15, సెప్టెంబర్ 2011, గురువారం

ఉరేసుకోవాల్సింది శాకాహారులా ఎఱ్ఱబ్లాగర్లా? - Part 4

This article comes to you from Kartik.
అమెరికా పాకిస్తాన్ ను ఎందుకు బెదిరించదు??

నిన్న కాబుల్ లో అమెరికా దౌత్య కార్యాలయం పైన జరిగిన దాడికి హక్కానీ వర్గమే బాధ్యులని భావించిన అమెరికా పాకిస్తాన్ కు హెచ్చరిక జారీ చేసింది. అమెరికా రక్షణశాఖ కార్యదర్శి లియాన్ ప్యానెట్ ఉగ్రవాదం పైన యుద్ధం లో పాకిస్తాన్ తన పాత్ర పోషించకపోతే బెండు తీయక తప్పదని చెప్పకనే చెప్పాడు.  పాకిస్తాన్ ద్వంద్వ వైఖరినీ మిత్ర ద్రోహాన్ని అమెరికా గర్హించడం ఇప్పటికే పలుమార్లు జరిగింది.  ఈ నేపథ్యం లో పాక్ అమెరికా సంభంధాలు చెడితే ఎక్కువగా నష్టపోయే దేశాలు ఆఫ్ఘన్-పాకిస్తాన్లు తప్ప అమెరికా ఏ రకంగానూ కాదు. ఒక వేళ పాక్ మొండిగా మొరాయిస్తే అమెరికా తన సైనికులను వెనక్కు పిలిపించి ఆఫ్ఘన్ ఘోరాలకు పాక్ ను దోషిగా నిలిపినా పాక్ చేయగలిగింది ఏమీ లేదు. ఇక అఫ్ఘన్ పరిస్థితి తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు,  ఎవడికి తోచినట్లు వాళ్ళు ఆడుకున్నారు.. ముందు రష్యా తర్వాత అంతర్యుద్ధం తర్వాత తాలిబన్లు.. ఇప్పుడు మళ్ళీ అమెరికా తాలిబన్ల మధ్య యుద్ధం.. ఈ రావణ కాష్ఠం లో సగటు ఆఫ్ఘనీ బ్రతుకు ఎప్పుడో బుగ్గిపాలయ్యింది.. ఆధునిక ప్రపంచ చరిత్రలో ఇన్ని ఐడియాలజీల మధ్య నలిగిపోయిన సమాజం మరొకటి లేదేమో!!


ఇదంతా పక్కన పెడితే అసలు ఆఫ్ఘన్ లో దాడి జరిగితే పాకిస్తాన్ ను ఎందుకు బెదిరించాలి అంటే జవాబు అందరికీ తెలిసిందే, భారత ఉపఖండం లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది పాకిస్తాన్ మాత్రమే.. భారతదేశం లో special economic zones ఉంటే పాక్ లో special extremist zones ఉన్నాయి. ఇలాంటి దేశం నుంచీ కాబుల్ లో దాడి జరగలేదంటే నమ్మడం కష్టం.

ఇక మన ఎర్రసారు చెప్పిన కొన్ని విషయాలను చూద్దాం..


>>అది మరిచి, పాకిస్ధాన్ చేయవలసింది చేయడం లేదని అమెరికా ఉక్రోషపడడం ఏమిటి?

ఉగ్రవాదం పైన యుద్ధం లో పాక్ ఒక భాగస్వామి కాబట్టి. ఆ పేరు మీద పాక్ బిలియన్ల కొద్దీ డాలర్లు అప్పనంగా తీసుకుంది కాబట్టి. అమెరికా పాకిస్తాన్ ను మిత్రదేశం గా భావిస్తున్నదని ఆగస్ట్15వ తారీకు తమరే సెలవిచ్చారు.. గుర్తులేకుంటే చెప్పండి,  స్క్రీన్ షాట్ రెఢీగా ఉంది.. :)

>>అప్పటివరకూ రష్యా దురాక్రమణపై పోరాడి సర్వం పోగొట్టుకున్న దేశంపైన ‘బిన్ లాడేన్’ ను అప్పగించలేదన్న ఒకే ఒక్క కారణం చూపి,
భలే  నవ్వించారు.. ఉక్రోషం లో నిజం చెప్పేశారు. కమ్యూనిష్టుల ధనపిపాశను రక్తపిపాశను మీరే బయట పెట్టుకున్నారు.. బిన్ లాడెన్ ను అప్పగించలేదన్న కారణం సరే అంతకంటే ముఖ్యంగా తన దేశం పైన జరిగిన దాడికి ప్రతీకారం ఎవరైనా తీర్చుకుంటారు.  అందరూ ఇండియా లాగా నరహంతకులకు బిరియానీలతో విందులు చెయ్యరు కదా..

>>ప్రతిఘటనగానే తాలిబాన్ మిలిటెంట్లు స్పందిస్తున్నారు తప్ప వాళ్లేమీ విమానాల్లో అమెరికాకి వెళ్ళి దాడులు చేయడం లేదు.
kevv.. మళ్ళీ నవ్వించారు..సెప్టెంబర్ 11 ఎవరి పని సార్??  అయ్యా తమరు వినలేదేమో లేక చెవులు మూసుకున్నారేమో  అమెరికన్లను శిక్షిస్తామని తమరి తాలిబన్ బంధువులైన ముల్లా ఒమర్, ఒసామా బిన్ లాడెన్ లు పలు మార్లు చెప్పారు. ఆ ముల్లా ఒమర్ స్వయంగా తాలిబన్ అధిపతి.. అటువంటి తాలిబన్ ప్రభుత్వాన్ని బెండు తీసి తమ పౌరలకు రక్షణ కల్పించడం  ఆ దేశ ప్రభుత్వం యొక్క తొలి కర్తవ్యం.  అందరూ కమ్యూనిష్టు ప్రభుత్వాలలాగా తమ పనులు మానుకోరు కదా.. అందువల్ల వచ్చిన ఇబ్బంది.. 

>>“టెర్రరిజంపై పోరాటానికి మా వద్ద అందుబాటులో ఉన్న వనరులనన్నింటినీ వినియోగిస్తున్నాము. హక్కాని గ్రూపు పాకిస్ధాన్ భూభాగం నుండి వచ్చి ఆఫ్ఘన్ లో దాడులు చేయడానికి సంబంధించి మాకెప్పుడైనా సాక్ష్యాధారాలు ఇచ్చారా?” అని ఒక పాక్ మిలట్రీ అధికారి ప్రశ్నించాడని రాయిటర్స్ తెలిపింది.


పాక్ కు సాక్ష్యాలు...కికికికి.. కిం.ప.దొ.న.


26/11 గురించి ఎన్ని సాక్ష్యాలిస్తే మాత్రం పాకిస్తాన్ ఏం చేసింది??  తగినంతగా లేవని కబుర్లు చెబుతోంది.. కసబ్ పాకిస్తాన్ దేశానికి చెందినవాడే నని డాన్ పత్రిక పాత్రికేయులే తేల్చి చెప్పారు.. అలాంటి పాకిస్తాన్ కు సాక్ష్యాలంట.. ఇంకా నయం సాక్ష్యాలతో పాటూ బరాక్ ఒబామా కుటుంబాన్ని బందీలుగా అడగలేదు


సార్ బ్లాగులో ఆ మధ్య రాసిన మరొక ఆణిముత్యం, మీకోసం: 


>>ఆఫ్ఘన్లందరూ అమెరికా సైన్యం దేశం విడిచి పోవాలని ముక్త కంఠంతో కోరుతున్న సంగతిని మాత్రం వారు దాచిపెడతారు.

ఆఫ్ఘన్లందరూ అంటే తాలిబన్లందరూ అనా??  అయినా నాకు తెలియక అడుగుతాను ఆఫ్ఘన్లందరూ అంటూ చెబుతున్నారు ఈయన ఆఫ్ఘనిస్థాన్ లో సర్వే ఏమైనా చెశారా లేక అది కూడా ఇంకొక ఎర్ర మిత్రుడెవరైనా చెప్పారా?? ఏం లేదు జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలుతుంది, ఎర్రి ఎర్రి రాసుకుంటే ఏం రాలుతుందా అని చిన్న డౌటు అంతే..


Finally, ఈకమ్యూనిష్టులు ఎందుకు ప్రజలకు దగ్గర కాలేకపోయారు అనే ప్రశ్నకు ఈ బ్లాగు చదివితే చాలా సులభంగా సమాధానం దొరుకుతుంది..  అమెరికా వ్యతిరేకత తప్ప ఇప్పుడు కమ్యూనిష్టులకు వేరే సిద్ధాంతాలు ఏమీ లేవన్న సంగతి కళ్ళకు కట్టినట్టుగా తెలుస్తుంది.

5 వ్యాఖ్యలు:

 1. Very well written. Good points to expose the leftist propaganda.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. "భారతదేశం లో special economic zones ఉంటే పాక్ లో special extremist zones ఉన్నాయి"

  దుమ్ము లేపావు గా కార్తీక్ :-)))

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఉరేసుకోవటం అనేమాట రావలిసిన అవసరం ఏమిటి?? ఇందులోకి శాకాహారులను లాగటం దేనికి. ఇలా శాకాహారులను పట్టి చూపటంలో ఉన్న ఎజెండా ఏమిటి.

  "....అమెరికా వ్యతిరేకత తప్ప "ఇప్పుడు" కమ్యూనిష్టులకు వేరే సిద్ధాంతాలు ఏమీ లేవన్న సంగతి...."

  ఇప్పుడేమిటీ ఎప్పుడూ లేవు. ఏవో పడికట్టు మాటలు పట్టుకుని పిడివాదాలు చేస్తూ కుతర్కంతో వాదించటం తప్ప మరొకటి లేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ఇలా శాకాహారులను పట్టి చూపటంలో ఉన్న ఎజెండా ఏమిటి.
  ______________________________________________

  No idea!


  ఏవో పడికట్టు మాటలు పట్టుకుని పిడివాదాలు చేస్తూ కుతర్కంతో వాదించటం తప్ప మరొకటి లేదు.
  ______________________________________________

  Hum gaali ka jawaab goli se deynge :))

  ప్రత్యుత్తరంతొలగించు
 5. నాకు తెలిసి వారు మోడీని మాంసం రుచి మరిగిన కౄరజంతువుతో పోలుస్తున్నట్టుంది. ఇప్పుడు కోర్టు నుండి పొందిన చిన్నపాటి ఉపసమనం వల్ల మూడు రోజుల పాటు నిరాహారదీక్ష చేస్తున్నాడుకదా, దాన్ని వారు శాఖాహారం తినడముతో పోలుస్తున్నట్టున్నారు. మోడీ పై రాసిన వ్యాసము (నేను పూర్తిగా చదవలేదు)లో ఈ తతంగమంతా ఉంది.

  ప్రత్యుత్తరంతొలగించు