
తాము తప్ప ప్రపంచంలోని మిగాతావారందరివీ ద్వంద్వప్రమాణాలనే కమ్యూనిష్టులు వాళ్ళ ప్రమాణాలని వాళ్ళే నిరూపించుకుంటున్నారు.
అబ్బెబ్బే, ఇది తెర గారి గురించి కాదులెండి. ఆయన సంగతి తెలియనిదెవరికీ? కామెంట్లు తీసెయ్యటానికి కారణం దొరక్కపోతే భాష పేరు చెప్పి తప్పించుకోవటం ఇప్పుడు పాతబడిపోయింది. అసలు సంగతేమిటంటే ఆయన అనూనయులు వాడే భాష ఆయన కంటికి ఇంపుగా ఉంటుంది.
నేను మాట్లాడుతోంది వారి పత్రిక గురించి. రోమిలా థాపర్ లాంటి పనికిమాలిన శాల్తీలు వగే పిచ్చివాగుడు ప్రసా(చా)రం చేసే వ్యూహంలో భాగంగా ఒక కమ్యూనిష్టుడి (కమ్యూనికృష్టుడి అంటారా? సరే సరే మీ ఇష్టం) పత్రిక మన మేడంగారి ఇంటర్వ్యూ ఏదో పేచురించింది. మన తెలుగు కమ్యూనిష్టువీరులేమో దానిని కాస్త దండేసి ఫోటో కట్టించారు.
అన్నట్టు ఇంతకీ విషయమేమిటంటే, ఎవడో మేతావి వ్రాసిన వ్రాతల్ని ఢిల్లీ యూనివర్సిటీ సిలబస్ లోంచి తొలగించింది. "ఏమిటీ సంగతీ?" అంటే "రోమిలా ఏడ్చింది" అన్న చందాన ఎఱ్ఱబాబులు కాకిగోల మొదలుపెట్టారు. సిలబస్ లోంచి హిందూవ్యతిరేక వ్యాసాలని తొలగించకూడదని వీళ్ళ డిమేండ్. అంతవరకూ బాగానే ఉంది.
కానీ ఆ తొక్కలో వ్యాసాన్ని చూసి వళ్ళు మండిన ఒక బ్లాగర్ గట్టిగానే ఇచ్చుకున్నారు. హిందువులంటే అందరికీ అలుసే అని ఘాటుగానే స్పందించారు. అయితే ఔరంగజేబులో దైవత్వాన్ని చూసే రోమిలా, ఆవిడగారి శిష్యగణాల రూటే వేరు. తమకి వ్యతిరేకంగా ఒక వ్యాఖ్య వచ్చేసరికీ దాన్ని పీకిపారేశారు ఈ కమ్యూనిష్టులు. అలాంటింది హిందూవ్యతిరేక వ్యాఖ్యలని, కాదు .. కాదు ఏకంగా వ్యాసాలని ప్రచురించాలిట. పోనీ చరిత్రకి సంబంధించిన ఆధారాలేమన్నా ఉన్నాయా అంటే అవీ లేవు. ఆర్యుల దురాక్రమణ సిధ్ధాంతం పేరుతో భారతీయుల్ని విడదీసే ప్రయత్నం చేశి, సఫలీకృతురాలినయ్యానని ఆనందపడేలోగానే మిగాతావారి పరిశోధనల వల్ల భంగపడిన మేడంగారా మనకి చరిత్రగురించి పాఠాలు చెప్పేది?
ఆ బ్లాగర్ వ్యాఖ్యలివిగో:
_______________________________________________
RADHAKRISHNA చెప్పారు...
ఎవరికి తోచినట్లు వారు ఏదోకటి అనేయట బాగా పరిపాటైయ్యింది. వీరందరూ ఇతర మతాల కధల జోలికి ఎందుకు వెళ్ళరు? అవన్నీ హేతుబద్ధంగా వుండి ప్రజల మనస్సును చక్కగా తీర్చి దిద్దాయా? అలా అయితే వాటిలోని లోపాలను బహిరంగంగా చెప్పటానికి ఎందుకు లౌకికతత్వం అనే ముసుగు వెసుకుని భయం లేనట్లు నటిస్తారు? మరి రామాయణ, భారతాలను విమర్శించే వారికి ఇంత ధైర్యాన్ని ఇచ్చిందెవరు?
అదే భారతీయ సన్స్కృతి; ఈ ఇతిహాసాలను మరియు చక్కటి అనుబంధ పురాణాలను మనకు తెలియకుండా వంట బట్టించుకోబట్టే అందరూ ధైర్యంగా, స్వేచగా మాట్లాడగలుగుతున్నారు, వ్యాఖ్యలు చెయ్యగలుగుతున్నరు. మన వ్యక్తిత్వంలో ఇంతటి స్వేచ్చనిచ్చిన హిందూ మాతం లాంటిది మరొకటి చూపించి, తరవాత మనమీద మనం విమర్శ చేసుకొవడం మొదలు పెడితే బావుంటుంది. మన స్వేచ్చను బయట సాన్స్కృతిక దాడికి లోనైన కొందరు అతిగా తీసుకుని కూర్చున్న చెట్టునే నరకాలని చూస్తున్నారు. మరి ఇంట్లో వాళ్ళనే తిట్టి, అడ్డదారిన పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుందామని అనుకుంటున్న ఈ విభీషుణులకి వినపడుందో లేదో!!!
_______________________________________________________
RADHAKRISHNA చెప్పారు...
నా కామెంటు తొలగించారు కాబట్టి నెను చెప్పిందే నిజమైది. ప్రజాశక్తి లో "శక్తి" కేవలం నేతిబీరకాయేనన్నమాట. ఈ నిరంకుశత్వానికే నేను వ్యతిరేకం. నచ్చకపోతే నా కామెంటుకి కామెంటు వ్రాసే స్వేచ్చ ప్రజలకివ్వచ్చుగా... "ప్రజల శక్తి" మీద మీకే నమ్మకం లేదా?