17, ఏప్రిల్ 2010, శనివారం

పిట్స్ బర్గ్ ఉగాది సంబరాలు - ౨౦౧౦

మొత్తానికి ఒక నాలుగైయిదు వీకెండ్స్ ప్రేక్టీస్ చేసిన ఉగాది ఉత్సవం పోయిన వారం అయిపోయింది. ఈ హడావిడిలో భాగంగా PRythms ( Pittsburgh Rhythms) అనే గ్రూపుని కూడా మొదలు పెట్టేశాం. ఇందులో చాలామంది ఇప్పటిదాకా అసలు స్టేజ్ ఎక్కని వారే. మొదట్లో కొంచం భయపడినా తరువాత ధైర్యం చేసి పాడేశారు. వాతాపి రీమిక్సు తొ మొదలయిన ఈ కార్యక్రమం పలుకే బంగారమాయేనా, చికీతా, చిన్ని చిన్ని ఆశ, వీణ వేణూవైన, నిన్న ఈ కలవరింత పాటలే కాకుండా, ఒక రెండూ పేరడిలతో, ఇంకో రెండు డెన్సులతో ఒక గంట సేపు సాగింది. ఇద్దరు చిన్నపిల్లలతో "హింస ధ్వని" రాగంలో సాగిన "మహా మహా" ఒక ప్రత్యేక అంశం. మొదటిసారి ఇంత మంది పెద్దవాళ్ళని స్టేజ్ మీదకి లాగిన ఘనత PRythms కి దక్కింది. కొన్ని ఫోటోలు, వీడియోలు: క్రింద


గమనిక: ఇవి విని / చూసి ఎవరికైనా మూర్ఛ, వికారం, వాంతులు గట్రా కలిగిన ఎడల, బాధ్యత నాది కాదోచ్ :))


BUT PLEASE PARDON THE POOR AUDIO QUALITY IN THE VIDEOS. THE CAMCORDER WAS NOT CONNECTED TO THE MAIN AUDIO SYSTEM.

SCROLL ALL THE WAY DOWN TO THE END FOR THE VIDEOS




దోమ పాట - "మనసంతా నువ్వే" లో "చెప్పవే ప్రేమ" కి పేరడీ:

కుట్టకే దోమ చెయ్యకే హంగామా
ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడూన్నా
వంటింట్లో నువ్వే, పడకింట్లో నువ్వే
నట్టింట్లో నువ్వే మా ఇల్లంతా నువ్వే

ఓ హో హో

ఇప్పుడే ఎవరినో కుట్టావనే సంగతీ
పిల్లల ఏడుపూ నాకు చెబుతున్నదీ
ఇప్పుడే ఎవరినో కుట్టావనే సంగతీ
పిల్లల ఏడుపూ నాకు చెబుతున్నదీ

మార్టీనూ ఎంత కొట్టినా
టార్టాయిస్ మంట పెట్టినా
మార్టీనూ ఎంత కొట్టినా
టార్టాయిస్ మంట పెట్టినా

చావవే నిన్ను చంపేదెలా ...

కుట్టకే దోమ చెయ్యకే హంగామా
ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడూన్నా

అమేరికా వచ్చినా నాతోడు ఉన్నావనీ
సమ్మరులో చెట్లలో సాక్షముంటున్నది

నా రక్తం నీకు తీపనీ
ఆ స్వైన్ ఫ్లూ ఎంతసేపనీ
నా రక్తం నీకు తీపనీ
ఆ స్వైన్ ఫ్లూ ఎంతసేపనీ

తెలిసినా నిన్ను చంపేదెలా ...

కుట్టకే దోమ చెయ్యకే హంగామా
ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడూన్నా
వంటింట్లో నువ్వే, పడకింట్లో నువ్వే
నట్టింట్లో నువ్వే మా ఇల్లంతా నువ్వే











Videos:



Part 1:



Part 2:



Part 3:



Part 4:

3 కామెంట్‌లు: