పూర్తి పోస్టు వ్రాసే టైంలేక చేతికొచ్చినది 10-15 లైన్లలో బఱుకుతున్నా :))
1. రష్యాలో నిషేధానికి గురవుతోంది భగవద్గీత కాదు. ఇస్కాన్ వ్యవస్థాపకుడు స్వామీ ప్రభుపాదచే రచింబడిన దాని ఆంగ్లానువాదం!
2. నా ఉద్దేశ్యంలో ఇస్కాన్ అసలు హిందూ సంస్థ కాదు - హిందూ సంస్కృతికి సంబంధించినదేదయినా భారతదేశంలో పుట్టి ఉండాలి లేక వైదిక ధర్మంపై ఆధారపడి ఉండాలి - ఇస్కాన్ పుట్టింది న్యూయోర్క్ లో, వృద్ధి చెందిందీ, చాలా మంచిపేరూ, కాస్తంత చెడ్డపేరూ తెచ్చుకుందీ పిట్స్ బర్గ్ దగ్గర వీలింగ్ లో. అది బోధించేది కృష్ణతత్వం. దాని ప్రామాణికాలు వేదాలు కావు - భాగవతం మరియు భగవద్గీత. హిందువులకి అవి పవిత్ర గ్రంథాలేగానీ వేదాల స్థానాన్ని పొందలేవు.
3. ఇప్పుడు జరుగుతున్న గొడవ మొదలయ్యింది ఇస్కాన్ కీ, ఏదో తొక్కలో చర్చికీను. చిలికి చిలికి కెలికి కెలికి భారత్ రష్యాల మధ్య గొడవయ్యి కూర్చుంది. ఈ గొడవ పుణ్యమా అని ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళకి ప్రచారమే ప్రచారం :)
4. భారతదేశంలో హిందూ దేవాలయాలపై హిందువులకు పూర్తిహక్కులు పార్లమెంటుని ముందు ఇవ్వమనండి. ఇస్కాన్ సంగతి తరవాత చూసుకోవచ్చు.
PS: Please feel free to correct me if you find anything wrong with the above points!
ఎలా అంటే గుర్తులేదుగానీ ఈ ఇస్కాను ప్రస్తావన రష్యను విప్లవంలో వస్తుంది. అసలు కధేంటి? ఈ ట్రాన్సిలేషనేంటి అనే విషయాలగురించి మీరు కొన్ని లింకులివ్వకూడదూ
రిప్లయితొలగించండినాలుగు ముక్కల్లో తేల్చేశారు. ఎవరైనా భగవద్గీత చదివితే ఎంత? చదవకపోతే ఎంత? మనదేశంలో నిషేధంలేకున్నా, చదివినా ఎంతమంది అందుకు తగ్గట్టు 10%మైనా నిజ జీవితంలో ఆచరించగలుగుతున్నారు? ఇస్కాన్ వాళ్ళు చేస్తోంది, బిజినెస్ అని బెంగళూరులోని ఇస్కాన్ టెంపుల్ చూశాక ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది.
రిప్లయితొలగించండిఇలాంటి తొక్కలో వ్యాపారసంస్థలతో భంధాలను పెంచుకుని ఆవేశపడిపోక తామరాకు మీద నీటిబొట్టువలే వ్యవహరించమనే గీతలో చెప్పేది అని నా ఉద్దేశ్యం.
నిషేధానికి గురైంది రష్యన్ అనువాదం
రిప్లయితొలగించండిఅవునా? ఆంగ్లాను వాదం అర్థం కాక రష్యన్లు కేసుళేసుకుంటున్నారనుకున్నానే! :P
రిప్లయితొలగించండిIt's not banned yet.
రిప్లయితొలగించండిGita ban: Russian court suspends verdict till 28 Dec
<>
రిప్లయితొలగించండిహిందువులను పార్లమెంటులో పూర్తి మెజారిటీ ని సాధించమనండి హక్కుల గురించి అపుడు చూసుకోవచ్చు.
మలక్,
రిప్లయితొలగించండిరష్యా వాళ్ళు చేసింది ఒక అర్థం లేనీ, మతిలేని పని. అది ఒక పొరపాటు అని గ్రహించి సరిదిద్దుకుంటారని అనుకుంటున్నాను. అసలు నిషేదించడం, పైగా ఏదేదో ఊహించుకోని ఆ కారణంవల్ల నిషేదిస్తున్నామనడం ఖచ్చితంగా అభ్యంతరకరం.
ఇస్కాన్ అనేది హిందూ సంస్థా కాదా అనేది మీరు రాశారు. ఆ విషయం మీద నాకు అవగాన లేదు కాబట్టి నేనేమీ చెప్పలేను. అది ఏ సంస్థ అనేది అసంబధ్ధం. ఏదైనా సరే సరైన కారణం లేకుండా నిషేదించడమేంటి? ఖచ్చితంగా అభ్యంతర పెట్టాల్సిందే. They say, it preaches voilence. which is a very illogical deduction. If their logic is applied... all agriculture related books should be banned as organized Agriculture is a voilence against Nature :))
>>"భారతదేశంలో హిందూ దేవాలయాలపై హిందువులకు పూర్తిహక్కులు"
ఇది కొంచెం వివరించగలరా? పూర్తి హక్కులు అంటే, ఏమేమి ఉండాలి? ఇప్పుడున్న వాటిలో లోపాలేంటో కొంచెం చెప్పగలిగితే బావుంటుంది.
వీకెండ్,
రిప్లయితొలగించండిరష్యావాళ్ళింకా నిషేదించలేదు. అసలు ఇది ప్రభుత్వంతొ సంబంధం లేని రెండు ప్రైవేట్ సంస్థల మధ్య జరుగుతున్న రాజకీయపరమైన గొడవ. వాళ్ళు నిషేధించాలి అని గొడవ చేస్తోంది ఇస్కాన్ ని కాదు (ఇస్కాన్ కి రష్యా ప్రభుత్వ మద్దతు కూడా ఉంది - వాళ్ళకి ఆ ప్రభుత్వం కాస్తంత స్థలం కేటాయించింది కూడా) - భగవద్గీత సంస్కృత గ్రంధాన్ని కూడా కాదు - ఇస్కాన్ నాయకుడు స్వామీ ప్రభుపాద అనువదించిన భగవద్గీతని. ఆయన ఏమి వ్రాశాడో, వాళ్ళు ఏమి చదివారో ఆ కృష్ణుడికే ఎఱుక.
ఆ పుస్తకం యొక్క ఆంగ్ల ప్రతి నాదగ్గరకూడ ఉంది - ఒక ఇరవై పేజీలకి మించి చదవలేదు .. ఆ పేజీలలో అయితే ఎక్కడా కృష్ణుడిని నమ్మనివాళ్ళ పై బలప్రయోగం చెయ్యమని లేదు.
టూకీగా చెప్పాలంటే భగవద్గీతకి ప్రభుపాదగారి అనువాదాన్ని నిషేధించాలని మాత్రమే ఈ గొడవ. తనని తాను కాపాడుకోగలగని అంగ అర్థ బలాలు ఇస్కాన్ కి బాగానే ఉనాయి.
ఇక హిందువుల హక్కుల విషయానికి వస్తే,
నేనంటోంది హిందూ దేవాలయాలకి స్వయంప్రతిపత్తి ఉండాలని. చర్చి, మశీదుల విషయాలలో తలదూర్చనట్టే దేవాలయాల విషయంలో కూడా ప్రభుత్వం వ్యవహరించాలని. దేవాలయాలమీద వచ్చిన ఆదాయం ప్రభుత్వం తస్కరించకపోతే చాలు. రాష్ట్రంలో ఉన్న అందరు అర్చకులకీ జీత భత్యాలు పెద్ద దేవాలయాలే భరించగలవు.
మలక్,
రిప్లయితొలగించండిగొడవ ఎవరి మధ్య అయినా నిషేదించడం మతి లేని చర్య. హిందువులుగా కాకపోయినా కనీసం ఈ ప్రపంచ పౌరులు గా అటువంటి చర్యలకి జనాలు స్పందించి ఖండించడం అవసరమే. అసలు నిజంగా అంత అభ్యంతరకర విషయాలు భగవద్గీత పేరు మీద ఆయన రాసుంటే హిందూ సంస్థలు అందరికంటే ముందుగా అభ్యంతర పెట్టాలి.
ఇంక దేవాలయాలకి స్వయం ప్రతిపత్తి విషయంలో, ఏమత ఆలయాలైనా అన్నిటికీ ఒకే విధానం అమలవ్వాలి అని కోరుకుంటున్నాను. ఇక ఎంత స్వయం ప్రతిపత్తి ఉండాలి అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయమె. వాళ్ళ వాళ్ళ ధార్మిక సంబంధమైన విషయాల వరకూ ఎవరూ కల్పించుకోక పోవడమే మంచిది. ఆర్థిక, సామాజిక అంశాల్లో ఏ మత ఆలయాలైనా ఆ దేశ చట్టాలకీ, నిభందనలకీ లోబడాలి ఆ ప్రభుత్వాల పర్య వేక్షణలో ఉండాల్సిందే అనుకుంటున్నాను. ఏమత దేవాలయాలైనా, వాటి కింద ఉన్న ఆస్థులు ఆ చుట్ట పక్కల ప్రజల అభ్యున్నతి కోసం రాజులో, దాతలో వాటికి కట్టబెట్టినవే అనే విషయం గుర్తుంచు కోవాలి. అటువంటి వాటిలో కొంత న్యాయబధ్ధమైన వాటా వాటి యాజమాన్యాలకి అప్పగించి మిగిలింది ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవడం, ఆ తరువాత దేవాలయాల మానాన వాటిని వదిలెయ్యడం శ్రేయస్కరం అని నా అభిప్రాయం.
ఇదో కత్తి కండించుకోండి. అసలు అది సమస్యేకాదంటుంటే కండిస్తా కండిస్తా అంటున్నరు. వాళ్ళు గీత చదవకపోతే మనకు, హిందు మతానికి, భారతదేశానికి వచ్చిన నష్టం ఏమీలేదు. ఖురానైనా కన్సిడర్ చేయమని చెప్పండి. ఏదో ఒహటి వాళ్ళతో చదిపించేదాక వీళ్ళు నిద్రపోయేట్టు లేరు, పాపం రష్యన్లు.
రిప్లయితొలగించండిఅజ్ఞాత,
రిప్లయితొలగించండిఇదే మీలాంటోళ్ళతో వచ్చిన చిక్కు :) ఏది సమస్యో ఏది సమస్య కాదో, హిందువులు ఏం చెయ్యాలో, భారతీయులేం చెయ్యలో అన్నీ మేమే చెప్పేస్తాం అంటారు.
As I said,
రిప్లయితొలగించండిThis is a dispute between two private parties wherein one party is asking for a ban on a book written by another.
ఇంక దేవాలయాలకి స్వయం ప్రతిపత్తి విషయంలో, ఏమత ఆలయాలైనా అన్నిటికీ ఒకే విధానం అమలవ్వాలి అని కోరుకుంటున్నాను.
_______________________________________________
Exactly - So, either grant autonomy to the Hindu Temples or bring Mosques and Churches under govt. supervision. Right?
yes malak
రిప్లయితొలగించండిఈరోజు లంచ్ టైమ్‌లో ఇదే విషయం డిస్కషన్‌కి వచ్చింది. ఒక అబ్బాయి బే ఏరియాలో కొంతమంది ఇస్కాన్ పధ్ధతులని బాగా ఫాలో అవుతారని, ప్రచారం చేస్తారనీ, భగవద్గీత పంచుతారని చెప్పుకుంటూ వచ్చాడు. ఎంతైనా ఇస్కాన్ వాళ్ళు హిందూ ధర్మాన్ని బాగా ప్రచారం చేస్తారు అని చెప్తుంటే నాకు నవ్వొచ్చింది. అసలలా పుస్తకాలు పంచి ప్రచారం చేయించుకోవటం హిందూ ధర్మమే కాదు. హిందూ ధర్మంలో ఎక్కడా నీ ధర్మాన్ని అవతలివాళ్ళ మీద రుద్దూ, ప్రచారం చెయ్యీ అని ఎక్కడా, ఎక్కడా రాసి లేదు. ఏ వేదమూ ఆ మాట చెప్పలేదు. ఎక్కడా హిందూ ధర్మ ప్రచారకులు కనిపించరు. ఎందుకంటే ప్రాచీనమైన హిందూ ధర్మానికి ఎంతమంది జనాలు ఫాలో అవుతున్నారన్న విషయం పట్టదు. హిందూ ధర్మం ఏది మంచి ఎందుకు మంచి ఏది చెడు ఎందుకు చెడు చెప్తుంది. మానవుడు ఉన్నతంగా జీవిచగలిగే పధ్ధతి సూచిస్తుంది. అంతే కానీ నన్ను చేరకపోతే నీకధోగతి అనో, మిగతా దేవుళ్ళందరూ సున్నా నేనొక్కటే మిన్న అనో చెప్పదు. తన సిధ్ధాంతాలని నమ్మితే, ఇష్టం ఉంటే ఆచరించమంటుంది కానీ బలవంతాన రుద్దదు. బలవంతంగా తనని నమ్మేలా చెయ్యమని ఎప్పుడూ చెప్పదు. అలాంటిది ఇస్కాన్ ఫాలోయర్లు హిందూ మత ప్రచారానికి ఊళ్ళో అందరికీ భగవద్గీతని పంచుతున్నారంటే అక్కడే అర్థం అవుతోంది కదా. వారికెంతగా హిందూ ధర్మం తెలుసో.
రిప్లయితొలగించండిఇక బాన్ చేసే విషయానికి వస్తే ఇస్కాన్ వారి గీతని బాన్ చేశారా లేదా అన్నది అంత పట్టించుకోదగ్గ విషయం కాదేమో. కానీ, డెఫినెట్‌గా ప్రింట్ అయ్యే ప్రతి చోటా ఇస్కాన్ వారి గీత అని సపెరేట్ ఔట్ చేస్తే బావుంటుంది. ఎవరికీ కంఫ్యూషన్ ఉండదు.
వీకెండూ
రిప్లయితొలగించండినీ యెదవ సోదాపి గోడమీద పిల్లి వాటం లేకుండా ఈ ప్రశ్నకైనా సమాధానం చెప్పు. దెవాలయాల నిరవహణలో ఒకో మతానికీ ఒకోవిధంగా ఉన్న ఇప్పటి పద్ధతిని సమర్ధిస్తున్నావా వ్యతిరేకిస్తున్నావా?
అఙాతా,
రిప్లయితొలగించండిమీకు కనబడలేదేమో గానీ, నేను స్పష్టంగానే చెప్పాను. మళ్ళొక్కసారి చూసుకోండి. కొంచెం బాష సరిగ్గా వాడండి. మీకు మామూలు భాషలో చెప్పేవి అర్థం కావనుకుంటా.
మీతొనూ మీ సలహాలతోనూ బారద్దేశానికి ఒరిగేదేమన్నా ఉందా క్రూకెండూ సారీ వీకెండూ
రిప్లయితొలగించండి##ఆ చుట్ట పక్కల ప్రజల అభ్యున్నతి కోసం రాజులో, దాతలో వాటికి కట్టబెట్టినవే అనే విషయం గుర్తుంచు కోవాలి. ##
రిప్లయితొలగించండిNO, Mr.WeekendPolitician.
They didn't donate to Temples for sake of people that was for their own spirutual satisfaction though at present they are accesseble even to ordinary people.
Some kings constructed bridges, dams, lakes, roads with trees on either sides, wells etc. ex. Asoka, Sher Sha, Sri Krishna Devevaraya
Govt shouldn't have access to temple funds. However, Govt should monitor for right use of the funds. Temple trust should be accountable to the govt. They should not appoint their own buffoon politicians as chairmans etc, like they do for APSRTC, APPSC. Local MLA, MP can be ordinary members of the trust.
అబ్బే నాకర్దంకాదులే నీలాంటి ముష్టి యెదవలు వాడే బాష వినీ వినీ అలవాటయిపోయింది. సరే మళ్ళీ చెప్పు గోడమీదపిల్లి వాటం లేకుండా. స్పష్టంగా చెప్పినోడివైతే మళ్ళా చెప్పడానికి భయం ఎందుకు?
రిప్లయితొలగించండివీకెండు గారికి తిరుపతిలో మిగిలిన రాయలవారి ఆభరణాలు కాంగ్రెసోళ్ళు ఎప్పుడు నొక్కేస్తారా అని ఆదుర్దాగా వుంది. అందుకే ఎంత లౌకిక రాజ్యం అయినా, బాగా రాబడి వున్న దేవుళ్ళమీదనుంచి దృష్టి మరల్చుకోలేక పోతున్నారు.
రిప్లయితొలగించండిఈ వీకెండ్, విట్ రియల్, వాండరర్, బాలన్స్ డ్ గా కనపడుతారు బయటకి, ఈజీ కదా అలా ఉండటం, రాయటం. అది మిగతా వాళ్ళకి చేతకాదని ఫీల్ అయిపోతుంటారు ఈ వీకెండ్స్, మినర్వాస్, మిర్చీస్, సంజూస్ ఆఫ్ ద బ్లాగ్స్. అందుకే వాళ్ళు చాలా పక్షపాతంగా మాట్లాడుతారు, మాలా మెచ్యూరిటీతో మాట్లాట్టం మేధావితనం, ఈ మాత్రం తెలివి కూడా లేదేంట్రా బాబూ బ్లాగుల్లో ఉండే మెజారిటీ జనాలకి. అయ్యో దేవుడా, అజ్ణానంతో, ఆవేశంతో, వెర్రితో ప్రపంచాన్ని చెడగొడుతున్న ఈ జనాలకి మా హితబోధనలు చెవిన వేసి బాగుపరచండయ్యా వీళ్ళని అన్నట్లుగా ఉంటాయి వీళ్ళ రాతలు.
రిప్లయితొలగించండిపై అజ్ఞాత
రిప్లయితొలగించండివీకెండూ వాండరరూ విట్ రియలూ ఒకడే. అసలు రూపం బయటపడుతుందేమో అని అడే దొంగ నాటకాలు అవి.
@అజ్ఞాత,
రిప్లయితొలగించండిLoL :))
Looks like you are extremely afraid of the possibility that my comments and writings might actually make you and the likes of you to see some sense!!
If that is your worry then, I admit that you have a point there ;)Keep worrying..
మీ లాంటి వాళ్ళ అనవసర దూషణల కి బెదిరి ఎందుకులే అని మౌనంగా ఉండే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. When you are dealing with me..take a note of the following items..
1. You can not make me speak rubbish like the one you wrote here
2. You can not influence my thoughts or my expression of them
I pity folks like you and more than you.. I pity folks who get cowed down by the likes of you..
నీకంత లేదు పిచ్చి కన్నా. నీ దొంగ ఐడీల సంగతి నాకు తెలియదనుకున్నావా? నీ సంగతి ఈ బ్లాగు ఓనర్ కి తెలియకపోయినా లేక తెలియనట్టు నటిస్తున్నా నాకు బాగా తెలుసు. అన్నట్టు మీరిద్దరూ పూర్వాశ్రమంలో కొలీగ్స్ అని గుస గుస గుస.
రిప్లయితొలగించండి1.I can not make you speak rubbish in this id but what about your fake ids? :-)
2.I can not influence your thoughts. Yes especially when you have multiple tongues.
విషయానికొస్తే
You still have not answered the question.
మలక్కూ విన్నావా? భగవద్గీతపై అదేలే నీ భాషలో ఇస్కాన్ గీతపై నిషేధం లేదంట.
రిప్లయితొలగించండి"I pity folks like you and more than you.. I pity folks who get cowed down by the likes of you.."
రిప్లయితొలగించండి__________
ha ha ha great job weekend, keep pitying.
"Looks like you are extremely afraid of the possibility that my comments and writings might actually make you and the likes of you to see some sense!!"
___________
అయ్ బాబోయ్...ఏటయిపోతున్నాదేటి నాకు, గ్నానమొచ్చేత్తోందిరా బాబో, మత్తొచ్చొత్తేంది ఒళ్ళంతా. వామ్మో వాయ్యో తమర్తలెనకాల ఉండే ఆ ఎలుగుచక్రాన్ని చూత్తూంటే మాక్కళ్ళు బైర్లు కమ్మెత్తున్నాయిరా బాబో. అచ్చేసాడొచ్చేసాడు మహాజ్ణాని. ఇహ అగ్నానమంతా మటుమాయం ఈ పెపంచకంలో అందర్కీ తమరంత జ్ణానమిప్పించాల దొరా మీరు.
పూజలు సేయుడీ మునికి.
హ హ హ హ హ
:)) @అజ్ఞాత 28 డిసెంబర్ 2011 1:00 సా
రిప్లయితొలగించండి@అజ్ఞాత 28 డిసెంబర్ 2011 1:00 సా
రిప్లయితొలగించండిlol :)))
Votla kosam Tirupati ki Chairman Ga Oka pasterno,Mullano chestundi Sonia Govt....ayina vimarshinche :erralu: votlu vestaru..."khhrma"....iha swayam pratipatti kalla....kani ee blog lo manchi vishayalu chala telustunnayi..keep it up.
రిప్లయితొలగించండి