3, మార్చి 2012, శనివారం

ఇప్పటి వైమానిక శాస్త్రం వ్రాసింది భరద్వాజుడేనా?







ఈ మధ్య బ్లాగుల్లో వైమానిక శాస్త్రం గురించి తెగ కొట్టుకున్నారు కదా. దానిగురించి నాకూ చందమామ రాజుగారికీ ఆఫ్లైన్లో చిన్నపాటి చర్చ జరిగింది. నాకు తెలిసింది నన్ను వ్రాయమని ఆయనకోరారు కానీ ఇప్పటిదాకా వీలవలేదు. ఇప్పుడుకూడా వ్రాయకపోతే కొడతారేమోనన్న భయంతో వ్రాసేస్తున్నా.

ఈ మధ్యకాలంలో ఈ వైమానిక శాస్త్రం గురించి చాలా చర్చే జరిగింది. దీనిగురించి నేను మొదట విన్నది 1991 లో. అప్పుడు నా మేస్టర్స్ చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్ రోబాటిక్స్ లో తీసుకున్నా. విషయం పెద్దేమీలేదనుకోండి - ప్రమాదకరమైన వాతావరణంలో, కదిలే ప్రేలుడు పదార్ధాల మధ్యనుండి ఒక రోబాట్ గమనాన్ని నిర్దేశించటం. అంటే ఇప్పుడుండే వీడియో గేంస్ లో మన వైపు వచ్చే రాళ్ళని తప్పించుకుని గమ్యం చేరటం లాంటిదన్నమాట. అయితె ఇందులో నా ప్రాజెక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే సంబంధించింది. కనుక డైనమిక్స్ గురించి వెరే ఆల్గోరిథంస్ ని వెతుక్కోవాల్సి వచ్చింది. ఆక్రమంలో నేలమీదనుండి పైకి లేచే అవకాశాన్నికూడా పరిశీలించవలసి వచ్చింది.

మా డిపార్ట్మెంట్ హెడ్ (మా కోర్స్ మొత్తం డీ.ఆర్.డీ.ఓ. ప్రాయోజితం)  బెంగళూరు ADE లో Scientist E. అవి మన ప్రతిష్ఠాత్మకమైన తేజస్ (ఎల్.సీ.యే) ప్రాజెక్ట్  ప్రారంభదినాలు. నేనాయనతో ఈ విషయం మీద చర్చించినప్పుడు "లైబ్రరీలో భరద్వాజుని వైమానిక శాస్త్రం ఉంది, ఒకసారి వెళ్ళి చదువు. మన ఎల్.సీ.ఏ. లో కూడా దానిలో చెప్పిన సిద్ధాంతాలని వాడుతున్నారు" అన్నారు. అదే నాకు అ అపుస్తకంతో పరిచయం. కొన్ని పేజీలు తిప్పి పెద్దగా ఉపయోగం లేదనిపించి వదిలేశాను.

ఆ తరవాత సెంట్రల్ యూనివర్సిటిలో అదే సబ్జెక్ట్ ఒకసారి పరిశీలించినప్పుడు మళ్ళీ ఆ ప్రసక్తి వచ్చింది - చదవడం మొదలుపెట్టా. అయితే దానిగురించి, దాని ప్రామాణికత గురించి చాలామంది అనుమానాలు వ్యక్తం చెయ్యటం మొదలుపెట్టారు.కొన్ని ప్రయోగాలు ఫెయిల్ అయ్యాయని కూడా చెప్పారు. ఈలోగా నేను నా PhD రీసెర్చ్ ఏరియా నాలెడ్జ్ బేస్డ్ సాఫ్ట్వేర్ రివర్స్ ఎంజినీరింగ్ కి మార్హటంతో ఆ విషయం మఱుగునపడిపోయింది.

మళ్ళీ ఎన్నాళ్ళకో అప్రయత్నంగా ఆ పుస్తకం గురించి ఎక్కడో చదవటం తటస్థించింది. అప్పుడు బయటపడ్డ విషయాలు నాను కొంచం షాక్ కి గురించేశాయి ..... ముందుగా నా దృష్టినాకర్షించింది అసలు ఈ శాస్త్రం ఎలా బయటపడింది అనే విషయం. శాస్త్రం, పుస్తకం ఆహా ఓహో అంటూ గెంతులేశానేగానీ అసలది వ్రాసింది ఎవరన్న సంగతి నా మట్టిబుఱ్ఱకి తట్టనందుకు నాలుక్కఱచుకున్నా. ఈ మధ్యే పూర్తిగా చదివిన ఒక పరిశోధనా పత్రంతో నా అనుమానాలు చాలా వరకూ పటాపంచలయిపోయాయి.


సరే ఇక అసలు విషయంలోకి వస్తే. ఈ వైమానిక శాస్త్రం బయటపడింది 1900 తరవాత - అదికూడా ఎలా అంటే సుబ్బరాయ శాస్త్రి అనే ఆయనకి మహర్షి భరద్వాజుడు కలలోనో లేక టెలీపతీ ద్వారానో బోధించాడని! దాని గురించి మరిన్ని విషయాలు సేకరించటం మొదలుపెట్టా.


ఈ సుబ్బరాయశాస్త్రి అనేఆయన కర్ణాటకలోని ఆనేకాల్ అనే ఊరిలో నివశించిన ఒక తాంత్రికుడు. తనకి తోచినప్పుడల్లా ఆశువుగా శ్లోకాలు చెప్పేవాడు. ఆ క్రమంలో వెంకటాచలశర్మ అనే ఆయనకి తనకు భరద్వాజుడు చెప్పాడని ఈ వైమానిక శాస్త్ర స్లోకాలను ఉపదేశించాడు. ఆ వెంకటాచశర్మ వ్రాసిన ప్రతులు బరోడాలోని ఒక లైబ్రరీలో ఉన్నట్టుండి ప్రత్యక్ష్యమయ్యాయి. వాటీని జోస్యర్ అనే ఆయన 1959 లో ఆంగ్లంలోకి అనువదించాడు. ఆ తరవాత అది వేరేవారిద్వారా 8 అంశాలున్న పుస్తకంగా బయటకొచ్చింది. ఆ పుస్తకంలో కనబడే బొమ్మలు గీసింది ఎల్లప్ప అనే ఆయన.  


దీనికి పురిట్లోనే సంధికొట్టింది. భరద్వాజుడు శాస్త్రిగారికి కలలో కనిపించి చెప్పటం, దానిని ఆధారంగా చేసుకుని జానాలు పుస్తాకాలు వ్రాసెయ్యటం కొంతమందికి మింగుడిపడలేదు.

1974 లో ఐ.ఐ.ఎస్.సీ కొ సంబంధించిన కొందరు పరిశొధకులు ఈ పుస్తకాని క్షుణ్ణంగా పరిశీలించి పరిశోధించారు.  ఆ పేపర్ చదవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.


వారందించిన వివరాలిలా ఉన్నాయి:


1. As already stated, the authorship of the work has been attributed to Maharshi Bharadwaja. Whether this Maharshi is the same as one of the seven seers (Saptarshis) is by no means substantiated. Thus the question of authorship remains as yet unanswered


అంటే ఇది భరద్వాజుడు వ్రాసింది కాదనేగా? అన్నట్టు ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే ప్రతీదానికి ఆధారాలడిగేవారు అసలు ఇది భరద్వాజుడు వ్రాసిందా కాదా అని తెలుసుకోకుండానే "వేదాల్లో తప్పులున్నాయోచ్" అని టాం టాం చెయ్యటం. అలాగే మన వేదోఫాసకులు కూడ ఎవరు వ్రాశారన్నది తెలుసుకోకుండా "ఇదిగో వేదాలలో సైన్సుకి నిరూపణ" అని ఎగరటం.

(అసలీ "భరద్వాజ" అనేదే పెద్ద తేడా పేరని నా ఉద్దేశ్యం. ఏమంటారు?)

2. The kind of Sanskrit used in the text may indicate whether or not the text is of Vedic origin. The text contains Shlokas set to Anushtrup metre and its language is quite simple and modern. Again, in its  introduction, BVS mentions that a few words did have a structure similar to that of the Vedic Sanskrit. The number of such words being very small, and their usage being incidental, it appears appropriate to conclude that the Sanskrit used in the text is modern.



దీనర్థం మన విశాఖపట్నం భాషలో చెప్పాలంటే అతి పెద్ద "కిట్టింపు" జరిగిందనేగా? అయితే వీరు ఒక మాట మాత్రం చెబుతున్నారు. దొరిన వ్రాత ప్రతులు వేదకాలం నాటివి కావని అందరూ ఒప్పుకున్నారనీ, ఆ విషయానికి సంబంధించి ఫ్రాడ్ ఏదీ లేదనీనూ.

3. Another significant point is the almost complete absence of any mention of use of aircraft in the innumerable Sanskrit texts of the post‐Vedic age. One text, namely “Samarangana Sutradhara”, by Bhoja deals with some description of aircraft, but does not quote any earlier work. What is more, Bhoja states that detailed description of their construction and other features will not be given lest the same be used for evil purpose by people?

4. A few lines have been devoted to the function of wings and tail and they appear to be incorrect ...... It appears that great importance is given to the tail portion for the generation of lift. Also the function of the hinge wings becomes unclear in this context. It may be noted that it is the wings which should contribute to the life of the craft and the tail portion to its controllability.

5. The height and width of the craft, in our opinion, are in such proportion as to put its stability in serious question. There are inconsistencies in the dimensions mentioned in the verses and those given in the
drawings.

శ్లోకాలకీ ఎల్లప్పగారి బొమ్మలకీ తేడాలున్నయంటే, ఎల్లప్పగారు కావాలనే ఆ మార్పులు చేశారనా?

6. There are no statements on the capabilities of this craft ... The author – whoever he be – shows a complete lack of understanding of the dynamics of the flight of heavier‐than‐air craft.

7.  The text and the drawings do not correlate with each other even thematically. The drawings definitely point to a knowledge of modern machinery. This can be explained on the basis of the fact that Shri Ellappa who made the drawings was in a local engineering college and was thus familiar with names and details of some machinery.

టూకీగా చెప్పాలంటే వైమానిక శాస్త్రం అసలు శాస్త్రమేకాదని కొట్టీపారేశారు పై పరిశోధకులు. అది భరద్వాజుడూ వ్రాసినదికాదు అని కూడా చెప్పకనే చెప్పారు. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు మాత్రం అందులో చెప్పబడిన కొన్ని మాత్రం పనిచేశాయని నాతోనే ఒప్పుకున్నారు.  దీన్ని బట్టీ తేలుతోందేమిటంటే భరద్వాజుని పేరుతో ఉన్న వైమానిక శాస్త్రం భరద్వాజుడు వ్రాసినది కాకపోవచ్చనీ, అందులో చాలా విషయాలు అమలుకు నోచుకోవని అయితే కొన్నిటిని అమలు పఱచటానికి మాత్రం అవకాశం ఉందనీనూ!



అయితే ఈ సందర్భంగా తాడేపల్లిగారు శ్రీకృష్ణదేవరాయలు వ్రాసిన వైమానిక శాస్త్రం గురించి ఎక్కడో అన్నారు. భోజుడు వ్రాసిన దానిని గురించి విన్నానుగానీ ఈ ఆంధ్రభోజుడు వ్రాసినదాని గురించి నేనెప్పుడూ వినలేదు. దీనిసంగతి ఆయన్ని అడగాలి. అలాగే భరద్వాజుడు వ్రాసినదానికి అనువాదం కూడా ఉందన్నారు (నేను పైన చర్చించిన అనువాదం కాకపోతేనే). వాటిని గురించి ఆయనను కనుక్కోవాలి.



టూకీగా చెప్పాలంటే ఈ ఫేక్ శాస్త్రాన్ని (ఫేక్ అయితేనే) వదిలిపెట్టి అసలు శాస్త్రం కోసం అన్వేషణ సాగించాల్సిన సమయం ఆసన్నమైంది.











55 కామెంట్‌లు:

  1. Nice Post !

    అసలీ "భరద్వాజ" అనేదే పెద్ద తేడా పేరని నా ఉద్దేశ్యం. ఏమంటారు
    -----------------------------------
    హ హ :))

    రిప్లయితొలగించండి
  2. ఎవరు ఏమి చెప్పినా, ఏ గడ్డపాళ్ళు దేశం కాని దేశం లో లైబ్రరీల్లో కూచుని వ్రాసిన తిక్క మాటలనైనా సరే ప్రామాణికంగా తీసుకుని నెత్తిన పెట్టుకుని పూజించే వాళ్ళు మన దేశంలో ఉన్నారు. వాళ్ళు ఉన్నది కొద్దిమందే కాని, మొత్తం వాళ్ళే అనిపించేంత అల్లరి చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎక్కడి విషయమైనా పరవా లేదు, అది ప్రామాణికమే. భారతీయులు, అది కూడా ముఖ్యంగా హిందూ మత గ్రంధాల్లోనూ, వేదాల్లోనూ ఉన్నాయి అని ఎవరన్నా చూచాయగా చెప్తే చాలు, విరుచుకుపడిపోయి అవన్నీ తీవ్రంగా ఖండించి పారేస్తారు.

    వేదాల్లో కాని, ఇతర హిందూ మత గ్రంధాల్లో కాని ఉన్న విషయాలు అర్ధం చేసుకుని, ఆకళింపు చేసుకునే శక్తి ఇప్పుడు మనకు ఉందనుకుంటున్న భాషా జ్ఞానం కాని, శాస్త్ర జ్ఞానం కాని సరిపొయ్యి, నిజమైన పరిశోధన జరిగితే (అంటే ఏదో "నమ్మకం" అనే ప్రెజ్యుడీస్ కాకుండా లేదా ఇదంతా "హంబగ్" అని నెగెటివ్ గా కూడా కాకుండా) అసలు విషయం ఏమిటి అన్న "జిజ్ఞాస" తో ఆ పరిశోధన జరిగితే, అలా పరిశోధనలు జరిపేవారు ఒకటి రెండు తరాలు మారినాక అక్కడ ఉన్న విషయాలు అవగతం అవ్వటం మొదలవ్వచ్చు అని నా అభిప్రాయం. దురదృష్టవశాన అటువంటి పరిశోధన జరిగే అవకాశానికి మనకి సెక్యులర్ అన్న పదం అడ్డు వస్తున్నది. సెక్యులర్ లో ఇటువంటి పరిశోధనలు చేపట్టకూడదు అనుకోవటం కూడా మూఢ నమ్మకమే కాకపోతే ఈ మధ్య కాలంలో పుట్టిన మూఢ నమ్మకం.

    ఏది ఎమైన మీరు ఒక చిన్నపాటి ప్రయత్నం మొదలు పెట్టారు. దయచేసి కొనసాగించండి. మీరు చదువుకున్న విద్య కూడా మీరు వ్రాసిన విషయ సంబంధంగా అనిపిస్తున్నది. కూలంకషంగా విషయాలని విశదపరచటానికి ప్రయత్నించండి, అందరికీ ఉపయోగపడుతుంది. ఈ ప్రయత్నం చేస్తున్నందుకు, అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. దేనినీ హేళన చేసి మాట్లాడవలసిన అవసరం లేదు.
    నాకు తెలిసి విశ్వాసం కు - విజ్ఞానం కు ఉన్న సంబంధం :
    మనిషికి ఒక ఆలోచన వచ్చేది ఎక్కడనుండి ?
    ప్రకృతిలో తాను చూసినది మాత్రమే ఊహించుకుంటాడు.
    ఆకాశం లో ఎగిరే పక్షిని చూసి విమానం అనే ఆలోచన వస్తుంది.
    రైట్ బ్రదర్స్ విమానం కనుక్కుంటామన్నపుడు ఒక ఇనుప ముక్క గాలిలో ఎగురుతుందా ? అని హేళన చేశారు.
    మొదట ఫెయిల్ అయినపుడు మరింత నవ్వారు.
    ఆ తరువాత ఏమైంది ? మనకు తెలుసు .
    ప్రకృతిలో ఉన్న శక్తిని మనం తెలుసుకుంది చాలా చాలా తక్కువ మాత్రమే .
    అయితే దేనికైనా అందరికీ అర్ధం అయ్యేలా ? లేదా వాస్తవం లో నిరూపించిన దానినే నమ్ముతారు. నమ్మాలి.
    ఇదే సందర్భం లో ఇంకొకరి నమ్మకాన్ని కించపరచడం కూడా సరి కాదు.

    రిప్లయితొలగించండి
  4. I asked you 2 years before to write posts like aryula dravidula, seems now you are back at last.

    -Raghav

    రిప్లయితొలగించండి
  5. Electric motors?? that's clearly a fake one!

    Mr. Bharadwaja might have written it or not, the thing is, Do you believe that people of Vedic times really have the capability of building a flying machine?? If so, its so sad, that their descendents couldn't get that knowledge and are still not capable of building one indigenously, no matter how argumentative they are!!

    రిప్లయితొలగించండి
  6. భరద్వాజ్ గారూ,
    నిన్నటినుంచి ఇంతవరకు ఇంటర్నెట్‌కు దూరంగా ఉన్నాను. దాంతో మీ మెయిల్‌ను, మీ కథనాన్ని సకాలంలో చూడలేకపోయాను. క్షమించాలి.

    పరమ నిజాయితీగా వైమానిక శాస్త్రం వాస్తవం గురించి పంచుకున్నారు. అందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు

    శాస్త్ర విజ్ఞానం బ్లాగులో చర్చ నేపథ్యంలో మీరు గతంలో నాతో చాట్ లోకి వచ్చినప్పుడు మిమ్మల్ని ఈ విషయంపై అభ్యర్థించాను.

    "వైమానిక శాస్త్రం పుస్తకం సాధికారత, వాస్తవం గురించి తప్పకుండా బృహత్ వ్యాసం రాసి ప్రచురించగలరు. ఎంత సమయం పట్టినా సరే దీన్ని మీరు విడిచి పెట్టవద్దు. ఎందుకంటే మీరే చెప్పినట్లు శాస్త్రానికి, ఫ్రాడ్‌కు పొంతన కుదరదు. ఇది మన జాతికి లేని గౌరవం ఆపాదించడమే కాదు, పరమ వాస్తవ విరుద్ధ విషయానికి సాధికారత కల్పించినట్లు కూడా అవుతుందనుకుంటాను. సైన్స్‌లో పిహెచ్‌డి చేసిన వారిగా మీరు బాధ్యతతోనే ఈ పని చేపట్టాలి. వైమానిక శాస్త్రంపై తప్పకుండా మీకు తెలిసిన నిజాలను కథనం రూపంలో రాయండి. అది మనందరికీ మేలు కలిగించే పని."

    మన పురాతన గతంపై, మన ప్రాచీన వారసత్వంపై గుడ్డి వ్యతిరేకత ప్రదర్శించడం, మన సుదూర గతమంతా తప్పుడుదే అనడం ఎంత వక్ర భావజాలమో, లేనిది ఉన్నట్లు కల్పించడం, దానికి శాస్త్రప్రతిపత్తిని తీసుకువచ్చే ప్రయత్నం చేయడం మన చరిత్రకు, మన పురాతన గతానికి కూడా ఎంతమాత్రం ప్రయోజనం కాదని నా బలమైన అభిప్రాయం.

    గతంలో శాస్త్ర విజ్ఞానం బ్లాగులో జరిగిన వివాదాస్పద చర్చ కాని, నా చందమామలు బ్లాగులో సందేహ దృష్టితోనే వైమానిక శాస్త్రం గురించి చేసిన పరిచయం కాని మీ విలువైన వ్యాసం ద్వారా పూర్వపక్షం అయినట్లే...

    వైమానిక శాస్త్రం ఆధారాలకు సంబంధించి ఇటీవలి కాలంలో జరిగిన ఒక తీవ్రమైన తప్పును బయటపెట్టడంలో, మీ కథనానికి ఇప్పుడూ, భవిష్యత్తులో కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.

    శాస్త్రవిజ్ఞానానికి సంబంధించిన వాస్తవ చరిత్ర గురించి ఇలాగే మరిన్ని కథనాలు ప్రచురించగలరని, మీ కృషిని ప్రధానంగా ఈ రంగంపైకి మళ్లించమని అభ్యర్థిస్తున్నాను.

    మీ కధనం మొదటి వాక్యం...

    "ఇప్పుడు కూడా వ్రాయకపోతే కొడతారేమోనన్న భయంతో వ్రాసేస్తున్నా."
    ఇది నిజంగా జోక్ మాత్రమే కదా..

    మరోసారి అభినందనలతో..
    రాజు.

    రిప్లయితొలగించండి
  7. భరద్వాజ్ గారూ,
    నిన్నటినుంచి ఇంతవరకు ఇంటర్నెట్‌కు దూరంగా ఉన్నాను. దాంతో మీ మెయిల్‌ను, మీ కథనాన్ని సకాలంలో చూడలేకపోయాను. క్షమించాలి.

