హీహీహీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
హీహీహీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
17, అక్టోబర్ 2013, గురువారం
5, జులై 2013, శుక్రవారం
"ఊర్వశీ ఊర్వశీ" ట్యూన్లో వోటర్లపైన ఒక "ప్రేమికుడి" ఆక్రోశం :P
వోటరూ, వోటరూ టేకీటీసీ వోటరూ
నేతలు నిన్ను ఫూలు చేస్తే లైటుతీస్కో వోటరూ
నిన్ను వెధవని చెయ్యటమంటే వాళ్ళకి సింపుల్ మేటరూ ..
నాయకుల..పే..కాటలోన నువ్వే అసలు జోకరూ ...
వోటరూ, వోటరూ టేకీటీసీ వోటరూ...
నీకసలు తెలుసా తెలుసా ఎమ్మెల్యే ఎంపీ నీవాళ్ళే
నువ్వు వోటింగ్ ఎగ్గొడితే మిగిలిన వోట్లతో గెలిచినాళ్ళే
అయినా నీకూ కావల్సింది టీవీలో హేరీ పాటరూ ..
దొంగవోట్లు ఎన్నిపడినా నువ్వు చెయ్యి బేఖాతరూ..
వోటరూ, వోటరూ టేకీటీసీ వోటరూ...
స్టేటునే విడగొడతామంటే ఈసీ కోస్తా వోటరూ
ఇప్పుడప్పుడే తేల్చము అంటే ఈసీ తెలంగాణా వోటరూ
నీది త్రిశంకు స్వర్గం అంటే ఈసీ రాయలసీమ వోటరూ
నెత్తిపై శఠగోపం పెడితే ఈసీ ఆంధ్రప్రదేశ్వోటరూ ...
వోటరూ, వోటరూ టేకీటీసీ వోటరూ...
కేడర్లు గుడినే మింగేస్తే... లీడర్లు లింగం మింగునులే
అందులో నీక్కాస్త పడవేస్తే... నీ మెదడు వైట్-వాష్ అవ్వునులే
నువ్వు ఇక బక్రా అయిపోతే... నీకసలు ఫికరే అక్కరలే
ఏదో ఒక ఫ్రీ స్కీమే పెడితే... నీ కుక్క తోకే వంకరలే
వోటుకింతని రొఖ్ఖం ఇస్తే పండగ చేస్కో వోటరూ
ఫుల్లుగా మందేపోయిస్తే ఎంజాయ్ చెయ్యి వోటరూ
గెలిచినాక టాటా చెబితే ఏడ్చుకో ఇక వోటరూ
అయిదేళ్ళయ్యాక కనిపిస్తే అంతా మర్చిపో వోటరూ
వోటరూ, వోటరూ టేకీటీసీ వోటరూ...
నువ్వు నేతలపై అలిగేస్తే... వెంటనే క్రికెట్ మేచ్ ఖాయం
దానిలో ఇండియా గెలిచేస్తే... నీకున్న కోపం మటుమాయం..
నీవల్ల గెలిచిన వారైతే నీకసలు చెయ్యరుగా సాయం
అసలు కారకుడివి నువ్వేగా.. నీకింక తప్పదు ఈ న్యాయం!
3, జులై 2013, బుధవారం
శంకరశాస్త్రి టిఫిన్!
ఒక రోజు శంకరశాస్త్రిగారో టిఫిన్ సెంటర్కి వెళ్ళారు. ఆయన చెప్పినదాన్ని సెర్వర్ ఒక పట్టాన తీసుకురాకపోయేసరికి కాస్త దీనంగా, కాస్త కోపంగా "శంకరా! నాదశరీరాపరా" ట్యూనులో ఈ పేరడీ ఎత్తుకున్నారు.
పల్లవి:
సెర్వరా! నాన్చుడు ఇక ఆపరా..
వేగముగా సాగరా
టిఫిన్ తీసుకురా...!
సెర్వరా!
నాన్చుడు ఇక ఆపరా..
వేగముగా సాగరా
టిఫిన్ తీసుకురా...!
చరణం 1:
గారెలు ఎఱుపని, ఆవడ తెలుపని
మూకుడే నలుపుయనీ ...
నిన్నటి పుల్లని పెఱుగును కలిపితే
గారెనే ఆవడనీ ..
గారెలు ఎఱుపని, ఆవడ తెలుపని
మూకుడే నలుపుయనీ ...
