19, జనవరి 2010, మంగళవారం

అవతార్ శేడిస్టులు

ఈ మధ్య ఒక కొత్తరకం శేడిస్టులు పుట్టుకొచ్చారండోయ్. వాళ్ళు దేనికయినా బలైపోతే, పక్కవాళ్లకి చెప్పకుండా - అబ్బో, భలే ఉంది, సూపరో సూపరు అంటూ పక్కవాడిని కూడా బలి చేసే రకాలు. అవతార్ సినిమా బ్రహ్మాండం, అబ్బో తిరుగులేదు అంటూ రాసిన రివ్యూలు చదివి వెళ్ళి చూసి మరీ బలి అయిపోయా! చూసి 24 గంటలైనా తలనెప్పి ఇంకా తగ్గలేదు - చిరు, బాలయ్య, రజనీకాంత్ ముగ్గురినీ కలిపేసి రూపొందించిన హీరో, విజయశాంతి, రోజాలని కలిపిన హీరోయిన్ ఇక "నిన్ను వదల బొమ్మాలీ" అనుకుంటూ ఒక తొక్కలో మిలట్రీ మామ .. శేం ఏండర్‌సన్ టైపులో మిగతా జనాలు.

దేవుడా దేవుడా మా మంచి దేవుడా .. నన్ను ఈ సినిమాకి తీసుకెళ్ళిన మోహనరాగానికి ఇదే సినిమా రెండోసారి చూసే భాగ్యం ప్రసాదించు స్వామీ - అప్పటికి గానీ నా కసి తీరదు!!!! ఇలాంటి సినిమా మన తెలుగులో చాలా తక్కువ ఖర్చులో తియ్యచ్చేమో ... చిరంజీవికో, బాలయ్యకో, వెంకటేషుకో జస్ట్ నీలం రంగు పూస్తే చాలు, గ్రేఫిక్స్ ఖర్చు కూడా ఉండదుగా :))


మిగిలిన సినిమాలని "అవతార్ ముందు", "అవతార్ తరవాత" గా కాదు .............. "అవతార్ కన్నా కాస్త బెటర్", "అవతార్ కన్నా చెత్త" గా క్లేసిఫై చేసే రోజు ఎంతో దూరంలో లేదు.

ఇక చాలు .. నేను అడవుల్లోకి పోయి పిట్టలకి, గబ్బిలాలకి, నా తోకని కలిపి వాటి మీద ఎక్కి ఊరేగాలి .. టా టా!

14, జనవరి 2010, గురువారం

హైతీ భూకంపబాధితులకి మన వాళ్ళలో ఎవరైనా సహాయం చేస్తున్నారా?

మీకు తెలిస్తే చెప్పండి. నేను కూడా కొంత చేద్దామనుకుంటున్నాను!!!!

12, జనవరి 2010, మంగళవారం

రెండు ఉద్యమాలు - ఒక పె ద్ ద్ ద్ ద్ ద్ ద్ ద్ ద్ ద్ ద్ ద్ ద్ ద్ద అబద్ధం!

(సరే! సరే!! ఇదేమిటో మీకు తెలుసని నాకు తెలుసులేండి అయినా ఏదొ అబ్రకదబ్రగారి స్ఫూర్తితో నా తుత్తి కోసం వ్రాసుకుంటున్న మినీ పోస్టు ఇది)
ఈ మధ్య కాలంలో నేను విన్న అతి పెద్ద అబధ్ధం - "మా పోరాటం హైదరాబాద్ కోసం కాదు!" .. ఇది రెండు పార్టీలూ చెప్తున్న మాటే .. "తెలుగువాడి ఆత్మగౌరవం", "తెలంగాణా ఆత్మ గౌరవం" ముసుగేసుకుని ...

ఒకవేళ సమైక్య వాదులకి హైదరాబాద్ అక్కరలేకపోతే ఉద్యమమంతా హైదరబాద్ మీదే ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? ఒక్కరైనా "జరిగిందేదో జరిగింది... ఇప్పుడయినా తెలంగాణాకి జరిగిన అన్యాయానికి ప్రాయశ్చితం చేద్దాం" అన్నారా? అబ్బే!! ఎందుకంటారూ? "మిగిలినవాళ్ళు ఎటుపోతే మాకేం? మా హైదరాబాద్ మాకొస్తే చాలు" - అంతేనా?

ఇక వేర్పాటువాదుల సంగతి - నిజంగానే తెలంగాణా కావాల్సినవారైతే "సరే, ఉన్న చిక్కంతా హైదరాబాదే కదా. దానిని కొన్నాళ్ళు విడిగా పెడదాం - మిగిలిన జిల్లాలని కలిపి వెంటనే తెలంగాణా ఇవ్వండి - హైదరాబాద్ తేలేదాకా విడిగా పెడదాం" అనుండే వారు, సమైక్యవాదులు అందరూకాకపోయినా చాలామంది ఒప్పేసుకునేవారు - కానీ అలా అన్నారా? లేదే! "హైదరాబాద్ లేని తెలంగాణా మాకొద్దు" అనడంలోనే తెలుస్తోంది తెలంగాణామీద ఎంత ప్రేముందో. మిగిలిన జిల్లాలు జిల్లాలు కావా? వాటిట్లో మనుషులు ఉండరా? అదీ కాక మహరాష్ట్రకీ, కర్నాటక కి జిల్లాలని మొత్తం వదులుకోలేదా? ఇది అంతకన్నా ఘోరమేమీ కాదే?
స్వగతం: అమ్మో! రెండు గుంపులనీ కెలికి రాళ్ళేసా ... ఇద్దరూ కలిపి వాయిస్తారేమో?