    పరమ నిజాయితీగా వైమానిక శాస్త్రం వాస్తవం గురించి పంచుకున్నారు. అందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు

    శాస్త్ర విజ్ఞానంలో చర్చ నేపథ్యంలో మీరు గతంలో నాతో చాట్ లోకి వచ్చినప్పుడు మిమ్మల్ని ఈ విషయంపై అభ్యర్థించాను.

    "వైమానిక శాస్త్రం పుస్తకం సాధికారత, వాస్తవం గురించి తప్పకుండా బృహత్ వ్యాసం రాసి ప్రచురించగలరు. ఎంత సమయం పట్టినా సరే దీన్ని మీరు విడిచి పెట్టవద్దు. ఎందుకంటే మీరే చెప్పినట్లు శాస్త్రానికి, ఫ్రాడ్‌కు పొంతన కుదరదు. ఇది మన జాతికి లేని గౌరవం ఆపాదించడమే కాదు, పరమ వాస్తవ విరుద్ధ విషయానికి సాధికారత కల్పించినట్లు కూడా అవుతుందనుకుంటాను. సైన్స్‌లో పిహెచ్‌డి చేసిన వారిగా మీరు బాధ్యతతోనే ఈ పని చేపట్టాలి. వైమానిక శాస్త్రంపై తప్పకుండా మీకు తెలిసిన నిజాలను కథనం రూపంలో రాయండి. అది మనందరికీ మేలు కలిగించే పని."

    మన పురాతన గతంపై, మన ప్రాచీన వారసత్వంపై గుడ్డి వ్యతిరేకత ప్రదర్శించడం, మన సుదూర గతమంతా తప్పుడుదే అనడం ఎంత వక్ర భావజాలమో, లేనిది ఉన్నట్లు కల్పించడం, దానికి శాస్త్రప్రతిపత్తిని తీసుకువచ్చే ప్రయత్నం చేయడం మన చరిత్రకు, మన పురాతన గతానికి కూడా ఎంతమాత్రం ప్రయోజనం కాదని నా బలమైన అభిప్రాయం.

    గతంలో శాస్త్ర విజ్ఞానం బ్లాగులో జరిగిన వివాదాస్పద చర్చ కాని, నా చందమామలు బ్లాగులో సందేహ దృష్టితోనే వైమానిక శాస్త్రం గురించి చేసిన పరిచయం కాని మీ విలువైన వ్యాసం ద్వారా పూర్వపక్షం అయినట్లే...

    వైమానిక శాస్త్రం ఆధారాలకు సంబంధించి ఇటీవలి కాలంలో జరిగిన ఒక తీవ్రమైన తప్పును బయటపెట్టడంలో, మీ కథనానికి ఇప్పుడూ, భవిష్యత్తులో కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.

    శాస్త్రవిజ్ఞానానికి సంబంధించిన వాస్తవ చరిత్ర గురించి ఇలాగే మరిన్ని కథనాలు ప్రచురించగలరని, మీ కృషిని ప్రధానంగా ఈ రంగంపైకి మళ్లించమని అభ్యర్థిస్తున్నాను.

    మీ కధనం మొదటి వాక్యం...

    "ఇప్పుడు కూడా వ్రాయకపోతే కొడతారేమోనన్న భయంతో వ్రాసేస్తున్నా."
    ఇది నిజంగా జోక్ మాత్రమే కదా..

    మరోసారి అభినందనలతో..
    రాజు.

    రిప్లయితొలగించండి
  8. స్పందించిన అందరికీ ధన్యవాదాలు.

    కొండలరావుగారూ,

    ఈ పోస్టు నమ్మకాల గురించి కానేకాదు. వైమానిక శాస్త్రంగా చెప్పబడుతున్న ఈ పుస్తకం అసలు భరద్వాజుడు వ్రాసిందేనా అనేది ఒక అంశం. ఒకవేళ కాకపోతే ఆయన రచించిన అసలు ప్రతి ఉందా, ఉంటే ఎక్కడ ఉందనేది మరొకటి.

    నాకు నచ్చింది నేను సంస్కృతంలో ఏదో వ్రాసేసి "ఇది వేదాలలో ఉంది, నాకెవరో చెప్పారు" అనటం పద్ధతి కాదు కదా? టూకీగా చెప్పాలంటే ఈ ఫేక్ శాస్త్రాన్ని (ఫేక్ అయితేనే) వదిలిపెట్టి అసలు శాస్త్రం కోసం అన్వేషణ సాగించాల్సిన సమయం ఆసన్నమైంది.

    రాజుగారూ,

    అది జోక్ గానే అన్నానులెండి :)

    రిప్లయితొలగించండి
  9. Do you believe that people of Vedic times really have the capability of building a flying machine??
    _____________________________________________________________________

    As the above paper mentioned, there has been only one reference to the flying machines in the post vedic period, that is Ramayana.

    Interesting enough, there has been no mention of vimanas in Mahabharata even though it discusses complete war strategies.

    Long story short, the answer to your question is - I don't know. There has been no other concrete evidence of the usage of flying machines so far. There should be more studies conducted.

    రిప్లయితొలగించండి
  10. అసలు విషయం ఏమిటి అన్న "జిజ్ఞాస" తో ఆ పరిశోధన జరిగితే, అలా పరిశోధనలు జరిపేవారు ఒకటి రెండు తరాలు మారినాక అక్కడ ఉన్న విషయాలు అవగతం అవ్వటం మొదలవ్వచ్చు అని నా అభిప్రాయం.
    ______________________________________________________________________

    Sivaramprasad garu .. I agree completely with this.

    రిప్లయితొలగించండి
  11. Raghav, Durgeswara, Sravya and Saikiran,

    Thanks. Just shared whatever Iittle I knew.

    రిప్లయితొలగించండి
  12. Oh My!!! this author knows nothing about aerodynamics or propulsion!!!! neither the author of Vaimanika Shastra!!!

    This, what is going on here is.....simply!! absurd!!!! senseless!!!

    రిప్లయితొలగించండి
  13. Dude YourGod, this discussion is not about aerodynamics.

    First of all you don't have enough IQ to understand what has been written in the post. This is for a serious discussion and not for incompetent people like you.

    I have a separate post for you and lets discuss there - I repeat, this post is not for negative IQ'ed guys like you who know nothing about Science.

    So, no more comments from you on a serious post like this - Period :)

    రిప్లయితొలగించండి
  14. భరద్వాజ్ గారూ,
    పొరపాటును నా వ్యాఖ్యను రెండుసార్లు పోస్ట్ చేసినట్లున్నాను. అదనపు వ్యాఖ్యను తీసివేయగలరు.

