5, ఫిబ్రవరి 2012, ఆదివారం

Originally written by Srikanth M in http://kamyunijam.wordpress.com/


Click here for the original post



LTTE, NAXALS హిందూ తీవ్రవాద సంస్థలు
ఎందుకంటే అందులో హిందువులున్నారు కాబట్టి
అని చెప్పగలిగే స్థాయి నా విశ్లేషణలది
LTTE,NAXALSలో ఇతర మతాలవారు చాలామందే ఉన్నా,
ఆయా సంస్థల మూల సిద్దాంతం హిందూత్వ కాకపోయినా,
పట్టించుకోని సూక్ష్మగ్రాహత కేవలం నాకే సొంతం.
దేశములో జరిగే తీవ్రవాద దాడులకు
ఒక మసీదును కూల్చడమే కారణమని,
గుజరాత్ అల్లర్లు మాత్రం
కేవలం హిందూత్వ కారణగా జరిగాయనే సిద్దాంతం నాది
ప్రతీ తీవ్రవాద దాడిలో
హిందువులతో పాటు ముస్లిములు మరణించారని
గుర్తుచేస్తూ, గుజరాత్ మారణకాండలో హిందువులూ
మరణించారన్నది మరిచే మేధావితనం నాది.
మెజారిటీ తీవ్రవాదం ప్రమాదం
ఎందుకంటే అది సమస్యలా కాక పరిష్కారంలా
చూపించే అవకాశముందని వాదిస్తా, కానీ
మైనారిటీ తీవ్రవాదాన్ని ఒక విప్లవంలా చూపించే
అవకాశముందని ఒప్పుకోని ఆదర్శవాదిని.
తప్పు ఎవరు చేసినా శిక్షపడాలని
తీవ్రవాదం ఎవరు చేసినా ఖండిచాలని
హిందూ అతివాదులు దాడులు చేసినప్పుడు చెబుతా
అదే టెర్రరిస్టులు దాడి చేస్తే మాత్రం వారికి
ఇరాకులో, పాలస్తీనాలో, ఇంకా సానా సోట్ల
అన్యాయం జరిగిందని సన్నాయి నొక్కులు నొక్కుతా
దావూదు ఇబ్రహీము, జోబులు కొట్టే దొంగ
ఇద్దరూ ఒక్కటే ఎందుకంటే ఇద్దరిపైనా
కేసులున్నాయి కాబట్టి అనేంతటి తెలివితేటలు నాసొత్తు
అందుకే సెబ్తున్నా హిందూ తీవ్రవాదమే
అన్నింటికన్నా ప్రమాదకారి.
మీరే సెప్పండి నేను సెక్కులరు వాదినా కాదా ..
ఇంకో విషయం పేరును సూసి మనిషి మీద
అభిప్రాయ్నికి వచ్చే వారున్నారు కాబట్టి
నేను పేరులేకుండా అగ్నాతగా రాత్తన్నా.. నిజ్జం.


3 కామెంట్‌లు:

  1. "వ్యంగమనేది ఓ మానసిక రోగం. ఓ ఇజం ఫైల్యూర్ అది ఆచరించే వ్యక్తులపై కాదు, అది అలౌకిక మైనదని నా 'విశ్వాసం'. మతవిశ్వాసాల కన్నా, పలుమార్లు ఫెయిల్ అయిన నా విశ్వాసమే గొప్పదనే విశ్వాసం. కేపిటలిజం కూడా మాలా కూలితే, ఆ గెలుపు మాదే అనే మొక్కవోని పిచ్చి విశ్వాసం నాది. ఇదుకు వెయ్యేళ్ళు గాని, గోతికాడ నక్కలా వేచివుండే ఓపిక నా స్వంతం."

    రిప్లయితొలగించండి
  2. అయితే స్వర్గం-నరకం అనేవి ఉన్నాయా? లేవా? అనేవి పక్కన పెడితే,ఈ భూమి మీద వున్న మానవాళి మొత్తం కలసిమెలసి వసుధైక కుటుంబంలా అంటే మనం అనుకున్న స్వర్గం లా వుంటే ఎలా వుంటుందీ ?
    స్వార్ధం , దోపిడీ , హింస , యుద్ధాలూ , అకృత్యాలూ , పీడన , మనిషిని మనిషి కుల, మత, లింగ , వర్ణ ... ఇలా అనేక రకాల విచక్షనల తో , వివేకం కోల్పోయి,నరకం లా తయారవుతున్న భూగోళాన్ని విముక్తి చేస్తే ఎలా వుంటుందీ ?
    ఇలా చేయడం సాధ్యమా ? అయితే మార్గం ఏమిటి ?
    అలా వుండే , మానవ జీవితం లో అత్యున్నత జీవన విధానం యొక్క రూపమే "కమ్యూనిజం". సమాజం నిరంతరం మారుతూ వుంటుంది. ప్రతి మార్పు పురోగమనం వైపే వుంటుంది. పాత దానికంటే కొత్తది మెరుగ్గా వుంటుంది.
    అలా పెట్టుబడిదారీ విధానం అంతరించి , సోషలిజం , తరువాత అది అంతరించి కమ్యూనిజమూ వస్తాయనీ ఇది మానవ సమూహము తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాల్సిన, ఏర్పాటు చేసుకునే ఇలలోని స్వర్గమనీ కారల్ మార్క్స్ కలలు కన్న అత్యున్నత మానవ జీవన విధానమే " కమ్యూనిజం".

    ___________

    దెబ్బకు మైండ్ బ్లాంక్ అయింది!!!!!!!!!

    సో ఇన్నేళ్లుగా, ఓఓఓ కలలు కందాం మనం అనా వీళ్ళు మాట్లాడేది. ఓ అలా అయితే తొక్కలో కమ్యూనిజం ఎందుకు, అంతకంటే ఆనందకరమయిన కలలు నా దగ్గిర సానా ఉన్నాయి.

    రిప్లయితొలగించండి
  3. jai cong....only political group in India,jai Roul "Whitchi"(i-karam ante....nundi udbhavinchinadi)

    రిప్లయితొలగించండి