3, మార్చి 2012, శనివారం

ఇప్పటి వైమానిక శాస్త్రం వ్రాసింది భరద్వాజుడేనా?







ఈ మధ్య బ్లాగుల్లో వైమానిక శాస్త్రం గురించి తెగ కొట్టుకున్నారు కదా. దానిగురించి నాకూ చందమామ రాజుగారికీ ఆఫ్లైన్లో చిన్నపాటి చర్చ జరిగింది. నాకు తెలిసింది నన్ను వ్రాయమని ఆయనకోరారు కానీ ఇప్పటిదాకా వీలవలేదు. ఇప్పుడుకూడా వ్రాయకపోతే కొడతారేమోనన్న భయంతో వ్రాసేస్తున్నా.

ఈ మధ్యకాలంలో ఈ వైమానిక శాస్త్రం గురించి చాలా చర్చే జరిగింది. దీనిగురించి నేను మొదట విన్నది 1991 లో. అప్పుడు నా మేస్టర్స్ చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్ రోబాటిక్స్ లో తీసుకున్నా. విషయం పెద్దేమీలేదనుకోండి - ప్రమాదకరమైన వాతావరణంలో, కదిలే ప్రేలుడు పదార్ధాల మధ్యనుండి ఒక రోబాట్ గమనాన్ని నిర్దేశించటం. అంటే ఇప్పుడుండే వీడియో గేంస్ లో మన వైపు వచ్చే రాళ్ళని తప్పించుకుని గమ్యం చేరటం లాంటిదన్నమాట. అయితె ఇందులో నా ప్రాజెక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే సంబంధించింది. కనుక డైనమిక్స్ గురించి వెరే ఆల్గోరిథంస్ ని వెతుక్కోవాల్సి వచ్చింది. ఆక్రమంలో నేలమీదనుండి పైకి లేచే అవకాశాన్నికూడా పరిశీలించవలసి వచ్చింది.

మా డిపార్ట్మెంట్ హెడ్ (మా కోర్స్ మొత్తం డీ.ఆర్.డీ.ఓ. ప్రాయోజితం)  బెంగళూరు ADE లో Scientist E. అవి మన ప్రతిష్ఠాత్మకమైన తేజస్ (ఎల్.సీ.యే) ప్రాజెక్ట్  ప్రారంభదినాలు. నేనాయనతో ఈ విషయం మీద చర్చించినప్పుడు "లైబ్రరీలో భరద్వాజుని వైమానిక శాస్త్రం ఉంది, ఒకసారి వెళ్ళి చదువు. మన ఎల్.సీ.ఏ. లో కూడా దానిలో చెప్పిన సిద్ధాంతాలని వాడుతున్నారు" అన్నారు. అదే నాకు అ అపుస్తకంతో పరిచయం. కొన్ని పేజీలు తిప్పి పెద్దగా ఉపయోగం లేదనిపించి వదిలేశాను.

ఆ తరవాత సెంట్రల్ యూనివర్సిటిలో అదే సబ్జెక్ట్ ఒకసారి పరిశీలించినప్పుడు మళ్ళీ ఆ ప్రసక్తి వచ్చింది - చదవడం మొదలుపెట్టా. అయితే దానిగురించి, దాని ప్రామాణికత గురించి చాలామంది అనుమానాలు వ్యక్తం చెయ్యటం మొదలుపెట్టారు.కొన్ని ప్రయోగాలు ఫెయిల్ అయ్యాయని కూడా చెప్పారు. ఈలోగా నేను నా PhD రీసెర్చ్ ఏరియా నాలెడ్జ్ బేస్డ్ సాఫ్ట్వేర్ రివర్స్ ఎంజినీరింగ్ కి మార్హటంతో ఆ విషయం మఱుగునపడిపోయింది.

మళ్ళీ ఎన్నాళ్ళకో అప్రయత్నంగా ఆ పుస్తకం గురించి ఎక్కడో చదవటం తటస్థించింది. అప్పుడు బయటపడ్డ విషయాలు నాను కొంచం షాక్ కి గురించేశాయి ..... ముందుగా నా దృష్టినాకర్షించింది అసలు ఈ శాస్త్రం ఎలా బయటపడింది అనే విషయం. శాస్త్రం, పుస్తకం ఆహా ఓహో అంటూ గెంతులేశానేగానీ అసలది వ్రాసింది ఎవరన్న సంగతి నా మట్టిబుఱ్ఱకి తట్టనందుకు నాలుక్కఱచుకున్నా. ఈ మధ్యే పూర్తిగా చదివిన ఒక పరిశోధనా పత్రంతో నా అనుమానాలు చాలా వరకూ పటాపంచలయిపోయాయి.


సరే ఇక అసలు విషయంలోకి వస్తే. ఈ వైమానిక శాస్త్రం బయటపడింది 1900 తరవాత - అదికూడా ఎలా అంటే సుబ్బరాయ శాస్త్రి అనే ఆయనకి మహర్షి భరద్వాజుడు కలలోనో లేక టెలీపతీ ద్వారానో బోధించాడని! దాని గురించి మరిన్ని విషయాలు సేకరించటం మొదలుపెట్టా.


ఈ సుబ్బరాయశాస్త్రి అనేఆయన కర్ణాటకలోని ఆనేకాల్ అనే ఊరిలో నివశించిన ఒక తాంత్రికుడు. తనకి తోచినప్పుడల్లా ఆశువుగా శ్లోకాలు చెప్పేవాడు. ఆ క్రమంలో వెంకటాచలశర్మ అనే ఆయనకి తనకు భరద్వాజుడు చెప్పాడని ఈ వైమానిక శాస్త్ర స్లోకాలను ఉపదేశించాడు. ఆ వెంకటాచశర్మ వ్రాసిన ప్రతులు బరోడాలోని ఒక లైబ్రరీలో ఉన్నట్టుండి ప్రత్యక్ష్యమయ్యాయి. వాటీని జోస్యర్ అనే ఆయన 1959 లో ఆంగ్లంలోకి అనువదించాడు. ఆ తరవాత అది వేరేవారిద్వారా 8 అంశాలున్న పుస్తకంగా బయటకొచ్చింది. ఆ పుస్తకంలో కనబడే బొమ్మలు గీసింది ఎల్లప్ప అనే ఆయన.  


దీనికి పురిట్లోనే సంధికొట్టింది. భరద్వాజుడు శాస్త్రిగారికి కలలో కనిపించి చెప్పటం, దానిని ఆధారంగా చేసుకుని జానాలు పుస్తాకాలు వ్రాసెయ్యటం కొంతమందికి మింగుడిపడలేదు.

1974 లో ఐ.ఐ.ఎస్.సీ కొ సంబంధించిన కొందరు పరిశొధకులు ఈ పుస్తకాని క్షుణ్ణంగా పరిశీలించి పరిశోధించారు.  ఆ పేపర్ చదవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.


వారందించిన వివరాలిలా ఉన్నాయి:


1. As already stated, the authorship of the work has been attributed to Maharshi Bharadwaja. Whether this Maharshi is the same as one of the seven seers (Saptarshis) is by no means substantiated. Thus the question of authorship remains as yet unanswered


అంటే ఇది భరద్వాజుడు వ్రాసింది కాదనేగా? అన్నట్టు ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే ప్రతీదానికి ఆధారాలడిగేవారు అసలు ఇది భరద్వాజుడు వ్రాసిందా కాదా అని తెలుసుకోకుండానే "వేదాల్లో తప్పులున్నాయోచ్" అని టాం టాం చెయ్యటం. అలాగే మన వేదోఫాసకులు కూడ ఎవరు వ్రాశారన్నది తెలుసుకోకుండా "ఇదిగో వేదాలలో సైన్సుకి నిరూపణ" అని ఎగరటం.

(అసలీ "భరద్వాజ" అనేదే పెద్ద తేడా పేరని నా ఉద్దేశ్యం. ఏమంటారు?)

2. The kind of Sanskrit used in the text may indicate whether or not the text is of Vedic origin. The text contains Shlokas set to Anushtrup metre and its language is quite simple and modern. Again, in its  introduction, BVS mentions that a few words did have a structure similar to that of the Vedic Sanskrit. The number of such words being very small, and their usage being incidental, it appears appropriate to conclude that the Sanskrit used in the text is modern.



దీనర్థం మన విశాఖపట్నం భాషలో చెప్పాలంటే అతి పెద్ద "కిట్టింపు" జరిగిందనేగా? అయితే వీరు ఒక మాట మాత్రం చెబుతున్నారు. దొరిన వ్రాత ప్రతులు వేదకాలం నాటివి కావని అందరూ ఒప్పుకున్నారనీ, ఆ విషయానికి సంబంధించి ఫ్రాడ్ ఏదీ లేదనీనూ.

3. Another significant point is the almost complete absence of any mention of use of aircraft in the innumerable Sanskrit texts of the post‐Vedic age. One text, namely “Samarangana Sutradhara”, by Bhoja deals with some description of aircraft, but does not quote any earlier work. What is more, Bhoja states that detailed description of their construction and other features will not be given lest the same be used for evil purpose by people?

4. A few lines have been devoted to the function of wings and tail and they appear to be incorrect ...... It appears that great importance is given to the tail portion for the generation of lift. Also the function of the hinge wings becomes unclear in this context. It may be noted that it is the wings which should contribute to the life of the craft and the tail portion to its controllability.

5. The height and width of the craft, in our opinion, are in such proportion as to put its stability in serious question. There are inconsistencies in the dimensions mentioned in the verses and those given in the
drawings.

శ్లోకాలకీ ఎల్లప్పగారి బొమ్మలకీ తేడాలున్నయంటే, ఎల్లప్పగారు కావాలనే ఆ మార్పులు చేశారనా?

6. There are no statements on the capabilities of this craft ... The author – whoever he be – shows a complete lack of understanding of the dynamics of the flight of heavier‐than‐air craft.

7.  The text and the drawings do not correlate with each other even thematically. The drawings definitely point to a knowledge of modern machinery. This can be explained on the basis of the fact that Shri Ellappa who made the drawings was in a local engineering college and was thus familiar with names and details of some machinery.

టూకీగా చెప్పాలంటే వైమానిక శాస్త్రం అసలు శాస్త్రమేకాదని కొట్టీపారేశారు పై పరిశోధకులు. అది భరద్వాజుడూ వ్రాసినదికాదు అని కూడా చెప్పకనే చెప్పారు. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు మాత్రం అందులో చెప్పబడిన కొన్ని మాత్రం పనిచేశాయని నాతోనే ఒప్పుకున్నారు.  దీన్ని బట్టీ తేలుతోందేమిటంటే భరద్వాజుని పేరుతో ఉన్న వైమానిక శాస్త్రం భరద్వాజుడు వ్రాసినది కాకపోవచ్చనీ, అందులో చాలా విషయాలు అమలుకు నోచుకోవని అయితే కొన్నిటిని అమలు పఱచటానికి మాత్రం అవకాశం ఉందనీనూ!



అయితే ఈ సందర్భంగా తాడేపల్లిగారు శ్రీకృష్ణదేవరాయలు వ్రాసిన వైమానిక శాస్త్రం గురించి ఎక్కడో అన్నారు. భోజుడు వ్రాసిన దానిని గురించి విన్నానుగానీ ఈ ఆంధ్రభోజుడు వ్రాసినదాని గురించి నేనెప్పుడూ వినలేదు. దీనిసంగతి ఆయన్ని అడగాలి. అలాగే భరద్వాజుడు వ్రాసినదానికి అనువాదం కూడా ఉందన్నారు (నేను పైన చర్చించిన అనువాదం కాకపోతేనే). వాటిని గురించి ఆయనను కనుక్కోవాలి.



టూకీగా చెప్పాలంటే ఈ ఫేక్ శాస్త్రాన్ని (ఫేక్ అయితేనే) వదిలిపెట్టి అసలు శాస్త్రం కోసం అన్వేషణ సాగించాల్సిన సమయం ఆసన్నమైంది.











5, ఫిబ్రవరి 2012, ఆదివారం

Originally written by Srikanth M in http://kamyunijam.wordpress.com/


Click here for the original post



LTTE, NAXALS హిందూ తీవ్రవాద సంస్థలు
ఎందుకంటే అందులో హిందువులున్నారు కాబట్టి
అని చెప్పగలిగే స్థాయి నా విశ్లేషణలది
LTTE,NAXALSలో ఇతర మతాలవారు చాలామందే ఉన్నా,
ఆయా సంస్థల మూల సిద్దాంతం హిందూత్వ కాకపోయినా,
పట్టించుకోని సూక్ష్మగ్రాహత కేవలం నాకే సొంతం.
దేశములో జరిగే తీవ్రవాద దాడులకు
ఒక మసీదును కూల్చడమే కారణమని,
గుజరాత్ అల్లర్లు మాత్రం
కేవలం హిందూత్వ కారణగా జరిగాయనే సిద్దాంతం నాది
ప్రతీ తీవ్రవాద దాడిలో
హిందువులతో పాటు ముస్లిములు మరణించారని
గుర్తుచేస్తూ, గుజరాత్ మారణకాండలో హిందువులూ
మరణించారన్నది మరిచే మేధావితనం నాది.
మెజారిటీ తీవ్రవాదం ప్రమాదం
ఎందుకంటే అది సమస్యలా కాక పరిష్కారంలా
చూపించే అవకాశముందని వాదిస్తా, కానీ
మైనారిటీ తీవ్రవాదాన్ని ఒక విప్లవంలా చూపించే
అవకాశముందని ఒప్పుకోని ఆదర్శవాదిని.
తప్పు ఎవరు చేసినా శిక్షపడాలని
తీవ్రవాదం ఎవరు చేసినా ఖండిచాలని
హిందూ అతివాదులు దాడులు చేసినప్పుడు చెబుతా
అదే టెర్రరిస్టులు దాడి చేస్తే మాత్రం వారికి
ఇరాకులో, పాలస్తీనాలో, ఇంకా సానా సోట్ల
అన్యాయం జరిగిందని సన్నాయి నొక్కులు నొక్కుతా
దావూదు ఇబ్రహీము, జోబులు కొట్టే దొంగ
ఇద్దరూ ఒక్కటే ఎందుకంటే ఇద్దరిపైనా
కేసులున్నాయి కాబట్టి అనేంతటి తెలివితేటలు నాసొత్తు
అందుకే సెబ్తున్నా హిందూ తీవ్రవాదమే
అన్నింటికన్నా ప్రమాదకారి.
మీరే సెప్పండి నేను సెక్కులరు వాదినా కాదా ..
ఇంకో విషయం పేరును సూసి మనిషి మీద
అభిప్రాయ్నికి వచ్చే వారున్నారు కాబట్టి
నేను పేరులేకుండా అగ్నాతగా రాత్తన్నా.. నిజ్జం.


4, ఫిబ్రవరి 2012, శనివారం

Okay .. here is the one!

The guy posing as fake "YourGod" (Who happens to be a regular blogger by the way) పాపం మరొక పోస్ట్ వెయ్యమనటం మూలంగా ఈ పోస్ట్ వేస్తున్నా. సరే ఇప్పుడేం పీకుతాడో చూద్దాం! వేరే బ్లాగుల్లో కామెంట్లు వేస్తాట్ట ... who cares? ... పాపం ఆ బ్లాగు వ్రాసేవాళ్ళ ఖర్మ! He has his life-time ambition of kicking me out of the blogs, but he is ending up giving me a kick out of it .. hehe .. poor guy!

31, జనవరి 2012, మంగళవారం

"సాగర సంగమం" - జయప్రద కమల్ ని పెళ్ళి చేసుకుని ఉంటే తకిట తధిమి పాట ఇలా ఉండేది ..







తకిట తధిమి తకిట తధిమి తందానా
తాళి కట్టిన క్షణమే బ్రదరు బందీనా ..

తడబడు అడుగుల వయసులో ప్రేమేనా ...
పెళ్ళికి తీసిన దారులు ఏమైనా ..
బ్రతుకునంత బుగ్గి చేసి ..

తకిట తధిమి తకిట తధిమి తందానా
తాళి కట్టిన క్షణమే బ్రదరు బందీనా ..

చరణం 1:

మొగుడి బ్రతుకు నటన, పెళ్ళంటే దుర్ఘటన
మగవాడి రాత ఇంతని, చేశాడు బ్రహ్మ రచన

మొగుడి బ్రతుకు నటన, పెళ్ళంటే దుర్ఘటన
మగవాడి రాత ఇంతని, చేశాడు బ్రహ్మ రచన

తెలుసా సోదరా తెలిసీ నెగ్లీజెన్సా ..
తెలియక చేసిన తప్పుకు లైఫ్ సెంటెన్సా ..

తెలుసా సోదరా తెలిసీ నెగ్లీజెన్సా ..
తెలియక చేసిన తప్పుకు లలలా లలలా ..

అక్కినేని నాగ్ మాట
మన్మధుని మూవీ బాట

"వద్దురా సోదరా" అని పాడీ!


తకిట తధిమి తకిట తధిమి తందానా
తాళి కట్టిన క్షణమే బ్రదరు బందీనా ..


చరణం 2:



చిట్లెను నీ అధరం ఇక పారెను నీ రుధిరం
సతినే ఎదిరిస్తే బ్రతుకంధకారబంధురం

చిట్లెను నీ అధరం ఇక పారెను నీ రుధిరం
సతినే ఎదిరిస్తే బ్రతుకంధకారబంధురం

గొంతులో దాగిన నీ ఆర్తనాదమే
బానిస బ్రతుకును మొత్తం వివరింపంగా

గొంతులో దాగిన నీ ఆర్తనాదమే
బానిస బ్రతుకును మొత్తం వివరింపంగా

డ్రీము గాళు కలలనుండి
బయటపడ్డ బ్రతుకు బండి

పడిపోయెను పట్టాలే తప్పీ ...

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ...

18, జనవరి 2012, బుధవారం

20, డిసెంబర్ 2011, మంగళవారం

ఇస్కాన్ - భగవద్గీత - నిషేధం?

పూర్తి పోస్టు వ్రాసే టైంలేక చేతికొచ్చినది 10-15 లైన్లలో బఱుకుతున్నా :))


1. రష్యాలో నిషేధానికి గురవుతోంది భగవద్గీత కాదు. ఇస్కాన్ వ్యవస్థాపకుడు స్వామీ ప్రభుపాదచే రచింబడిన దాని ఆంగ్లానువాదం!

2. నా ఉద్దేశ్యంలో ఇస్కాన్ అసలు హిందూ సంస్థ కాదు - హిందూ సంస్కృతికి సంబంధించినదేదయినా భారతదేశంలో పుట్టి ఉండాలి లేక వైదిక ధర్మంపై ఆధారపడి ఉండాలి - ఇస్కాన్ పుట్టింది న్యూయోర్క్ లో, వృద్ధి చెందిందీ, చాలా మంచిపేరూ, కాస్తంత చెడ్డపేరూ తెచ్చుకుందీ పిట్స్ బర్గ్ దగ్గర వీలింగ్ లో. అది బోధించేది కృష్ణతత్వం. దాని ప్రామాణికాలు వేదాలు కావు - భాగవతం మరియు భగవద్గీత. హిందువులకి అవి పవిత్ర గ్రంథాలేగానీ వేదాల స్థానాన్ని పొందలేవు.

3. ఇప్పుడు జరుగుతున్న గొడవ మొదలయ్యింది ఇస్కాన్ కీ, ఏదో తొక్కలో చర్చికీను. చిలికి చిలికి కెలికి కెలికి భారత్ రష్యాల మధ్య గొడవయ్యి కూర్చుంది. ఈ గొడవ పుణ్యమా అని ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళకి ప్రచారమే ప్రచారం :)

4. భారతదేశంలో హిందూ దేవాలయాలపై హిందువులకు పూర్తిహక్కులు పార్లమెంటుని ముందు ఇవ్వమనండి. ఇస్కాన్ సంగతి తరవాత చూసుకోవచ్చు.

PS: Please feel free to correct me if you find anything wrong with the above points!

14, డిసెంబర్ 2011, బుధవారం

ఓ నేటి త్రిలింగదేశ అంతర్జాలికులారా ...





Sung to the tune of పెళ్ళిచేసుకొని ఇల్లు చూసుకుని ...



ఓ భావి త్రిలింగదేశ అంతర్జాలికులారా
వయసుముదిరిన బ్లాగ్జనులారా
పరానుభవమున టైపు నా ఘోష ఇదే!!

వాహ్ రే వాహ్!
తాధినా తకధీన తాంగిడతక తధికిటతకతోం

బ్లాగు తెఱచుకుని పోస్టులేసుకుని కామెంట్లెన్నో పెట్టాలోయ్
భజనలు గట్రా చెయ్యాలోయ్
మరి ఫుల్లుగ టైంపాస్ అవ్వాలోయ్

సినిమాల మోజులో గాసిప్ సైట్లనే ఆదరించి
విసిట్ చేసిన ఐడిలు హేక్ కాగా
పిన్నలు పెద్దలు ముసలివాండ్రు
బ్లాగు పేరు చెప్పుకుని అందరూ సుఖపడగా

తాధినా తకధీన తాంగిడతక తధికిటతకతోం

డెస్కు టాపులో లేపు టాపులో అప్డేట్లు చూడాలోయ్... తరంపం
డెస్కు టాపులో లేపు టాపులో అప్డేట్లు చూడాలోయ్
స్మార్టుఫోనులో ఐపేడులో వాటికి రిప్లయ్ ఇవ్వాలోయ్
స్మార్టుఫోనులో ఐపేడులో వాటికి రిప్లయ్ ఇవ్వాలోయ్

బ్లాగు తెఱచుకుని పోస్టులేసుకుని కామెంట్లెన్నో పెట్టాలోయ్
భజనలు గట్రా చెయ్యాలోయ్
మరి ఫుల్లుగ టైంపాస్ అవ్వాలోయ్

సహజాలునిలా సహజాలికలా
సహజీవనమే గడపాలోయ్ ...

సహజాలునిలా సహజాలికలా
సహజీవనమే గడపాలోయ్
బోరుకొట్టినచో ఎవరికీ
అర్థం కాని పోస్టులే వెయ్యాలోయ్ ...
బోరుకొట్టినచో ఎవరికీ
అర్థం కాని పోస్టులే వెయ్యాలోయ్ ...


బ్లాగు తెఱచుకుని పోస్టులేసుకుని కామెంట్లెన్నో పెట్టాలోయ్
భజనలు గట్రా చెయ్యాలోయ్
మరి ఫుల్లుగ టైంపాస్ అవ్వాలోయ్!

3, డిసెంబర్ 2011, శనివారం

RIP దేవానంద్ :((

ఈ జీవితంలో కలవాలనుకున్నవాళ్ళలో ఈయన ఒకడు. ఆ అదృష్టం నాకు లేదు :((