    మీ ప్రధాన కథనంలో భాగంగా అందించిన లింక్ వ్యాసం A CRITICAL STUDY OF THE WORK “VYMANIKA SHASTRA” చదువుతున్నాను. నిజానిజాలను నిగ్గు తేల్చడానికి సైన్స్ లేదా సైన్స్ పరిశోధకులు ఎంత విస్తృత పరిశీలన చేయగలరో, ఎలాంటి ఆవేశకావేషాలకు, అంధ విశ్వాసాలకు, ముందే నిర్ధారించుకున్న అభిప్రాయాలకు లోను కాకుండా వాస్తవ ప్రకటన చేయగలరో రుజువుగా చూపడానికి మీరందించిన పై లింక్ వ్యాసం అద్భుతమైన ఉదాహరణ. -అసలు అద్భుతం అనే పదప్రయోగం సైతం సైన్స్ భావనకు వ్యతిరేకమనుకుంటాను-

    భవిష్యత్తులో ఎవరూ కాల్పనిక విషయాలను సైన్స్ పేరుతో ముడిపెట్టి ఆటలాడకుండా, తెలుగు ప్రజలకు శాశ్వతంగా అందుబాటులో ఉండేలా, ఈ మేటి వ్యాసాన్ని ఎవరైనా తెలుగులోకి అనువదించి అందించగలిగితే ఎంత బాగుంటుందో... మీరూ లేదా సైన్స్ భావనల పట్ల లోతైన అవగాహనలు కలిగిన మిత్రులూ ఎవరైనా ఈ 8 పేజీల ప్రామాణిక పత్రాన్ని తెలుగులోకి తీసుకురాగలరా?

    వైమానిక శాస్త్ర్రాన్ని శ్లోకాల రూపంలో వివరించిన పండిట్ సుబ్బరాయశాస్త్రి గారి పేదరికం, ఆ కుటుంబం మొత్తంగా అనుభవించిన భయంకర దారిద్ర్యం మాత్రమే నన్ను కరిగించాయి. కాని తదనంతరం ఆయన పేరుతో ఆపాదించబడిన శ్లోకాల ముసుగులో ఇతరులు అంటే మన భారతీయులు, చివరకు ఇంగ్లీష్ వాళ్లు కూడా ఆడిన కపట నాటకం కాని, వందేళ్లలోపు రాయబడిన మాన్యుస్క్రిప్ట్‌లను వేల సంవత్సరాలనాటివని నిర్భీతిగా ప్రకటించడానికి పూనుకున్న ఆ దుస్సాహసం కాని క్షమించరాని నేరమనే చెప్పాలి.

    ఇది వ్యక్తుల విశ్వాసాలు నమ్మకాలపై దాడి చేయడం కాదు.. మన కళ్లముందు సైన్స్ పేరుతో ఎంత అభూత కల్పన పేర్చబడుతూ వచ్చిందో చూస్తుంటే దిగ్భ్రాంతి కలుగుతోంది. బెంగళూరు ఐఐటీ పరిశోధకులు నిగ్గు తేల్చబట్టి సరిపోయింది కాని మనకళ్ల ముందు వేదకాలం నాటి విమానాలు అంటూ ఇంకా ఎన్ని అవాస్తవ అభూత కల్పనలు ప్రచారంలోకి వచ్చేవో ఊహించడానికే సాధ్యం కావడం లేదు. పుష్పక విమానంతో సహా మన ప్రాచీన గ్రంథాలు, లేదా రచనలలో ప్రస్తావించిన 'గాల్లో ఎగిరే విమానాలు' ఏరో డైనమిక్స్ సూత్రాలకు ఎంత వ్యతిరేకమైనవో ఈ వ్యాసంలో చూస్తుంటే కళ్లముందు కొత్త కాంతి పరుచుకున్నట్లుంది నాకు.

    మన దేశంలోనే కాదు. పురాతన గతం, సాహిత్యం కలిగిన ప్రతి దేశంలోనూ గాల్లోకి ఎగరడానికి సంబంధించిన భావనలు ఉండేవని అంతర్జాలంలో సమాచారం కుప్ప పోసి ఉంది. ఎగరడానికి సంబంధించి మానవజాతి బాల్యంలో అల్లుకున్న మధురోహలుగా తప్ప వీటిని ఇంకేమాత్రం శాస్త్ర ప్రతిపత్తికి ఆకరాలుగా గుర్తించలేము. మనం ప్రాచీన గతాన్ని ప్రేమిద్దాం.. ఆరాధిద్దాము కాని ఇలాంటి అభూత కల్పనలతో, అవాస్తవాలతో కాదు.

    అసలు వందేళ్ల వయస్సు లేని పుస్తకాన్ని పట్టుకుని వేల సంవత్సరాల నాటిదంటూ మన కళ్లముందే ఒక ఇంగ్లీష్ వాడు ఆడిన నాటకాన్ని ఆ దుస్సాహసాన్ని చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది నాకు.

    నేను ముందే చెప్పినట్లు.. శాస్త్రం పేరుతో జరిగిన ఈ ఘోరమైన ఫ్రాడ్‌, ఒక జాతిగా మనకు గౌరవకరం కాదు. నా అభిప్రాయంతో మీరు అప్పట్లోనే ఏకీభవించినందుకు, ఇప్పుడు ఇంత మంచి కథనంతో పాటు ఒక ప్రామాణిక శాస్త్ర పత్రాన్ని అందరికీ అందుబాటులో ఉంచినందుకు..

    మరోసారి కృతజ్ఞతలు.

    A CRITICAL STUDY OF THE WORK “VYMANIKA SHASTRA” ను ఎలాగైనా సరే తెలుగులోకి తీసుకువచ్చే పనిని కూడా మీరూ, సైన్స్‌ భావనలతో పరిచయం ఉండి అనువాదం చేయగలిగిన మిత్రులూ పూనుకోగలరా? చేయగలిగితే మరో అమూల్యమైన రచనను తెలుగు పాఠకులందరికీ అందుబాటులోకి తీసుకు వచ్చిన ఘనత కూడా మీకే దక్కుతుంది మరి.

    రాజు.

    రిప్లయితొలగించండి
  15. రాజుగారూ,

    ఇందులో మన భారతీయులు ఆడిన నాటకం పాళ్ళు చాలా తక్కువేలెండి.

    వెనక్కి తిరిగి చూసుకుంటే, శాస్త్రిగారేదో తన శ్లోకాలు తను చెప్పుకున్నారు. శర్మగారు వ్రాసింది కూడా తను వ్రాసినట్టే చెప్పుకున్నారు. వీళ్ళపేర్లు వదిలేసి కేవలం భరద్వాజుని పేరే వాడుకున్నవారిది తప్పంతా.

