20, ఫిబ్రవరి 2010, శనివారం

రాయప్రోలువారి పద్యానికో పేరడీ!

కోడు విరిగిన డబల్ బెడ్డై
కాలు జారిన బాత్ రూమై
ఏడ్చుచున్నది భరత ఖండము
బాగు చెయ్యర తమ్ముడా

టెర్రరిష్టులు దాడిచేయగ
లంచగొండులు రాజ్యమేలగ
ప్రజలనందరు మోసపుచ్చగ
తెలుసుకొనరా తమ్ముడా

యువత శక్తిని కోల్పోచుండగ
క్రికెట్ కోసమె బ్రతుకుతుండగ
సినిమాహాళ్ళలో తిరుగుచుండగ
ఏంచేయుదువురా తమ్ముడా?

( Thanks to my cousin Prasanna for reminding me of the original)

8 కామెంట్‌లు:

  1. Thx Sky, Aksharamohanam garu


    Kamal,

    What happened to me?

    I hope you are not getting confused between this blog and Pramaadavanam. This blog is a general blog and has everything that I can write about.

    Pramaadavanam is my dedicated Kelukudu blog. Check the old posts of this blog - You'll get an idea

    రిప్లయితొలగించండి
  2. మలక్ పేట రౌడి గారూ
    ఏమి పేరడి రచించారూ
    భేష్ భేషనిపించినారూ
    అందుకొనుమిదె జోహారూ.

    రిప్లయితొలగించండి
  3. సుజాత గారూ, ఇంకా రాయమన్నది రౌడీ గారినా, నన్నా?

    రిప్లయితొలగించండి
  4. రౌడీ గారినే! మీ వ్యాఖ్య చూసాక మీరూ ఇంకా రాస్తే బాగుండనిపిస్తోంది!

    రిప్లయితొలగించండి