24, డిసెంబర్ 2010, శుక్రవారం

నల్ల బఱ్ఱె

ఒక వాక్యాన్ని మూడు లేక నాలుగు లైన్లుగా విడగొట్టడమే  కవిత్వమయితే నా ఈ కవితకి నోబెల్ వచ్చి తీరాలి


పక్కవాళ్ళ మీద, వాళ్ళ మతం మీద
కారుకూతలు కూస్తూ నడుస్తున్న నల్ల బఱ్ఱెని
అనుసరిస్తున్నాయి ఆహా ఓహో అంటూ కొన్ని గొర్రెలు

అందులో ఏ గొఱ్ఱే తలెత్తటంలేదని
ధృవీకరించుకున్నాక ఆ బఱ్ఱె
మరికాస్త ముందుకి నడవటం మొదలుపేట్టింది

గొఱ్ఱెలనే కాదు
బఱ్ఱెలని అనుసరించేవి కూడా గొఱ్ఱేలేనన్న
కొత్త ప్రతిపాదనతో గర్వంగా అడుగులు వేస్తోందా బఱ్ఱె

హిందువుల మీద విషం కక్కుతూ
హిందువులను అవమానిస్తూ
విద్వేషమే ఊపిరిగా సాగిపోతోందా బఱ్ఱె

ఒక కొండ అంచుకు వచ్చాక
"జై బాబా" "సై సై బాబా"
అంటూ కిందకి దూకేసింది

దానితో పాటుగా దూకిన
గొఱ్ఱెని ఆనందంగా తడుముతూ
హిందువుల పై ద్వేషాన్ని గొఱ్ఱెలపై రుద్దానన్న
గర్వంతో ఆ బఱ్ఱె ఆ గొఱ్రె వైపు చూసి ఉలిక్కిపడింది
ఆ గొఱ్ఱె రంగు నలుపు!

ఏదో అనుమానమొచ్చి తలపైకెత్తి చూస్తే
"టా టా బై బై! మేము గొఱ్ఱేలమే కాని
నీలాంటి ద్వేషులం, సంఘ విద్రోహులం కాదు
నిన్ను వదిలించుకోడానికే ఇంతదూరం అనుసరించాం!
మాలో చెడబుట్టినది నీతోనే దూకింది!!"
అంటున్న గొఱ్ఱెలమంద!!!

"ఎవరు నువ్వు?" అని గద్దించిన బఱ్ఱెకి సమాధానంగా
 నా పేరు "M.." అని
ఆ నల్ల గొఱ్ఱె చెప్తుండగానే బఱ్ఱె తల ఒక బండరాతిని తాకింది :(

6, డిసెంబర్ 2010, సోమవారం

పాకిస్తానీ గజనీ :))

ఎవరన్నారండి పాకిస్తానిలకి సెన్స్ ఆఫ్ హ్యుమర్ తక్కువని?3, డిసెంబర్ 2010, శుక్రవారం

రౌడీరాజ్యం పై కమ్యూనిష్టుల ఏడుపు :))

In response to


http://srijabili.blogspot.com/2010/12/blog-post_03.html


నీలాంటి చిల్లర రాజకీయాలు... ఓట్ల గురించి కాదు.
___________________________________

కానేకాదు - నీలాంటి చిల్లర వీధిపోరాటాలగురించి మాత్రమే :))


ప్రపంచ కార్మికులందరూ ఆదర్శంగా తీసుకుంటూ ఇప్పటికీ తమ గుండెల్లో పెట్టుకుని ఆరాధించే చికాగో కార్మిక పోరాటం
____________________________________________________


అది ఆదర్శంగా తీసుకునేది కార్మికులు - కమ్యూనిష్టులంటే చాలామంది కారికులకి అసహ్యమే :)) సోషలిస్టులు చేసినదాన్ని కమ్యూనిష్టులు హైజాక్ చేసిందే కాకుండ కబుర్లొకటీ!

All workers are not communists and a majority of the workers even in India dont trust communists.

Evidence: భారతదేశంలో అతిపెద్ద కార్మిక సంఘం భాజపా కి సంబంధించిన భారతీయ మజ్దూర్ sangh (BMS). దాని తర్వాతి స్థానం కాంగ్రేసుది. కమ్యూనిష్టులు మూడో స్థానంలో ఉన్నారు. అంటే దానర్థం? కార్మికులకే కమ్యూనిష్టులంటే నమ్మకం లేదనేగా?

చరిత్ర చదువు అనవసరంగా ఏది పడితే అది కూయకు విషయం మీద పూర్తి పరిజ్ఞానం ఉంటేనే మాట్లాడాలి
________________________________________________

చరిత్రలో చ కూడా తెలియని నీలాంటి వాళ్ళే కదా పాపం చరిత్ర గురించి మాట్లాడేది? నువ్వన్న చికాగోలో నేను రెండేళ్ళున్నా, అక్కడ కమ్యూనిజమెంత ఉందో చూసా. నువ్వెన్నాళ్ళు ఉన్నావేంటి ఉపన్యాసాలివ్వడానికి?


వాళ్లు పెట్టే చిత్ర హింసలు తట్టుకోలేక, వెట్టి చాకిరి చేయలేక, తిరగబడ్డ తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల గురించి అవహేళనగా మాట్లాడే నీతో
___________________________________________________

అక్కడ పోరాటం చేసింది రైతులు. కమ్యూనిష్టులు వాళ్ళని ఎలా వాడుకున్నారో గుర్తించారుగనకనే ఒక్క వోటు కూడా ఆ ద్రోహులకి వెయ్యరు


కమ్యూనిజం అంటేనే ఐడియల్‌..... దానికి నీ వంకర సూత్రాలు అనువదించకు.
____________________________________________________

అచ్చు తప్పు. ఐడియల్ కాదు - ఈనాటి కమ్యూనిష్టు పార్టీ ఐడిల్. పనీ పాటా చెయ్యని బధ్ధకస్తుల గుంపు :))

ఏసి గదుల్లో కంప్యూటరు మీద వేళ్లు ఆడిస్తూ గడిపే మీకేం తెలుసు మా పేదల బాధలు.
___________________________________________________

ఏసిగదుల్లో కూర్చున్నా మేము కష్టపడతాం రోజుకి పన్నెండు గంటలు. మీలాగా సామాన్య ప్రజలని మిగతావారి మీదకి రెచ్చ్గొట్టి వాళ్ళ రక్తాన్ని దోచుకు త్రాగం. అసలు సిసలైన దోపిడిగాళ్ళు మీ కమ్యూనిష్టు ద్రోహులే.


సిస్టమ్‌ (కంప్యూటర్‌) మీద కూర్చుని సిద్ధాంతాలు వల్లించడం కాదు ఒక సారి బయటికి వచ్చి చూడు.
____________________________________________________

అబ్బో, ఆ సిస్టంలేకేకపోతే నీకు ఈ బ్లాగు రాసే సీనే ఉండేదికాదు. ఇదే మరి ఇప్పటి కమ్యూనిజం. నువ్వు పనీ పాట చెయ్యకుండా సిధ్ధాంతాలు వల్లించచ్చుగానీ అవతలవాడు అదే పని చేస్తే తప్పు కదా :))


పార్లమెంటు లో సీట్లు కాదు ప్రజా సమస్యలపై చేస్తున్న పోరాటాలు చూడు....
___________________________________________________

అబ్బో అబ్బబ్బో, మరి బెంగాల్లో వచ్చిన ఎసెంబ్లీ సీట్లగురించి డబ్బా కొట్టుకున్నదెవరో? నిజంగా ప్రజా సమస్యలాఇ పోరాటం చేసుంటే ఈ పాటికి అధికారమే వచ్చేది. చైనా దగ్గర డబ్బులు తీసుకుని అమేరికాకి వ్యతిరేకంగా ఇండియాలో ధర్నాలు చేస్తే ఎక్కడొస్తుందీ? :))ఈ ఈ ఉద్యమాలు అన్నీ ఈ నెలలో కమ్యూనిస్టులు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజల పక్షాన నిలిచి చేసిన ప్రజా ఉద్యమాలు.
ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ముందుండి పేదవారి సమస్యలు తీర్చేది కేవలం కమ్యూనిస్టులు మాత్రమే అని మర్చిపోకు.
_____________________________________________________

అవునవువు పాపం అందుకే ఆ పేదవారే చీకొడుతున్నారు కమ్యూనిష్టులని :))


But there is one thing I would agree with - AP communists sound much better than the other pinkos

30, నవంబర్ 2010, మంగళవారం

అది కమ్యూనిజమా? LOOOOOL

Read this article first. This post is in response to that.చికాగో కార్మికులనెత్తుటి మరకలను అడుగు కమ్యూనిజం అంటే ఏమిటో...
________________________________________________

రా, వచ్చి చికాగోలో కమ్యూనిజం గురించి మాట్లాడు. చెప్పు తీసుకుని కొడతారు. కమ్యూనిష్టు ఐడీయాలజీతో నిలబడ్డ ఇండిపెండెంట్లకి పట్టు మని పదోట్లు కూడా రావు ఇలినాయ్ లో.

