12, సెప్టెంబర్ 2009, శనివారం

ఈ పొదుపు చర్యలేమిట్రా బాబూ?

మన కేంద్ర మంత్రివర్గాన్ని పొదుపు చర్యల తుఫాను ఒక ఊపు ఊపుతోంది. ప్రణబ్ ముఖర్జీ, మమతా బెనర్జీ తదితర మంత్రులు విమానాలలో ఎకానమీ క్లాసుల్లో ప్రయాణిస్తున్నారు. కానీ ఇదేమన్నా ఉపయోగమా అంటే నాకు సందేహమే. ఖ్సమించాలి, నేను ఎకానమిక్స్ లో కాస్త పూర్. కనుక వాళ్ళు చేసిన పనులు నాకర్ధమవ్వకపోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ నాకున్న ధర్మ సందేహన్ని ఎవరయినా తీరిస్తే సంతోషైస్తాను.

ఇంతకీ నా సందేహం ఏంఇటంటే, వీరి పొదుపు చర్యల వల్ల మేలు జరుగుతుందా అని. వీరి పొదుపుని ఆదర్శంగా తీసుకుని దేశమంతా పొదుపు చేసిందనుకోండి, అంటే జనాలందరూ ఖర్చులు తగ్గించేస్తరు. చాలా వ్యాపారాలు దెబ్బతింటాయి. దీని వలన దేశానికి లాభమా నష్టమా?

నాకు అర్ధమయిన ఆర్ధిక శాస్త్రం ప్రకారం, డబ్బు చేతులు మారినప్పుడే పురోగతి సాధ్యపడుతుంది. అలా అని అందరూ ఖర్చుపెడితే నెత్తి మీద గుడ్డ ఖాయం. మరెలా? కేపిటలిజం సూత్రాల ప్రకారం ధనవంతులు ఎక్కువ ఖర్చు పెట్టాలి, పేదవారు ఎక్కువ పొదుపు చెయ్యాలి. ధనవంతులు పెట్టే ఖర్చు వల్ల వ్యాపారాలు నిలబడతాయి, పేదవారి పొదుపు వల్ల వారి సంసారాలు కూడా నిలబడతాయి.

ఒక కోటీశ్వరుడు పది కోట్లు ఖర్చు పెట్టి కొడుకు పెళ్ళి చెయ్యడం వృధా అని మన కమ్యూనిష్టు జ్ఞానుల ఉవాచ. వారికి తెలిసినంత ఎకానమిక్స్ నాకు తెలియదు కానీ నాదో చిన్న ప్రశ్న. ఆ పది కోట్లు ఖర్చు పెట్టడం వల్ల ఆ ధనవంతునికి నష్టం లేదు. కానీ షామియానాల వారి దగ్గరనుండీ, బాణా సంచాలు తయారు చేసే పేదవారికి ఆదాయం సమకూరదా? అంబానీ ఒక స్టార్ హోటల్లో పదివేలు ఖర్చుపెడితే అందులో కనీసం అయిదువేలన్నా పన్ను రూపంలో ప్రభుత్వానికీ, జీతాల రూపంలో హోటల్ ఉద్యోగస్తులకూ చేరవా?

ఇది కేపిటలిష్టు విధానమయినా ధనవంతుని దగ్గరనుండి పేదవాడికి డబ్బు చేరుతోంది కదా? కమ్యునిష్టులకి కావలసింది అదే కదా? పనీ పాట లేకుండా పేదవారిమని చెప్పుకుంటూ కమ్యూనిష్టు పార్టీ జెండాలు పట్టుకునే వారికి ఉత్తినే డబ్బు పంచడం కన్నా, కష్టపడీ పని చేసిన వారికి డబ్బులివ్వడం మంచిదేకదా?

ఆ ధనవంతులు ఖర్చు పెట్టకుండా పొదుపు చేస్తే ఏమవుతుంది? వారి ధనం స్విస్ బేంకులో మూలుగుతుంది! దేశానికి పన్నూ రాదు, మధ్య తరగతి, బీదవారికి ఉపాధీ దొరకదు! నాకు అర్ధమయింది ఇదే - తప్పయితే సవరించ గలరు.

ఇక మంత్రుల విషయం. వారు మొదటి తరగతి మీద చేసే ఖర్చు నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న ఏయర్ ఇండియాకి మేళు చెయ్యదా? అది వారి సొమ్ము కాదు, ప్రజాధనం అని ఎవరైనా అనచ్చు, కానీ ఆ పొదుపు చెయ్యబడ్డ ప్రజాధనం ప్రజలకేమన్నా చేరదుగా? మరో రూపంలో నల్ల ధనంగా మారుతుంది. మరి ఇంకా ఆ పొదుపెందుకో? మళ్ళీ చెప్తున్నా - మనం ఎకానమిక్స్ లో వీకు. కనుక ఈ పోస్టు మీకు మూర్ఖంగా అనిపిస్తే క్షమించేసేయ్యండి!