నిన్నటి పుల్లని పెఱుగును కలిపితే
గారెనే ఆవడనీ ..
పాకపు కిటుకులు తెలిసినవాడవు మరోనలుడవు నీవైతే ...
పాకపు కిటుకులు తెలిసినవాడవు మరోనలుడవు నీవైతే ...
ఇడ్లీ పూరి బిసిబెళేబాత్ ఉప్మా
మఱువరా నీవు మఱువరా
కుక్కులెరుగనీ కొత్తవంటకం
స్వయంశక్తితో చేసిపెట్టరా .. వేసిపెట్టరా...
సెర్వరా!
నాన్చుడు ఇక ఆపరా..
వేగముగా సాగరా
టిఫిన్ తీసుకురా...!
చరణం 2:
ఉడికే కుడుములు అతివకు గుచ్చిన మన్మథ చూపులు కాబోలూ ..
వేగే పుణుకులు నరకపు యమునికి చిక్కిన పాపులు కాబోలూ ..
పెనం మీదపడవేయంగా .. చఱ్ఱున కాలెనుగదా వంగా...
పెనం మీద పడవేయంగా .. చఱ్ఱున కాలెనుగదా వంగా...
సాంబారే దానితో చేయంగా ... ఆ తలపుకే నానోరూరంగా ...
ఆ ..ఆ .. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
సెర్వరా! నాన్చుడు ఇక ఆపరా.. వేగముగా సాగరా టిఫిన్ తీసుకురా...! సెర్వరా! సెర్వరా!! సెర్వరా!!!
31, జనవరి 2012, మంగళవారం
"సాగర సంగమం" - జయప్రద కమల్ ని పెళ్ళి చేసుకుని ఉంటే తకిట తధిమి పాట ఇలా ఉండేది ..
తకిట తధిమి తకిట తధిమి తందానా
తాళి కట్టిన క్షణమే బ్రదరు బందీనా ..
తడబడు అడుగుల వయసులో ప్రేమేనా ...
పెళ్ళికి తీసిన దారులు ఏమైనా ..
బ్రతుకునంత బుగ్గి చేసి ..
తకిట తధిమి తకిట తధిమి తందానా
తాళి కట్టిన క్షణమే బ్రదరు బందీనా ..
చరణం 1:
మొగుడి బ్రతుకు నటన, పెళ్ళంటే దుర్ఘటన
మగవాడి రాత ఇంతని, చేశాడు బ్రహ్మ రచన
మొగుడి బ్రతుకు నటన, పెళ్ళంటే దుర్ఘటన
మగవాడి రాత ఇంతని, చేశాడు బ్రహ్మ రచన
తెలుసా సోదరా తెలిసీ నెగ్లీజెన్సా ..
తెలియక చేసిన తప్పుకు లైఫ్ సెంటెన్సా ..
తెలుసా సోదరా తెలిసీ నెగ్లీజెన్సా ..
తెలియక చేసిన తప్పుకు లలలా లలలా ..
అక్కినేని నాగ్ మాట
మన్మధుని మూవీ బాట
"వద్దురా సోదరా" అని పాడీ!
తకిట తధిమి తకిట తధిమి తందానా
తాళి కట్టిన క్షణమే బ్రదరు బందీనా ..
చరణం 2:
చిట్లెను నీ అధరం ఇక పారెను నీ రుధిరం
సతినే ఎదిరిస్తే బ్రతుకంధకారబంధురం
చిట్లెను నీ అధరం ఇక పారెను నీ రుధిరం
సతినే ఎదిరిస్తే బ్రతుకంధకారబంధురం
గొంతులో దాగిన నీ ఆర్తనాదమే
బానిస బ్రతుకును మొత్తం వివరింపంగా
గొంతులో దాగిన నీ ఆర్తనాదమే
బానిస బ్రతుకును మొత్తం వివరింపంగా
డ్రీము గాళు కలలనుండి
బయటపడ్డ బ్రతుకు బండి
పడిపోయెను పట్టాలే తప్పీ ...
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ...
3, జనవరి 2012, మంగళవారం
14, డిసెంబర్ 2011, బుధవారం
ఓ నేటి త్రిలింగదేశ అంతర్జాలికులారా ...
Sung to the tune of పెళ్ళిచేసుకొని ఇల్లు చూసుకుని ...
