రేఖాచిత్రం వెంకటప్పారావుగారి టపా ఇప్పుడే చూసి అర్జెంటుగా మూడొచ్చేసి రాసేస్తున్న మినీ టపా ఇది :)
ఉస్తాద్ ఫైయజ్ ఆలి ఖాన్ శిష్యుడు, సంగీతకారుడు శైలేష్ దత్తాగుప్తాకి ఆప్తుడైన హేమంత్ కుమార్ ముఖోపాధ్యాయ తరువాత కాలంలో ఒక ప్రసిధ్ధగాయకునిగా, సంగీత దర్శకునిగా సంగీతాభిమానులపై ఒక చెరగని ముద్ర వేశారు. మొట్టమొదటి పాట 1933 లో ఆకాశవాణికి పాడినా, తన మొట్టమొదటి ఆల్బం కోసం 1937 దాకా ఆగవలసి వచ్చింది. ఆ రోజుల్లో ఆయన సినీమాలకు పాడివాటికన్నా ప్రైవేటుగా పాడిన పాటలే ఎక్కువ.
మరో నాలుగేళ్ళ తరువాత, అంటే మొదటి పాట పాడిన 8 సంవత్సరాల తరవాత (ఆ రోజుల్లో పాపం ఇండియన్ ఐడల్, సరెగమ లేవు కదా, ఇలా పాడగానే అలా సినీమా చాన్సు వచ్చెయ్యడానికి) ఒక బెంగాలీ సినీమా ద్వారా ఆయన చలన చిత్ర రంగ ప్రవేశం చెయ్యడం జరిగింది. ఆ తరవాత మరో సంగీత దర్శకుడైన సలీల్ చౌదరి ( అదే నండీ, మధుమతి సినీమాలో "దిల్ తడప్ తడప్ కే" అనబడే కాపీ పాటని మనకి అందించినాయన - హీ హీ ఊరికే అన్నాలేండి, ఆ పాట కాపీ కొట్ట్నా ఆయన మంచి సంగీత దర్శకుడే) తో కలిసి ఒక రంగస్థల సంఘాన్ని కూడ స్థాపించారు. 1952 లో ఆనందమఠ్ అనే చిత్రం ద్వారా సంగీత దర్శకత్వానికి నాంది పలికారు. ఆ చిత్రంలో లతా మంగేష్కర్ పాడిన "వందేమాతర" గీతాన్ని ఇప్పటికి కూడా ఎవరూ మర్చిపోలేదు.
సచిందా - సచిన్ దేవ్ బర్మన్ - దర్శకత్వంలో దేవానంద్ కోసం ఆయిన పాడిన పాటలు "యే రాత్ యే చాంద్నీ ఫిర్ కహా(", "హై అప్నా దిల్ తో ఆవారా"లాంటిగీతాలు ఇప్పటికి కూడ జనాల గుండెల్లో, పెదవులపై పదిలంగానే ఉన్నాయి. అలాగే గురుదత్ కోసం పాడిన "జానె వో కైసే లోగ్ థె" పాట ఒక సారి విన్నవాళ్ళు మళ్ళీ మర్చిపోగలరా?
1954 లో ఆయన సంగీత దర్శకత్వం వహించిన "నాగిన్" చిత్రం సంచలనాన్ని సృష్టించడమే కాక ఆయనకి ఉత్తమ సంగీత దఋసకుని ఎవార్డ్ కూడ తెచ్చిపెట్టింది. నాలాంటి ప్రతీ కీబోర్డు వాయిద్యగాడూ జీవితంలో ఎప్పుడో ఒకసారి "మన్ డోలే మెర తన్ డోలే" పాటని ప్రేక్టీస్ చేసే ఉంటాడు. ఇప్పటీకి కూడా ఆ పాటని వివిధ సంగీత దర్శకులు కాపీ / రీమిక్స్ చేస్తూనే ఉన్నారు.
ఆ తరవత వెంకటప్పారావు గారు చెప్పినట్టు బీస్ సాల్, బాద్, కొహ్రా, ఖామోషి చిత్రాలలో ఆయన పాడిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అలాగే బెంగాలీలో కూడా ఆయన తనదైన ఒక ప్రత్యేక శైలిని, ముద్రని శ్రోతలకందించారు.
బాలీవుడ్ లో ఆయనది ఎప్పటికీ ఒక ప్రత్యేక స్థానమే.
ఆయన పాటలు కొన్ని మీకోసం ఇక్కడ
1. హై అప్నా దిల్
2. హై అప్నా దిల్ (విషాదం) - ఈ పాట చాలా మంది విని ఉండరు
Original film video here:
http://www.youtube.com/watch?v=JHJ4oeUagXU
3. యే రాత్ యే చాంద్నీ
Original film video here
http://www.youtube.com/watch?v=dBw_JSiNF9c
4. యాద్ కియా దిల్ నే కహా( హో తుం
5. జానే వో కైసే లోగ్ థే
6. తుం పుకార్ లో
7. యె నయన్ డరే డరే
8. బేకరార్ కర్కే హమే(
9. మన్ డోలే మెర తన్ డోలే
10. వందే మాతరం - Dont miss this
రౌడీగారు ఇలా మాకు అర్ధం కానీ టపాలు రాయడాన్ని నేను ఖండిస్తున్నాను..
రిప్లయితొలగించండితార గారూ, ఇంత మంచి టపా రాశారని నేను మెచ్చుకోబోతుంటే మీరేమిటి సార్ అలా అనేశారు? రౌడీ సంగీత పరిజ్నానమ్ ప్రత్యక్షం గా విన్న అనుభవం తో చెప్తున్నాను. అప్పుడప్పుడైనా మీ వొరిజినల్ ఇంటరెస్ట్ కి సంబంధించిన ఇలాంటి టపాలు రాయండి. నేను వచ్చి కామెంట్ పెట్టడానికి వీలవుతుందని నా దురాశ...
రిప్లయితొలగించండిlooooooooooooool గారు,
రిప్లయితొలగించండిముందు టపాకి సంబంధం లేని కామెంటు అని ఆలోచించినా ... ఆ దానేదేముందిలే , మనోళ్లకి ఇలాంటివి మామూలే అని క్షమాపణలు లేకుండా మామూలుగా రాస్తున్నా.. మరేటీ అనుకోవద్దు.
మీ చిలకలో నా ఫ్రెష్ టపా కనిపియ్యలేదబ్బా! మీ గీకే గారిని గోకాను గాని, ఆయన స్వయం గోకుడులో బిజీగా వున్నట్టు వున్నారు. ఎందుకిలా జరిగిందంటారు ? నాకెందుకో మా లాంటి సన్నకారు చిన్న బ్లాగర్ల పైన మీ అగ్రిగేటర్ల ఆధిపత్య భావజాలమని, మీ అభిజాత్యమని అనిపిస్తా వుంది. మా బోటి టాలెంటెడ్ ( ఉష్ష్ .. ఎవర్రా గోల చేస్తా వుంది ? ) బ్లాగర్లని మీరు ఇలా తుంగలో తొక్కడం , మాకెక్కడ 500 కామెంట్లు వస్తాయోమని మీ కుళ్లుమోత్తనం అని నాకనిపిస్తా వుంది మరి.
మరీ ఇలా అయితే ఎట్టా చెప్పుండ్రీ ?
btw ఆఖరి వీడియో చూసాను , రహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసి ఆశా భోంస్లే పాడిన పాట్ కంటే బాగుంది. మిగిలిన టపా మరెప్పుడన్నా సదువుతా.
రిప్లయితొలగించండి"నాలాంటి ప్రతీ కీబోర్డు వాయిద్యగాడూ జీవితంలో ఎప్పుడో ఒకసారి "మన్ డోలే మెర తన్ డోలే" పాటని ప్రేక్టీస్ చేసే ఉంటాడు".
రిప్లయితొలగించండిసెబాసో...మన్ బోలే మేరా మన్ బోలే తుం సచ్ బోలే పోస్ట్ సూపరులే...
I am also a big fan of HEmant kumar.Thanks for the songs. నేను బ్లాగ్ మొదలెట్టిన కొత్తల్లో హేమంత్ కుమర్, ఎస్.డి బర్మన్ల గురించి రాసిన టపాకు మీరు రాసిన వ్యాఖ్య గుర్తుంది.
రిప్లయితొలగించండిధన్యవాదాలు. మంచి పాటలను దృశ్యరూపంలో
రిప్లయితొలగించండిఅందిచారు.
యం.వి.అప్పారావు (సురేఖ)
@ pillakaaki krishna
రిప్లయితొలగించండిశుక్రవారం 17 సెప్టెంబర్ 2010 నాడు టపా రాస్తే మాలిక లొ ఫ్రెష్ గా కనపడుతుంది అనిఉ ఎవరైనా చెప్పారా??
ఈ టపాలో పాటలు వింటూ ఉండేవే కానీ "మన్ డోలే" నా ఫావరేట్ సాంగ్. ఆ పాము మ్యూజిక్ కూడా:-)
రిప్లయితొలగించండిహేయ్ అప్నా దిల్ పాట నాకిష్టం.happy and sad సాంగ్స్ కి ఎంత వ్యతాసం చూపించారో, గ్రేట్!
రిప్లయితొలగించండిఆయన పాడిన రొమాంటిక్ పాటలలో గొంతులో ఒకరకమైన హస్కీనెస్, చిలిపితనం తో కూడిన కేర్‌లెస్ నెస్ ఉంటుంది, బావుంటుంది.
మంచి మంచి పాటలు పెట్టారు, మళ్ళీ అన్నీ విని మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది. Thanks a lot!
