31, జులై 2013, బుధవారం

మాలిక పత్రిక ఆషాడమాస సంచిక విడుదల
విభిన్నమైన, సరికొత్త అంశాలతో మాలిక పత్రిక ఆషాడమాస సంచిక విడుదల చేస్తున్నాం. ఇంతకుముందు ప్రారంభమైన సీరియల్స్ తో పాటు ఈ నెలనుండి ప్రముఖ రచయిత బ్నిం మూర్తిగారి  కధలను విందాం.. అవునండి చదవడం కాదు విందాం.. అలాగే ప్రముఖ కార్టూనిస్ట్ జయదేవ్ గారి గీతపదులు కూడా ఈ నెలనుండి మొదలవుతున్నాయి.. కినిగె నుండి ప్రతీనెల టాప్ టెన్ పుస్తకాల గురింఛిన వివరాలు అందించబడతాయి..  దీనివలన కొత్త పుస్తకాల గురించిన సమాచారం తెలియవస్తుంది. కొనాలనుకున్నవాళ్లు కొనుక్కోవచ్చు.


ఇక మాలిక పత్రిక తరఫున మరో ముఖ్య ప్రకటన..
తెలుగు బ్లాగులు, వికీపీడియాలో రాసేవారిని ప్రోత్సహించడానికి మాలిక పత్రిక ప్రతీనెల ఉత్తమ బ్లాగు టపా, ఉత్తమ వికీ టపాను ఎంపిక చేసి కినిగె వారి 116/- రూపాయిల గిఫ్ట్ కూపన్ బహుమతిగా అందిస్తుంది. ఈ కూపన్ సాయంతో మీరు కినిగెనుండి ఈబుక్ లేదా ప్రింట్ బుక్ కొనుక్కోవచ్చు..


మాలిక పత్రికకు రచనలు  ఈ చిరునామాకు పంపాలి.. editor@maalika.orgఈ సంచికలోని విశేష వ్యాసాల వివరాలు:

0. సంపాదకీయం: స్నేహం ఒక వరం
1. కినిగె టాప్ టెన్
2. విదేశీకోడలు 
3. నల్లమోతు శ్రీధర్ వీడియోలు
4. రఘువంశము - 2
5. అనగనగా బ్నిం కధలు - 1
6. మాలిక పదచంద్రిక - 11
7. పారసీక చందస్సు - 3
8. జయదేవ్ గీతపదులు - 1
9. సంభవం - 3
10. అతడే ఆమె సైన్యం - 3
11. రక్షాబంధనం
12. జీవిత పాఠశాలలో నిరంతర విద్యార్ధి
13. చారిత్రక సాహిత్య కధామాలిక - 4

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి