13, సెప్టెంబర్ 2013, శుక్రవారం

అత్యాచారం చేసి ఉరికంబం ఎక్కుతారా లేక అత్యాచారం చేయబడిన అమ్మాయిని చంపేసి కొన్నాళ్ళు జైల్లో ఉండి బయటకొచ్చేస్తారా?

అత్యాచారం చేసి ఉరికంబం ఎక్కుతారా లేక అత్యాచారం చేయబడిన అమ్మాయిని చంపేసి కొన్నాళ్ళు జైల్లో ఉండి బయటకొచ్చేస్తారా?

హత్యానేరానికి సంబంధించిన చట్టాలని సవరించకుండా అత్యాచారానికి ఉరిశిక్ష విధిస్తే జరగబోయేది ఊహించటం పెద్ద కష్టమేమీ కాదేమో?

అత్యాచారం మిగిల్చే trauma జీవితమంతా ఉంటుంది నిజమే, కానీ అసలు జీవితమే మిగలకపోతే?

ప్రాణంకంటే మానం ముఖ్యమనే ప్రవచనాలని వల్లిస్తూ అత్యాచారానికి గురైన సినీమా హీరోగారి చెల్లెలు అత్మహత్య చేసుకోవటం సినీమాలకే పరిమితమయితే మంచిదేమో?

10, సెప్టెంబర్ 2013, మంగళవారం

తెలుగువాడి ఆత్మగౌరవం Vs. తెలంగాణా ఆత్మ గౌరవం

--- A repost... original dated back to 2010 .. but still relevant  ...

ఈ మధ్య కాలంలో నేను విన్న అతి పెద్ద అబధ్ధం - "మా పోరాటం హైదరాబాద్ కోసం కాదు!" .. ఇది రెండు పార్టీలూ చెప్తున్న మాటే .. "తెలుగువాడి ఆత్మగౌరవం", "తెలంగాణా ఆత్మ గౌరవం" ముసుగేసుకుని ...

ఒకవేళ సమైక్య వాదులకి హైదరాబాద్ అక్కరలేకపోతే ఉద్యమమంతా హైదరబాద్ మీదే ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? ఒక్కరైనా "జరిగిందేదో జరిగింది... ఇప్పుడయినా తెలంగాణాకి జరిగిన అన్యాయానికి ప్రాయశ్చితం చేద్దాం" అన్నారా? అబ్బే!! ఎందుకంటారూ? "మిగిలినవాళ్ళు ఎటుపోతే మాకేం? మా హైదరాబాద్ మాకొస్తే చాలు" - అంతేనా?

ఇక వేర్పాటువాదుల సంగతి - నిజంగానే తెలంగాణా కావాల్సినవారైతే "సరే, ఉన్న చిక్కంతా హైదరాబాదే కదా. దానిని కొన్నాళ్ళు విడిగా పెడదాం - మిగిలిన జిల్లాలని కలిపి వెంటనే తెలంగాణా ఇవ్వండి - హైదరాబాద్ తేలేదాకా విడిగా పెడదాం" అనుండే వారు, సమైక్యవాదులు అందరూకాకపోయినా చాలామంది ఒప్పేసుకునేవారు - కానీ అలా అన్నారా? లేదే! "హైదరాబాద్ లేని తెలంగాణా మాకొద్దు" అనడంలోనే తెలుస్తోంది తెలంగాణామీద ఎంత ప్రేముందో. మిగిలిన జిల్లాలు జిల్లాలు కావా? వాటిట్లో మనుషులు ఉండరా? అదీ కాక మహరాష్ట్రకీ, కర్నాటక కి జిల్లాలని మొత్తం వదులుకోలేదా? ఇది అంతకన్నా ఘోరమేమీ కాదే?
స్వగతం: రెండు గుంపులనీ కెలికి రాళ్ళేసా ... ఇద్దరూ కలిపి వాయిస్తారేమో? Let them :P

5, సెప్టెంబర్ 2013, గురువారం

మాలిక మాసపత్రిక భాద్రపదమాస సంచిక విడుదల
వినూత్నమైన వ్యాసాలతో, సీరియల్స్ తో మాలిక పత్రిక  భాద్రపద మాస సంచిక విడుదలైంది.
గతనెలలో ప్రకటించిన ఉత్తమ బ్లాగు, వికి టపాలకు రూ. 116 విలువైన కినిగె గిఫ్ట్ కూపన్ ఇవ్వబడుతుంది. ఈ బహుమతులకు మీరు కూడా మీకు నచ్చిన టపాలను నామినేట్ చేయవచ్చు. మీరు రాసినదైనా సరే ...

మీ ఉత్తరాలను, రచనలను పంపవలసిన చిరునామా:  editor@maalika.org


ఉత్తమ బ్లాగు టపా:  ' ఔను! నేను బ్లాగ్ రాయడం మానేశాను'  ( పనిలేక)
ఈ టపాలో డాక్టర్ గారు చెప్పిన అనుభవాలు చాలామందికి కలిగి ఉండవచ్చు. మనమో పెద్ద బ్లాగర్. చాలా పేరుంది. బాగా రాస్తారని తెలుసు కాని అసలు బ్లాగు అంటే ఏంటి? దానివల్ల ఎంత రాబడి ఉంటుంది మొదలైన ప్రశ్నలు వేస్తుంటారు చాలామంది. అందుకే  ఇది ఈ నెల కోసం ఎంపిక చేయబడింది..

ఉత్తమ వికి వ్యాసం :  తెలుగు వికీపీడియాలో గతనెల అంటే ఆగస్టులో కొత్త వ్యాసాలేమున్నాయి అని చూస్తే ఎన్నో గ్రామాలగురించి కొత్త వ్యాసాలు ఉన్నాయి.  పైసా ఆదాయాన్నివ్వని ఈ పనిని ఒక బాధ్యతగా నిర్వహిస్తున్న YVS Reddyగారికి బహుమతి ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది.. మీరు కూడా మీ ఊరిగురించిన వింతలు విశేషాలు వికిలో చేర్చండి మరి..


మాలిక పదచంద్రిక - 11 .. ఈ ప్రహేళికకు ఒక్క సమాధానం కూడా రానందుకు చింతిస్తున్నాము. మరీ అంత కష్టంగా ఉందా ఈ పదచంద్రిక?? కాని ఈసారి పదచంద్రిక కాస్త సంగీతభరితంగా, రసవత్తరంగా ఉంటుంది..

ఇక ఈ నెలలోని వ్యాసాలు ఇలా ఉన్నాయి...

 0. పట్టిక
 1. సంపాదకీయం: మనమేం చేయగలం?
 2. అతడే ఆమె సైన్యం - 4 - యండమూరి వీరేంద్రనాధ్
 3. సంభవం - 4 - సూర్యదేవర రామ్మోహనరావు
 4.  కినిగె టాప్ టెన్ - ఆగస్టు 2013
 5. జయదేవ్ గీతపదులు - 2  - జయదేవ్
 6.  అక్షర పరిమళాల మమైకం -  శైలజామిత్ర
 7. బియాండ్ కాఫీ - కత్తి మహేష్ కుమార్
 8. అనగనగా బ్నిం కధలు -2 - బ్నిం
 9. వినిపించని రాగాలే .. పారశీక చందస్సు - 4
10. మాలిక పదచంద్రిక - 12 - సత్యసాయి కొవ్వలి
11. పంపనాచార్యుడు - చారిత్రక సాహిత్య కధామాలిక - 5
12. సాంబే పరబ్రహ్మణి - రసజ్ఞ
13. కాళిదాసు కవితా సౌందర్యం - అనిల్  మాడుగుల