24, ఫిబ్రవరి 2010, బుధవారం

నేనూ, నా "ఐస్ టీ" !!!

అనగనగా ఒక రోజు. చికాగో షాంబర్గులో మా ఆఫీసు ... సాయంకాలం .. ఆకలితో నేను .. అంద్తకు ముందు రాత్రి ఏమితినలేదు, ఆ రోజు పొద్దున్న మధ్యాహ్నం కూడ ఏమి తినలెదు. అయిదయ్యింది.. దాహం కూడా మొదలయ్యింది. సరే ఎదన్నా తాగుదామని మా బాస్ ని అడిగా, సరే అని ఒక ఆరుగురం గుంపుగా అక్కడే గాల్ఫ్ రోడ్ మీదున్న టీ జీ అఈ ఫ్రైడేస్ కి వెళ్ళాం. డ్రింక్ ఆర్డర్ చెయ్యమన్నాడు. నేనేదో ఫోన్ హడావిడిలో ఉండి మా బాస్ చెప్పిన ఐస్ టీనే నాకు కూడా తెమ్మన్నా. సరే నని తీసుకొచ్చాడు. అసలే ఆకలి, పైగా దాహం. నీరసానికి ఒళ్ళు తూలడం కూడ మొదలయ్యింది. వాడేమో ఫ్రైస్ తెచ్చి చావడు. సరే టీ తాగితే తగ్గుతుందేమో అని మొదలు పెట్టా, తగ్గలేదు సరి కదా తల తిరుగుడు ఇంకా ఎక్కువయ్యింది. పక్కవాళ్ళ సురాపానం, మనకేమో ఆ వాసనకి కడుపులో తిప్పుడు. సినీమా కష్టాలన్నమాట. ఇది లాభంలేదు జ్యూస్ ఏమన్నా తాగుదామని చూస్తే పక్క టేబుల్ మీడ ఎదో దానిమ్మ రసం మెన్యూ కనిపించింది. సరే అది తీసుకురమ్మన్నా. పక్కనే విస్కీ తాగుతున్న ఒకాయన, "మాగాడంటే విస్కీ తాగాలోయ్, అదేమిటి ఆడవాళ్ళ డ్రింకు తాగుతున్నావ్" అని కుళ్ళాడు. "నీ బొందలే, దానిమ్మ రసంలో ఆడా మగా ఏమిటి?" అనుకుని ఒక వెర్రి నవ్వు నవ్వి ఊరుకున్నా. నా నవ్వు వెనకాల వ్యంగ్యం అర్ధమయ్యిందేమో, మా బాస్ మొహంలో చిద్విలాసం.

సరే, ఆ సెర్వారాయుడు, నేనడిగింది తీసుకొచ్చాడు. అది త్రాగాక కూడా, ఊహు( లాభంలేదు, ఇంకా ఎక్కువయ్యింది గానీ తగ్గలేదు. సరే ఇక లాభంలేదని అందరికీ గుడ్ Bye చెప్పేసి పక్కనున్న పార్కింగ్ లాట్ లోకి నడిచా (నేను శరత్ ని కలిసింది ఆ పార్కింగ్ లాట్లోనే) ... తల తిరుగుడు, కడుపు తిప్పుడు, ఆకలి. తిన్నగా నడవవలసిన వాడిని చక్కర్లలో నడవడం మొదలు పెట్టా, జనాలేమొ నన్ను చూసి నవ్వు .. నా పరిస్థితి అర్ధం కాక. అదృష్టవశాత్తు నా స్నేహితుడు రేవంత్ (అదే ఝాన్సీ తో కలిసి ఏదో టీవీ సీరియల్ చేసినతను) ఇంటికి తీసుకెళ్ళడు. మా ఆవిడ పిల్ల ఊళ్ళో లేరు - రోడ్ ఐలేండ్లో ఉన్నరు. కునాల్ అని మరో ఫ్రెండ్ ఇంటికొచ్చి ఒక ఆరేడు దోసెలేసి పెట్టి వేళ్ళాదు. అవి తిన్నాక కాస్త ఓపిక వచ్చింది. వామ్మో, తిండీ తినకుండ అంత సేపు ఉండకూడదు అనుకున్నా...

ఆ మర్నాడు ఆఫీస్ కి వెళ్ళిన వెంటనే జనాలు నన్ను చూడడం, నవ్వడం. ఎందుకో నాకర్ధం కాలేదు. ఒకళ్ళని అడిగితే "నిన్న నువ్వేం చేశావో తెలుసా?" అని ప్రశ్న. "ఏహే! ఒంట్లో బాలేదు, అందుకే ఇంటికెళ్ళిపోయాను" అన్నా ..

"దానికి ముందు ఏం చేశావ్?"

"ఐస్ టీ, దానిమ్మ జ్యూస్ తాగి, ఏవో ఫ్రైస్ తిన్నా, టిజీఐ ఫ్రైడేస్ లో" అన్నా

మళ్ళీ నవ్వు

"తెలుగు సినీమా హీరోయిన్ వెకిలి నవ్వు చాలు గానీ విషయం చెప్పి తగలడు" నాకు కోపమొచ్చింది.

"పిచ్చినా వెర్రినా బుజ్జీ, నువ్వు త్రాగింది మామూలు ఐస్ టీ కాదు, లాంగ్ ఐలాండ్ ఐస్ టీ - దానిలో రం, జిన్, వోద్కా కలిసి ఉంటాయి)

అలాగే తరవాత తాగింది పోమెగ్రేనైట్ మార్గరీటా, దానిమ్మ జ్యూసు కాదు. నీ హడావిడిలో "లాంగ్ ఐలాండ్" వినకుండా "ఐస్ టీ" మాత్రమే విన్నావ్, అలగే "మార్గరీటా" చూడకుండా "పోమెగ్రేనైట్" మాత్రమే చూసావ్. అదీ సంగతి - జీవితంలో మొదటిసారి తాగడం, అది కూడ ఖాళీ కడుపుమీద, పైగా ఇంత స్ట్రాంగ్ డోసు" అని ఒకటే నవ్వు.

"హతోస్మి" అనుకున్నా. అప్పటినించీ ఎక్కడికెళ్ళినా తెలియని డ్రింక్ అడిగేడప్పుడు దాంట్లో ఆల్కహాల్ ఉందా లేదా అని మరీ కనుక్కుంటా!

"ఆడవాళ్ళ డ్రింక్" అని పక్కన ఉన్నాయన ఎందుకు వెక్కిరించాడో అప్పుడు తెలిసింది. అది మార్గరీటా అన్న విషయం వెలిగాక ఆయన కుళ్ళలేదని అర్ధమయ్యింది. నాకు తాగుడలవాటు లేదని తెలిసిన మా బాస్ నవ్వు వెనకాల అంతరార్ధంకూడా అప్పుడే క్లిక్కుమంది.

వెంటనే వెళ్ళీ "నే తాగనని తెలుసు కదా, మరి నాకెందుకు చెప్పలేదు?" అని అడిగితే దానికి ఆయన సమాధానం "నువ్వడగలేదు, నేను చెప్పలేదు" అని!!!! పైగా మళ్ళీ "మరో టీటోటలర్ చేత విజయవంతంగా మందుకొట్టించా" అని ముసిముసినవ్వులు, "నువ్వు వెధవ్వనుకున్నాను గానీ , మరీ ఇంత వెధవ్వనుకోలేదు" అని అర్ధం వచ్చేడట్టు ఒక లుక్కూను!

ఒక్క పూటకే నాకు అంత దారుణమైన ఫీలింగ్ వచ్చింది. రోజూ తాగేవాళ్ళకి చేతులెత్తి దణ్ణం పెట్టాల్సిందే.

33 కామెంట్‌లు:

  1. లాంగ్ ఐలాండ్ ఐస్ టీ కి worst hangover అని విన్నాను. అదే మొదటి సారి (ఆఖరి సారి కూడా అనుకుంటా ) తాగి భలే ఇబ్బంది పడ్డారన్నమాట.

    దాంట్లో కాలరీస్ కూడా చాలా ఎక్కువట :D

    రిప్లయితొలగించండి
  2. నిజమే. రోజూ తాగే వాళ్ళకి పెద్ద నమస్కారం. అందులో అంత రుచి ఏముంటుందా అని మాత్రం అందరికీ అనుమానం కలుగుతుంది.

    రిప్లయితొలగించండి
  3. ఇలాంటిదే నాకూ ఓ సారి బస్సులో జరిగింది. అదేంటో నా బ్లాగులో టపాగా రాస్తాను.

    రిప్లయితొలగించండి
  4. __________________________________

    అదీ సంగతి - జీవితంలో మొదటిసారి తాగడం, అది కూడ ఖాళీ కడుపుమీద, పైగా ఇంత స్ట్రాంగ్ డోసు" అని ఒకటే నవ్వు.
    __________________________________

    నిజమే, ఖాళీ కడుపు మీద ఆ రేంజిలో తాగి తట్టుకోగలిగారంటే గ్రేట్.

    రిప్లయితొలగించండి
  5. Sujatha,

    Well I dunno. To me it didnt taste much different from a regular Ice Tea.

    Ravichandra, waiting for your post ..


    Ganesh .. it was like I had a vertigo attack, LOL

    రిప్లయితొలగించండి
  6. హ్మ్... జీవితం లో ఒకే ఒక్కసారి తాగి వాగిన వాగుడు నా లైఫ్ ని మార్చేసింది, మళ్ళీ ఇంతవరకు దాన్ని తాకలేదు :(

    రిప్లయితొలగించండి
  7. @రాఘవ గారు,
    ఏదో మాంఛి వెనక మెరుపు (అదేనండీ ఫ్లాష్‌బ్యాక్) ఉన్నట్టుందే.....:-)

    రిప్లయితొలగించండి
  8. మీ రేవంత్ గారి ఇంటి పేరు పిన్నమా?

    రిప్లయితొలగించండి
  9. హ హా .. ఐస్ టీ సంగతి కాదు. ఇన్ జెనెరల్ ''మద్యం'' అన్న బ్రహ్మపదార్ధం లో అంత రుచి ఏమిటో, ఎందుకంతగా జనం పడి చస్తారో - అని అనుమానం.