Thanks a lot for the nice post and videos రౌడీ గారు,
రిప్లయితొలగించండినా ఫేవరెట్ "హై అప్నా దిల్". నాటీనేజ్ లో 16-17 ఏళ్ళ వయసపుడు మొదటిసారి టీవీలో ఈ సినిమా చూస్తూ విన్నాను ఈ పాటను. దేవానంద్ మహిమో హేమంత్ మహిమో కానీ, అప్పటినుండి ఈ పాట ఎప్పుడు విన్నా నాకే తెలియకుండా ఒక సన్నని నవ్వు, మంచి హుషారు వచ్చేస్తుంటాయి. మళ్ళీ ఆ అనుభూతికి గురిచేసినందుకు ధన్యవాదాలు.
ఇలాంటి ఝలక్లు ఇవ్వడమే మలక్ తనం! చాలా మంచి పోస్టు! ఇవాళ మీ అమ్మగారూ, ముఖ్యంగా మీ నాన్న గారు కూడా ఇలాంటి మంచి రౌడీకి జన్మ నిచ్చినందుకు కాసింత సంతోషిస్తారు. ఆఫ్ కోర్సు, నేనెప్పుడూ మీలోని రౌడీతనం చూడలేదనుకోండి, ఈ బ్లాగు జాతరలోనే మీకేదో వేరే పూనకం వస్తుంది! ఇప్పుడీ పోస్టులో కనిపిస్తున్నది అసలు అవతారం అని నాకు తెలుసు!
రిప్లయితొలగించండినాకిష్టమైన హేమంత్ దా పాటలను ఒక చోటుకు చేర్చి అందించారు. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@ శ్రీనివాస్,
రిప్లయితొలగించండినేను ఫ్రెష్ టపా అన్నది 17 వ తారీఖు రాసినదాని గురించి కాదు స్వామీ. నిన్న్ 23 వ తారీఖు మధ్యాహ్నం 13 :00 గం ' రాసిన దాని గురించి. అదేంటో , హారం లోను రాలేదు, మాలిక లో కూడా రాలేదు. కూడలిలో వచ్చింది. ఏమన్నా పొరపాటు జరిగిందా అని ...
టపా చాలా బావుంది
రిప్లయితొలగించండిపాటల కలెక్షన్ ఇంకా బావుంది
ఆభినందనలు
Thanks everyone!
రిప్లయితొలగించండిమిరపకాయ బజ్జీ అలవాటైనవాడికి పాలకోవా పెడితే ఎమవుతాడో అలాగే ఉంది నా పరిస్థితి. కష్టపడి వ్రాసే కెలుకుడూ పోస్టులకన్నా దీనిలోనే జనాల మెచ్చుకోలెక్కువుందే? :))
Krishna, I'll check it with RK and he'll get back to you.
Another great song of Hemant:
రిప్లయితొలగించండిhttp://www.youtube.com/watch?v=XHuSP_uvL4o&p=21E80302AC57B43A&playnext=1&index=23
Soothing voice...
చాలా థాంక్స్ అండి. మీ బ్లాగు చదివి నేను టైం మెషిన్ ఎక్కి 1978 లోకి వెళ్లి పోయాను. అవి నేను REC వరంగల్ లో పోస్ట్ graduation చేసే రోజులు. కాలేజి లో ఏ ఫంక్షన్ జరిగినా ఒక నార్త్ కుర్రాడు (పేరు గుర్తు లేదు) స్టేజి మీద` ఏ అపనా దిల్` అచ్చు హేమంత్ కుమార్ లా పాడేవాడు. నాకు నచ్చిన హేమంత్ దా పాట ఇంకోటి `తేరి ద్వార్ ఖడా ఏక్ జోగి`.
రిప్లయితొలగించండిఊప్స్, నేను లేట్ !(గా వచ్చాను)
రిప్లయితొలగించండిఇక్కడ ఇచ్చినవే కాక ఇంకా బోల్డన్ని హేమంత్ కుమర్ పాటలు మా ఇంట్లో ఆడియో కాసెట్ల రూపంలో గుట్టలుగా పడి ఉన్నాయి.ఒక్కోసారి ఇంటర్నెట్ మీద కోపాలొచ్చేది ఇలాంటి సందర్భాల్లోనే! ఎంతో కష్టపడి సేకరించిన ఆ పాటలు ఇప్పుడు ఒక్క మౌస్ క్లిక్ దూరంలో దొరుకుతున్నాయి. ఐ పాడ్ లోకెక్కి కూచుంటాయి.
మన్ డోలే నేను కూడా ప్రాక్టీస్ చేయబోతూ ఉంటాను అప్పుడప్పుడూ! పాడుతూ మరీ! :-))
అబ్బం ఈ బ్లాగు ఇవాళ హాయిగా ఉంది!