21, సెప్టెంబర్ 2011, బుధవారం

విద్యామాలిక: త్వరలో


విద్య అనేది ఈ కాలపు మనుషులకి కనీస అవసరం. ప్రతీదీ వ్యాపారమయిపోయి విద్య కూడా సామాన్యులకి అందకున్న ఈ రోజుల్లో ప్రాథమిక విద్యని తెలుగు వ్యాసాల రూపంలో పిల్లలకి అందించటానికి మన బ్లాగర్ నాగ ప్రసాద్ ఒక ప్రణాళిక రూపొందించాడు. "విద్యామాలిక" అని పిలవబడే వెబ్ సైటులో ఈ వ్యాసాలుంటాయి. దీనికి సంబంధించిన వివరాలను యూ.ఆర్.ఎల్. ని త్వరలో తెలియబరుస్తాం.

పోతే ఈ ప్రాజెక్టు పూర్తవటానికి నెలల, ఏళ్ళ తరబడి సమయం పట్టచ్చు. ఈ చిన్న ప్రయత్నాన్ని విజయవంతం చెయ్యటానికి మాకు కొంతమంది వాలంటీర్లు కావాలి. మీరు కూడా దీనిలో పాలుపంచుకోదలిస్తే admin@maalika.org లేక editor@maalika.org కు ఈమెయిల్ పంపించగలరు. ఇప్పటిదాకా మాకు సహాయం చెయ్యటానికి ముందుకొచ్చిన వారి పేర్లు (ఇక ముందు వచ్చేవారివి కూడా) త్వరలోనే, టీం పరిచయంలో భాగంగా ప్రకటిస్తాం.

4 వ్యాఖ్యలు:

  1. మంచి ప్రయత్నం.... విశ్వనాథవారు అప్పట్లో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకూ "భాషా వాచకాలు" రూపొందించారట! వాటిని సంపాదించే పనిలో ఉన్నా! దొరికితే మీ ప్రాజెక్టుకి అందిస్తాను....

    ప్రత్యుత్తరంతొలగించు