ఓ భావి త్రిలింగదేశ అంతర్జాలికులారా
వయసుముదిరిన బ్లాగ్జనులారా
పరానుభవమున టైపు నా ఘోష ఇదే!!
వాహ్ రే వాహ్!
తాధినా తకధీన తాంగిడతక తధికిటతకతోం
బ్లాగు తెఱచుకుని పోస్టులేసుకుని కామెంట్లెన్నో పెట్టాలోయ్
భజనలు గట్రా చెయ్యాలోయ్
మరి ఫుల్లుగ టైంపాస్ అవ్వాలోయ్
సినిమాల మోజులో గాసిప్ సైట్లనే ఆదరించి
విసిట్ చేసిన ఐడిలు హేక్ కాగా
పిన్నలు పెద్దలు ముసలివాండ్రు
బ్లాగు పేరు చెప్పుకుని అందరూ సుఖపడగా
తాధినా తకధీన తాంగిడతక తధికిటతకతోం
డెస్కు టాపులో లేపు టాపులో అప్డేట్లు చూడాలోయ్... తరంపం
డెస్కు టాపులో లేపు టాపులో అప్డేట్లు చూడాలోయ్
స్మార్టుఫోనులో ఐపేడులో వాటికి రిప్లయ్ ఇవ్వాలోయ్
స్మార్టుఫోనులో ఐపేడులో వాటికి రిప్లయ్ ఇవ్వాలోయ్
బ్లాగు తెఱచుకుని పోస్టులేసుకుని కామెంట్లెన్నో పెట్టాలోయ్
భజనలు గట్రా చెయ్యాలోయ్
మరి ఫుల్లుగ టైంపాస్ అవ్వాలోయ్
సహజాలునిలా సహజాలికలా
సహజీవనమే గడపాలోయ్ ...
సహజాలునిలా సహజాలికలా
సహజీవనమే గడపాలోయ్
బోరుకొట్టినచో ఎవరికీ
అర్థం కాని పోస్టులే వెయ్యాలోయ్ ...
బోరుకొట్టినచో ఎవరికీ
అర్థం కాని పోస్టులే వెయ్యాలోయ్ ...
బ్లాగు తెఱచుకుని పోస్టులేసుకుని కామెంట్లెన్నో పెట్టాలోయ్
భజనలు గట్రా చెయ్యాలోయ్
మరి ఫుల్లుగ టైంపాస్ అవ్వాలోయ్!
10, అక్టోబర్ 2011, సోమవారం
నేను కవిని కానన్నవాడితో మార్తాండ కథలు చదివిస్తా! :))
ఈ మధ్య కొంతమది ఆధునిక కవులు వ్రాసిన కవితలు చదివాక నాలో కూడా భావావేశం పెల్లుబికి, పొంగిపోయి, శిరస్సును చీల్చుకుంటూ నా గణకయంత్ర బొత్తాముల ద్వారా బయటపడింది. "ఒక వాక్యాన్ని చీల్చి చెండాడి నాలుగు లైన్లలో రాయ్టమే కదా కవిత్వమంటే" అని అనుకుని, నేను కూడా కవిని అయిపోదామని డిసైడయిపోయా.
("నేను కవిని కాదన్నవాడిచేత మార్తాండ ఫేమస్ రచనలైన వదిన - మరిది అక్రమ సంబంధాల కథలు చదివిస్తా ఖబర్దార్!" )
ఇదిగో నా కవిత ముహహహహహహహహహ:
అగ్రవర్ణాలు చేతగాక విఫలమయితే తప్పు ఎప్పుడో రిజర్వేషన్లు పెట్టిన అంబేద్కర్ ది!
దళితులు బద్ధకంతో ఫెయిలయితే నేరం అప్పుడెప్పుడో ఉన్న వర్ణ వివక్షది!!
కమ్యూనిష్టు
స్త్రీ ఎవడితోనో లేచిపోతే, అది ఆమె మొగుడి బాధ్యత!!!!
మనం అసలు తప్పులు చెయ్యం - తప్పంతా పక్కవాడిదే :P
ఓ ప్రియా ..!!!!!!!!
నీ ఊరువుల వర్ణన విని ఊర్వశివనుకున్నా ...
నా నట్టించికొచ్చావంటే పండగ చేసుకున్నా ...
నీ కంటి చూపులకు సాటిలేదంటే అతిలోక సుందరివనీ ఊహించుకున్నా ...
