26, డిసెంబర్ 2011, సోమవారం

సనాతన ( హిందు ) ధర్మం లో "ఓం" ను ఎందుకు భగవంతుని చిహ్నము గా స్వీకరించారు?

సురేష్ కదిరిగారి బ్లాగులో ప్రచురితమయిన టపా ఇది. ఎవరో YourGod ఇది వ్రాసిన ఆయన్ని ఏదో చేసేస్తానని బెదిరిస్తున్నాడు. సరే ఆ శాల్తీ ఇక్కడైకొచ్చి నాకు ఏం ట్రీట్మెంట్ ఇస్తాడో అని చూడాలని ఉంది.శబ్దమే భగవంతుడని చెప్పబడింది.ప్రతిపదము నకు మూలాధారము గా ఒక గుర్తుగా ఉంటే అది ఉత్తమోత్తమ చిహ్నం అవుతుంది.శబ్దోచ్చారణ లో మనం కంఠం లో ని స్వరపేటికను,అంగిలిని, శబ్ద ఫలకాన్ని ఉపయోగిస్తాము.ఏ శబ్దము నుండి ఇతర శబ్దాలన్నీ వ్యక్తమవుతున్నాయో అలాంటి అత్యంత స్వాభావిక శబ్దము ఏదైనా ఉందా? ఆ శబ్దమే ప్రణవము లేక ఓంకారము.ఇందులో అ,ఉ,మ లు ఉన్నాయి.నాలుకలోని, అంగిలిలోని ఏ భాగము కూడా 'అ 'కార ఉచ్చారణ కు తోడ్పడదు.ఇది ఓంకారానికి బీజం గా ఉంది.చివరిది 'మ 'కారము.పెదవులని మూసి దీన్ని ఉచ్చరిస్తారు.నోటిలోని మూలభాగము నుండి అంత్యభాగము వరకు కూడా ఉచ్చారణ సమయము లో దొర్లుకుంటూ ఉంటుంది.ఇలా శబ్ద ఉచ్చారణా ప్రక్రియనంతా ఓంకారం తెలియజేస్తూంది.అందువలన ఓంకారాన్ని స్వీకరించడము జరిగింది.
____________________________________________________

Oh My Dog, the space is all yours and I have a good week of vacation. Come on, lets have some fun!

20, డిసెంబర్ 2011, మంగళవారం

ఇస్కాన్ - భగవద్గీత - నిషేధం?

పూర్తి పోస్టు వ్రాసే టైంలేక చేతికొచ్చినది 10-15 లైన్లలో బఱుకుతున్నా :))


1. రష్యాలో నిషేధానికి గురవుతోంది భగవద్గీత కాదు. ఇస్కాన్ వ్యవస్థాపకుడు స్వామీ ప్రభుపాదచే రచింబడిన దాని ఆంగ్లానువాదం!

2. నా ఉద్దేశ్యంలో ఇస్కాన్ అసలు హిందూ సంస్థ కాదు - హిందూ సంస్కృతికి సంబంధించినదేదయినా భారతదేశంలో పుట్టి ఉండాలి లేక వైదిక ధర్మంపై ఆధారపడి ఉండాలి - ఇస్కాన్ పుట్టింది న్యూయోర్క్ లో, వృద్ధి చెందిందీ, చాలా మంచిపేరూ, కాస్తంత చెడ్డపేరూ తెచ్చుకుందీ పిట్స్ బర్గ్ దగ్గర వీలింగ్ లో. అది బోధించేది కృష్ణతత్వం. దాని ప్రామాణికాలు వేదాలు కావు - భాగవతం మరియు భగవద్గీత. హిందువులకి అవి పవిత్ర గ్రంథాలేగానీ వేదాల స్థానాన్ని పొందలేవు.

3. ఇప్పుడు జరుగుతున్న గొడవ మొదలయ్యింది ఇస్కాన్ కీ, ఏదో తొక్కలో చర్చికీను. చిలికి చిలికి కెలికి కెలికి భారత్ రష్యాల మధ్య గొడవయ్యి కూర్చుంది. ఈ గొడవ పుణ్యమా అని ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళకి ప్రచారమే ప్రచారం :)

4. భారతదేశంలో హిందూ దేవాలయాలపై హిందువులకు పూర్తిహక్కులు పార్లమెంటుని ముందు ఇవ్వమనండి. ఇస్కాన్ సంగతి తరవాత చూసుకోవచ్చు.

PS: Please feel free to correct me if you find anything wrong with the above points!

14, డిసెంబర్ 2011, బుధవారం

ఓ నేటి త్రిలింగదేశ అంతర్జాలికులారా ...

Sung to the tune of పెళ్ళిచేసుకొని ఇల్లు చూసుకుని ...ఓ భావి త్రిలింగదేశ అంతర్జాలికులారా
వయసుముదిరిన బ్లాగ్జనులారా
పరానుభవమున టైపు నా ఘోష ఇదే!!

వాహ్ రే వాహ్!
తాధినా తకధీన తాంగిడతక తధికిటతకతోం

బ్లాగు తెఱచుకుని పోస్టులేసుకుని కామెంట్లెన్నో పెట్టాలోయ్
భజనలు గట్రా చెయ్యాలోయ్
మరి ఫుల్లుగ టైంపాస్ అవ్వాలోయ్

సినిమాల మోజులో గాసిప్ సైట్లనే ఆదరించి
విసిట్ చేసిన ఐడిలు హేక్ కాగా
పిన్నలు పెద్దలు ముసలివాండ్రు
బ్లాగు పేరు చెప్పుకుని అందరూ సుఖపడగా

తాధినా తకధీన తాంగిడతక తధికిటతకతోం

డెస్కు టాపులో లేపు టాపులో అప్డేట్లు చూడాలోయ్... తరంపం
డెస్కు టాపులో లేపు టాపులో అప్డేట్లు చూడాలోయ్
స్మార్టుఫోనులో ఐపేడులో వాటికి రిప్లయ్ ఇవ్వాలోయ్
స్మార్టుఫోనులో ఐపేడులో వాటికి రిప్లయ్ ఇవ్వాలోయ్

బ్లాగు తెఱచుకుని పోస్టులేసుకుని కామెంట్లెన్నో పెట్టాలోయ్
భజనలు గట్రా చెయ్యాలోయ్
మరి ఫుల్లుగ టైంపాస్ అవ్వాలోయ్

సహజాలునిలా సహజాలికలా
సహజీవనమే గడపాలోయ్ ...

సహజాలునిలా సహజాలికలా
సహజీవనమే గడపాలోయ్
బోరుకొట్టినచో ఎవరికీ
అర్థం కాని పోస్టులే వెయ్యాలోయ్ ...
బోరుకొట్టినచో ఎవరికీ
అర్థం కాని పోస్టులే వెయ్యాలోయ్ ...


బ్లాగు తెఱచుకుని పోస్టులేసుకుని కామెంట్లెన్నో పెట్టాలోయ్
భజనలు గట్రా చెయ్యాలోయ్
మరి ఫుల్లుగ టైంపాస్ అవ్వాలోయ్!

3, డిసెంబర్ 2011, శనివారం

RIP దేవానంద్ :((

ఈ జీవితంలో కలవాలనుకున్నవాళ్ళలో ఈయన ఒకడు. ఆ అదృష్టం నాకు లేదు :((