భూమి కోసం భుక్తి కోసం బానిస సంకెళ్ల విముక్తి కోసం సాగిన పోరాటంలో రజాకార్లకు, నైజాము మూకలకు ఎదురొడ్డి పేద వాళ్లకు అండగా నిలిచి గుండుకెదురుగా గుండెను నిలిపి ప్రాణాలను తృణప్రాయంగా విడిచిన 4000 వేల మంది తెలంగాణా రైతాంగ సాయుదపోరాట అమర వీరుల బలిదానాన్ని అడుగు కమ్యూనిజం అంటే
___________________________________________________________________________________

పోరాటం విముక్తి పేరుతో ఆ సామన్య ప్రజల జీవితాలతో ఆడుకున్న కమ్యూనిష్టులకి బుధ్ధిబాగానే చెప్పారు కదా ప్రజలు ప్రతీ ఎలక్షన్ లో :)) మీ వోట్లకోసం సామాన్యుల సమయాన్ని రక్తాన్ని బలితీసుకున్న పధ్ధతితో పోలిస్తే కాంగ్రేస్, టీడీపీ, బీజేపీలొక లెక్కా?


ఒక సారి పల్లెల్లోకి వెళ్లి చూడు ఎర్రజెండా అంటే గుండెను చీల్చి ఇచ్చేవాళ్లుంటారు
________________________________________________

సర్లే, అఫ్ఘానిస్తాన్ లో ఒసామా బిన్ లాడేన్ కోసం గుండేమిటి మొత్తం శరీరాన్నే చీల్చుకునే వాళ్ళుంటారు


అన్ని పార్టీలు నాయకులతో నడిస్తే ఎర్రజెండా పేద ప్రజలతో నడుస్తుంది
____________________________________________

అందుకే పాపం 90% రాష్ట్రాల్లో డిపాసిట్ కూడా దక్కదు కమ్యూనిష్టులకి.నిజమే కమ్యూనిస్టులు సాధారణంగా అధికారంలోకి రారు వస్తే దిగే చాన్సే ఉండదు అందుకే భారత దేశంలో ఒక రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్‌లో కమ్యూనిస్టు పార్టీ 30సంవత్సరాలుగా దిగ్విజయం సాధిస్తుటే దానిని ఆదర్శంగా తీసుకుని కేరళ త్రివేండ్రం లాంటి రాష్ట్రాలు కూడా కమ్యూనిస్టుల చేతి కొచ్చాయి
____________________________________________________________________________________

కేరళలో కమ్యూనిష్టులు ఎన్నిసార్లు ఓడారో లెక్కలు చూపించమంటావా? త్రిపురతో సైతం. మొన్నటికి మొన్న స్థానిక సంస్థల ఎన్నికలలో బెంగాల్ లో కూడా.


సామ్రాజ్యవాద అమెరికా లాంటి దేశాలతో కమ్యూనిజం అనుక్షణం పోరాడుతూ ముందుకు సాగుతూనే ఉంది
_______________________________________________________________

అందుకేనా, ఒక్క సీటూ సెనేట్ లో, హౌస్ లో లేక డెమాక్రాట్లకి మదదతిస్తోంది?


కానీ ఒక్క సారి ఒకే ఒక్క సారి పాజిటీవ్‌గా ఆలోచించి కమ్యూనిజం గురించి కనీసం తెలుసుకో
_______________________________________________________

అదే మరి, ఇక్కడ మాట్లాడుతోంది ఇప్పుడున్న కమ్యూనిజం గురించి, ముఖ్యంగా ఇండియాలో ఉన్న కమ్యూనిజం, కమ్యూనిష్టుల గురించి.

అసమానతలు లేని, అసలు సిసలైన కమ్యూనిజం ఏనాడొ చచ్చిపోయింది ఈ కమ్యూనిష్టుల ద్వంద్వప్రమాణాల వల్ల. "ఐడియల్" కమ్యూనిజానికి ఇప్పటి కమ్యూనిజానికి ఉన్న తేడా గాంధీ హయంలో కాంగ్రెస్ కీ, సోనియా గాంధి హయాంలో ఉన్నదానికీ మధ్య ఉన్న తేడాలాంటిదే. Even in case of ideal communism, some of the ideas are flawed.

28, నవంబర్ 2010, ఆదివారం

పాలవెల్లిగారికి మళ్ళీ ధన్యవాదాలు :))

ఈయన బ్లాగులో కొడుతున్న కమ్యూనిష్టు డబ్బా లో మరో రాయి ఈయనగారి report. అయితే ఇదే సమయంలో ఆ ఫ్రంటులో ఒక్ భాగస్వామే కమ్యూనిష్టు అవినీతి గురించి గళమెత్తిన వైనం చూడండి :))


CPI questions CPM’s corruption in Kerala
November 29, 2010 5:54:42 AM

VR Jayaraj | Kochi

Perhaps for the first time in the more-than-three-decade history of Kerala’s LDF, its lesser constituent CPI has openly turned against front leader CPI(M) over its leaders’ tendencies of corruption and arrogance.

CK Chandrappan, newly-elected State secretary of the CPI, on Sunday asked the CPI(M) to review its approach to allegations of corruption against its State secretary Pinarayi Vijayan in the Rs 374.5-crore SNC Lavalin scam. This is the first time the CPI has made such a demand.

Chandrappan called for serious discussions in the CPI(M) on whether the allegations of corruption against Pinarayi Vijayan had affected the credibility of the entire LDF. Pinarayi Vijayan, the first-ever CPI(M) Politburo member to face court in a corruption case, is seventh accused in the case, according to the CBI chargesheet.

The CPI secretary said in a television interview that the CPI(M) should examine whether the people would endorse its decision to face the corruption case against Pinarayi politically. After Kerala Governor RS Gavai cleared Pinarayi’s prosecution, the CPI(M) had held a campaign alleging that the Centre was misusing the CBI to settle scores with it for withdrawing support for the UPA regime.

అయినా అబధ్ధాలలో పుట్టి అబధ్ధాలలో బ్రతకడం కమ్యూనిష్టు దేశద్రోహులకు అలవాటేగా? :))

24, నవంబర్ 2010, బుధవారం

పాలవెల్లి గారూ - You are more than welcome!

డైరెక్టు గా మీ చాటభారతంలోకే వద్దాం:


మీ కమ్యూనిజానికి సరైన నిర్వచనం "భారత తిండి తిని చైనా కోసం మొరిగే విశ్వాసం లేని చైనా వారి "వేగు"కుక్క!"

మీరన్నమాటే "ఉత్తర కొరియా, దక్షిణ కొరియా యుద్ధం ప్రజాశక్తి కళ్లకు కనిపించదా అంటూ తెగ రాసేశారు. దానికంటే ప్రాధాన్యత అంశాలు ఎన్నో ఉన్నాయి"

అవును కదా! మరి ఆఫ్ఘన్, ఇరాక్ యుధ్ధాల గురించి మాట్లాడేటప్పుడు ఆ అంశాలు మీకు గుర్తురావుకదా. ఎప్పుడయితే మీ కమ్యూనిష్టుల డొలాతనం, పనికిమాలినతనం, ద్రోహాలు బయటపడతాయో అప్పుడే మిగతా అంశాలు గుర్తుకొస్తాయి

మీరన్నమాట: "భూర్జువా పత్రికల వల్లే పేజీలకు పేజీలు నిపండం కాదు జర్నలిజం అంటే"

మరి రోజుకి 15 పోస్టులతో మీ పనికిమాలిన ప్రజాశక్తి నిమౌతోంది ఏమిటో? వెబ్ పేజీలు కదా?


"ప్రజా అవసరాలకు ఏమి కావాలి"
______________________


కమ్యూనిష్టుల దేశద్రోహపు కబుర్లు మాత్రం కాదు


వారిని చైతన్యం వైపు ఏలా మళ్లించాలి
_____________________________________________


చైనా వేదం నమ్మిన ద్రోహిని బీజింగ్ దాకా తరిమితే చాలు. చైతన్యం అదే వస్తుంది :)

టెంకాయలో శివలింగం..బొప్పాయపండులో బొజ్జగణపయ్య
____________________________________

అబ్బా, అంతేనా? కంప్యూటర్లతో నిరుద్యోగం, ప్రైవేటీకరణతో ఘోరాలు, ఔట్సోర్సింగ్ తో సర్వనాశనం, గీ యెం తో హాని, వాల్ మార్ట్ తో కష్టాలు?

మీ కమ్యూనిష్టులు చెప్పే కల్లిబొల్లి కబుర్లముందు ఆ టెంకాయ శివలింగాల కథలెంతలేండి మరీను!


ఆ టెంకాయ శివలింగాల వల్ల ఎవరికీ పెద్దగా నష్టం లేదు నమ్మిన వాడికి ఒక పదిరుపాయల దక్షిణ తప్ప. అదే మీ కబుర్లతో? మీ వల్లే కదా 70-80 లలో రెండు తరాలు భ్రస్టుపట్టిపోయాయి! పారిశ్రామీకరణ జరగకుండా అడ్డుపడి ఆ రెండు తరాలని సర్వనాశనం చేసిన మీతో పోలిస్తే ఆ దొంగబాబాలెంత?


..కోట్లాది రూపాయలు కొల్లగొడుతూ స్విస్‌లో దాచుకుంటున్న క్రోనీ కేపటలిస్టులపై ప్రజల చింతించే అవకాశం రాకుండా చేయడం ఆ టీవీల, పత్రిక ప్రధాన బాధ్యత కాబోలు
________________________________________________

అదే స్విస్ బేంక్ లో ఖాతాలున్న మీ బెంగాలీ కమ్యూనిష్టు వారసుల సంగతేమిటో మరి?

ప్రజలు ఇచ్చిన విరాళాలతో నడుస్తున్న ప్రజా చైతన్య కరదీపిక.
___________________________________________________________________

అవును మరి, అబధ్ధాలే ఊపిరిగా నడిచే పత్రిక విరాళాలతోగాక లాభాలతో నడుస్తుందా?

మీకు అర్థం కావాలంటే బోపాల్‌ విషవాయు బాధితులనడగండి
______________________________________

చైనా అక్రమించుకున్న భూభాగంలోని నివాసితులని అడగక్కరలేదు కదా? అనుక్షణం భయం గుప్పిట్లో బ్రతుకుతున్న అరుణాచల్ ప్రదేశ్ ప్రజలని అడగక్కరలేదు కదా?


పెట్టుబడి క్యాన్సర్‌ పుండు లాంటిది. ఆ పుండుకు పైపూత మందులు పనికి రావు. కణకణాన్ని పెకిలించి వేరు చేయాల్సిందే
___________________________________________________________________________

కమ్యూఇనిజం ఏయిడ్స్ వాయ్ధి లాంటిది. బయట దేశాలనుండి భారత్ లోకి కమ్యూనిష్టుల అక్రమసంబంధాల ద్వరా బాకిన వ్యాధి. పైపూత మందులు కాకపోయినా పెట్టుబడి కేన్సర్ ని కస్టపడి నియంత్రణలో పెట్టవచ్చు. కానీ కమ్యూనిష్టు ఎయిడ్స్ కి అసలు మందే లేదు. వ్యవస్థ సర్వనాశనం కావాల్సిందే.

శ్రమకు విలువనిచ్చింది. శ్రమకు ఫలితం దక్కాలంది. కార్మిక వర్గం నాయకత్వం వహించాలని సిద్ధాంతికరించుకుంది
_______________________________________________________________________

అవునవును. రోజుకి రెండు గంటలు మాత్రమే పనిచేసి మిగిలిన ఆరు గంటలు సమ్మెలతో కాలక్షేపం చేసి జీతం మాత్రం ఎనిమిది గంటలకు తీసుకోవాలనికూడ చెప్పింది :))

లేదంటే 12 కూడదంటే 16 గంటలు పనిచేసేవాడివే.
___________________________________

ఇదే మరి కమ్యూనిజమంటే. నేను రోజుకెన్ని గంటలు పనిచేస్తానో కూడా తెలియదుగానీ దానిమీద లెక్చరొకటి. అలాగే అసలు ప్రజల సమస్య ఏమిటో తెలియకుండా వాటి మీద కుహానా ఆందోళనలు కూడా!

చైనా..క్యూబా..మన కేరళ..త్రిపుర..పశ్చిమ బెంగాల్‌ వెళ్లండి..అక్కడి అభివృద్ధిని చూడండి
___________________________________________________________

చైనాలో అమేరికా పెట్టుబడులు, ఔట్సోర్సింగ్ ద్వారా చైనాకి వచ్చే పైకం ఎంతో తెలుసా మీకు?

క్యూబా, త్రిపుర, కేరళ అభివృధ్ధి ఎంతో మనకి తెలియదా? చివరిస్థానానికి పోటీ పడతాయి అవి :)) ఇంత పెద్ద దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో చెప్పుకోడానికి ఎడ్రస్ కూడా లేనిది మీ కమ్యూనిష్టు పార్టీ! జాతీయ పార్టీ గుర్తింపు కూడ పోగొట్టుకోబోయిన ఎఖైక పార్తీ!

మావోయిస్టుల కదంభహస్తాల్లో చిక్కుకున్న లాల్‌గఢ్‌లో తిరిగి ఎర్రబావుటా ఎగరడమే అందుకు ప్రతీక.
____________________________________________________________

ఒకటి ఇసక తక్కెడ, రెండోది పేడ తక్కెడ. పెద్ద తేడా ఏమీలేదు

కమ్యూనిజం మత ఉన్మాదానికి వ్యతిరేకం. మూఢ విశ్వాసాలకు వ్యతిరేకం. మతాచారాల పేరుతోనూ..కుల గౌరవాల పేరుతోనూ..సాంప్రదాయాల పేరుతోనూ జరిగే ఆరాచకాలకు వ్యతిరేకం.
___________________________________________________________________

అబ్బా చా! మరి ముస్లిం లీగుతోనూ, మదానీతోనూ, బుఖారీ మద్దతున్న ములాయంతోనూ పొత్తు పెట్టుకున్నప్పుడు గుర్తుకురాలేదా మత తత్వం? కేవలం హిందువుల విషయంలోనే గుర్తొస్తుందా ఇది?

నిజమే అదీ పిజ్జా యాడే. ఆ పిజ్జా యాడే కాదు. వాటిని కంటెంట్‌ యాడ్స్‌ అంటారు. అవి ప్రతిసారి మారుతుంటాయి. ఎవర్నో ద్రోహం చేసో..చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడో నేను ఆ ప్రకటను ఉంచలేదు. గూగుల్‌ వాడు ఇస్తే ఉంచాము.
____________________________________________________________

గూగుల్ లాంటి బూర్జువా కంపెనీ ఎందుకు? ఎంచాక్క పస్చిమ బెంగాల్ ప్రకటనలు పెట్టుకోలేకపోయారా? ఇక్కడ మాత్రం అమేరికా ఉత్పత్తులు కావాలి ( మీరు వాడే బ్లాగ్స్పాట్ తో సహా)

దానిపేరు కేరళ. ఏ ఒక్క మంత్రిగానీ, ప్రజాప్రతినిధిగానీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారా.
__________________________________________________________

అభివృధ్ధి చెందని ప్రాంతాల్లో అవినీతి కన్నా క్రిమినల్ కేసుల్లెకువ ఉంటాయి. పైగా కేరళలో ఉన్నది ఒక్క కమ్యూనిష్టు పాలనే కాదు. కాంగ్రేస్ పాలనకూడా ఉంది.


అసలు పెట్టుబడి అంటే దొంగతనమేనని
___________________________________________

ఒక పనిదొంగ మిగతావాళ్లని దోపిడీ దొంగలన్నాడు అంతేకదా ? Big deal? మీ కార్మిక సంఘాల నాయకులకేమో పని చెయ్యకపోయినా జీతం మాత్రం కావాలి. ప్రైవేట్ సంస్థల్లో ఆ పప్పులుడకవు. అదీ మీ అసలు కసి :))

కమ్యూనిష్టుల మౌనం?

అమేరికాలో చీమ చిటుక్కుమన్నా ఉలిక్కిపడి కాకిగోల చేసే కమ్యూనిష్టులు, వాళ్ళ కావు కావు మౌత్ పీస్ ప్రజాశక్తి ఉత్తర కొరియా విషయంలో మౌనంగా ఉండడానికి కారణమేమిటబ్బా? దక్షిణ కొరియాపై దాడి వీళ్ళ కళ్ళకు కనబడదా లేక నీటికన్నా రక్తం చిక్కననే సూత్రమా?


వీళ్ళమీద నేనిదివరలో వ్రాసిన ఒక చచ్చు కవిత :))When it rains in China
I would run for a cover
Even though I am in India
Since I’m a Mao lover

All that I wanna see
is everything painted Red
even it that means
craving for human blood

If my country goes nuclear
I would always resist
But if it’s Iran or N Korea
My recommendation is to persist

If Israel occupies neighbors
I would call her imperial
But when China does it to Tibet
To me, that a study material

If the US goes to war
She must be called a crusader
When a ‘Red’ country does the same
I call her a leader

When police kills militants
I scream “Human Rights?”
But when the militants go killing
I brand them freedom fights

When Saibaba does something
I pick a gun to shoot
But when Mother Teresa does it
I prefer to stay in mute

Fish medicine is crap
that’s what I would claim
But if its something non-Hindu
That’s not part of my aim

I can manipulate history
But my opponents can not
For I would stand exposed
If they untie the knot

Aryan Invasion theory
Is something I always profess
Even though I’m proved wrong
I would never confess

Before every civilian
I would scream “Science”
But when a scientist crosses me
I would say “Social conscience”

Trade Unions are my heart
I don’t care their likes
May be they get lazy but
Who cares? I wanna see ‘Strikes”

Religion is opium
and Caste means Shit
But Muslim league is an ally
Or else I’ll be Hit!