నాకేం తెలుసు నీ పేరు బాలకృష్ణ అని? :(((((
24, సెప్టెంబర్ 2011, శనివారం
కెలుకుడు
16, జూన్ 2011, గురువారం
14, జూన్ 2011, మంగళవారం
భక్తి
1990ల సంగతి ...
మా అమ్మ బయటకేదో పనిమీద వెళ్ళి పనిలో పనిగా పుస్తకాల షాపుకి వెళ్ళారు. అవీ ఇవీ చూస్తూ ఆవిడ పని చేసిన కళాశాలలో ఇద్దరు కలీగ్స్ మాట్లాడుకుంటుండగా ప్రస్తావనకి వచ్చిన పుస్తకాన్ని కొన్నారు. ఆ షాప్ ఓనర్ కాస్త తటపటాయించాడు అమ్మడానికి - ముందు ఒకటే కాపీ ఉందనీ, తరవాత ఎవరో రిజర్వ్ చేసుకున్నారని. కానీ ఆవిడ మిగిలిన కాపీలని కూడా చూపించడంతో చేసేదేమిలేక అమ్మేశాడు.
ఆ మర్నాడు ఆవిడ పూజ చేసుకుంటూండగా మామూలుగా వినిపించే స్తోత్రాలకు బదులు నాకు తిట్లు వినిపించాయి. "అడ్డగాడిదలు, దరిద్రపుగొట్టు వెధవలు, అన్నం తినే మనుషులా గడ్డి తినే పశువులా?" నాకొక నిముషం అర్థం కాలేదు ఏం జరుగుతోందో. తిట్లతో పూజలు చెయ్యటం కొత్త పధ్ధతేమో అని సరిపెట్టుకున్నా. కానీ కాసేపయ్యాక మరీ దేవుడిని అలా తిడుతోందేమిటి అని అనుమానం వచ్చి పూజగదిలోకి తొంగి చూశా.
అమ్మ మొహం కోపంగా, భీకరంగా ఉంది. ఏమైందని అడిగా.
"చూడరా నా కలీగ్ దరిద్రులు, ఏదో భక్తి పుస్తకమంటే షాపు ఓనర్ ఇవ్వనంటున్నా మరీ కొని పట్టుకొచ్చా ఈ పుస్తకాన్ని. పూజ టైంలో చదువుకుందామని తెరిచి చూస్తే ఏముందీ? దరిద్రులు, దరిద్రులు" అని మళ్ళీ తిట్లు లంకించుకుంది.
భక్తి పుస్తకంలో అంత భయంకరమైనది ఏముంటుందా అనుకుంటూ ఆ పుస్తకాన్ని చూసాక నాకు నవ్వాగలేదు. అదంతా అ ఇద్దరు మగ కలీగ్స్ వాళ్ళలో వాళ్ళు వాడుకునే "భక్తి" అనే కోడ్ వర్డ్ అమ్మకి అర్థం కాకపోవటంవల్ల వచ్చిన గొడవని నాకర్థమైంది. లోపలి పేజీలు చూడకుండా పుస్తకాలని కొనద్దని అప్పటికీ ఆవిడకి చాలాసార్లు చెప్పాను. నా మాట వింటేగా?
ఇంతకీ ఆవిడని అంత ఆగ్రహానికి గురిచేసిన పుస్తకం ఏమిటో తెలుసా?
"కవి చౌడప్ప శతకం" :)))))))))))))))
PS: ఒరిజినల్ కవి చౌడప్ప శతకం వేరు. అవి చాటు పద్యాలు. కానీ ఇక్కడ ఈవిడ కొన్న పుస్తకం, చౌడప్ప పేరడీలది - ఘాటైన భాషతో :)

18, ఫిబ్రవరి 2011, శుక్రవారం
బులుసు గారూ మీకిది తగునా?
అయ్యా బులుసుగారూ, ఏమనుకోకండీ గానీ మీ బ్లాగును నేను blacklist చేస్తున్నా. నేను ఇక ముందు చదవని బ్లాగుల్లో ఇదొకటి.
ఎందుకంటారా? ఎవడికి చెప్పుకోను నా కష్టాలు?
