26, సెప్టెంబర్ 2011, సోమవారం

పదచంద్రిక - ౩ ఫలితాలు

మాలిక శ్రావణ పౌర్ణమి సంచికలో ప్రచురించబడిన పదచంద్రిక - 3 ఫలితాలు..


ఈ పదచంద్రికను తప్పులు లేకుండా పూరించినవారికి వెయ్యి రూపాయల నగదు బహుమతి ప్రకటించడమైనది. కంది శంకరయ్యగారు, ఎన్నెల గారు, భమిడిపాటి ఫణిబాబుగారు ఒక్క తప్పుతో పూరించారు, భమిడిపాటి సూర్యలక్ష్మిగారు రెండు తప్పులతో పూరించారు. చివరి రోజు పంపిన మాచర్ల హనుమంత్ రావుగారు ఐదుకంటే ఎక్కువ తప్పులు చేసారు.


తప్పులు అస్సలు లేకుండా పూరించివారు.. నేస్తం..
నేస్తంగారు మీకు బహుమతి పంపడానికి తగిన చిరునామా పంపగలరు.. editor@maalika.org,ఈ సంచికలో ప్రకటించిన మరో పోటీ.. ఈ సంచికలో ఒకటికంటే ఎక్కువ రచనలు చేసిన రచయిత పేరు, ఆ రచనలను కనుక్కోండి అని అడిగాం. ఈ పత్రికలో మన్నె సత్యనారాయణగారు రాసింది గురజాడ అంతరంగ నివేదన, సత్రవాణి వ్యాసాలు. కౌటిల్య రాసింది మూడు వ్యాసాలు.. విశ్వనాధుని నాయికలు.. రణరంభా దేవి, ఆహా! ఆంధ్రమాత, కూచిపూడి నా తొలి అడుగులు ( మిగతా అడుగులు, నడకలు తర్వాతి సంచికలలో వరుసగా వస్తాయి).. ఆంధ్రమాత పోస్టులో గెస్ చేసినా అన్ని కలిపి అతనే అని ఎవరూ చెప్పనందున ఈ బహుమతి ని వచ్చే దీపావళి సంచికలోని పోటీకి చేర్చడమైనది. ఈసారి ఈ బహుమతి ఇవ్వడం లేదు.. he he he he...

3 వ్యాఖ్యలు:

  1. మలక్ గారు మొదటిసారి నేను సంపాదించిన డబ్బు ఇది..చాలా సంతోషంగా ఉంది ..ఆ డబ్బు జీవనికి పంపండి ప్లీజ్ ...వస్తే వాళ్ళకు పంపుతాను అనుకున్నా ..అందుకే వచ్చింది :)

    ప్రత్యుత్తరంతొలగించు