27, జూన్ 2013, గురువారం

మాలిక పద చంద్రిక – 9 సమాధానాలు


మే నెల పదచంద్రిక పూరణ ఈక్రింద ఇస్తున్నాము. కేవలం ఇద్దరే పూరించి పంపారు. వారు శ్రీమతి భమిడిపాటి సూర్యలక్ష్మిగారు, శ్రీ ఫణికుమార్ గారు(బ్లాగాగ్ని బ్లాగు కర్త).  ఇద్దరి తప్పులూ ఒకటే అవడం విశేషం.  ఈసారి విజేతలెవ్వరూ లేరు..


  1. అడ్డం 1.పేరులో క్షీరం, రచనలో 14 అడ్డం ఈసోమేశ్వరుడి సొత్తు   --  పాలకొల్లు అని రాసారు. పాల్కురికి సరైన సమాధానం.
  2. అడ్డం 15    ఈయనది కృష్ణపక్షమే.. లేకపోతే ఆ కృతికి సింహావలోకం రాస్తాడా పొడి అక్షరాలలో  -- తకొ. తశి సరైన పదం. తల్లావఝ్ఝుల శివశంకర శాస్త్రి కి పొట్టి పేరు.
  3. నిలువు 16. 5 నిలువుతో చేరితే .. చివరికి మిగిలేది ఇంటిపేరే.  చివరికి మిగిలేది రాసిన బుచ్చిబాబు గారి ఇంటిపేరు శివరాజు.

సూర్యలక్ష్మిగారు అదనంగా చేసిన తేడా  14 నిలువు ద్విరుక్త అని రాయడం. ద్వితీయ (విభక్తి) అని ఉండాలి.


ఏదైనా ప్రత్యేకంగా చేద్దామని జ్యోతిగారు సూచించినమీదట పదచంద్రిక -9 ని సాహిత్య పదచంద్రికగా తయారు చేసాము. మరి కొందరు కూడా పూరించి ఉంటే పత్రికకూ, నాకూ కూడా ఉత్సాహంగా ఉండేది.


సత్యసాయి కొవ్వలి

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి