18, ఫిబ్రవరి 2011, శుక్రవారం

బులుసు గారూ మీకిది తగునా?

అయ్యా బులుసుగారూ, ఏమనుకోకండీ గానీ మీ బ్లాగును నేను blacklist చేస్తున్నా. నేను ఇక ముందు చదవని బ్లాగుల్లో ఇదొకటి.

ఎందుకంటారా? ఎవడికి చెప్పుకోను నా కష్టాలు?

ఒక రోజు పొద్దున్నే ఎందుకో (ఎందుకేమిటి లెండి .. బుధ్ధిలేక) మీ బ్లాగు చదవటం మొదలుపెట్టాను, అది కూడా మీ పెళ్ళి చూపుల టపా. రెండంటే రెండే నిమిషాల్లో ఒక మైలు దూరంలో కూర్చునేవాడొకడొచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు, అంత గట్టిగా నవ్వద్దంటూ.

సరే మూతికి గుడ్డ చుట్టుకుని మరో రెండు టపాలు చదివా. అది కాస్తా చిరిగిపోయింది. ఈలోగా అరమైలు దూరంలో ఉండేవాళ్ళందరూ పదింటికే లంచికి వెళ్ళిపోయారు (దానికి కారణం నేనేనని ఆ తరవాత తెలిసింది). సరే ఇక నావల్లకాదని అటు ఇటూ తిరగటం మొదలుపెట్టా. అయినా సరే మీ టపాల్లోని విషయాలు గుర్తుకు రాకుండా ఉండవుకదా!

వాక్వే లో నడుస్తూ వెడుతుంటే ఒక దేశీ వనిత జీన్స్ మీద కుర్తా, వాలుజడ, పెద్ద బొట్టూ, మల్లెపూలూ పెట్టుకుని ( మీ ఊహ కరెక్టే, తెలుగమ్మాయే, ఎవరో అన్నట్టు వారికి తప్ప మరెవరికీ ఇలాంటి విచిత్ర వస్త్రధారణ ఉండదుకదా) ఎదురుగుండా వస్తోంది. ఈలోగా మీ బండోపాఖ్యానం గుర్తొచ్చి నవ్వేశా. ఆమేమో తన బట్టలని చూసి నవ్వుతున్నాననుకుని మొహం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయింది. వెంటనే నవ్వు ఆపుకున్నా. ఆ వెనకాలే వచ్చిన తమిళ పొన్నుని (ముదురు ఎరుపు చొక్కా, మెరుపుల జీన్స్) చూస్తే ఎందుకో మీ చివరి క్షణాలు గుర్తొచ్చాయి. కానీ నవ్వితే ఇబ్బంది అని నవ్వలేక, ఆపుకోలేక అదోటైపులో మొహం పెట్టా. ఆ పిల్లేమో "ఛి! నలభై యేళ్ళొచ్చి, ఒక కూతురు కూడా ఉండీ అవేం చూపులూ?" అనే టైపులో ఒక లుక్కిచ్చి ( ఏమిటో లేండి, ప్రపంచంలో జనాలందరూ వీళ్ళవెంటే పడతారని వీళ్ళకి కాస్త అనుమానం) వెళ్ళిపోయింది.

మరికాస్త ముందుకెడితే ఒక నీలమేఘశ్యాముడు - బోడి గుండు, బుఱ్ఱ మీసం - మన అంగ్రేజ్ సినిమాలో అన్నకి రంగుపూసినట్టన్నమాట - మీ సినిమా కథ గుర్తొచ్చింది - ఇక నావల్లకాదనుకుని పెద్దగా నవ్వేశా. వాడప్పుడే ఎవరితోనో తిట్లు తినొస్తున్నాట్ట, కోపంగా చూసుకుంటూ వెళ్లి పోయాడు. తరవాత వచ్చిన ఒక శ్వేతసుందరి మాత్రం "ఎప్పుడూ కనీసం పలకరింపుగా కూడా నవ్వనివాడు ఇవాళ ఇలా నవ్వుతున్నాడేమిటబ్బా?" అనుకుని, ఆనందపడిపోయి ఒక హగ్గు ఇచ్చి మరీ వెళ్ళింది. ఇది చూసి పైన చెప్పిన తమిళ తెలుగు పోర్లు మహిళా విశ్లేషణ -అదేనండీ గుస గుస గుస గుస - మొదలుపెట్టారు. ఇలా హగ్గులని అపార్థం చేసుకునే వాళ్ళు మా ఆవిడకి ఈ విషయం చేరేస్తే నా గతేంగాను?

ఇకమీటింగులో, ఎవరో ఒక అయిడియా చెప్పి ఎలా ఉంది అని నన్నడిగారు. ఖర్మకాలి అప్పుడే 239 వ దినం గుర్తొచ్చింది. ఇక ఆపకుండా నవ్వటం మొదలుపెట్టా. ఆ తరవాత ఒక మంచి అయిడియాని అపహాస్యం చేస్తావా అని తిట్లు పడటమే కాకుండా ఒక warning కూడా వచ్చింది గట్టిగా నవ్వద్దని.

