12, అక్టోబర్ 2017, గురువారం

సోనూ!!

సోనూ ఇంట్లో టివీ ఉండు.. ఉండు..
టీవీలో వచ్చు గుండు.. గుండు..
గుండు అమ్మేది బంగారంగా .. గుండర్గా
గుండూ నీకు క్లైంట్లపై భరోసా లేదా? లేదా??

కపిత్వం!

నన్ను నేనే మఱచాను
ఎవరికీ అందనంత ఎత్తులో...
గాల్లో తేలుతున్న క్షణంలో ...
గమ్యం చేరాలన్న తపనలో ...
.
నా కళ్ళు గమ్యాన్నే చూస్తున్నాయి
దాన్నందుకోలేనేమొనన్న భయంతో...
అందుకోకున్న మరణం తథ్యమనే తలపుతో...
ప్రపంచాన్ని పట్టించుకోని వైఖరితో...
నేలనసలు తాకకూడదన్న పట్టుదలతో...
.
.
.
ఒక భవనం పన్నెండో అంతస్తునుండి
మరొక భవనం పదకొండో అంతస్తుమీదకు
దూకుతున్న నేను  వచ్చిపడ్డాను...
ఉన్నట్టుండి మళ్ళీ ఈ లోకంలోకి...
 గ్రహించాను నేనెవర్నో...
"అమ్మో! కోతి!!" అనే చిన్నపిల్లల అరుపులతో!!
.

9, జనవరి 2015, శుక్రవారం

మాలికలో Wordpress ఫీడ్ల ఇబ్బందులు!

మాలికలో Wordpress బ్లాగుల ఫీడ్లకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదురవుతుండడం వల్ల కొన్ని బ్లాగులు కనబడటంలేదన్న విషయం మా దృష్టికి వచ్చింది. దీనికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం. ఈ లోగా బ్లాగర్లు https డిసేబుల్ చేస్తే ఫలితం కనిపించవచ్చు. We apologize for the inconvenience caused.

5, డిసెంబర్ 2013, గురువారం

మాలిక పత్రిక డిసెంబర్ 2013 సంచిక విడుదల

మాలిక పత్రిక ఈ సంవత్సరంలో   డిసెంబర్ 2013 సంచిక విడుదల అయింది. ఈ సంచికలో మీకు నచ్చే, మీరు మెచ్చే సీరియళ్లు, పుస్తక సమీక్షలు, కవితలు చోటు చేసుకున్నాయి. జనవరినుండి మరిన్ని కొత్త శీర్షికలు మిమ్మల్ని అలరించగలవు.
మీ రచనలు పంపవలసిన చిరునామా: editor@maalika.org

 మాలిక పత్రిక ఈ  నెల సంచికలోని విశేషాలు:


0.  పుస్తకాల పండగ గురింఛిన సంపాదకీయం
పుస్తకం హస్తభూషణం

1. బ్నింగారు రచించగా ఝాన్సీ గళంలో ఈ సారి పెళ్లానికి ప్రేమలేఖ గురించి ఏం చెప్తున్నారో మరి
పెళ్లానికి ప్రేమలేఖ

2.  పసుపులేటి గీతగారు అద్దం గురించి చెప్పే ముచ్చట్లు
అద్దం

3. ఈసారి మోహనరావుగారు మధుశాల గురించి చెప్తున్నారు.
మధిర - మధుశాల

4. శ్రీమతి అంగులూరి అంజనీదేవిగారి సీరియల్ లో దేదీప్య, అభిరాంల మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారిందా..
మౌనరాగం - 2

5. అబ్దుల వాహెద్ గారు ఈసారి కూడా షకీల్ బదాయూనీ గజల్స్ వివరిస్తున్నారు.
గజల్స్ - షకీల్ బదాయూనీ

6. మంధా భానుమతిగారు చారిత్రక సాహిత్య కధలలో ఈసారి అఫురూపమైన స్నేహం గురించి చెప్తున్నారు.
తెలుగు వెలుగుల స్నేహం

7.  గాసిప్స్ కాదు ఉపయుక్తమైన Gausips అంటూ స్త్రీలలోని గర్భాశయ సమస్యలగురించి వివరాలు అందిస్తున్నారు డా.గౌతమి.
గర్భాశయపు సమస్యలు -1

8. ప్రముఖ రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మిగారి కొత్త పుస్తకం గురించి జి.ఎస్.లక్ష్మిగారు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్తున్నారు...
కొంచెం ఇష్టం - కొంచెం కష్టం

9. మీకు కవితలు తెలుసుకదా. పెద్ద కవితలు, చిన్న కవితలు కాక ఏకవాక్య కవితలను రచించి వాటిని ఒక పుస్తకంలా అచ్చువేసారు. మరి ఆ పుస్తకం గురించి జగద్ధాత్రి ఏం చేప్తున్నారో చూడండి..
ఏకవాక్యం రసాత్మకం

10.  మీకు హైదరాబాదు చుట్టుపక్కల ఎన్ని సందర్శనీయమైన ఆలయాలు ఉన్నాయో తెలుసా. ఒక్కరోజులోనే ఆ ఆలయాలకు వెళ్లి రావొచ్చు కూడా . నమ్మట్లేదా. ఐతే ఈ పుస్తకం గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే..
యాత్రాదీపిక  

11. సంగీత దర్శకుడు సురేష్ మాధవపెద్దిగారు ఈసారి సరిగమలు-గలగలలులో పెండ్యాల నాగేశ్వరరావుగారి గురించి తన అనుభవాల గురించి మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.
సరిగమలు - గలగలలు 3 - పెండ్యాల

12. ప్రధానమంత్రిమీద హత్యాయత్నం జరగబోతుందని చెప్పడానికి దిశ ఎంతగా ప్రయత్నించిన జరగవలసిన దారుణం జరిగిపోయింది.
సంభవం - 7

13. పాకిస్తాన్ లో చిక్కుపడ్డ చైతన్య, ప్రనూష మొదలైనవారు క్షేమంగా తిరిగివచ్చారా? అక్కడే సైన్యం చేతిలో హతమయ్యారా? ఈ సీరియల్ చివరిభాగంలో చదవండి..
ఆతడే ఆమె సైన్యం - 6

1, అక్టోబర్ 2013, మంగళవారం

మాలిక పత్రిక అక్టోబర్ సంచిక విడుదల


విభిన్నమైన వ్యాసాలు, కధలు, సీరియళ్లతో మిమ్మల్ని అలరిస్తున్న మాలిక పత్రిక అక్టోబర్ సంచిక విడుదల.. ఈ నెలలో ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు శ్రీ మాధవపెద్ది సురేష్ గారు  " సరిగమల గలగలలు"  పేరిట తన సంగీత ప్రస్ధానంలోని విశిష్ట వ్యక్తుల  గురించి తెలియజేస్తున్నారు .. మరో కవయిత్రి శ్రీమతి రేణుక అయోలగారు "లేఖాంతరంగం " పేరిట వివిధ సామాజిక అంశాలను లేఖారూపంలో  చర్చిస్తున్నారు.

మాలిక పత్రిక తరఫున నిర్వహిస్తున్న పదచంద్రిక విషయంలో చాలా నిరుత్సాహంగా ఉంది. రాను రాను ఈ పదచంద్రిక పూరించేవారు తగ్గిపోతున్నారు.  ఈ ప్రహేళిక రూపురేఖలు మార్చాలా? మరీ కష్టంగా ఉందా? అసలు కారణమేమిటో తెలియడంలేదు. అందుకే గతనెలలో స్పందన లేకుండా ఉన్న జె.కె.మోహనరావుగారు కూర్చిన పదచంద్రికనే మళ్లీ ఇవ్వడం జరుగుతుంది.

మాలిక పత్రిక తరఫున ఇచ్చే కినిగె బహుమతి ఈసారి ఉత్తమ బ్లాగు టపా వనజగారు రాసిన ఈ టపాకు ఇవ్వడమైంది. ఎప్పుడూ సీరియస్ పోస్టులు రాసే వనజగారు మనందరం ఎదుర్కునే మార్కెటింగ్ మాయాజాలం గురించి రాసారు.
జగ్గయ్యపేట రంగురాళ్లు చాలమ్మా...