    ఇప్పుడు బయటకి ప్రచారంలోకి వచ్చిందేమిటంటే భరద్వాజుని వైమానిక శాస్త్రం ఫెయిల్ అయ్యిందని, కనుక వేదాల్లో తప్పులున్నాయని. అసలు భరద్వాజుడు వేదకాలానికి పూర్తిగా చెందినవాడా కదా అనేది ఎవరూ ఆలోచించరు. ఆయన రచనలు వేదాలలో భాగమా అనేది కూడా ఎవరూ పట్టించుకోరు :)

    రిప్లయితొలగించండి
  16. /అసలు భరద్వాజుడు వేదకాలానికి పూర్తిగా చెందినవాడా కదా అనేది ఎవరూ ఆలోచించరు. ఆయన రచనలు వేదాలలో భాగమా అనేది కూడా ఎవరూ పట్టించుకోరు :)/

    భరద్వాజుడు అంటే మహర్షా?! అరేరే.. ఇంతకాలం నా అమెరికా మిత్రుడనుకుని తెగ సంబర పడిపోయానే!! ;)

    తెలియని వైమానిక నిగూఢ రహస్యాలు పంచుకున్నావు, మలక్. నే సంతసించితిని. అయినా మించిపోయిందేమీ లేదు... ఇది భరద్వాజ్ aka మలక్పేట రౌడీ విరచిత శాస్త్రంగా ప్రసిద్ధిచెందాలని, తిక్క తింగరిస్టులు అలా ప్రచారం చేసుకుంటూ తమ ఆస్థిత్వాన్ని డైనోజర్లలాగా extinct కాకుండా నిలుపుకుని, వినోదాన్ని బ్లాగుల్లో పంచుతూ వుండాలనిన్నూ నా కోరిక. :P
    భరద్వాజుడు అంటే మహర్షా?! అరేరే.. ఇంతకాలం నా అమెరికా మిత్రుడనుకుని తెగ సంబర పడిపోయానే!! ;)
    తెలియని వైమానిక నిగూఢ రహస్యాలు పంచుకున్నావు, మలక్. నే సంతసించితిని. అయినా మించిపోయిందేమీ లేదు... ఇది భరద్వాజ్ aka మలక్పేట రౌడీ విరచిత శాస్త్రంగా ప్రసిద్ధిచెందాలని, తిక్క తింగరిస్టులు అలా ప్రచారం చేసుకుంటూ తమ ఆస్థిత్వాన్ని డైనోజర్లలాగా extinct కాకుండా నిలుపుకుని, వినోదాన్ని బ్లాగుల్లో పంచుతూ వుండాలనిన్నూ నా కోరిక. :P

    తనకే అర్థం కాకున్నా, అప్పట్లో బాలుడివైన నీతో ఆ శాస్త్రాన్ని చదివించిన ఆ శాస్త్రవేత్త స్పూర్థి మెచ్చుకోకుండా వుండలేకపోతున్నాను. అలా చెప్పకపోయివుంటే, (విసే)ఖరాలు ఇంకెంత రెచ్చిపోయి పిచ్చపిచ్చగా దుష్ప్రచారం చేసుండేవారో కదా!

    SNKR :)

    రిప్లయితొలగించండి
  17. /పుష్పక విమానంతో సహా మన ప్రాచీన గ్రంథాలు, లేదా రచనలలో ప్రస్తావించిన 'గాల్లో ఎగిరే విమానాలు' ఏరో డైనమిక్స్ సూత్రాలకు ఎంత వ్యతిరేకమైనవో ఈ వ్యాసంలో చూస్తుంటే కళ్లముందు కొత్త కాంతి పరుచుకున్నట్లుంది నాకు./

    అసలు పేపర్లో పుష్పక విమానాల గురించి ఏమన్నారో చూడండి:
    whether theseexisted at all is undecideable within the realm of science and is beyond the scope of this paper.

    మరి మీరేమో సైన్సు మీద అవగాహనలేదంటూనే ఇవి ఎయిరోడైనమిక్స్ సూత్రాలకు వ్యతిరేకమని తేల్చేశారాయె! అదే... అదే.. ఆ అత్యుత్సాహమే కూడదని మన మలక్పేట్ చెప్పారు.

    Snkr :)

    రిప్లయితొలగించండి
  18. /బెంగళూరు ఐఐటీ పరిశోధకులు నిగ్గు తేల్చబట్టి సరిపోయింది /

    నమస్కార.
    నమ్మ బెంగళూరు దల్లి IIT ఇల్ల, IISC మాత్ర ఇదే.
    Snkr :D

    రిప్లయితొలగించండి
  19. బాబూ శంకరూ,

    పైన అజ్ఞాతకి ఏయిరోడైనమిక్స్ 101 కావాలిట. ఎంతయినా మిసైల్ మేన్ అబ్దుల్ కలాం గారితో రాసుకు పూసుకు తిరిగినవాడివి కదా. కాస్త దాన్నో చూపు చూడకూడదూ?

    రిప్లయితొలగించండి
  20. Good post! Expecting more from you in this series.

    రిప్లయితొలగించండి
  21. కలాం గారా? మాజీ రాష్ట్రపతి గారేనా? నేనా?! :)

    ఆ పేపర్ చదివాను, బావుంది. ఆకాలానికే ఓ పెద్దగా చదువుకోని వ్యక్తి విమానాల గురించి మారుమూల బ్రిటీష్ ఇండియాలో కనీసం వూహించడం, అద్భుతమైనదనే (తప్పో/రైటో,ఫేకో/గీకో) అనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  22. ఈ snkr గారు.... (ఇప్పటికి దొరికారుఆయనకి సొంత బ్లాగ్ లేదాయే) అయ్యా ఇక్కడి డిస్కషన్ తో సంబంధం లేదు కానీ తమరు అబ్దుల్ కలాం గారితో పనిచేసారా ?? నాదొక్క అభ్యర్ధన తమరికి తెలిస్తే చెప్పండి. చెపితే మీ కాలు పట్టుకు లాగి మరీ దణ్ణం ఎట్టుకుంటాను.
    ఆ భరద్వాజుడు వ్రాశాడా లేదా వేదాలున్నాయా లేదా రామాయణం జరిగిందా లేదా ఈ తొక్కలో డిస్కషన్ నాకొద్దు మా తాతలు నేతులు తాగారు...... వద్దు. ఇపుడు గిర్రున 2012 లోకి వచ్చేయండి. గతం తవ్వుకోకుండా భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం. లాడెన్ ని చంపడానికి అమెరికన్లు వాడిన టెక్నాలజీ ఏమిటి ?? seals operation ఎలా జరిగింది ?? మొత్తం ఆపరేషన్ గురించి తెలుగులో వివరిస్తే మిగతా పని నేను చూసుకుంటాను. ఏమీ లేదు అదవానీ నో ఒబామానో ఇంకా డిసైడ్ కాలేదు గానీ ఇద్దరిలో ఒక్కరి పని అయిపోయిందే !! లాడెన్ ని సముద్రం లోకి విసిరేస్తేనో లాడెన్ ఇల్లు కూలగొట్టేస్తోనో మాలాంటివాళ్ళ మనసుల్లో స్పూర్తి నివ్వడం ఆగిపోతుందా ఏమిటీ ???

    రిప్లయితొలగించండి
  23. /తమరు అబ్దుల్ కలాం గారితో పనిచేసారా ?? /
    లేదు
    /చెపితే మీ కాలు పట్టుకు లాగి మరీ దణ్ణం ఎట్టుకుంటాను/
    సుబుద్ధి ప్రాప్తిరస్తు! అని దీవించాగా ఇక నాకాళ్ళొదలండి. :)

    /లాడెన్ ని చంపడానికి అమెరికన్లు వాడిన టెక్నాలజీ ఏమిటి ?? seals operation ఎలా జరిగింది ?? /
    మీ వారు DRDO శాస్త్రవేత్త అని వినినట్టు గుర్తు. రోజూ చెప్పులోనిరాయి చెవిలోని జోరీగ లా పోరండి. తెలుసుకున్నాక మాకూ చెప్పండీ, వినిపెడతాం.
    టెక్నాలజీదేముంది? సెల్ ఫోన్లు, గుప్తచరులు, $$$, నమ్మకద్రోహం చేసేవాళ్ళు అంతా కలిసి మీ లాడెన్ నూకలు చెల్లేలా చేసేశారండీ.... చేసేశారు! వా.. :((

    /seals operation ఎలా జరిగింది ?? /
    లక్కతో అయ్యుంటుంది, అది తెలుసులేండి, సీల్డ్ కవర్లో టెండర్లు వేస్తారు కదా, అలానే.

    /లాడెన్ ని సముద్రం లోకి విసిరేస్తేనో లాడెన్ ఇల్లు కూలగొట్టేస్తోనో మాలాంటివాళ్ళ మనసుల్లో స్పూర్తి నివ్వడం ఆగిపోతుందా ఏమిటీ ???/
    అమెరికోడు వింటే... సీల్ అయిపోతారు. ఎందుకైనా మంచిది రాత్రి/పగలు బురఖా వేసుకోని వుండండి, అమెరికా వాళ్ళకు బూచోళ్ళంటే తెగ భయం. ఆఁ...

    Snkr :))

    రిప్లయితొలగించండి
  24. /మొత్తం ఆపరేషన్ గురించి తెలుగులో వివరిస్తే మిగతా పని నేను చూసుకుంటాను./
    SEALS operation for Dammies అనే బుక్ మలక్, నేను రాయబోతున్నాము. వెల 1000రూ. 100 ప్రతులకు తక్కువ కాకుండా అడ్వాన్సు వెంటనే మలక్ గారికి పంపించండి.
    Snkr :))))) :))))

    రిప్లయితొలగించండి
  25. ఈ విషయంపై రెండు బండలు (అనగా జ్ఞాన గుళికలు)

    1) మన aero dynamics principles కందిరీగ ఎగరడాన్ని వివరించలేవుట. ఇంకోలా చెప్పాలంటే వాటి ప్రకారం కందిరీగ అసలు ఎగరనేకూడదట. కాబట్టి aero dynamic principles may not be everything.
    2) పోరస్సుకూ (పురుషోత్తముడు) అలెక్సాండరుకూ జరిగిన యుధ్ధంలో ఎగిరేవాహనాల (UFO??) ప్రస్తావన ఉందని. పురుషోత్తముడి వైపున్న ఎగిరేవాహనాలను చూసి యవనుల గుర్రాలు బెదిరాయని ఒక గ్రీకాయన రాసినట్లు, దాన్ని నేను చదివినట్లు గుర్తు.

    శాశ్త్రం విషయానికే వస్తే "నెలవంక" గారి అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తాను. పురాణల్లోని విమాన వర్ణనలు fictionలో భాగమేకానీ వాటన్నిటికీ వివరణలవసరమని నేను నమ్మను. ఇప్పుడు రాసిన science fiction పుస్తకాన్ని ఒక వెయ్యేళ్ల తరువాత చదివినవాళ్ళు "అప్పటివాళ్లకి అవన్నీ తెలుసు" అనుకోనేలాగానే నేడు మనంకూడా ఆలోచిస్తున్నామేమో.

    రిప్లయితొలగించండి
  26. "మా తాతలు నేతులు తాగారు...... వద్దు."

    ఈ ముక్క కుసింత మీ సోనియమ్మ కొడుక్కి చెప్పండి ప్లీజ్

    రిప్లయితొలగించండి
  27. వందేనా ?? చీ .. భారతీయులూ మారరూ.. బుద్ధులూ మారవు !!!
    హే లాడెన్ !!! జరా హం కో సీగ్ర హీ సద్బుద్ధి దేదో ప్రభూ

    రిప్లయితొలగించండి
  28. భారతీయులకైతే వందకు పైన, అదే పాకీయులకైతే పదే!(డిస్కౌంట్ అన్నమాట!)
    తొలిపక్షి డమ్మీలకు టిప్స్: 100సార్లు చదవాలంటే 100 ప్రతులు కొనాల్సిన అవసరం లేదు. ఒక్క ప్రతితోనే 100సార్లు వల్లె వేసుకునే టెక్నాలజీ 1000రూ లకే నేర్పబడుతాయి. :P

    యుపిలో మన ఇటాలియన్ 'గాడిదీ' వంశాన్ని చీపురుతో నివాళించి 'ముల్లా'యంకు తివాచీ పరిచారట కదా, ఇపుడెట్లా? మనకు యువరాజు రానట్లేనా? :(

    Snkr

    రిప్లయితొలగించండి
  29. ఇప్పటి Computer S/W కాలంలో ఎలా ఉందో తెలియదు కానీ, కొంతకాలం క్రితం వరకు, పంచాంగకర్తలు సూర్య సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని పంచాంగాలను నిర్ధారించేవారు. సూర్య సిద్ధాంతం ఒక astronomical treatise. మీరు స్పృశించిన ఈ విషయానికిలాగానే, సూర్య సిద్ధాంతంపై - ఇప్పటికీ సమాధానాలు తెలియని ప్రశ్నలున్నాయి. ఉదాహరణకు దాని రచయిత "మయుడు" అనే అసురుడు. ఇతని తపస్సుకు మెచ్చి, సాక్షాత్ సూర్య భగవానుడే ఈ శాస్త్రాన్ని బోధించారట. గుండెమీద చేయ్యి వేసుకొని చెప్పండి - ఎంతమంది దీన్ని నమ్ముతారో! ఆ కాలంలో Telecopeలు గట్రాలు లేవాయే! మరి అంత accurateగా, astronomical bodies గురించి ఎలా చెప్పగలిగారు?

    ఇప్పుడు లభ్యమవుతున్న సూర్య సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని, ఎందరో (ఈ తరం శాస్త్రవేత్తలు సైతం) ముక్కు మీద వేలేసుకున్నారు. ఇప్పుడు లభ్యమవుతున్న సూర్య సిద్ధాంతం originalఆ కాదా అనే ప్రశ్నలూ ఉన్నాయి. దౌర్భాగ్యమేమిటంటే, దాని ప్రతికై మీరు వెతికినట్టయితే, 1860 లో Ebenezer Burgess అనే అతను దానిని ఆంగ్లంలో తర్జుమా చేసి Journal of the American Oriental Societyలో ప్రచురణ చేయించినదే లభ్యమవుతుంది. మన భారతీయులు ఇప్పటివరకూ "పీకినది ఏమీ లేదట." (దయ చేసి ఫణీంద్రలాల్ గాంగులి అనకండేఁ?)

    మళ్ళీ ఈ టపాలోని వైమానిక శాస్త్రానికి వస్తే, ఇటువంటి జటిలమైన చిక్కులను ముడివిప్పగలిగే సహనం, పట్టుదల, ఓపికలు మన ఈకాలం భారతీయులకు లేవు. ఇటువంటి ఆంశాలు నిజమైన వెలుగు చూడాలంటే, ఎవరో ఒక తెల్ల వాడో, లేక దొరసానో కరుణించాల్సినదే! మన దేశంలో రెండే రెండు రకాల వాళ్ళుంటారు. "ఫలానా విషయం సనాతనం" అన్నామంటే చాలు. మొదటివారు - 'అంతా బోగస్' అని చిటికెలో తేల్చేస్తారు. ఇక రెండో రకం వాళ్ళు "అబ్బో చూశారా! అన్నీ మన పురాణాల్లోనే ఉన్నాయష" అంటుండే నేతులు-మూతులు రకం.

    రిప్లయితొలగించండి
  30. we are waiting for your next...just to "ekataaniki"".....so, please be careful!!! right??? you BPNaaaaa??? no mater what you write....you will face me!!

    రిప్లయితొలగించండి
  31. LOLZ, you and your stuff..

    First opt all go learn what a REFERENCE means, then talk about arguments. There are better ways of begging me to publish your comments,

    But you know what, beggars like you can't be choosers. Now, better go back to your platform and have a good sleep. 3rd class lives like you can't aspire for more.

    As I said, this is a serious post and the people like you are NOT QUALIFIED enough to talk about it.

    I'll post a separate one for you wherein we can fight. As I said earlier, to talk about subjects like this, one needs some basic education which unfortunately you lack. Sorry :)

    రిప్లయితొలగించండి
  32. you will get it!!! you know you will!!! all you need now is the same!!

    రిప్లయితొలగించండి
  33. Oh yeah? I am waiting. You have been saying it for the last 3-4 months. You said you would kick me out of the blogs and you could even move me an inch.

    All you can do is just talking for you know it yourself that you are worth nothing.

    Seriously, uneducated folks like you aint worth nothing.

    రిప్లయితొలగించండి
  34. i will write on the other blogs if your behavior does not change!!!

    రిప్లయితొలగించండి
  35. Go ahead, be my guest! As I told you, you are at my mercy as far as this blog is concerned. You are just a beggar and its my choice to allow you or not!

    రిప్లయితొలగించండి
  36. Lolz, This is funny - A nameless, shameless, brainless and worthless guy posting that question :)

    When you aint worth a penny, you have no right to post questions dude! Just take whatever coin is thrown at you with thanks :)

    రిప్లయితొలగించండి
  37. malak??? you real name???? are you afraid???

    or hihihiih....dont have a name at all???? hihihihihih

    come on....,,,,your name...????? you want my name?? YOurGOD's real name????...ok...its janarthan reddy.....what's your name???

    రిప్లయితొలగించండి
  38. Oh yeah? If you are Janarthan Reddy then I am Yediyurappa!!

    Try something smart man, these dumb tricks are too old!

    రిప్లయితొలగించండి
  39. real name malak! real name if you have one!!!

    రిప్లయితొలగించండి
  40. Yes, if Janarthan Reddy is your real name then Yediurappa is my real one too.

    If you want to play tricks, play smart tricks, not these stupid ones and a real dumbo like you calling yourself a researcher is real funny now!

    రిప్లయితొలగించండి
  41. you have been writing so much??? why not use real name??? real stuff?? why hiding????? why being so coward??? even girls are coming out even with their surnames!!! aren't they????

    so what are you??? what of you???? why not using original name and address????

    why not??? malak??? why not??? huh???? afraid of people like me???? afraid of what, malak??

    pissing in your pants by seeing comments from anonymous??? huh???? you deserve it! dont fret on it!!! accept the truth!!! you sort of nameless people are destined to get that!!!

    so, which shastri or sharma you are???? oh.....don't cut this line and post it...so that you can get sympathy from that group!!! ...I know..exactly thats waht you are gonna do!!!...thing is, we will be here for you..no matter what you write....!!!! kikikikikiiki....he-man of the blogs???? we are gonna make you 0.5 of the blogs!!

    note the above line also as you did the earlier one..like...throw you out of.....etc....OK?

    రిప్లయితొలగించండి
  42. LOLZ,

    This one comment is enough to prove what kind of a dumbo you are. Any regular reader who reads the above comment will be really rolling on the floor laughing!!!!!!!

    As I said earlier, you are UNFIT even to be called a researcher.



    we are gonna make you 0.5 of the blogs!!
    ______________________________________________________

    SURE, I am waiting for it. Now stop these Balaiah dialogs and do something ( I really doubt it since I now know well about you)

    You guys are scared even to reveal your identities and you question the others? LOLZ

    రిప్లయితొలగించండి
  43. If you guys are really capable of doing anything, you could have done a lot in 3 months. (When I mean you guys, I mean you in multiple forms - I don't think looking at you any sensible guy would even think of befriending you)

    Ok I am giving you one more chance to you to kick me out of blogs. Can you, if you are really capable of doing it.

    Lets have an open challenge!

    రిప్లయితొలగించండి
  44. malak??? one simple thing??? who asked you to treat me like a researcher???? kikikikikikikiki

    I might be a researcher...of course...not your problem??? is it??

    రిప్లయితొలగించండి
  45. You and a researcher? It will be a shame on the entire research community.
    Research needs qualified people - not people like you who are scared to reveal their own names but ask the others to do so.

    Why are you so scared to reveal your details? You reveal your details with proof and I will reveal mine :)

    రిప్లయితొలగించండి
  46. By the way,

    So do I take it that you are scared of taking the challenge up and you don't have guts to live up to your own words?

    As you claim if you are real then accept the challenge.

    రిప్లయితొలగించండి
  47. ఓరే యువర్గాడ్ పిచ్చికుంకా. ఆపరా నీ సోది. మలక్ పేరు ఎడ్రస్ ఇక్కడ బ్లాగుల్లో కనీసం అయిదొందలమందికి తెలుసు.

    మలకూ పాపం వీడిమీద జాలి చూపించు బాబు.

    రిప్లయితొలగించండి
  48. Hehe Above Anon,

    This guy is a researcher right? So he wouldn't know what everyone else on the planet knows :)))))))))))))))))))))))

    If he has had little bit of common sense (yeah yeah I know he doesn't have any) he would have found it himself :)))))))))))))

    రిప్లయితొలగించండి
  49. ఓకే మరి నువ్వు వీడిని ఆడుకుంటున్నావన్న సంగతి వీడికి ఎప్పుడు తెలుస్తుందో ఏమో?

    రిప్లయితొలగించండి
  50. నువ్వు చెప్పావుగా, ఇప్పుడు అర్థమయ్యుంటుందిలే. But you never know - వీడి బొద్దింక బుఱ్ఱకి ఆమాత్రం తెలివయినా ఉంటుందో లేదో!

    రిప్లయితొలగించండి
  51. హబ్బ ఏందీ గోల..చాలా రోజులనుంచీ చూస్తున్నాను. గుయ్య్ మని రొద ఒకటే.

    Bharadwaj,
    When Fly-swatter is only partially-working, then it's time to send frogs, in their way ;-)

    రిప్లయితొలగించండి
  52. ఏంటీవేళ ఈగల రొద వినిపించట్లేదు? అప్పుడప్పుడు మాత్రమే వస్తాయా ఇటేపు?

    రిప్లయితొలగించండి