అందుకే దీనంతటికీ కారణమయిన బులుసుగారి పులుసును, అదే నవ్వితేనవ్వండి బ్లాగును నేను బహిష్కరిస్తున్నా.

7, ఫిబ్రవరి 2011, సోమవారం

మాలిక పోస్టులు కలగా పులగం - 2

ముందుగా - మాలిక పత్రికలో "కాపీరైట్" మరియు "రచయితలకి సూచనలు" పొందుపరచటానికి టీం మెంబర్లని సలహాలు అడిగితే మాకొచ్చినవి:

Copyright info: All rights reserved and if you try to copy any information you will be strangled to death by an unknown evil force. If you copy the entire site, then you will be made the owner of the site, which is much worse than the abovesaid death penalty!

Instructions to Authors: Send us any sh*t you like, but we'll publish only our sh*t!

Selection Policy: You kiddin me? I m THE JUDGE and nobody asks me any questions * THUD * (With a sledgehammer)

Editorial Board: We wanted fresh faces so brought in a few blokes who never read or wrote anything

Comment Policy: Seriously, you want to mess with us? Think again!
మావాళ్ళంతే! అదో టైపు!! సరే, ఇక ఇవాల్టి మాలిక పోస్టుల శీర్షికలు కలగాపులగమైతే?

________________________________________

* మంచి స్క్రిప్ట్‌ కోసమే తాగుబోతు తమ్ముళ్ళ హక్కుల పరిరక్షణకు నడుం బిగించిన చంద్రబాబు

* శోభా రాణి వేసిన జోకాతిజోక - అలా మొదలై౦ది !


* వసంత పంచమి విశిష్టత ఏమిటి? - ఒకరితో ప్రేమ..మరొకరితో ఎంజాయి..


* జగన్ హరిత యాత్ర దిగ్విజయం - ప్రపంచకప్‌లో భారత్‌కు మొదటి షాక్‌ ...


* భండారు అచ్చమాంబగారి కథల్లో ఏముంది? - నేను మెచ్చే బ్రాహ్మణత్వం

* ఇంతకి ఏది ప్లాప్ ?????? - విరాట పర్వము

* కర కర కాకర - ఆహా ఎమి రుచి ..........!

* విడాకులకు సిద్ధమైన "ఖుషీ" భామ భూమిక - ఐదేళ్ళ తరువాతనే పెళ్లి

* గారెల పిండి పలచగా ఉంటే విలీనమే మార్గం

* దెయ్యమా ....పిచ్చా?? - క్లారిటీ అనేది మన అభిప్రాయంలో ఉండాలి మిత్రమా!!


* పెంకె ఘటం, మా పతంజలి - వాడికి నిద్రలో నడిచే అలవాటుంది సార్.....


* ప్రసిద్ది చెందిన ప్రపంచ రాజకీయ "ఐకాన్"(Icon)లిస్ట్ లో మహాత్మా గాంధీ మొదటిస్థానం - మండిపడ్డ త్రిష

* బ్లాగర్లూ డబ్బు సంపాదనా - నలభై వేలు లంచం తీసుకుంటూ ఏ.సి.బి కి చిక్కిన రిజినల్ డైరెక్టర్ సురేష్ కుమార్

* ఓపెన్ టైప్ ఎంత చూపించినా అదృష్టం లేకపోతే అంతే

* ఆడబడుచు సినిమాల్లోనూ అక్క చెల్లెళ్ళ అనుబంధం

Shankar's comment:

రెండు విభిన్న పోస్టులు కలిపితే వచ్చే కామెడీ లాగే
బ్లాగు పేరు - వాళ్ళు రాసిన పోస్టు కలిపితే కామెడీగానే అనిపించింది
ఉదాహరణకి ఈ క్షణం కనిపించిన కొన్ని ఉదహరిస్తున్నాను

౧. మీకోసం నా చెలి

౨. మందాకిని కోటి మాటలు దొంగ ప్రచారానికే

౩. మీ మంచి మిత్రుడు చిరు దెబ్బకు ఆంధ్ర పాలిటిక్స్ లో సునామి. దెబ్బకు ఠా! దొంగల ముఠా!

౪. లాహిరి ముందుంది క్రోకడైల్ ఫెస్టివల్

౫. నామది రాతలు రాజకీయం

౬. మైలవరం 'చేతిలో సూర్యుడు' ..జెండా పీకిన చిరు

౭. సత్యవాణి ఉదయించక ముందే 'హస్త'మించిన సూర్యుడు

౮. నా పరిధి దాటి ఇటాలియన్ డిన్నర్ ...ఫర్ ఎ చేంజ్

౯. GPVPRASAD అనుకున్నదే అయ్యింది

౧౦. ఎన్నెల పరకాయ ప్రవేశం

౧౧. పర్ణశాల ఓపెన్ టైప్

6, ఫిబ్రవరి 2011, ఆదివారం

నల్లమోతు శ్రీధర్ గారికి సరదాగా ఒక ఛాలెంజ్ :)

ముందుగా - ఈ టపా సైబర్ క్రైం ని ప్రోత్సహించటానికి కాదు .. సైబర్ క్రైంని నిరోధించటంలో శ్రీధర్ గారి approachలో ఉన్న లొసుగులు ఎత్తి చూపేందుకు మాత్రమే.


శ్రీధర్ గారూ, ఇన్నారెడ్డిగారి బ్లాగులో మీ Video చూశాను. Its a nice one. బాగానే వివరించారుగానీ నాకు కొన్ని విషయాలు అర్థం కాలేదు.

ముందుగా మీ ఐపీ ట్రేకర్ ఇంతా చేస్తే ఐ.ఎస్.పీ దాకా తీసుకెళ్ళి ఆపుతుంది. మరి అక్కడనుండి ఇంటి చిరునామా ఎలా సంపాదించాలో చెప్పనే లేదు. ఉదాహరణకి న్యూ జెర్సీ కాంకేస్ట్ ఐ.ఎస్.పీ. వాడేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. అందులో మీకు కావాల్సిన వారిని పట్టుకోవటం ఎలా?

అలాగే కాంకేస్ట్ వాళ్ళకి వాళ్ళ యూసర్ల ప్రైవసీని కాపాడే బాధ్యత ఉంది (సైబర్ నేరాలు, టెర్రరిస్ట్ దాడుల విషయాల్లో తప్ప. ఇతరులని విమర్శించటం అమేరికాలో ఏ రాష్ట్రంలోనూ సైబర్ నేరం కాదు). దానిని ఎలా ఛేదిస్తారు?

ఇక సరదాగా మీ టూల్ కి పరీక్ష - దాని పనితనం చూడటానికి మాత్రమే. ఎందుకంటే నేను క్రింద చెప్పినవాటికి ప్రయత్నించి విఫలమయ్యా. మీరేమైనా దారి చూపిస్తారేమో అని.


1. నేసు మీకు ఒక ఈ-మెయిల్ పంపిస్తా. అది పంపించింది నేనే అని నిరూపించగలరా?

2. నా స్వంత ఐపీ ఎడ్రస్ తో మీకొక కామెంట్ పెడతా. Home ఎడ్రస్ కనుక్కోగలరా?

3. ఒక ప్రాక్సీ వాడి మీకు కామెంట్ పెడతా. దాని ద్వారా నన్ను ట్రేస్ చెయ్యగలరా?

పై మూడూ చెయ్యగలిగితే I will have to appreciate the progress made by the Cybercrime division in India over the last decade. (I WAS ONE OF THE SPEAKERS AT A WORKSHOP ON CYBERCRIME CONDUCTED AT NATIONAL POLICE ACADEMY (NPA) SIVARAMPALLY SOMETIME IN 1997 or 98, COVERING SOFTWARE ENGINEERING PRACTICES AND SUN-SOLARIS HACKING TECHNIQUES. I WAS ACTIVELY FOLLOWING THE CASE WHEREIN A FEW PAKISTANI HACKERS WERE TARGETING THE INDIAN GOVT WEBSITES, INCLUDING THAT OF NPA)అన్నట్టూ మీకు తెలుసో లేదో - 2009 లో A***** (Name hidden) గారికి వచ్చిన బెదిరింపు ఈ మెయిళ్ళని సైబర్ క్రైం విభాగానికి తీసుకేళితే వాళ్ళు తేల్చినదేమిటంటే - ఆ మెయిల్ డిట్రాయిట్ నించి వచ్చింది, అంతకన్నా ఏమీ చెప్పలేము అని. ఈ ఏడాది సమయంలో వివరాలు సాధించగల పురోగతి సాధిస్తే అంతకన్నా సంతోషమేముంది?

Once again, this is only to challenge the efficiency of the above methods in a constructive way. As I was not able to trace the users behind TRUE anonymous proxies, I am interested in knowing if someone else can do this.


పిడకలవేట:

NPA అంటే గుర్తొచ్చింది. ఆ వర్క్ షాప్ సమయంలో ఒక తల నెరిసిన ఆయన దగ్గరకొచ్చి Software విషయంలో నక్సలైట్ల గురించి ఏదో ప్రశ్న అడిగాడు. పెద్దాయనేకదా కాస్త Show off చేద్దామని ఒక రెండు నిమిషాలు గేస్ కొట్టా. ఆయన నవ్వి వెళ్ళిపోయాడు. ఆ పక్కనే ఉన్న మా కసిన్ నా దగ్గరికొచ్చి "నీ బొంద. Software Engineering కాక Naxals సుత్తెందుకు? ఆయన Anti-Naxal ఆపరేషన్స్ కి one of the country heads" అని తిట్టేసరికి నాలుక్కరచుకున్నా! BAKRAAAAAAAAAAA :))

కొసమెరుపు: ఇంత చెయ్యగలిగీ, మరి రెండెళ్ళనుండీ కాగడా ఎవరో ఎందుకు తెలుసుకోలేకపోయారు/తున్నారు? కాసేపు నేనని, కాసేపు పవనని, లేకపోతే రవిగారనే అభియోగాలు మోపటం తప్ప!