1, అక్టోబర్ 2013, మంగళవారం

మాలిక పత్రిక అక్టోబర్ సంచిక విడుదల


విభిన్నమైన వ్యాసాలు, కధలు, సీరియళ్లతో మిమ్మల్ని అలరిస్తున్న మాలిక పత్రిక అక్టోబర్ సంచిక విడుదల.. ఈ నెలలో ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు శ్రీ మాధవపెద్ది సురేష్ గారు  " సరిగమల గలగలలు"  పేరిట తన సంగీత ప్రస్ధానంలోని విశిష్ట వ్యక్తుల  గురించి తెలియజేస్తున్నారు .. మరో కవయిత్రి శ్రీమతి రేణుక అయోలగారు "లేఖాంతరంగం " పేరిట వివిధ సామాజిక అంశాలను లేఖారూపంలో  చర్చిస్తున్నారు.

మాలిక పత్రిక తరఫున నిర్వహిస్తున్న పదచంద్రిక విషయంలో చాలా నిరుత్సాహంగా ఉంది. రాను రాను ఈ పదచంద్రిక పూరించేవారు తగ్గిపోతున్నారు.  ఈ ప్రహేళిక రూపురేఖలు మార్చాలా? మరీ కష్టంగా ఉందా? అసలు కారణమేమిటో తెలియడంలేదు. అందుకే గతనెలలో స్పందన లేకుండా ఉన్న జె.కె.మోహనరావుగారు కూర్చిన పదచంద్రికనే మళ్లీ ఇవ్వడం జరుగుతుంది.

మాలిక పత్రిక తరఫున ఇచ్చే కినిగె బహుమతి ఈసారి ఉత్తమ బ్లాగు టపా వనజగారు రాసిన ఈ టపాకు ఇవ్వడమైంది. ఎప్పుడూ సీరియస్ పోస్టులు రాసే వనజగారు మనందరం ఎదుర్కునే మార్కెటింగ్ మాయాజాలం గురించి రాసారు.
జగ్గయ్యపేట రంగురాళ్లు చాలమ్మా...

ఇక తెలుగు వికీపీడియాకు సంబంధించి ఎటువంటి లాభాపేక్ష, స్వార్ధం లేకుండా కొంత సమయం వెచ్చించి విలువైన సమాచారాన్ని ఇతరులకోసం వికీలో పొందుపరుస్తున్న వికీపీడియన్లకు చిరు సత్కారం ఇవ్వాలనుకుంటున్నాంః  ఈసారి ఈ బహుమతి రాజశేఖర్ గారికి ఇవ్వబడుతుంది.

వనజగారికి, రాజశేఖర్ గారికి చెరో రూ.116 ల కినిగె గిఫ్ట్ కూపన్ ఇవ్వబడుతుంది..దీనితో ప్రింట్ లేదా ఈ పుస్తకాలను కినిగెనుండి కొనుగోలు చేయవచ్చు.

మీ రచనలు  పంపవలసిన చిరునామా: editor@maalika.org
అక్టోబర్ సంచికలోని విశేషాలు:

0.   సంపాదకీయం
1.  పారశీక చందస్సు - 5
2.  సరిగమల గలగలలు - 1
3.  జీవితపధ సోపాన పుటలు (పలక - పెన్సిల్)
4.  లేఖాంతరంగం - 1
5.  పంట పండింది 
6.  అనగనగా బ్నిం కధలు - 3
7.  సంభవం - 5
8.  పోరుగీతమై విప్లవిస్తా
9.  రఘువంశం - 3
10. చారిత్రక సాహిత్య కధామాలిక
11. ఇంటర్యూ - ఇన్నర్ వ్యూ
12. నల్లమోతు శ్రీధర్ వీడియోలు
13.  మాలిక పదచంద్రిక - 13

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి