16, మే 2010, ఆదివారం

ఈ మధ్య కాలంలో నేను ఎక్కువగా విన్న 20 పాటలు

నేను స్వహతాగా రాక్/మెటల్ (డీప్ పర్పుల్, ఏసీ/డీసీ, మెటాలికా, ఐరన్ మెయ్డెన్ గట్రా) పాటల అభిమానిని. కానీ నా కూతురి పుణ్యమా అని ఈ మధ్య కాస్త పాప్ & కంట్రీ కూడా వినడం మొదలెట్టా( లేడీ గాగా, మైఖేల్ జాక్సన్, బియాన్సే, టేలర్ స్విఫ్ట్ గట్రా) - ఇది ముసలితనానికి చిహ్నమని స్నేహితులు వెక్కిరించినా కూడా :))


ఈ మధ్య విన్న పాటల్లో నా టాప్ 20: (వరుస క్రమంలో అయితే లేవు) - ముందు అసలు వీడియోలు లేకుండా కేవలం ఆడియోలే పెడదామనుకున్నా - కానీ ఈ-స్నిప్స్ లో అన్నీ దొరకలేదు, దొరికినవి కూడ చాలా నింపాదిగా లోడ్ అవుతున్నాయ్.

1. పేరలైసర్ - ఫింగర్ ఇలెవెన్ - మొదటిసారి వినగానే నాకు నచ్చేసిన పాట




2. లెట్ ఇట్ రాక్ - కెవిన్ రుడాల్ఫ్, లిల్ వేన్ ( పిల్లలతో వినేటప్పుడు జాగ్రత్త - లిరిక్స్ అక్కడక్కడ బాగుండవు)




3. పేపర్ ప్లెయిన్స్ - ఎం.ఐ.ఏ. ( స్లం డాగ్ సినీమా నేను చూడలేదు గానీ, ఈ పాట అందులో వాడుకున్నారని విన్నా) - ఒక పాత రేప్ నెంబర్ కి కాపీలా అనిపిస్తుంది ఇందులో ఒక లైన్. అన్నట్టు ఎం ఐ ఏ ఒక శ్రీలంక తమిళ నాయకుని కూమార్తె




4. ఇఫ్ యూ సీక్ ఏమీ - బ్రిట్నీ స్పియర్స్ - చాలా వివాదం సృష్టించిన పాట - ఇఫ్ బదులు F, యూ బదులు U .. అలాగే మిగతా అక్షరలు కూడా పెట్టి చూడండి - వివాదమేమిటో మీకు అర్ధమవుతుంది :)) కానీ పాట మాత్రం మెలోడియస్ - కాస్త గాడ్ ఫాదర్ ట్యూన్ ని కాపీకొట్టినా. వివాదం తెలియని మా అమ్మాయి ఈ పాట పాడుతుంటే ఆపేసరికి తల ప్రాణం తోకకొచ్చింది :))




5. సో వాట్ - పింక్ - పక్కా పింక్ బ్రేండ్ పాట





6. వెన్ ఐ గ్రో అప్ - పుస్సీ కేట్ డాల్స్




7. టిక్ టాక్ - కేషా





8. వుమనైసర్ - బ్రిట్నీ స్పియర్స్





9. ఆల్ ద సింగిల్ లేడీస్ - బియాన్సే - నిజంగానే గ్రేమీ సాంగ్ - వీడీయోలో కూడా వైవిధ్యముంది




10. డోంట్ ట్రస్ట్ మీ - థ్రీ ఓ థ్రీ ( 303 ) - డెన్వర్ లో ఫోన్ నెంబర్లు 303 తో మొదలవుతాయిలేండి. పాట చూసేడప్పుడు జాగ్రత్త - అక్కడక్కడ వెకిలిగా ఉంటుంది






11. గివ్స్ యూ హెల్ - ఆల్ అమేరికన్ రిజెక్ట్స్ - కేచీ గా ఉంటుంది








12. డిస్టబియా - రిహానా - ప్రపంచాన్ని ఒక ఊపు ఊపిన దయ్యం పాట







13. బూం బూం పేవ్ - బ్లేక్ ఐడ్ పీస్ - 2009 సూపర్ హిట్లలో ఒకటి






14. టెలఫోన్ - లేడీ గాగా & బియాన్సే - ప్రస్తుతం ప్రపంచాన్ని ఒక ఊపుతున్న పాట - వీడియో మాత్రం పిల్లలని చూడనివ్వకండి - వీడియో మొదలైన మూడు నిమిషాలకి పాట మొదలవుతుంది.





15. లవ్ స్టోరీ - టేలర్ స్విఫ్ట్ - పక్కా టీనేజ్ అమ్మాయిల పాట




16. రాక్ స్టార్ - మైలీ సైరస్ (హెనా మోంటేనా) - మరో టీనేజ్ పాట





17. వన్ స్టెప్ ఎట్ ఏ టైం - జోర్డిన్ స్పార్క్స్ - Supposedly a song with a message







18. ఐ నో యూ వాంట్ మీ - పిట్ బుల్ - వీడియో మాత్రం చుట్టుపక్కలెవ్వరూ లేనప్పుడే చూడండి. "ఆట" కార్యక్రమంలో చిన్న పిల్లల చేత డేన్సులు వేయించడానికి అనువైన పాట ఇది! శరత్, ఈ పాట 3D లో కావాలని అడగద్దు :))






19. ద డే దట్ నెవర్ కంస్ - మెటాలికా - నాకు అత్యంత ఇష్టమైన పాటల్లో ఇదొకటి. అసలు వీడియో ఎంబెడ్ చెయ్యడానికి కుదరలేదు - ఈ వీడియో కింద యూ ఆర్ ఎల్ ఇస్తున్నా - చూడండ - The song should be heard in full volume and the video is good too!




http://www.youtube.com/watch?v=mRitfbhITLM


20. రాక్ ఎండ్ రోల్ ట్రెయిన్ - ఏసీ / డీసీ - అసలు వీడియో ఎంబెడ్ చెయ్యడానికి కుదరలేదు - ఈ వీడియో కింద యూ ఆర్ ఎల్ ఇస్తున్నా - చూడండి




http://www.youtube.com/watch?v=bX2xbqWtyJU


అన్నట్టు పైవాటిట్లో ఓ మూడు పాటలు మా అమ్మాయి వెంటపడి పాడించేసా. ఈ బ్లాగులో ఇంతకు ముందే రెండు సార్లు పెట్టా అవి - మూడోసారి ఇవిగో:






5 కామెంట్‌లు: