12, జనవరి 2011, బుధవారం

వనితామాలిక - మాలిక టీం కొత్త సైట్/పత్రిక: జనవరి 14న

సంక్రాంతి సందర్భంగా మాలిక టీం ఒక కొత్త వెబ్ సైట్/పత్రిక మీముందుకు తీసుకొస్తోంది. పేరు వనితామాలిక. మాలిక పత్రికకన్నా మూడురోజుల ముందు ప్రారంభమయ్యే ఈ పత్రిక మహిళలకు ప్రత్యేకం - ఆగండాగండి.. ఇదేమీ మగవాళ్లని ఆడిపోసుకునే రేడికల్ ఫెమినిస్టు సైట్ కాదు. This is a site of the women, by the women for both women and men. మహిళలు మాత్రమే నిర్వహించే ఈ సైట్లో కేవలం మహిళలకు సంబంధించిన విషయాలే కాకుండా అందరికీ పనికి వచ్చేవి ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే వివిధ అంశాలపై మహిళల గొంతును ప్రపంచానికి వినిపించే సాధనాల్లో ఇదొకటి. అలాగే ప్రగతికి కావలసిన స్పూర్థిని మహిళలకు అందించటం కూడా ఈ సైట్/పత్రిక ఆశయం. ఇది పొద్దు పత్రిక తరహాలో ఎప్పటికప్పుడు realtime లో update కాబడుతుంది. దీని యూ.ఆర్.ఎల్., దీనిని నిర్వహించే సభ్యుల పేర్లు శుక్రవారం ప్రకటిస్తాం.

9 వ్యాఖ్యలు:

 1. వావ్.. ఊహించని విషయం. పత్రికంటే యేదో రాజకీయ పత్రిక టైపులోనో లేక మరో అంతర్జాల పత్రికలానో ఉంటుందనుకున్నా. Waiting for further details.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. తినబోతూ రుచులడగడం అనుకోక పోతే, పత్రిక అన్నారు .. జర్నలిస్టులుంటారా లేక బ్లాగర్లతోనే కానిచ్చేశారా? :)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మొదలుపెడుతోంది బ్లాగర్లతోనేనండి. అయితే రాను రానూ బయటవారు కూడా వస్తారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మీరు అనుకుంటున్న పత్రిక వేరే. అది సోమవారం సిధ్ధమవుతుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. నిజం చెప్పనా..ఆడవాళ్ళకి, ఆడంగిరేకుల వాళ్ళకి, దలితులకీ, నీచులకి, నిక్రుష్టులకి ఇలా వారికి మాత్రమే రాసే చాన్స్ ఉండే బ్లాగ్స్ కాకుండా--- ఎవరి గురించైనా (inthis case only about women but can be writeen by anybody)ఎవరైనా రాయగలిగేవే మంచివి.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. నిర్వహించబోయే సభ్యురాలు ఇంకెవరూ. తెలుసు లెండి.
  సరె కానివ్వండి మా భాగ్యం. కానీ మలక్ గారూ కనీసం ఇక్కడైనా ఎత్తుకొచ్చినవి వేయకుండా కాస్త ఫ్రెశ్ సరుకు వేయమనండి. మీకు పుణ్యం వుంటుంది. చాలా ఏళ్ళ నుండి ఖాళీగా వుండి దొరికిన పుస్తకాన్నీ మార్కెట్లో వచ్చిన అన్ని పత్రికలనీ చదివి ఇప్పుడు అవే వ్యాసాలూ ఇక్కడ చదవాలంటే విసుగ్గా వుండ ఇలా అడుగుతున్నా. ఇక్క్కడి ఎక్కువమంది చదువుల్లో ఉద్యోగాలలో విదేశాలలో బిజీ వల్ల బయటి పుస్తకాలకి పత్రికలకి కొంతాలం దూరంగా ఉంతాం వల్ల ఇక్కడి కాపీలన్నీ ఫ్రెష్ గా భావించి. కళ్ళకద్దుకుని చదువుకుంటారు. అది వాళ్ళ అదృష్టం.
  మీ మహిళా మాలిక కొరకై ఎదురు చూస్తున్నాం. వెల్కమ్

  ప్రత్యుత్తరంతొలగించు
 7. నిర్వాహణా బృందంలో ఏడుగురు సభ్యులున్నారండీ. అందులో ఇద్దరికి బ్లాగులే లేవు, మరో ముగ్గురు అప్పుడప్పుడు మాత్రమే బ్లాగులను సందర్శిస్తారు. ఈ సైట్లో వచ్చే వ్యాసాలేవి కాపీలు కాకుండా చర్యలు తీసుకుంటారు వారు (ఏదో ఒక్కడక్కడ పొరపాట్లు జరిగితే తప్ప).

  మొదటి విడత వ్యాసాలు చూసి మీ అభిప్రాయం తప్పకుండా చెప్పండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. చాలా సంతోషం.
  ఈ ప్రత్యేకం అన్నమాటే నన్ను కాస్త...!

  /మాలిక పత్రికకన్నా మూడురోజుల ముందు ప్రారంభమయ్యే ఈ పత్రిక మహిళలకు ప్రత్యేకం/
  అంటే మాలిక పత్రిక లో మహిళలకు చోటు లేదనా :P


  /This is a site of the women, by the women for both women and men.
  ఒక విధంగా చెప్పాలంటే వివిధ అంశాలపై మహిళల గొంతును ప్రపంచానికి వినిపించే సాధనాల్లో ఇదొకటి./

  అంటే!?

  /అలాగే ప్రగతికి కావలసిన స్పూర్థిని మహిళలకు అందించటం కూడా ఈ సైట్/పత్రిక ఆశయం/

  అంటే ఏంటండీ?

  నిర్వహించే మహిళలకు చదువుకునే మహిళలకు రాసే (అందరూ రాయవచ్చా కేవలం మహిళలే రాయాలా?)వారికీ అందరీకి అభినందనలు.

  ప్రత్యుత్తరంతొలగించు