ఒక రోజు పొద్దున్నే ఎందుకో (ఎందుకేమిటి లెండి .. బుధ్ధిలేక) మీ బ్లాగు చదవటం మొదలుపెట్టాను, అది కూడా మీ పెళ్ళి చూపుల టపా. రెండంటే రెండే నిమిషాల్లో ఒక మైలు దూరంలో కూర్చునేవాడొకడొచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు, అంత గట్టిగా నవ్వద్దంటూ.
సరే మూతికి గుడ్డ చుట్టుకుని మరో రెండు టపాలు చదివా. అది కాస్తా చిరిగిపోయింది. ఈలోగా అరమైలు దూరంలో ఉండేవాళ్ళందరూ పదింటికే లంచికి వెళ్ళిపోయారు (దానికి కారణం నేనేనని ఆ తరవాత తెలిసింది). సరే ఇక నావల్లకాదని అటు ఇటూ తిరగటం మొదలుపెట్టా. అయినా సరే మీ టపాల్లోని విషయాలు గుర్తుకు రాకుండా ఉండవుకదా!
వాక్వే లో నడుస్తూ వెడుతుంటే ఒక దేశీ వనిత జీన్స్ మీద కుర్తా, వాలుజడ, పెద్ద బొట్టూ, మల్లెపూలూ పెట్టుకుని ( మీ ఊహ కరెక్టే, తెలుగమ్మాయే, ఎవరో అన్నట్టు వారికి తప్ప మరెవరికీ ఇలాంటి విచిత్ర వస్త్రధారణ ఉండదుకదా) ఎదురుగుండా వస్తోంది. ఈలోగా మీ బండోపాఖ్యానం గుర్తొచ్చి నవ్వేశా. ఆమేమో తన బట్టలని చూసి నవ్వుతున్నాననుకుని మొహం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయింది. వెంటనే నవ్వు ఆపుకున్నా. ఆ వెనకాలే వచ్చిన తమిళ పొన్నుని (ముదురు ఎరుపు చొక్కా, మెరుపుల జీన్స్) చూస్తే ఎందుకో మీ చివరి క్షణాలు గుర్తొచ్చాయి. కానీ నవ్వితే ఇబ్బంది అని నవ్వలేక, ఆపుకోలేక అదోటైపులో మొహం పెట్టా. ఆ పిల్లేమో "ఛి! నలభై యేళ్ళొచ్చి, ఒక కూతురు కూడా ఉండీ అవేం చూపులూ?" అనే టైపులో ఒక లుక్కిచ్చి ( ఏమిటో లేండి, ప్రపంచంలో జనాలందరూ వీళ్ళవెంటే పడతారని వీళ్ళకి కాస్త అనుమానం) వెళ్ళిపోయింది.
మరికాస్త ముందుకెడితే ఒక నీలమేఘశ్యాముడు - బోడి గుండు, బుఱ్ఱ మీసం - మన అంగ్రేజ్ సినిమాలో అన్నకి రంగుపూసినట్టన్నమాట - మీ సినిమా కథ గుర్తొచ్చింది - ఇక నావల్లకాదనుకుని పెద్దగా నవ్వేశా. వాడప్పుడే ఎవరితోనో తిట్లు తినొస్తున్నాట్ట, కోపంగా చూసుకుంటూ వెళ్లి పోయాడు. తరవాత వచ్చిన ఒక శ్వేతసుందరి మాత్రం "ఎప్పుడూ కనీసం పలకరింపుగా కూడా నవ్వనివాడు ఇవాళ ఇలా నవ్వుతున్నాడేమిటబ్బా?" అనుకుని, ఆనందపడిపోయి ఒక హగ్గు ఇచ్చి మరీ వెళ్ళింది. ఇది చూసి పైన చెప్పిన తమిళ తెలుగు పోర్లు మహిళా విశ్లేషణ -అదేనండీ గుస గుస గుస గుస - మొదలుపెట్టారు. ఇలా హగ్గులని అపార్థం చేసుకునే వాళ్ళు మా ఆవిడకి ఈ విషయం చేరేస్తే నా గతేంగాను?
ఇకమీటింగులో, ఎవరో ఒక అయిడియా చెప్పి ఎలా ఉంది అని నన్నడిగారు. ఖర్మకాలి అప్పుడే 239 వ దినం గుర్తొచ్చింది. ఇక ఆపకుండా నవ్వటం మొదలుపెట్టా. ఆ తరవాత ఒక మంచి అయిడియాని అపహాస్యం చేస్తావా అని తిట్లు పడటమే కాకుండా ఒక warning కూడా వచ్చింది గట్టిగా నవ్వద్దని.
అందుకే దీనంతటికీ కారణమయిన బులుసుగారి పులుసును, అదే నవ్వితేనవ్వండి బ్లాగును నేను బహిష్కరిస్తున్నా.

6, డిసెంబర్ 2010, సోమవారం
26, నవంబర్ 2010, శుక్రవారం
25, అక్టోబర్ 2010, సోమవారం
ఒక "షిట్" కథ :))
నా కాశ్మీరు పోస్టు మీద కోపం అణచుకోలేక మన కత్తిలాంటి మేధావి గారు
కెబ్లాసని తిట్టిన తిట్లలో ఒకటి "Sh*t ****" అని. ఆ కామెంటుని నేను ఊడబెరికాననుకోండి, ఆయన వాడిన వేరే పదాలవల్ల. అయితే దానిగురించి ఎవరో అడిగారు అసలు "షిట్" అనేది బూతా అని. సరే ఆ పదం గురించే వ్రాసేద్దామని డిసైడ్ అయిపోయా! Read further at your own risk!
పూర్వకాలంలో ఎరువును - అంటే అదేనండీ, మానవ మలాన్ని - ఓడలలో ఒక చోటినుండీ మరొక చోటికి వ్యవసాయ పనుల నిమిత్తం రవాణా చేసేవారు. దాన్ని ఉంచిన సంచులను సాధారణంగా క్రింది డెక్ లో దాచేవారు. అయితే, ఆ పడవలకు కన్నాలుండండం, వాటి ద్వారా నీరు లోపలికి రావడం వల్ల, ఆ సంచులలోకి నీరు పోయి, ఆ నీరు, మలం కలవటం చేత మీథేన్ (Methane) వాయువుతో ఆ క్రింది డెక్ నిండిపోయేది. ఆ డెక్కులు చీకటిగా ఉండేవి కనుక, వాటిలోనికి వెళ్ళేవారి చేతిలో దివిటీలు తప్పనిసరి. కాని వెలుగుతున్న దివిటీతో మీథేన్ ఉన్న గదిలోకి వెళ్ళటం వల్ల ఓడ మొత్తం పేలిపోయేది.
ఈ సమస్యని పరిష్కరించడానికి అప్పట్లో నావికులు చేసిన పని, ఆ సంచులను పైభాగం లో ఉంచడం. "Handle with care" అని ఇప్పుడు మనము లేబుల్స్ పెట్టినట్టు ఆ సంచులపై వారు "Ship High In Transit" లేక టూకీగా "S.H.I.T" అని లేబుళ్ళు పెట్టేవారు. అప్పటినుండీ SHIT అనేది మలానికి పర్యాయపదం అయిపోయింది :))
Update: As Vimal points out Wiki calls this story a myth and says that the word orginated from the old English words Scite and Scitt. If the above story is really a myth then its time for me to unlearn what I have learnt. Wow!

10, అక్టోబర్ 2010, ఆదివారం
అందమైన అమ్మాయిలనుండి నన్ను రక్షించండి బాబోయ్!
వెటకారం కాదండీ బాబూ, నిజమే. గత ఏడాదిన్నర నుండీ నా మీద అందమైన అమ్మాయిల ఫోటోలదాడి జరుగుతోంది. ప్రతీ రెండు మూడురోజులకీ ఒక సారి జాతకం, ఒక నాలుగయిదు ఫోటోలు ఉన్న మెయిళ్ళొస్తున్నాయి -ఇదిగో మా అమ్మాయి జాతకం, ఫొటొలు, మీ అబ్బాయివి కూడ పంపించండి అని. నాకు కొడుకుల్లేరు, ఉన్న కూతురు కూడా పదేళ్ళవయసుది కదా అని బుఱ్ఱ చాలాసార్లు గోక్కున్నా.
చివరికి అర్థమయ్యిందేమిటంటే, నా ఖర్మ కాలి ఎవరో బెంగళురులో భరద్వాజ అనే పెద్దమనిషి తన కొడుక్కి పెళ్ళిచెయ్యాలనుకున్నట్టున్నాడు. తన కొడుకు వివరాలు కావాల్సిన వారిని తమ వివరాలు జత చేస్తు ఒక ఈమెయిల్ పంపించమన్నాడు - కాని ఆయన చేసిన పొరబాటు - నా యహూ ఈమెయిల్ ఐడీ ఇవ్వడం. అప్పటికీ ఆ మెయిళ్ళు పంపించినవారికి సమాధానం ఇస్తూనే ఉన్నా - అమ్మా, అయ్యా, ఆయనెవరో తెలిస్తే కాస్త ఈ విషయం చెప్పి పుణ్యం కట్టుకోండి అని - కానీ ఏమీ లాభం లేదు. దీనినుండి ఎవరు నన్ను రక్షిస్తారో!
