13, సెప్టెంబర్ 2013, శుక్రవారం

అత్యాచారం చేసి ఉరికంబం ఎక్కుతారా లేక అత్యాచారం చేయబడిన అమ్మాయిని చంపేసి కొన్నాళ్ళు జైల్లో ఉండి బయటకొచ్చేస్తారా?

అత్యాచారం చేసి ఉరికంబం ఎక్కుతారా లేక అత్యాచారం చేయబడిన అమ్మాయిని చంపేసి కొన్నాళ్ళు జైల్లో ఉండి బయటకొచ్చేస్తారా?

హత్యానేరానికి సంబంధించిన చట్టాలని సవరించకుండా అత్యాచారానికి ఉరిశిక్ష విధిస్తే జరగబోయేది ఊహించటం పెద్ద కష్టమేమీ కాదేమో?

అత్యాచారం మిగిల్చే trauma జీవితమంతా ఉంటుంది నిజమే, కానీ అసలు జీవితమే మిగలకపోతే?

ప్రాణంకంటే మానం ముఖ్యమనే ప్రవచనాలని వల్లిస్తూ అత్యాచారానికి గురైన సినీమా హీరోగారి చెల్లెలు అత్మహత్య చేసుకోవటం సినీమాలకే పరిమితమయితే మంచిదేమో?

2 వ్యాఖ్యలు:

  1. అసాదారనమయిన అత్యాచారం కేసులలో మాత్రమె మరణ శిక్ష విదిస్తుంటే బానే ఉంటుంది కదా ?

    ప్రత్యుత్తరంతొలగించు
  2. నిజమే. అయితే మళ్ళీ ఏది సాధారణం ఏది అసాధారణం అనే గొడవ మొదలవుతుంది.

    IPC 302 ని సవరించి హత్యానేరానికి కఠినమైన శిక్ష విధిస్తే ఈ ఇబ్బంది ఉండకపోవచ్చు. లేకపోతే బలాత్కారంకన్నా హత్యకు తక్కువ శిక్ష అనే లొసుగు ఉపయోగించుకుని నేరస్తులు తప్పించుకునే అవకాశాలే మెండు!

    ప్రత్యుత్తరంతొలగించు