11, మే 2011, బుధవారం

మాలిక Beta – మరింత వేగవంతం!


ఇది మారిన ప్రపంచం. ఇప్పుడంతటా అన్నిటా ఒకే మంత్రం. వేగం! ఈ తరపు పిల్లల ఆలోచనల్లోనూ చేతల్లోనూ అంతటా వేగమే. 3జి కాలం కదా మరి! అందుకే కాలంతో పాటూ ఎప్పటికప్పుడు మార్పులూ చేర్పులూ చేసుకుంటూ ముందుకువెళ్ళాలి! మీరేమంటారు?

ఆహ్, "జీవితంలో ఏదో కావాలనుకుని కాలేకపోయినవారు, ఏం కావాలో పెద్దగా పట్టింపులేని వారు ఇలా ఆంధ్రదేశం లో జర్నలిస్టులయి, ఇంతింతయి వటుడింతయి చివరికి సంపాదకీయాలు రాసేసి బతికేస్తార్రా మామా, అందులో పెద్దగా అర్థాలు వెతుక్కోకూడదు" - అని ఒక మిత్రుడంటే, ఏమిటో అనుకున్నా. వారిలా రాయాలని ప్రయత్నిస్తే గానీ అవగతమవలేదీ మట్టిబుర్రకు, అది అందరి వల్లా సాధ్యమయ్యేది కాదని. నమ్మకం కుదరకపోతే, కుదిరే దాకా మొదటి పేరాను చదవండి! అయితే ఇలా అన్నానని జర్నలిస్టులకు కోపం వస్తుందేమో. నా ఉద్దేశం అది కాదండీ. Let's Kill all the lawyers అని ఆయనెవరో పాశ్చాత్య సాహితీవేత్త అన్నాడంటే అర్థం అందర్నీ చంపేద్దామని కాదు. అందర్నీ చంపితే మరి ఆయన కేసెవరు వాదించేది. రాక్షసుల్లోనూ మంచివాళ్ళున్నట్టే, అప్పుడప్పుడూ జర్నలిస్టుల్లో కూడా జర్నలిస్టులు తగుల్తారు.

సరే - కొసరు విషయాన్ని వదిలేసి అసలు విషయానికొస్తే, ఈ టపా శీర్షిక చూసే మీకీపాటికి అర్థం అయిఉండాలి. మీ సౌలభ్యం కోసం, నా సంతృప్తి కోసం మీకర్థం కాలేదనుకుని చెప్పొచ్చేదేమిటంటే; ఇప్పడున్న మాలిక తో పాటుగా మరింత వేగవంతమైన, సమర్థవంతమైన మాలిక బీటా ఈ రోజు మీకందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాం! వేగవంతమైనది అంటే వెంటనే పోలిక తీసుకురావడం సహజమే. ఈ బీటా మాలిక, ఇప్పుడున్న మాలికకంటే చాలారెట్లు వేగవంతమైనది. అనగా, మాలిక తరచూ పోటీ పడేది మాలికతోనే అని కవిహృదయము.
 • ఇంతకీ ఎక్కడుందీ మాలిక బీటా: ఇదిగో ఇక్కడేhttp://maalika.org/beta.php
 • ఎంత వేగం? ప్రస్తుతానికి మీరు టపా రాసి పబ్లిష్ చేసిన ఇరవై ముప్పై సెకనులకు మాలిక బీటాలో టపా కనిపిస్తుంది.
 • ఇంతకంటే వేగవంతం చెయ్యలేరా?: తప్పకుండా! ప్రస్తుతం మాలిక బృందం Real time aggregation దిశగా పని చేస్తోంది. త్వరలోనే దాన్ని మీ ముందుకు తీసుకొస్తాం. అప్పుడు మనమెంచక్కా real time లో సంఘాలు సంస్కరించుకోవచ్చు, సైద్ధాంతికంగా విబేధించుకోవచ్చు. దేశం ఎటు పోతోంది అని బెంగడిపోవచ్చు :)
 • ఇంతకీ మేమేం చెయ్యాలి? సాధ్యమైనంత ఎక్కువగా మాలిక బీటాను ఉపయోగించండి. కొన్ని కొన్నిసార్లు అది మొరాయించవచ్చు, మీరు గమనించి - మీ తిట్లూ, సలహాలూ, శాపనార్థాలూ, దీవెనలూ మాకు పంపిస్తే ధన్యులం! మీ బ్లాగు బీటా లో కనిపించకపోవచ్చు. వేంటనే మాకో మెయిల్ కొట్టండి (admin@maalika.org), లేదా "మాలిక దౌర్జన్యం నశించాలి అని మీ బ్లాగులో ఒక పోస్టు కొట్టండి! :)
మాలిక బీటా వెనుక ఉన్న మొత్తం కృషి, సమయం బద్రి గా బ్లాగులోకానికి తెలిసిన రవిది, ఇంకా ఆయనకు చేదోడు వాదోడు గా నిలిచిన కల్నల్ శ్రీనుది. Thank you, Ravi and Sreenu!

20 వ్యాఖ్యలు:

 1. ప్రత్త్యక్షముగా పరీక్షించి తెలుసుకోనేదము

  ప్రత్యుత్తరంతొలగించు
 2. వాఖ్యలు రియల్ టైం లో రావా ?

  ప్రత్యుత్తరంతొలగించు
 3. అజ్ఞాతా,

  ప్రస్తుతానికి రావుగానీ త్వరలో వస్తాయి.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. yevaraina maalika dourjanyam meeda post raayandi . రియల్ టైం చూద్దాం

  ప్రత్యుత్తరంతొలగించు
 5. వ్యాఖ్యలకు ఇది ఇంకా విస్తరింపబడలేదండీ!. త్వరలోనే ఆ ముచ్చటా తీర్చుకుందాం :)

  ప్రత్యుత్తరంతొలగించు
 6. రెండు నిముషాలు పట్టింది మాష్టారు ... ఒకసారి పరీక్షించవలేనేమో

  ప్రత్యుత్తరంతొలగించు
 7. Yep it tool 2:05 then, now its down to 40-45 seconds, once its fixed it will be down to 20-30 seconds - Thanks for the feedback

  ప్రత్యుత్తరంతొలగించు
 8. Actually we have an issue with the server (Sreenu just checked it up) and that is slowing the thing down randomly. Even the regular Maalika is behaving erratically right now

  ప్రత్యుత్తరంతొలగించు
 9. so it is faster than sankalini? their time is one minute and yours is 30 seconds

  ప్రత్యుత్తరంతొలగించు
 10. Maalika competes only with Maalika. So its for you to decide either way, we have nothing to say.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. @anon
  plz write a test post like maalika and tell me which one is faster

  ప్రత్యుత్తరంతొలగించు
 12. from their statistics maalika is much faster. i have seen rowdy posting 3 test posts. they got updated within seconds.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. Yo Dawg. I herd ya'll like to compete. So we put a compete in your compete so you can fight while you fight. :)

  Jokes apart, lets stop the compare game. It ain't necessary. Period.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. If people are wondering what I mean by the "Yo Dawg.." line, http://yoyodawgdawg.com/about.php

  ప్రత్యుత్తరంతొలగించు
 15. @ RK ji
  I'm not kidding @the same time not fighting

  someone here said that maalika is faster than sankalini, thats the reason i sadi like that

  take my comments light :)
  All the best

  plz dont forget my final words - i used maalika from the starting

  And one more thing anna
  I am thinking that speend is not the criteria.

  iam just nothing in front of you
  i wrote the code based trail and error method

  ప్రత్యుత్తరంతొలగించు
 16. Can I block some useless blogs from getting displayed on my Malika screen? ex. a) seperatist cry blogs, b)some ladies senti/emotional blogs, c)boring keti type hate-blogs, d)communist false propaganda blogs, filthy content blogs ex. chiborika, saratkaalam :)
  Can I block viewing comments from an ID: ex. Marthandas comments, so irritating to see them you know? :)

  ప్రత్యుత్తరంతొలగించు