27, జులై 2010, మంగళవారం

అనఘ మరో పాట - టెలిఫోన్ (లేడీ గాగా, బియాన్సే) కవర్

పాడను మొఱ్ఱో అంటున్నా సరే వెంటపడి మరీ పాడించా ఓ పావుగంట క్రితం :))

.

10, జులై 2010, శనివారం

వినరా ఓ బ్లాగువీరా, ఆచార్యుని కధ చెబుతా...

వినరా ఓ బ్లాగువీరా, Professor కధ చెబుతా
అందరికీ ఝలక్కు ఇచ్చిన వైనం వివరిస్తా ...

అనగనగా ఒక గుంటూరు యువకుడు ప్రొఫెసర్ అయ్యాడు,
ప్రొఫెసర్ అయ్యి ఒక బైకరుతో స్నేహం చేశాడూ
ఆ ఇద్దరూ బయల్దేరి చెట్టాపట్టాలేసుకునీ
మోటర్ సైకిల్ వేసుకునీ దేశం చుట్టారూ

అప్పుడేమయ్యిందాయ్యా అంటే:

ఒక దేశంతో సంతృప్తి చెందని ప్రొఫెసర్ గారేమో
తన పనికోసం భారత్ నుండీ మెక్సికోకొచ్చే
సడన్ గా లవర్ పై బెంగొచ్చే
పదేళ్ళ ప్రేమ గుర్తొచ్చే
రేపటి రోజున అట్లేంటిక్ పై
వరుడుకాబోతున్నాడూ!


Geetacharya .. my hearty congratulations to you on losing your Bachelors degree - Have a great married life ahead..

(and of course my hearty condolences on losing your freedom too)Background -

Here is the mail from Geetacharya I received a few minutes ago!*******************************************


అన్నయ్యా,

మీకో శుభ వార్త. రేపు మెక్సికో సమీపంలో అత్లాంటిక్ సముద్రం మీద నేను ఒక ఇంటి వాడిని కాబోతున్నాను. న్యూసు మీకు స్వయమ్గా చెపుదామనుకుంటే ఆన్లైన్ లో మీరు లేరు. ఇక మీ ఆశీస్సుల కోసం మెయిల్ ని ఆశ్రయించక తప్పలేదు. ఇంటి వాడిని అంటే అట్లాంటిక్ సముద్రం మీద ఇల్లు కట్టుకుంటున్నానని కాదు. నా పదేళ్ళ ప్రేమని క్లైమాక్స్ కి చేరుస్తున్నానని :D

అలాగే నా మెక్సికన్ టూర్ సకెస్ అయింది కూడా

హవార్యూ ఆల్?
ప్లీజ్ మెయిల్
అదర్వైజ్ కాల్
ఎనీథింగ్ బోల్
యువార్ ఇన్ మై సోల్
ఇటీజ్ నాట్ కోల్
ఇట్ హాజ్ నో హోల్

గీతాచార్య