ఇక తెలుగు వికీపీడియాకు సంబంధించి ఎటువంటి లాభాపేక్ష, స్వార్ధం లేకుండా కొంత సమయం వెచ్చించి విలువైన సమాచారాన్ని ఇతరులకోసం వికీలో పొందుపరుస్తున్న వికీపీడియన్లకు చిరు సత్కారం ఇవ్వాలనుకుంటున్నాంః  ఈసారి ఈ బహుమతి రాజశేఖర్ గారికి ఇవ్వబడుతుంది.

వనజగారికి, రాజశేఖర్ గారికి చెరో రూ.116 ల కినిగె గిఫ్ట్ కూపన్ ఇవ్వబడుతుంది..దీనితో ప్రింట్ లేదా ఈ పుస్తకాలను కినిగెనుండి కొనుగోలు చేయవచ్చు.

మీ రచనలు  పంపవలసిన చిరునామా: editor@maalika.org
అక్టోబర్ సంచికలోని విశేషాలు:

0.   సంపాదకీయం
1.  పారశీక చందస్సు - 5
2.  సరిగమల గలగలలు - 1
3.  జీవితపధ సోపాన పుటలు (పలక - పెన్సిల్)
4.  లేఖాంతరంగం - 1
5.  పంట పండింది 
6.  అనగనగా బ్నిం కధలు - 3
7.  సంభవం - 5
8.  పోరుగీతమై విప్లవిస్తా
9.  రఘువంశం - 3
10. చారిత్రక సాహిత్య కధామాలిక
11. ఇంటర్యూ - ఇన్నర్ వ్యూ
12. నల్లమోతు శ్రీధర్ వీడియోలు
13.  మాలిక పదచంద్రిక - 13

13, సెప్టెంబర్ 2013, శుక్రవారం

అత్యాచారం చేసి ఉరికంబం ఎక్కుతారా లేక అత్యాచారం చేయబడిన అమ్మాయిని చంపేసి కొన్నాళ్ళు జైల్లో ఉండి బయటకొచ్చేస్తారా?

అత్యాచారం చేసి ఉరికంబం ఎక్కుతారా లేక అత్యాచారం చేయబడిన అమ్మాయిని చంపేసి కొన్నాళ్ళు జైల్లో ఉండి బయటకొచ్చేస్తారా?

హత్యానేరానికి సంబంధించిన చట్టాలని సవరించకుండా అత్యాచారానికి ఉరిశిక్ష విధిస్తే జరగబోయేది ఊహించటం పెద్ద కష్టమేమీ కాదేమో?

అత్యాచారం మిగిల్చే trauma జీవితమంతా ఉంటుంది నిజమే, కానీ అసలు జీవితమే మిగలకపోతే?

ప్రాణంకంటే మానం ముఖ్యమనే ప్రవచనాలని వల్లిస్తూ అత్యాచారానికి గురైన సినీమా హీరోగారి చెల్లెలు అత్మహత్య చేసుకోవటం సినీమాలకే పరిమితమయితే మంచిదేమో?

10, సెప్టెంబర్ 2013, మంగళవారం

తెలుగువాడి ఆత్మగౌరవం Vs. తెలంగాణా ఆత్మ గౌరవం

--- A repost... original dated back to 2010 .. but still relevant  ...

ఈ మధ్య కాలంలో నేను విన్న అతి పెద్ద అబధ్ధం - "మా పోరాటం హైదరాబాద్ కోసం కాదు!" .. ఇది రెండు పార్టీలూ చెప్తున్న మాటే .. "తెలుగువాడి ఆత్మగౌరవం", "తెలంగాణా ఆత్మ గౌరవం" ముసుగేసుకుని ...

ఒకవేళ సమైక్య వాదులకి హైదరాబాద్ అక్కరలేకపోతే ఉద్యమమంతా హైదరబాద్ మీదే ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? ఒక్కరైనా "జరిగిందేదో జరిగింది... ఇప్పుడయినా తెలంగాణాకి జరిగిన అన్యాయానికి ప్రాయశ్చితం చేద్దాం" అన్నారా? అబ్బే!! ఎందుకంటారూ? "మిగిలినవాళ్ళు ఎటుపోతే మాకేం? మా హైదరాబాద్ మాకొస్తే చాలు" - అంతేనా?

ఇక వేర్పాటువాదుల సంగతి - నిజంగానే తెలంగాణా కావాల్సినవారైతే "సరే, ఉన్న చిక్కంతా హైదరాబాదే కదా. దానిని కొన్నాళ్ళు విడిగా పెడదాం - మిగిలిన జిల్లాలని కలిపి వెంటనే తెలంగాణా ఇవ్వండి - హైదరాబాద్ తేలేదాకా విడిగా పెడదాం" అనుండే వారు, సమైక్యవాదులు అందరూకాకపోయినా చాలామంది ఒప్పేసుకునేవారు - కానీ అలా అన్నారా? లేదే! "హైదరాబాద్ లేని తెలంగాణా మాకొద్దు" అనడంలోనే తెలుస్తోంది తెలంగాణామీద ఎంత ప్రేముందో. మిగిలిన జిల్లాలు జిల్లాలు కావా? వాటిట్లో మనుషులు ఉండరా? అదీ కాక మహరాష్ట్రకీ, కర్నాటక కి జిల్లాలని మొత్తం వదులుకోలేదా? ఇది అంతకన్నా ఘోరమేమీ కాదే?
స్వగతం: రెండు గుంపులనీ కెలికి రాళ్ళేసా ... ఇద్దరూ కలిపి వాయిస్తారేమో? Let them :P

5, సెప్టెంబర్ 2013, గురువారం

మాలిక మాసపత్రిక భాద్రపదమాస సంచిక విడుదల
వినూత్నమైన వ్యాసాలతో, సీరియల్స్ తో మాలిక పత్రిక  భాద్రపద మాస సంచిక విడుదలైంది.
గతనెలలో ప్రకటించిన ఉత్తమ బ్లాగు, వికి టపాలకు రూ. 116 విలువైన కినిగె గిఫ్ట్ కూపన్ ఇవ్వబడుతుంది. ఈ బహుమతులకు మీరు కూడా మీకు నచ్చిన టపాలను నామినేట్ చేయవచ్చు. మీరు రాసినదైనా సరే ...

మీ ఉత్తరాలను, రచనలను పంపవలసిన చిరునామా:  editor@maalika.org


ఉత్తమ బ్లాగు టపా:  ' ఔను! నేను బ్లాగ్ రాయడం మానేశాను'  ( పనిలేక)
ఈ టపాలో డాక్టర్ గారు చెప్పిన అనుభవాలు చాలామందికి కలిగి ఉండవచ్చు. మనమో పెద్ద బ్లాగర్. చాలా పేరుంది. బాగా రాస్తారని తెలుసు కాని అసలు బ్లాగు అంటే ఏంటి? దానివల్ల ఎంత రాబడి ఉంటుంది మొదలైన ప్రశ్నలు వేస్తుంటారు చాలామంది. అందుకే  ఇది ఈ నెల కోసం ఎంపిక చేయబడింది..

ఉత్తమ వికి వ్యాసం :  తెలుగు వికీపీడియాలో గతనెల అంటే ఆగస్టులో కొత్త వ్యాసాలేమున్నాయి అని చూస్తే ఎన్నో గ్రామాలగురించి కొత్త వ్యాసాలు ఉన్నాయి.  పైసా ఆదాయాన్నివ్వని ఈ పనిని ఒక బాధ్యతగా నిర్వహిస్తున్న YVS Reddyగారికి బహుమతి ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది.. మీరు కూడా మీ ఊరిగురించిన వింతలు విశేషాలు వికిలో చేర్చండి మరి..


మాలిక పదచంద్రిక - 11 .. ఈ ప్రహేళికకు ఒక్క సమాధానం కూడా రానందుకు చింతిస్తున్నాము. మరీ అంత కష్టంగా ఉందా ఈ పదచంద్రిక?? కాని ఈసారి పదచంద్రిక కాస్త సంగీతభరితంగా, రసవత్తరంగా ఉంటుంది..

ఇక ఈ నెలలోని వ్యాసాలు ఇలా ఉన్నాయి...

 0. పట్టిక
 1. సంపాదకీయం: మనమేం చేయగలం?
 2. అతడే ఆమె సైన్యం - 4 - యండమూరి వీరేంద్రనాధ్
 3. సంభవం - 4 - సూర్యదేవర రామ్మోహనరావు
 4.  కినిగె టాప్ టెన్ - ఆగస్టు 2013
 5. జయదేవ్ గీతపదులు - 2  - జయదేవ్
 6.  అక్షర పరిమళాల మమైకం -  శైలజామిత్ర
 7. బియాండ్ కాఫీ - కత్తి మహేష్ కుమార్
 8. అనగనగా బ్నిం కధలు -2 - బ్నిం
 9. వినిపించని రాగాలే .. పారశీక చందస్సు - 4
10. మాలిక పదచంద్రిక - 12 - సత్యసాయి కొవ్వలి
11. పంపనాచార్యుడు - చారిత్రక సాహిత్య కధామాలిక - 5
12. సాంబే పరబ్రహ్మణి - రసజ్ఞ
13. కాళిదాసు కవితా సౌందర్యం - అనిల్  మాడుగుల

31, జులై 2013, బుధవారం

మాలిక పత్రిక ఆషాడమాస సంచిక విడుదల
విభిన్నమైన, సరికొత్త అంశాలతో మాలిక పత్రిక ఆషాడమాస సంచిక విడుదల చేస్తున్నాం. ఇంతకుముందు ప్రారంభమైన సీరియల్స్ తో పాటు ఈ నెలనుండి ప్రముఖ రచయిత బ్నిం మూర్తిగారి  కధలను విందాం.. అవునండి చదవడం కాదు విందాం.. అలాగే ప్రముఖ కార్టూనిస్ట్ జయదేవ్ గారి గీతపదులు కూడా ఈ నెలనుండి మొదలవుతున్నాయి.. కినిగె నుండి ప్రతీనెల టాప్ టెన్ పుస్తకాల గురింఛిన వివరాలు అందించబడతాయి..  దీనివలన కొత్త పుస్తకాల గురించిన సమాచారం తెలియవస్తుంది. కొనాలనుకున్నవాళ్లు కొనుక్కోవచ్చు.


ఇక మాలిక పత్రిక తరఫున మరో ముఖ్య ప్రకటన..
తెలుగు బ్లాగులు, వికీపీడియాలో రాసేవారిని ప్రోత్సహించడానికి మాలిక పత్రిక ప్రతీనెల ఉత్తమ బ్లాగు టపా, ఉత్తమ వికీ టపాను ఎంపిక చేసి కినిగె వారి 116/- రూపాయిల గిఫ్ట్ కూపన్ బహుమతిగా అందిస్తుంది. ఈ కూపన్ సాయంతో మీరు కినిగెనుండి ఈబుక్ లేదా ప్రింట్ బుక్ కొనుక్కోవచ్చు..


మాలిక పత్రికకు రచనలు  ఈ చిరునామాకు పంపాలి.. editor@maalika.orgఈ సంచికలోని విశేష వ్యాసాల వివరాలు:

0. సంపాదకీయం: స్నేహం ఒక వరం
1. కినిగె టాప్ టెన్
2. విదేశీకోడలు 
3. నల్లమోతు శ్రీధర్ వీడియోలు
4. రఘువంశము - 2
5. అనగనగా బ్నిం కధలు - 1
6. మాలిక పదచంద్రిక - 11
7. పారసీక చందస్సు - 3
8. జయదేవ్ గీతపదులు - 1
9. సంభవం - 3
10. అతడే ఆమె సైన్యం - 3
11. రక్షాబంధనం
12. జీవిత పాఠశాలలో నిరంతర విద్యార్ధి
13. చారిత్రక సాహిత్య కధామాలిక - 4