    ఒక పిట్ట కామెంటు :

    నర్తన శాల సినిమాలో మాత్రం ఎస్.వీ.రంగారావు చేతిలో మదిర గ్లాసు చూసి, నేనూ ఎప్పటికైనా ట్రై చేద్దామని అనుకున్నాను (గ్లాసు ని). ఇంకా, చిన్నప్పుడు నాకు గాజు గ్లాస్ అంటే భలే మోజు ఉండేది. గ్లాసులో విషం పోసిచ్చినా అందంగా కనబడేదేమో !

    రిప్లయితొలగించండి
  10. hmm avunandi, adedo cinema loo ANR lagaa evarikosam ani paata paadukunna tarvaata pepsi bottle pattukoni. :(

    రిప్లయితొలగించండి
  11. Ravichandra, Cool!

    Raghava? Whats that chnage in life? DDid you get married?

    Sujata, hmm I tried only those two ...

    Sunita, yesssss! How do you know him?

    రిప్లయితొలగించండి
  12. మడిసన్నాక మంత్లీ ఒహసారయిన మందేయ్యలోయ్.

    రిప్లయితొలగించండి
  13. టీ టొటలర్ అంటే ఇంతక ముందు బాగా తాగి మానేసి వాడ్ని అంటారు అనుకుంటా.మీరు ఇదే మొదట సారీ అంటూన్నరు

    రిప్లయితొలగించండి
  14. 'రౌడీ' అన్న పేరుకే మచ్చ తెచ్చారండీ మీరు :)))

    రిప్లయితొలగించండి
  15. hello rowdy gaaru am very like your blog name malkpet rowdy kya yar please don't abstract you are very great yar......your blog so nice but ......zyada ushari nahi karna samje ha ha ha

    రిప్లయితొలగించండి
  16. రెండు తాగి బాగానే తట్టుకున్నారు. తినగ తినగ వేప తియ్యన అని తాగుతూ ఉంటే అదే అలవాటు అవుతుందండి (Just kidding, not suggesting to get used to it)

    రిప్లయితొలగించండి
  17. hmm....ఖాళీ కడుపుతో సేవించి తట్టుకున్నారంటే గట్టి పిండమే సుమా ..అయినా వాసన రాలేదా ..పక్క వాళ్ళ విస్కీ వాసన డామినేట్ చేసి ఉంటుందా..:P

    రిప్లయితొలగించండి
  18. LOl Nishi, Ashok and Batasari.

    Amrapali, nope - I coudnt smell it ... probably because of the stronger odor emanating from the neighborhood :))

    రిప్లయితొలగించండి
  19. Ohh yeah ... I worked for Gantec.

    I used to visit KK Reddy's place every other week. In fact my daughter was learning Kuchipudi there.

    రిప్లయితొలగించండి
  20. మలక్,
    అదేంటి , మరి ఆ రోజు మనిద్దరం తాగింది చివాస్ రీగల్ అన్నావు కదా? అదేంటి? జ్యూసేనా? మస్తు మజా వచ్చింది లే .. ?

    శంకర్ ;)

    రిప్లయితొలగించండి
  21. అయ్యో మలక్ నేను గోవా లో బీర్బలుల తో బిజీ గా వుండడం వాళ్ళ మీ తాగు బోతు పోస్టింగ్ చూడలేదు .
    ఇంతకీ కునాల్ కుడా అక్కడకే వచ్చేసాడ?సమయానికి వచ్చి దొసలు వేసాడు , మీలో దోషాన్ని ఇంట్లో వాళ్ళకి
    తెలీకుండా కాపాడాడు .
    సుజాత గారి కామెంట్ చూస్తె త్వరలోనే కుంకుడు కాయ పులుసు అదే నండీ భక్త కబీరు రుచి చూసే లాగే వున్నారు ---)

    రిప్లయితొలగించండి
  22. అన్ని బ్లాగులూ తిరగడం లేదు మలక్. తింగరి కత్తి చెత్త మీద ఆ మొదటి వెధవ కామెంట్ చూసి కలాపోస చేద్దామని అటు వెళ్ళా.. ప్చ్ ...
    ఆ చిత్రకారిణి తనేసిన బొమ్మలన్నిటికీ బట్టలేసింది, కళను కళాదృష్టితో చూసే అవకాశం కలగలేదు.
    ఏం కళాకరులో చెప్పేది చేసి చూపరు , ఎంత డిజప్పాయింట్ మెంటయ్యిందో తెలుసా? ప్చ్ ...;)

    శంకర్ :P

    రిప్లయితొలగించండి
  23. ఇక్కడ లాజిక్ ఎంటంటే... మొదటి సారి తాగే వాల్లు రెగ్యులర్ గా తాగే వాల్ల కన్నా ఎక్కువగా... స్ట్రాంగ్ గా తాగ గలరు.....తరవాత తరవాత శరీరం ఒక డోస్ కి అలవాటు పడిపొతుంది...

    రిప్లయితొలగించండి