20, అక్టోబర్ 2011, గురువారం

తన దాకా వస్తే గానీ ...

... ఎఱ్ఱ బ్లాగర్ల అసలు రంగు బయటపడదని ..


వీళ్ళంతా మోదీ విషయంలో చేసిన గొడవ ఏంటి? అభివృద్ధి జరగగానే సరా? జరిగిన హత్యాకాండకి బాధ్యత లేదా అని ...
ఇప్పుడు తెలకపల్లి రవి గారి బ్లాగులో గద్దాఫీ గురించిన స్టేట్మెంట్ చూడండి

మొత్తం అరబ్‌ ప్రపంచంలో ఆధునికత, లౌకికతత్వం నింపిన మరో పాలకుడు ఖతమై పోయాడు. మానవాభివృద్ధి సూచికల్లో లిబియా ఎంతటి ప్రగతి సాధించిందో ఇదే ఇంటర్‌ నెట్‌లోని వికీ పీడియా చూస్తే తెలుస్తుంది.


లాకర్బీ - పేన్ ఏం - విమానాన్ని పేల్చి 259 మంది హత్యకు కారణమైనవాడికి ఈ కమ్యూనిష్టులు బాహాటంగా మద్దతివ్వటం తప్పుకాదుగానీ మోదీకి కొంతమంది ఇచ్చే సపోర్ట్ మాత్రం తప్పుట. అన్నట్టు 2003 దాకా తనకేమీ తెలియదని లిబియా బొంకుతునే ఉంది. ఇక తప్పని సరై 2003 లో తప్పొప్పుకుంది. గద్దాఫీ స్వయంగా పేల్చివేతకు ఉత్తర్వులిచ్చినట్టు లిబియా మాజీమంత్రే ఒప్పుకున్నాడు.

సరే రవిగారిని వదిలేద్దాం. తప్పించుకుని తిరగటం తప్ప వేరేదారి తెలియని ఆయన. కానీ మిగతా ఎఱ్ఱ బ్లాగర్లైనా చెప్తారా మోదీ ఎందుకు విలనో గద్దాఫీ ఎందుకు హీరోనో? అంత సీనే ఉంటే వాళ్ళు కమ్యూనిష్టులెందుకవుతారంటారా? సరే ఈ ఊసెఱ్ఱవెల్లుల సంగతింతే అని సరిబెట్టుకోవాలా? :))

16 వ్యాఖ్యలు:

 1. ఖదాఫీ స్వతహాగా మంచివ్యక్తి. అమెరికాయే పెద్ద టెఱ్ఱరిస్టు. ఖదాఫీ తీసుకున్న చర్యని counter- terrorism offensive గా పరిగణించాల్సి ఉంటుంది. అతని కూతుర్ని అమెరికా దాడుల్లో చనిపోయింది. ఆ కోపం అతని మనసులో ఉండి ఉండొచ్చు. అయితే ఖదాఫీ అమెరికా యొక్క అంతర్జాతీయ గూండాయిజాన్ని ఎదుర్కొనే క్రమంలో కొన్ని పొఱపాట్లు చేశాడు. ఒకవేళ అతని స్థానంలో మనం ఉంటే మనమూ అవే పొఱపాట్లు చేస్తామేమో !

  అమెరికన్ల ప్రాణాలు ఏ ఇతర దేశస్థుల ప్రాణాల కంటేనూ ఎక్కువ విలువైనవి కావు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. Mr Telakapalli Ravi has removed comments, which he always does. I asked him 3 simple & straight forward questions, and didn't receive a reply. Meanwhile Mr Minabe got in between and went through his talking points i.e., blabbering, and put out the usual commie stuff, for which I had to reply.

  If I had all other comments including Mr Minabe's one, I would have pasted here , but I only have the last comment in clipboard. Here it is.
  BTW, Mr Teja's replies to the Omnipotent, in those removed comments, was something that I relished the most :-))
  ______________________________________
  Mr Minabe,
  You covered whole nine yards there, whereas I was asking specific omissions in this article.

  All your pole-dancing and somersaults didn't answer the questions in the end.

  1. You failed to even mention Pan-am airlines bombing by Gaddafi. The murderer had 270 peoples' blood on his hands, my friend. Now tell me who is BLIND? That is just one example, by the way.

  2."Don't you know why the price was hicked even when they used reserves"
  _____________________________
  That's an outright LIE. You guys are good for nothing else, than spreading lies. When reserves were used, gas prices went down in America. Go and check your facts, instead of vomiting out your lies here.

  Obama released 30million barrels of reserve in June 2011. (http://finance.yahoo.com/news/Obama-releasing-30M-barrels-apf-2233806614.html?x=0)

  And the following chart will tell you that gas prices peaked in May 2011 and headed downwards since then. I hope your pinhead is capable of reading charts. (http://gasbuddy.com/gb_retail_price_chart.aspx)

  And one little piece of unsolicited advice: Think twice before you start putting out that kind of non-sense, at least to me!!

  3. Gaddafi demise started primarily because of rebels, who sought the support of NATO. If you have to criticize, then your criticism should fall in the order a)rebels b)followed by NATO, c)America comes in the end. However this blogger and bunch of other America-haters, got the order wrong. That was my point.

  All you did in your blabbering, was like a headless-chicken-spinning-in-mid-air, nothing else.

  4. "I feel so sorry for u guys for praising and supporting America"

  It's mutual my friend. Take care of your ass first. I got mine covered pretty well.

  As to others, they are not related to this blog-post and will be addressed later.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మలకన్నా, మార్తాండ మార్తాండ అనే పాట లిరిక్స్ వారంజోజులనుండి యాద్ చేస్కుంటున్నా వస్తలేదు. బ్లాగంతా దేవులాడిన, గేడ కనిపిస్తలేదు. జర లింకిచ్చి పుణ్యం కట్టుకోరాదె. వినకపోతే నాకు నిద్ర పడతలేదు. ఒగే సారి చూసిన, హుక్ అయిపోయిన. ఆవు ఏమి షాటు కొట్టిండి, దిమ్మ తిరిగింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. తాడేపల్లి గారూ,

  Agreed. కానీ మరి ఇదే సూత్రం మోదీకి వర్తింపజేయకూడదా?

  Ajnata,

  ప్రమాదవనంలో ఉంది - First in the "Veera kelukudu tapaalu"

  ప్రత్యుత్తరంతొలగించు
 5. /ఖదాఫీ తీసుకున్న చర్యని counter- terrorism offensive గా పరిగణించాల్సి ఉంటుంది/
  :)) !!!

  ప్రత్యుత్తరంతొలగించు
 6. ఏ దేశమైనా అలా ఉత్తగనే గొప్పదవదు. గత శతాబ్దం కచ్చితంగా అమెరికాది.అనేక అవిష్కారాలకి, అలోచనలకి, ఐశ్వర్యానికి, దూరద్రుష్టికి కొలబద్ద అమెరికా. ఇవన్నీ ఆదేశపు సిటిజెన్ గా నాకు గర్వకారణం. కానీ...
  పిచ్చొడిచెతిలో రాయిలాంటి దాని విదేశాంగ విధానం, దాని తాలూకు దుర్మార్గాన్ని మెచ్చలేనండి.తన మీద దండెత్తే ఏదేశాన్నైనా ఎదుర్కోవటం ఆత్మ రక్షణౌతుంది.అలా దండెత్తే ఆలోచనకూడా రాకుండా దుర్నిరీక్షణమైన సైనిక శక్తి ని సంపాదించుకోవటం అర్థ చేసుకోవచ్చు. ప్రతి పనిలోను తనకెం లాభమని చూసుకోవటం కూడా శ్రుతిమించనంత వరకు పర్వాలెదు. కానీ లేని శత్రువుని స్రుష్టించి వాణ్ణి మొదట తనే మేపి మళ్ళీ వాడినే బూచిగా చూపెట్టిదేశాలని సర్వనాశనం చేసే మూర్ఖత్వాన్ని సమర్ధించలేను. ఇరాక్ ని నాశనం చేసే ముందు ఏనుగుని దోమలాగా దోమని ఈగలాగ నిజమనిపించేంత అబద్ధంగా ప్రజల్ని తికమక చేసి దొంగ వార్తలల్లిన మీడియా, నాయకులు ఆడిన నాటకాలు, చెప్పిన అబద్ధాలు ప్రతిక్షణం చూసి అసలు వీళ్ళె విషయన్నైనా ఉన్నదున్నట్టుగా చెప్తారంటే నమ్మటం కష్టంగా వుంది. అమెరికా ద్రుష్టిలో..

  1. ప్రపంచంలో రెండే రంగులు. నలుపు, తెలుపు. సంధర్భాన్ని బట్టి అస్మదీయులు తస్మదీయులు.
  2.తన బాధ ప్రపంచపు బాధ.ప్రపంచపు బాధ దాని వ్యవస్త కారణం. ఒఇల్ ఉంటే అ దేశ నాయకులు కారణం.
  3. అమెరికా తప్పు చెయ్యదు.iraaniyan commercial flight ని యుద్ధ విమానమని చెప్పి పేల్చి పారేసి..అప్పటి Vice President Bush గారు చెప్పిన మాట .."I will never apologize for the United States of America, ever. I don't care what the facts are."!!
  గడ్ఢాఫి విమానం కూల్చాడా లేదా అనడగటం బానె ఉంది కానీ..వాడికి జరిగిన శాస్తే
  US lO ఈగకైనా jarigindaa?

  4 రెండు మహా సముద్రాలు అటూ ఇటూ కేవలం రెండంటే రెండే దేశాలు, అవీ తనకే మాత్రం సరి తూగ లేనివి పైనా కిందా, నెక్ష్త్ ఏభై దేశాల మొత్తం కన్నా ఎక్కువ defence budget- అయినా ఎక్కడ చీమ చిటుక్కుమన్నా అది తనమీద వెయ్యటానికి సిద్ధంగా ఉన్న అణు బాంబె నని నమ్మకం.భయం.Paranoia. ఇవేవీ కాకపోతే ఇంకో దేశంలో వేలు పెట్టటానికి దొరికిన మహదవకాశం.

  ట్యునీషియా, ఈజిప్ట్, లిబియా లలో అమెరికా పాత్ర దాని గత చరిత ప్రకారం తక్కువనే చెప్పాలి. ఆర్ధిక మాంద్యం, జనాల్లో మార్పు, ఒబామా కాస్తా ఉదారవాది కావటం కారణాలు కావొచ్చు. Ron paul consistant గా 3rd or 4th place లో ఉండటానికి జనాల్లో వస్తున్న మార్పే కావొచ్చు.లేదా అలా అవాలని నా ఆశ.

  అమెరికా foreign policy లో దుర్మార్గాన్ని ఎండగడితే అది COMMUNISTS ని వెనకేసుకోరావటం అని అర్థాలు లాగ కుండా (వాళ్లు వీళ్ళ కన్నా గొప్పవాళ్ళు కారని చెప్పగలను)కాస్త objective గా ఆలోచిస్తే మంచిది.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. నిజమే మలక్పేట్ రౌడీగారూ ! మోదీది కూడా counter-terrorism offensivae నని నేనంగీకరిస్తాను. కానీ ఆ మాట ఒప్పుకోరు గదా ఎఱ్ఱజెండాలు. వాళ్ళ దృష్టిలో నాన్-ముస్లిములంతా టెఱ్ఱరిస్టులు.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. వాళ్లు వీళ్ళ కన్నా గొప్పవాళ్ళు కారని చెప్పగలను)కాస్త objective గా ఆలోచిస్తే మంచిది.
  ------------------------------------------------------------

  అలా అనుకోము గాని, వాళ్ళకన్నా వీళ్ళు ఎందుకు గొప్పవారు కాదో objectiveగా ఆలోచించి మీరే చెప్పండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. ఇంతకీ వాళ్ళెవరో వీళ్ళెవరో మీకు క్లియర్ గా అర్థమైందా?(నా క్కాలేదు)
  వాళ్ళు పెట్టుబడిదారులు. వీళ్ళు కమ్యూనిష్టులు.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. @Pavani అంతా అయోమయం గ ఉంది. ప్రపంచంలో ఉన్న వాళ్ళు వీళ్ళు ఇంకొకళ్ళు, వీళ్ళల్లో ఏ తప్పూ చెయ్యని ఏ దేశం మంచిది ఏ కార్పోరషన్ మంచిది. ఎక్కడికి వెళ్ళాలని జనం బారులు తీరి నుంచుని అక్కడికి చేరి పనిచేయ్యాలని తపిస్తున్నారు?

  ప్రత్యుత్తరంతొలగించు
 11. @పావని,
  అయితే ప్రజాస్వామ్యమం (పెట్టుబడిదారులు అనుకొందాము) ఉన్న దేశాలకంటె, కమ్యూనిసం ఉన్న దేశాలు (కమ్యూనిస్ట్లు అనుకొందాము) గొప్ప అంటారా? లేక గొప్పవి కాదు అంటారా?

  ముందు అదేదో క్లారిటీ ఉంటె, ఈ టపా మీకు, మీ కామెంట్ నాబోటోళ్లకు అర్ధమవుతుందేమో కదా? :))

  ప్రత్యుత్తరంతొలగించు
 12. I do not understand communists at all. They seem to live in their own wonderland that never exists, all the time.That makes me a capitalist, I guess. But,
  I believe American foreign policy is cruel, prejudiced and highly self centric. Its great milatary power and dependency on foreign oil is only making it even worse.It is useless to assess how good or bad Ghadaffi/Saddaam/Afghanisthan/Iran/Palestina or whoever or whatever nation in future is..they are just as good or as bad as America wants it to be.

  I noticed if somebody says like this, he/she will be branded as communists or supporter of the other side. It need not be. It doesn't make sense branding oneself as some 'ist and take the responsibility of defending all aspects of it.(..this is what communists to do and the reason for their near extintion in my opinion)

  Now read my above post (in telugu).thanks.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. @pavani గారూ మీరు అనాలిసిస్ అంతా బాగా చేశారు. బాగానే ఉంది. ప్రపంచంలో అన్నీ బాగా చేసి ఉన్న మంచి దేశం ఏమిటి? ఒక్క పర్ఫెక్ట్ దేశం చెప్పండి? నేను అనాలసిస్ చెయ్యలేదు. మీ లాంటి వాళ్ళు చెపితే ఒప్పుకుంటాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. @పావని,

  అమెరికా విదేశాంగవిధానాన్ని, చేసిన, చేస్తున్న ప్రత్యక్ష, పరోక్ష యుద్దాలనో విమర్శించినంత మాత్రాన కమ్యూనిస్ట్లు అవ్వరు లేండి, అలా అయితే, neo cons కాని ప్రతి అమెరికా పౌరుడు (2009 ఎన్నికలలో మెజారిటీ పౌరులు) కమ్యూనిస్టే అవుతాడు మరి :))

  ఇక ఈ టపా వరకు, ఇందులో ఎక్కడయినా అమెరికా విదేశాంగ విధానాన్ని పొగుడుతూ మీకేమయినా లైన్లు కనిపించినాయేమో (తోటి ఎఱ్ఱ కళ్లాద్దాల పిచ్చోళ్లకు, వాళ్ల బతుకులు, వాళ్ల ఎఱ్ఱ దేశాల బతుకులను బాగు చేసుకోవటం కంటే, అమెరికా లో నిరుద్యోగ సంఖ్య, వాటిని చూసుకొని పండగలు చేసుకొంటూ (తాము అడుక్కొని తింటున్నా సరే) అంతర్జాతీయ వార్తలు అంటూ చంకలు గుద్దుకోవటాలు చేసే వాళ్లను చూసి, మీరు ఆ కోవకు చెందుతారేమో) అన్న అనుమానం తో అడిగాలేండి. :))

  సరే, చివరకు ఈ టపాలో మలక్కు అడిగింది ఏమని? కమ్యూనిస్ట్లు భారతీయులు, ముఖ్యంగా హిందువుల వరకూ (ప్రత్యేకించి మోడీ వరకు) ఎందుకని ద్వంద ప్రమాణాలు పాటిస్తారు అని, మాత్రమే!!! ద్వంద ప్రమాణాలు పాటించింది ఎవరు, అసలు ద్వంద ప్రమాణాలతో బ్రతకందే పూటగడవంది వాళ్లకే కదా, అంటారా ఇక చెప్పటానికి ఏమీ లేదు!!!

  పైన తాడేపల్లి గారికి, మలక్కు జరిగిన సంభాషణ చూడగలరు.

  ప్రత్యుత్తరంతొలగించు
 15. ప్రపంచంలో పెర్ఫెక్ట్ గా ఏదీ ఉండదండి.అది స్రుష్టి విరుద్ధం.కాకపోతే పేదవాడి కోపం పెదవికి చేటైతే అమెరికా వాడి కోపం దెశాల్నే కబళించగలదు. అందుకే వాడి గురించి అందరూ ఇంతెక్కువ మాట్లాడుకునేది.వాడు కాస్త న్యాయంగా ధర్మంగా ఉండటం ప్రపంచానికి మంచిది. వాడికి కూడా మంచిదేనని నా అభిప్రాయం.
  ఇక కమ్యూనిస్ట్ ల ద్వంద్వ ప్రమాణాలంటారా..నాకు తెల్సి వాళ్ళదొకటే ప్రమాణం. పిల్లికీ పిడుగ్గీ, ప్రపంచలో సర్వ అరిష్టాలకీ కారణం కమ్యూనిజం లేకపోవటం.వాళ్ళు కాస్త నాలుగు కాలాల పాటు కొన్ని దేశాలనైనా జనరంజకంగా అభివ్రుద్ధిపథం వైపు నడిపించి చూపిస్తే దాంట్లో నిజమెంతో గొంతుచించుకోకపోయిన అందరికీ అర్ధమయ్యేది. అది జరగలెదు కాబట్టి --its more a theory than a real viable system of governance. (I know Cuba has achieved very high HDI inspite of its low income and economic sanctions. But that doesn't make it a model country to follow.)

  ప్రత్యుత్తరంతొలగించు
 16. ఇంతకీ వాళ్ళెవరో వీళ్ళెవరో మీకు క్లియర్ గా అర్థమైందా?(నా క్కాలేదు)
  ------
  క్లియర్‌గా అర్థం కాకున్నా అంత పెద్దగా చాలా బాగా చెప్పారు( నే చదవలేదులేండి), ఇక అర్థమైతే ఎంతబాగా చెప్పేవారోగదా! :))

  ప్రత్యుత్తరంతొలగించు