10, జనవరి 2010, ఆదివారం

కొమ్ములు ' విరిగిన ' మొనగాళ్ళు - టెక్సస్ లాంగ్ హోర్న్స్

2003 వర్ల్డ్ కప్ ఫైనల్ లో ఇండియా ఓడిందన్న బాధకన్నా ఆస్ట్రేలియా గెలిచిందన్న కుళ్ళే నన్ను దహించివేసింది. అలాంటి సంఘటనే మొన్న గురువారం పునరావృతమైంది. కొమ్ములుతిరిగిన టెక్సస్ లాంగ్ హోర్న్స్ ఫుట్ బాల్ జట్టును అలబేమా క్రింసన్ టైడ్ జట్టు వీరబాదుడు బాదింది ఫైనల్లో.

ఇప్పుడూ కూడా టెక్సస్ ఓడిన బాధ కన్నా అలబేమా గెలిచిన కుళ్ళే నన్ను ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా అలబేమాలో పండగ చేసుకుంటున్న నా ఫ్రెండుగాడు దివాకర్ ని తలుచుకుంటుంటే.

<a href="http://video.msn.com/?mkt=en-us&playlist=videoByUuids:uuids:1e464584-c981-447c-b6fb-3c59408afd2d&showPlaylist=true" target="_new" title="Petros: Texas loses McCoy, title">Video: Petros: Texas loses McCoy, title</a>


ఈ సందర్భంగా సంతాప సూచకంగా ఆంధ్రప్రదేశ్ అల్లరిమూకలనుండి పొందిన స్ఫూర్తితో టెక్సస్ లాంగ్ హోర్న్స్ టీషర్టును తగలబెడదాం అనుకుంటున్నాను - ఏమంటారు?

అన్నట్టు ఆస్టిన్ లో దానిని తగలబెడితే జనాలు నన్ను తగలేసి తగిలేస్తారు. వారి లాంగ్ హోర్న్స్ అభిమానం ముందు భారతీయుల క్రికెట్ అభిమానం ఎందుకూ కొరగాదు - అందుకని పిట్స్బర్గ్ లో తగలబెడదామనుకుంటున్నా - వారం రోజులనుండీ కురుస్తున్న మంచులో భోగిమంట వేసి.


4, జనవరి 2010, సోమవారం

శ్రీశ్రీ గారికి మళ్లీ క్షమాపణలతో ... అసురసంధ్యా సమస్యలు ..

ఆ వైపున లాడెన్ ఒసామా
ఈ వైపున బరాక్ ఒబామా
ఎన్నాళ్ళిక బ్రతికుంటాననే
సమస్య ఇక పాకిస్తానుది

ఉత్తరాన టైనన్మేన్ స్క్వేర్
పశ్చిమాన ఇరాక్, ఆఫ్ఘన్
ఏ దేశాన్ని విమర్శించాలనే
సమస్య ఒక విశ్లేషకునిది

సాంప్రదాయక తాడేపల్లి
రెబేలియస్ కత్తి మహేష్ కుమార్
ఎవరి బ్లాగు చదవాలన్నదే
సమస్య ఒక బ్లాగ్రాయుడిది

అటు చూస్తే తెలంగాణా
ఇటు చూస్తే సమైక్యాంధ్ర
ఎవరివైపు చేరాలన్నదే
సమస్య ఒక కాంగ్రేస్ వాదిది

ఒకరి చేతిలో అద్దాలు పగిలి
మరొకరితో తగలబెట్టబడి
రేపెలా పరిగెత్తాలనే
సమస్య ఒక అర్టిసీ బస్సుది

అటు చూస్తే వారి బందులూ
ఇటేమో ఈ నిరసనలు
మరునాటికి తిండెక్కడనే
సమస్య ఒక కూలి మనిషిది

కింగ్ ఫిషర్ సూపర్ మోడల్
ఈటీవీ అత్తాకోడల్
ఏ ప్రోగ్రేం చూడాలన్నది
సమస్య ఒక తెలుగు గృహిణిది

సబ్‌వే లో ఫుట్‌లాంగ్ సాండ్విచ్
పాపా జాన్స్ క్రిస్పీ పీట్జా
ఏదితినాలో తేల్చుజోలేని
సమస్య ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ది

ఒక చానెల్ లో ఐ.పీ.యల్
మరొక చోట వండే క్రికెట్
ఏమి పెట్టుకోవాలన్న
సమస్య ఒక పిల్లకాయది

ఆ మూలన రీడిఫ్ పాప
ఈ మూలన బ్లాగుల భామ
ఎవరి సెల్లు మోగించాలనే
సమస్య మన రవిగారిది

ఆ సైడు ఒంగోలు సీను
ఈ సైడు ప్రమాదవనమూ
ఎందులో పోస్టాలన్నదే
సమస్య అసలు శ్రీనివాసుది

ఒక బ్లాగులో "హేటు" వాదులూ
మరోదానిలో మన మార్తాండ
ఎవరిని ముందు కెలకాలన్నదే
సమస్య మలక్‌పేట్ రౌడీది :))

2, జనవరి 2010, శనివారం