12, అక్టోబర్ 2017, గురువారం

కపిత్వం!

నన్ను నేనే మఱచాను
ఎవరికీ అందనంత ఎత్తులో...
గాల్లో తేలుతున్న క్షణంలో ...
గమ్యం చేరాలన్న తపనలో ...
.
నా కళ్ళు గమ్యాన్నే చూస్తున్నాయి
దాన్నందుకోలేనేమొనన్న భయంతో...
అందుకోకున్న మరణం తథ్యమనే తలపుతో...
ప్రపంచాన్ని పట్టించుకోని వైఖరితో...
నేలనసలు తాకకూడదన్న పట్టుదలతో...
.
.
.
ఒక భవనం పన్నెండో అంతస్తునుండి
మరొక భవనం పదకొండో అంతస్తుమీదకు
దూకుతున్న నేను  వచ్చిపడ్డాను...
ఉన్నట్టుండి మళ్ళీ ఈ లోకంలోకి...
 గ్రహించాను నేనెవర్నో...
"అమ్మో! కోతి!!" అనే చిన్నపిల్లల అరుపులతో!!
.