19, జనవరి 2010, మంగళవారం

అవతార్ శేడిస్టులు

ఈ మధ్య ఒక కొత్తరకం శేడిస్టులు పుట్టుకొచ్చారండోయ్. వాళ్ళు దేనికయినా బలైపోతే, పక్కవాళ్లకి చెప్పకుండా - అబ్బో, భలే ఉంది, సూపరో సూపరు అంటూ పక్కవాడిని కూడా బలి చేసే రకాలు. అవతార్ సినిమా బ్రహ్మాండం, అబ్బో తిరుగులేదు అంటూ రాసిన రివ్యూలు చదివి వెళ్ళి చూసి మరీ బలి అయిపోయా! చూసి 24 గంటలైనా తలనెప్పి ఇంకా తగ్గలేదు - చిరు, బాలయ్య, రజనీకాంత్ ముగ్గురినీ కలిపేసి రూపొందించిన హీరో, విజయశాంతి, రోజాలని కలిపిన హీరోయిన్ ఇక "నిన్ను వదల బొమ్మాలీ" అనుకుంటూ ఒక తొక్కలో మిలట్రీ మామ .. శేం ఏండర్‌సన్ టైపులో మిగతా జనాలు.

దేవుడా దేవుడా మా మంచి దేవుడా .. నన్ను ఈ సినిమాకి తీసుకెళ్ళిన మోహనరాగానికి ఇదే సినిమా రెండోసారి చూసే భాగ్యం ప్రసాదించు స్వామీ - అప్పటికి గానీ నా కసి తీరదు!!!! ఇలాంటి సినిమా మన తెలుగులో చాలా తక్కువ ఖర్చులో తియ్యచ్చేమో ... చిరంజీవికో, బాలయ్యకో, వెంకటేషుకో జస్ట్ నీలం రంగు పూస్తే చాలు, గ్రేఫిక్స్ ఖర్చు కూడా ఉండదుగా :))


మిగిలిన సినిమాలని "అవతార్ ముందు", "అవతార్ తరవాత" గా కాదు .............. "అవతార్ కన్నా కాస్త బెటర్", "అవతార్ కన్నా చెత్త" గా క్లేసిఫై చేసే రోజు ఎంతో దూరంలో లేదు.

ఇక చాలు .. నేను అడవుల్లోకి పోయి పిట్టలకి, గబ్బిలాలకి, నా తోకని కలిపి వాటి మీద ఎక్కి ఊరేగాలి .. టా టా!

16 వ్యాఖ్యలు:

 1. హీ హీ హీ. మరీ ఇలా ఏకేసారెంటండి బాబూ అదీ సినిమా బిలియన్ డాలర్లు పై చిలుకు కలెక్షన్లు చేసాకా.
  నాకు నచ్చని విషయాలు ఉన్నా ఈ సినిమాలో నచ్చినవి ఉన్నాయి. కానీ చెప్పను . చెప్తే నా అడ్రస్ కనుక్కొని వచ్చి మరీ కొట్టేడట్టు ఉన్నారు మీరు :)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. దీన్ని బట్టి మీ అభిరుచి కొంతవరకు అర్థం అవుతుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. నాయినాహ్ రౌడీ, హెంత కాలానికి అవతార్ నచ్చలేదూ అన్న మనిషిని చూశాను బాబూ. ఈ సంతృప్తితో హాయిగా గుండెపోటు తెచ్చుకుంటా నాయినాహ్ (గుమ్మడి స్టయిల్లో).

  మలక్పేట్ గారూ, నాక్కూడా అవతార్ నచ్చలేదు . అసలు ట్రయిలర్ చూడగానే నిర్ణయించుకున్నా ఈ సినిమా నాకు నచ్చదు అని. కానీ మా బంధువులు, సహోద్యోగులు, స్నేహితులు, బ్లాగర్లు ఒక్కరేమిటి ప్రతీవాళ్ళూ అదేపనిగా దీన్ని పొగుడుతుండటంతో నా జడ్జిమెంటు మీద అనుమానమొచ్చి బలవ్వాల్సొచ్చింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మీకొసం తెలుగు లొ

  http://manchupallakee.blogspot.com/2009/12/blog-post_21.html

  ప్రత్యుత్తరంతొలగించు
 5. రౌడీ,

  రివ్యూకన్నా, రివ్యూయర్ చాలా ఇంపార్టంటు. ఎవరన్నారు, అవతార్ పెద్ద పిస్తా అని? అదో తొక్క.

  డబ్బాలో పడుకుని, ఇంకోచోట లెగవటం ప్రాక్టీసు చెయ్యాలి. నేనూ వస్తా.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. Join the club! I didn't like the movie too. IMO, the sign of a good movie is that it is enough entertaining/thought provoking/engaging even if you watch it more than once. I can watch a Godfather whenever I want to without getting bored or a Good Will Hunting, Pirates of Caribbean, Few Good Men, Gladiator, 300 etc.,

  Try watching Avatar for the second time and if you feel like watching till the end, then you have supernatural ability for taking crap!