I'm always right
and the 'right' is laways wrong
If I get a chance
I even malign Armstrong

I would lead my life
Into some vague mist
That’s precisely because
I’m a God-Damned COMMUNIST!

23, నవంబర్ 2010, మంగళవారం

తిరోగమనవాదపు కమ్యూనిష్టులారా! చేస్కోండి విజ్ఞప్తులు ... హీ హీ హీ!!భారత తిండి తింటూ చైనాకు వంత పాడే ద్రోహులైకూడా ఇప్పుడు దొంగ బాబాల వంకతో హిందువుల మీద బ్లాగుల్లో దాడికి భలే ప్రయత్నిస్తున్నారుగా మీరు. దేశాన్ని సర్వనాశనం చెయ్యడానికి చూస్తున్న చైనా కన్నా ఈ దొంగబాబాలు, స్వామీజీలు చాలా నయం. బ్లాగులు తెరవడం మీకే కాదు మాకు కూడా వచ్చు. ఇప్పుడు సాధారణ జనాల్లో కూడా చైతన్యం వచ్చింది. వామపక్షం పేరుతో కొంతమంది చేస్తున్న దేశద్రోహపు పనులని జనాలు గమనిస్తూనే ఉన్నారు. సంకుచిత భావజాలంతో, దేశం పైన అంతులేని వ్యతిరేకతతో, నిరంతర హిందూ ద్వేషంతో కూడిన కమ్యూనిష్టు తిరోగమనవాదానికి సరైన సమాధానం చెప్పేవాళ్ళు చాలామందే ఉన్నారు. మీరు మిగతావాళ్ళమీద పదుల సంఖ్యలో రాళ్ళేస్తే వాళ్ళు తిరిగి వందల సంఖ్యలో వేస్తారని గుర్తుంచుకోండి.

My unconditional support to anyone who gives a fitting respose to those traitors!

22, నవంబర్ 2010, సోమవారం

కార్తీక మాసం - టోఫూ రీమిక్స్

లేడీ గుంపుని చూసి బ్రహ్మీలు వంటలు మొదలుపెట్టగానే మా అంకుళ్ళ పరిస్థితి పెనం మీదనించి పొయ్యిలో పడింది. లాభంలేదు ఏదో ఒక స్పెషల్ చెయ్యాలని అంకుళ్ళ సంఘం వారు తీర్మానించారు. సరే అని నేనో స్పెషల్ చేద్దామని డిసైడయిపోయా.

కానీ ఏమి చెయ్యాలి? రెగులర్ కూరలు సాంబార్లలో ఎపీల్ ఉండదు. మన ఓట్మీల్ స్పెషాలిటీస్ గత ఏడాదే చెప్పేశాను. ఇక మెక్సికనా ( మెహికన్?), ఇటాలియనా, మెడిటరేనియనా అని అలోచిస్తుంటే అసలు చైనీస్ ఎందుకు చెయ్యకూడదన ఐడియా వచ్చింది. ఇకేం? వెంటనే టొఫూ, సాయ్ సాస్, థాయ్ సాస్, స్పైస్ దినుసులు గట్ర పట్టుకొచ్చా. ( అసలు తెదామనుకున్నది కంగ్ పావ్ సాస్, కాని అది దొరకలేదు - వచ్చేవారం తెస్తా)

ఇక పీ ఎఫ్ చాంగ్ ప్రేరణతో దిగిపోయా :))

* ముందుగా ఒక మూకుళ్ళో కాస్తంత సన్ ఫ్లవర్ నూనే మరిగించా
* వేరు శనగ, ఏండు మిర్చి కలిపా
* దానిలో చక్కగా తరిగిన గట్టి టోఫూ వేయించేసా
* బాగా వేగాకా, సాయ్ సాస్ + వినేగర్ పోశా
* ఒక అయిదు నిమిషాలయ్యాక, థాయ్ స్వీట్ & పెపర్ సాస్ పోశా
* రెండు నిముషాలయ్యాక రుచి చూస్తే ఏడొ తక్కువనిపించింది
* సరే ఇక చిండీయన్ ( చైనీస్ + ఇండియన్ ) లోకి దిగిఫొయా
* ఆ వేగుతున్న మిశ్రమంలో కాస్తంత ఇంగువ వేశా
* ఒక నిముషం తరవాత కూర పొడి, ధనియా పొడి కలిపా
* ఇంకొంచం సాయ్ సాస్ పోశా
* పది నిముషాలు వేయించా

టోఫూ రీమిక్స్ రెడీ!!!

