13, జనవరి 2011, గురువారం

పాపం మీ మీ రాశి మారిపోయిందా? ఇక జ్యోతిషులు తమ లెక్కలు మార్చుకోవాలా? :)

ముందుగా ఈ లంకె చూడండి.


నక్షత్రాలు కూడా మిగతా ఖగోళ రాశులవలే తిరుగుతూ ఉంటాయని మనకి తెలుసు. దానివల్ల జరిగిందేమిటంటే గత 2 వేల సంవత్సరాలలో నక్ష్త్ర సముదాయాలు (రాశులు) తమ తమ స్థానాలు మార్చుకున్నాయన్నమాట. చంద్రుని ఆధారంగా నడిచే మన భారతీయ జ్యోతిషుల సంగతి ఎలా ఉన్నా, సూర్యుని పై ఆధారపడ్డ పాశ్చాత్య జ్యోతిషులకి ఇప్పుడు పెద్ద ఇబ్బంది వచ్చిపడింది. ఈ నక్షత్రాల స్థాన చలనం వల్ల పదమూడవ రాశి పుట్టుకొచ్చిందని పార్క్ నకుల్, జో రావ్ వంటి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ ఇదంతా వట్టిదేననీ, సనాతనులు దీనిని పరిగణలోకి తీసుకునే తమ లెక్కలు వేసుకున్నారని కొంతమంది వాదిస్తున్నారు. ఏదెలా ఉన్నా, కొత్త రాశిగానీ పుట్టుకొస్తే చాలా మంది "సన్ సైనులు" మారిపోతాయి. ఎలాగో క్రింద చూడండి.


Capricorn: Jan. 20-Feb. 16.
Aquarius: Feb. 16-March 11.
Pisces: March 11-April 18.
Aries: April 18-May 13.
Taurus: May 13-June 21.
Gemini: June 21-July 20.
Cancer: July 20-Aug. 10.
Leo: Aug. 10-Sept. 16.
Virgo: Sept. 16-Oct. 30.
Libra: Oct. 30-Nov. 23.
Scorpio: Nov. 23-29.
Ophiuchus: Nov. 29-Dec. 17.
Sagittarius: Dec. 17-Jan. 20)

6 వ్యాఖ్యలు:

 1. మంచి విషయం చెప్పారు. ఇంగిలిపీసు జ్యోతిశ్యం (సనాతన) ప్రకారం నేనూ వృశ్ఛిక రాశికి చెందిన వాడిని, కానీ అప్పుడెప్పుడో, కొత్తగా ఒక గ్రహం కనపడిందని కొత్త రాశులు ఈలా ఉంటాయని ఒక పట్టిక ఇచ్చారు దాని ప్రకారం నాది "తుల" రాశి. ప్రస్తుతం, మీరిచ్చిన పట్టిక ప్రకారం నాది "కన్యా" రాశి. (virgo అంటే అదే కదా..?)

  దీనివలన నాకున్న లాభాలేంటంటే, వృశ్ఛిక రాశిలో నాకు ఈరోజు బాలేదనుకోండి, తులా రాశిలో నో, కన్యా రాశిలోనో బాగుండే చాన్సుంది. ఇలా మూడీంటిలో యే రాసి బాగుంటే, నేను ఆరోజు ఆరాశికి చెందిన వాడ్ని అవ్వొచ్చన్న మాట. అంటే, నా టైం బాగుండడానికి స్కోప్ పెరిగినట్టే కదా.

  ఒక వేల అన్నింటిలోనూ బాలేక పోతే అనేనా మీ డౌటూ, మరేం ఫర్వాలేదు, ఆరోజు నేను నాస్తికున్ని, జ్యోతిష్యాన్ని నమ్మను. అంతే.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. అవును sun signs మారిపోయాయి. మొన్న నేనూ చూసి గతుక్కుమన్నాను. ఇన్నాళ్ళు libran ఉన్న నేను సడన్ గా scorpioan అయిపోయాను. ఏమీ అర్థం గాక బుర్రగోక్కున్నాను...ఇదా సంగతి!

  అంటే వీటిని నేను నమ్ముతానని కాదు. నేను జ్యోతిష్యం అస్సలు నమ్మను. ఏదో పేపర్లో సరదాగా చూస్తూ ఉంటే ఇది కళ్ళబడింది...ఇదేమిటిరా బాబు నా రాశి అలా ఎలా మారిపోతుంది అనుకున్నా.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ఇప్పుడు మీరిచ్చిన లెక్కల ప్రకారం నేను virgo అయిపోయాను..ఇదేమి మాయ!

  ప్రత్యుత్తరంతొలగించు