  Having said that, liking/disliking a particular movie or a girl or food are matters of taste. There is no tangible way that one can define, if you allow the expression, a universal taste norm. Thats what makes discussions on movie forums like Navatarangam absolutely meaningless and third rate.

  Coming back to Avatar, I felt Cameron's so called 'imaginative planet' was rather funny. The Na'vi's are improvised and costly versions of Yahoo emoticons, the bio-mechanical-self-illumining-whatever crap trees are hilarious. I, for one, would feel creepy where the plants and flowers look like christmas trees decorated with cheap neon lights. And what more, the story is not even original!!

  http://www.huffingtonpost.com/2010/01/04/avatar-pocahontas-in-spac_n_410538.html

  ప్రత్యుత్తరంతొలగించు
 7. నాకూ సినిమా నచ్చింది కానీ మీ బాధలు మరీ మరీ నచ్చాయి.

  ముఖ్యంగా రెండో వాక్యం...వాళ్ళు దేనికయినా బలైపోతే, పక్కవాళ్లకి చెప్పకుండా - అబ్బో, భలే ఉంది, సూపరో సూపరు అంటూ పక్కవాడిని కూడా బలి చేసే రకాలు. ఇది సూపరో సూపరు!

  ప్రత్యుత్తరంతొలగించు
 8. "సూపరో సూపరు అంటూ పక్కవాడిని కూడా బలి చేసే రకాలు. ఇది సూపరో సూపరు"

  అక్కాయ్! సూపరో సూపరు అన్జెప్పి నువ్విప్పుడెవ్వుర్ని బలిజేస్తాండావో రూంత జెప్పు? ;)

  ప్రత్యుత్తరంతొలగించు
 9. మానస సంచర:

  నాకు కూడా నచ్చినవి అక్కడక్కడ ఉన్నయి లేండి - కానీ అవేవి తలనొప్పినాపలేదు

  అజ్ఞాత:
  దీనిని బట్టి నా అభిరుచి ఏది కాదో అర్ధమవుతుంది

  బ్లాగాగ్ని:
  హెంత మాఠ అన్నారు నాన్నా! అవతార్ సినిమానే తట్టుకున్న మీకు గుండె పోటు ఒక లెక్కా?


  మంచు: హీహీహీ .. బావతార్! బాలయ్య ఉంటే సినిమాలో రెండూ డ్యూయెట్లు కూడా ఉంటాయి ..

  నావి పాపా నావి పాపా, నాతో వస్తావా
  పక్షినెక్కిస్తావా, తోక కలిపేస్తావా
  బాణమేసి విలన్ గాడిని చంపేస్తావా ..


  అజ్ఞాత:

  అవతార్ సినిమా చూసిన వాళ్ళ ఆత్మ హత్యల వివరాలేమైనా ఉన్నయా?

  రవి:

  తెలుగు సినిమాలలో వచ్చే డైలాగులిలా ఉంటాయేమో:

  "పెట్టెలో పడుకోబెడతా జాగ్రత్త!"
  "ఎక్కువ మాట్లాడితే రెడ్డు బటన్ నొక్కుతా ఖబడ్దార్!"

  శరత్: రెండో తోక ఎందుకబ్బా?

  ప్రశాంత్: ఒక్క సినిమాని సింగిల్ అవుట్ చెయ్యడం కష్టం. నా ప్రోఫైల్ లో నాకు నచ్చిన సినీమాలు ఉన్నాయ్ చూడండీ. అజ్ఞాత గారూ మీరు కూడా దానిని బట్టి నా అభిరుచి (అసలు టేస్టంటూ ఒకటి నాకు తగలడితే) తెలుస్తుంది మీకు :))

  కొత్తపాళీ: థేంక్యూ

  ఆర్కే: మీ లింకులో పేజీని ఒక పోస్టుగా వెయ్యబోతున్నా

  సుజాత: థేంక్యూ

  అజ్ఞాత: ఇంకెవరు, బలి పశువుని నేనేగా?

  ప్రత్యుత్తరంతొలగించు
 10. Same thing happened to me with Titanic. Hated it to the core and couldn't sit through. Keeping that in mind I haven't even dared to enter the theater playing Avatar.

  -Hemanth

  ప్రత్యుత్తరంతొలగించు
 11. మీ కామెంట్ స్పేస్ ను వాడుతున్నందుకు ముందుగా క్షమాపణలు. దయచేసి ఒక్కసారి జీవని వెబ్సైట్ www.jeevanianantapur.org ను చూసి మార్పులు చేర్పులు సూచించవలసిందిగా కోరుతున్నాము. మి అమూల్యమైన సలహా తప్పక ఉపయోగపడుతుంది.
  kathasv@gmail.com
  jeevani.sv@gmail.com

  మీ,

  జీవని.

  ప్రత్యుత్తరంతొలగించు