13 కామెంట్‌లు:

  1. చాలా మంచి పాయింటు. బాగా చెప్పారు. ఎన్నికలపుడు కూడా ఇలాగే ఖర్చు పెట్టించాలి. ఎంతలా అంటే ఉత్తుత్తిగా రాజీనామాలు చేస్తాం అనే వాళ్ళు ఉ.... పోసుకునేలా ! నేనూ నిజంగా ఎకనమిక్స్ లో వీకు. ప్రభుత్వం వారు పొదుపు చేస్తే మంచిదే అని అనుకుంటా. ప్రైవేటు వ్యక్తుల విషయంలో మన సిద్ధాంతం వర్తిస్తుంది. అయినా వీళ్ళు చేసే పొదుపు చర్యలు అన్నీ గిమ్మిక్కులు కాదా సార్!

    రిప్లయితొలగించండి
  2. అమెరికా ఆర్థికశాస్త్రం బాగానే వంటబట్టినట్టుంది. :)
    కాని ఇండియా కేంద్రప్రభుత్వం పొదుపు చేయమన్నది అధికారులను, మంత్రులను. అంటే వాళ్ళు పొదుపు చేయాల్సినది వాళ్ళు కష్టపడి సంపాదించిన నల్లడబ్బును కాదు. టాక్స్ పేయర్ జేబు గుల్ల చేయొద్దని, మలకయ్యా. :))

    శంకర్

    రిప్లయితొలగించండి
  3. అంటే వాళ్ళు పొదుపు చేయాల్సినది వాళ్ళు కష్టపడి సంపాదించిన నల్లడబ్బును కాదు. టాక్స్ పేయర్ జేబు గుల్ల చేయొద్దని, మలకయ్యా. :))
    ___________________________________

    I agree, but I did talk about it.

    "అది వారి సొమ్ము కాదు, ప్రజాధనం అని ఎవరైనా అనచ్చు, కానీ ఆ పొదుపు చెయ్యబడ్డ ప్రజాధనం ప్రజలకేమన్నా చేరదుగా? మరో రూపంలో నల్ల ధనంగా మారుతుంది. మరి ఇంకా ఆ పొదుపెందుకో?"

    రిప్లయితొలగించండి
  4. వొక సంవత్సరం ఇలా పొదుపు చర్యలు మంత్రులు అధికారులు చేపట్టడం ద్వార వచ్చిన మొత్తం సొమ్ముని ఏదైనా నీటి ప్రాజెక్ట్స్ కి వాడడం ద్వార ఉపాధి plus సత్పలితం కూడా .సాధించొచ్చు ఉదాహరణ కి executuve క్లాసు లో ప్రయాణానికి sanction తీసుకుని , ఎకానమీ క్లాసు లో ప్రయాణం చేసి ఆ difference amount ని వెంటనే ప్రాజెక్ట్ ఫండ్ లో జమ చెయ్యాలి అప్పుడే యి పొదుపుకి సార్ధకత లేక పొతే కేవలం పబ్లిసిటీ జిమ్మిక్.

    రిప్లయితొలగించండి
  5. Do you think all the Public money is getting in to black money?
    I don't think so. If that is the case, India would not have projected 8% growth rate, while many countries are struggling to show some positive growth rate.

    Yes, som % is being misused.
    Misuse is everywhere. In us it is quite common say Lehman brothers, Madoff, Enron, etc.

    Sankar

    రిప్లయితొలగించండి
  6. Hmm point taken .. but still I cant believe that the amount they sabve will be used for public consumption .. may be they cando this .. they can keep an account of the money they saved ... and then tell us, the public, what they did with that money

    రిప్లయితొలగించండి
  7. :)) No direct public consumption, even if they show it as seperate account! :) If they show... Jagan would use it to buy death certificates of the persons who are dying after YSR ( Is it so horrible that so many died seeing the gory scenes?! If so, it should regularly be showed in Gandhibhavan! :)) ) . Now Jagan is claiming all public to be behind him and the public have agenda than to make him CM and help him in his 'business' ;)

    O paata paaTa yaad kostOndi:
    " EmanTaav EmanTaav Ori maavaa
    ee maaTa kEmanTaav Ori maavaa.. "

    They are capable of showing 1001 wayas of spending.. don't ask them. Then, it will be legitemized! :)

    రిప్లయితొలగించండి
  8. పొదుపు:

    kendra prabhutvam podutupu cheyya mandi enduku cheyya mando telusa ante, aa vidhamuga villu edho tega viraga distunnaru ani pinchataniki. monna aa madhya aa rahul ekkadiko vellataniki flight kakunda train lo vellinadu anta. daniki పొదుపు entha ante
    10000 la rupayalu. dini valla prabhutavaniki ayyina karchu entho telusa daggaraga 2 lakhs. ade flight lo pothe, ekke daggara secruity dige daggar secruity unte saripoyyedi. adedho 5000 lu save chestunnadu ani cheppi delhi nundi amrutsar or inko place madhya lo anni stations lo dari podavuna forces ni unchi sunakanadam ani anipinchiru. villu vallu bratakataniki matrame, prajalani sampataniki puttinaru. maname gaa gelipinchindi villani, maname pikkovali.

    రిప్లయితొలగించండి
  9. spending or saving.....every individual should decide for themselves......both saving/spending are both good for the economy........spending as you posted will help in the same way......saving....if it is in the form of investment will help....or even if you just store money in a locker will also help as money circulation in market gets lower and....as a result less inflation......

    But government spending is never good......by this i dont mean govt. to save money but lower government spending should result in low/ no taxes and less fiat currency.

    రిప్లయితొలగించండి