18, ఏప్రిల్ 2010, ఆదివారం

మాలిక - తెలుగులో సరిక్రొత్త సంకలిని; కేక - తెలుగు ట్విటర్

తెలుగులో అత్యంత వేగవంతమైన సంకలిని ఒకటి రూపుదిద్దుకుంటొంది. నిన్ననే బీటా వెర్షన్ వెలువడింది. ప్రస్తుతానికి దీనిలో కేవలం టపాలు, వ్యాఖ్యలు మాత్రమే కనిపిస్తాయి. రాబోయే సంచికలలో పెర్సనలైసేషన్, మీ అభిరుచులకు తగ్గట్టుగా ఈ సంకలినిని మలచుకోవడం లాంటివి ఉంటాయి. మాలిక అనబడే ఈ సంకలినిని ఇక్కడ చూడవచ్చు. మీ అభిప్రాయాలు నిర్మొహమాటంగా తెలపండి, అవి దీనిని ఇంకా ఆమోదయోగ్యంగా చెయ్యడానికి పనికొస్తాయి.

అన్నట్టు దీనిలో కొన్ని బ్లాగులనే చేర్చాం. మీ బ్లాగు కూడా వస్తుంది, కాస్త ఓపిక పట్టండి, ప్రస్తుతానికి టెస్టింగే కదా. కాదు, కూడదు ఇప్పుడే చూడాలననుకుంటే, మీ బ్లాగుని మీరే చేర్చండి మాలిక ముఖపత్రంలో ఉన్న లంకెననుసరించి. We will add your blog to the same.


URL: http://www.maalika.org

అలాగే మీ మైక్రో బ్లాగింగ్ అవసరాలని తీర్చడానికి ట్విటర్, కువకువల తరహాలో "కేక" బీటా వెర్షన్ కూడా వెలువడింది. దానిని ఇక్కడ చూడవచ్చు. హాయిగా కేకలేసుకోవచ్చు.

URL: http://keka.maalika.com



ఇంతకీ కడలి ఏమయిందని అనుకుంటున్నారా? అది ఎక్కడీకీ పోలేదు. అనుకున్నదానికన్నా కొంచం ఆలస్యంగా మీ ముందుకు వస్తుంది. కానీ అదొక ప్రత్యేక తరహా సంకలిని, అదేమిటో మీకు త్వరలోనే తెలియజేస్తాం.


Full credits to Ekalingam, Vimal and RK for their efforts on this.

22 కామెంట్‌లు:

  1. కొత్త సంకలిని ప్రారంభిస్తున్న సందర్భంలో శుభాకాంక్షలు.
    cbrao
    Mountain View,CA

    రిప్లయితొలగించండి
  2. నాకైతే కేక పిచ్చపిచ్చగా నచేసింది మాష్టారు...వెరి వెరి థాంకు :)

    రిప్లయితొలగించండి
  3. ఐపి అడ్రస్ పట్టాము, పాడె కడతాము అనే ఆకురౌడీ బెదరింపులు మాలికలో వుంటాయా? తాజుమహల్ నిర్మాణానికి రాళ్ళెత్తే 'అజ్ఞాత ' కూలీలకు ప్రవేశముంటుందా? లేదా బాకా వూదేవాళ్ళకే మీ ఎర్ర తివాచీలా? :P

    రిప్లయితొలగించండి
  4. గోవిందా.......గో......వింద.

    రిప్లయితొలగించండి
  5. మాలిక టీం లోని అందరికీ అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. CB Rao, Nagarjuna, Durgeswara,Sarat

    ధన్యవాదాలు.

    Naga, hehehehe :))

    రెండో అజ్ఞాత ... దేనికి గోవింద కొడుతున్నారు?
    మొదటి అజ్ఞాత,

    మీ ఐపీ ఎడ్రస్ మాకు తెలియదు. ఒకవేళ తెలిసినా, చట్ట పరమైన ఇబ్బందులొస్తే తప్ప బయటపెట్టేది లేదు. ( ఇది కేవలం ఏగ్రిగేటర్ కనుక చట్టపరమైన ఇబ్బందులు రావనే అనుకుంటున్నాము)

    సరే మాట వరసకి ఒకవేళ ఐపీ ఎడ్రస్ తెలిసి, మీరెవరో తెలిసిపోయినా మేము పీకేదేముంది?

    As of the blogs that appear on the aggregator, I propose to allow everything except defamatory, criminal and illegal stuff which is likely to put Maalika in legal troubles. However, we need to talk about it, as a team, consult our legal experts and get back to you with a final answer.

    రిప్లయితొలగించండి
  7. నా బ్లాగ్ కూడా లేదు. సో, నేను యే ' గాంగ్ ' కి చెందినదాన్ని కాను అని అనుకోవచ్చా? హమ్మయ్య. :p

    రిప్లయితొలగించండి
  8. రౌడీ రాజ్యం మురదాబాద్.....దీంట్లో నా బ్లాగ్ లేదు...అందుకే!!
    Good Work..congrats!!

    రిప్లయితొలగించండి
  9. అభినందనలు.
    కేక పర్పస్ ఏంటో అర్ధం కాలేదు. బహుశ స్పోర్ట్స్ చూసే వాళ్ళకి అప్పటికప్పుడు స్కోర్ ప్రకటించడానికి పనికొస్తుందనుకుంటా.

    రిప్లయితొలగించండి
  10. తమ్ముడూ అరిశెల్లో బెల్లం పెట్టడం మర్చిపోయావు బాబూ(నేనెక్కడా? నా బ్లాగెక్కడా?).

    రిప్లయితొలగించండి
  11. పప్పు శ్రీనివాస్ గారు,
    మీ బ్లాగు ఉందండి. ఒక్క టపా రాసి చూడండి.

    రిప్లయితొలగించండి
  12. అభినందనలు.
    బ్లాగ్లోక పెద్దల ఆశిస్సులూ వస్తున్నాయే :) ఇక మాలికకు ఎదురుండదు.

    రిప్లయితొలగించండి