చిరాకేసి ఒకళ్ళిద్దరికి తిక్క సమాధానాలు కూడా ఇచ్చా - నాకు పెళ్ళయ్యి ఒక పదేళ్ళ పిల్ల కూడా ఉంది - ఒక పెళ్ళాన్ని, ఒక కూతుర్ని తట్టుకోవడమే కష్టంగా ఉంది, రెండో పెళ్ళి చేసుకునే ఒపిక లేదు, అలాంటి విపరీతపు బుధ్ధి ఎమన్నా పుడితే ఫోటో పంపిస్తాను అని. అయినా సరే నాకు మెయిల్ తాకిడీ ఎక్కువయ్యింది గానీ ఏ మాత్రం తగ్గలేదు.
ఈ విషయంలో నన్ను రక్షించే ఐడియాలు మీదగ్గరేమన్నా ఉన్నాయా?

5, అక్టోబర్ 2010, మంగళవారం
టేకాఫ్ ముందు ఫ్లైట్ ఎటెండెంట్లు ఇచ్చే సేఫ్టీ ఇంస్ట్రక్షన్లు చిరాకు తెప్పిస్తున్నాయా?
విమానాల్లో ప్రయాణించే ఫ్రీక్వెంట్ ఫ్లైయర్లకి సాధారణంగా చిరాకు తెప్పించే అంశం టేక్కఫ్ ముందు ఎటెండెంట్లు చేసే సేఫ్టీ డ్రిల్లు. కానీ ఈ విమానయాన సంస్థ వారి సృజనాత్మకత చూడండి :))
12, సెప్టెంబర్ 2010, ఆదివారం
ఈ ఫోటో ప్రత్యేకత ఏంటి?
ఫోకస్ కూడా సరిగ్గాలేని ఈ ఫోటో ప్రత్యేకత ఏమిటో చెప్పగలరా?
Scroll down if you cant ...
.....................................................................
.........................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
అది వినాయక చవితినాటిది :))
తిట్టుకుంటున్నారా?
విషయమేమిటంటే నేనొక్కడినే ఎందుకు బలవ్వాలన్న్న కుళ్ళు అంతే :))
........................
........................
........................
........................
25, ఆగస్టు 2010, బుధవారం
పెన్సిల్ పేరుతో భావ దారిద్ర్యపు జల్లు - Post no longer relevant and hence edited.
పెన్సిళ్ళ భావదారిద్ర్యం గురించి ఒక బ్లాగరు ఒక టపా వ్రాశారు.
టపా బాగానే ఉంది - ఒక విషయం ఎవరైనా మాట్లాడితే వేరే చోట జరిగిన విషయాన్ని లాగి గోల చేసేవాళ్ళకోసం.
టపా బాగానే ఉంది - ఒక విషయం ఎవరైనా మాట్లాడితే వేరే చోట జరిగిన విషయాన్ని లాగి గోల చేసేవాళ్ళకోసం.
24, ఆగస్టు 2010, మంగళవారం
ఈ గొడవలతో జ్యోతక్కకున్న సంబంధం
1. జ్యోతి పేరు వాడుకుని మన వాడి బ్లాగు వీక్షణం గేంగ్ నాపై బురద జల్లడం
2. కాగడా నేనే అన్న అబధ్ధాన్ని నమ్మకపోవడం
3. ఎన్ని అబధ్ధాలు చెప్పినా వారితోనే ఉంటుందనుకున్న జ్యోతి నిజాన్ని ధైర్యంగా బయటపెట్టి సదరు కత్తిగారి తిత్తి తీయడం
4. కత్తి మహేష్ ఎంత పచ్చి అబధ్ధాలకోరో నిరూపించడం (Particularly his comment that I am Kagada)
5. కాగడాని కెలికి జ్యోతి మీదకు ఉసిగొలుపుదామనే రాజకీయ వ్యూహం చిత్తవ్వడం (Internal bickering)

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)