17, జూన్ 2013, సోమవారం

మాలిక మాసపత్రిక




మాలిక పత్రిక ఇంతకుముందులా రెండు నెలలకు ఒకాసారి కాకుండా ప్రతీనెల విడుదల అవుతుందని  తెలియజేయడానికి సంతోషిస్తున్నాము.

కొత్త కొత్త రచనలను మాలిక పత్రిక ఆహ్వానిస్తుంది. ఇందుకోసం మీరు పేరు పొందిన బ్లాగరు, రచయిత , కవి కానవసరం లేదు. మీరు ఏ విషయం మీదైనా రాయవచ్చు. కధలు, కవితలు.సంగీతం. సినిమా, సాహిత్యం, సీరియల్స్, సాంకేతికం, విశ్లేషణ, విమర్శ మొదలైనవి రాసి మాకు పంపండి . ఈ విషయంలో మీకు కావలసిన సహకారం ఇవ్వబడుతుంది. కొత్త ప్రయోగాలు చేయడానికి మాలిక పత్రిక ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని గతంలో విజయవంతంగా నిర్వహించిన అంతర్జాల అవధానాలు నిరూపించాయి. మరికొన్ని రాబోతున్నాయి..

మీ రచనలు పంపవలసిన చిరునామా:  editor@maalika.org

2 వ్యాఖ్యలు:

  1. మాలికను మాసపత్రికగా మారుస్తున్నందుకు అభినందనలు!సరుకు నిండా ఉండే రచనలు పంపే రచయితలు ఉంటే ఏ పత్రికయినా పది కాలాలపాటు నిలుస్తుంది!ముందుగా సంపాదకులకు మంచి ఉన్నతాభిరుచి ఉండాలి!చచ్చు రచనలు మిత్రులు పంపినా వెయ్యకుండా ఉండే నిగ్రహం పాటించాలి!

    ప్రత్యుత్తరంతొలగించు