1, నవంబర్ 2010, సోమవారం

ఈ వారం పాకిస్తాన్ టెర్రరిస్టు దాడి జరిగే అవకాశం ఉందా?

మనవాళ్ళు దీపావళి కన్నా ఒబామా కోసమే ఎక్కువ నిరీక్షిస్తున్నట్టున్నారు, అయనేదో వచ్చి హాం ఫట్ అని మన కష్టాలన్నీ తీర్చేసేటట్టు :))

అయితే ఒకటి - ప్రతీ ముఖ్యమైన వ్యక్తి రాకముందు పాకిస్తాన్ ప్రాయోజిత టెర్రరిస్టు దాడులు భారత్ లో సర్వ సాధారణం - కాశ్మీరు మీదకి జనాల దృష్టిని మరల్చడానికి. ఈసారలా జరగ కూడదని భగవంతుడీని కోరుకుంటూ - రద్దీ ఉన్న ప్రదేశాలకి వీలయినంతవరకూ దూరంగా ఉండడం ఉత్తమమేమో?

28, అక్టోబర్ 2010, గురువారం

రెస్ట్ ఇన్ పీస్ - ఆక్టోపస్ పాల్!

సాకర్ ప్రపంచకప్ 2010 ఫలితాలని ముందుగానే చెప్పి సంచలనం సృష్టించిన ఆక్టోపస్ పాల్ అక్టోబర్ 26, 2010న చనిపోయింది.

25, అక్టోబర్ 2010, సోమవారం

ఒక "షిట్" కథ :))

నా కాశ్మీరు పోస్టు మీద కోపం అణచుకోలేక మన కత్తిలాంటి మేధావి గారు
కెబ్లాసని తిట్టిన తిట్లలో ఒకటి "Sh*t ****" అని. ఆ కామెంటుని నేను ఊడబెరికాననుకోండి, ఆయన వాడిన వేరే పదాలవల్ల. అయితే దానిగురించి ఎవరో అడిగారు అసలు "షిట్" అనేది బూతా అని. సరే ఆ పదం గురించే వ్రాసేద్దామని డిసైడ్ అయిపోయా! Read further at your own risk!

పూర్వకాలంలో ఎరువును - అంటే అదేనండీ, మానవ మలాన్ని - ఓడలలో ఒక చోటినుండీ మరొక చోటికి వ్యవసాయ పనుల నిమిత్తం రవాణా చేసేవారు. దాన్ని ఉంచిన సంచులను సాధారణంగా క్రింది డెక్ లో దాచేవారు. అయితే, ఆ పడవలకు కన్నాలుండండం, వాటి ద్వారా నీరు లోపలికి రావడం వల్ల, ఆ సంచులలోకి నీరు పోయి, ఆ నీరు, మలం కలవటం చేత మీథేన్ (Methane) వాయువుతో ఆ క్రింది డెక్ నిండిపోయేది. ఆ డెక్కులు చీకటిగా ఉండేవి కనుక, వాటిలోనికి వెళ్ళేవారి చేతిలో దివిటీలు తప్పనిసరి. కాని వెలుగుతున్న దివిటీతో మీథేన్ ఉన్న గదిలోకి వెళ్ళటం వల్ల ఓడ మొత్తం పేలిపోయేది.

ఈ సమస్యని పరిష్కరించడానికి అప్పట్లో నావికులు చేసిన పని, ఆ సంచులను పైభాగం లో ఉంచడం. "Handle with care" అని ఇప్పుడు మనము లేబుల్స్ పెట్టినట్టు ఆ సంచులపై వారు "Ship High In Transit" లేక టూకీగా "S.H.I.T" అని లేబుళ్ళు పెట్టేవారు. అప్పటినుండీ SHIT అనేది మలానికి పర్యాయపదం అయిపోయింది :))

Update: As Vimal points out Wiki calls this story a myth and says that the word orginated from the old English words Scite and Scitt. If the above story is really a myth then its time for me to unlearn what I have learnt. Wow!

కాశ్మీరుని వదులుకోవాలా? అలాగే!

మన మేతావుల సొమ్మేంపోయింది చెప్పండి? కాశ్మీరులో మూడు దేశాల సైన్యాలున్నా భారతదేశాన్నే నిందిద్దాం ఎందుకంటే మిగతా దేశాల గురించి మాట్లాడీతే వాళ్ళు తోలు తీస్తారు. వాళ్ళు అ భాగాలు వదలనంత కాలం ప్లెబిసైట్ అనేది సాధ్యం కాదని వీళ్లకి తెలియకనా? ఎంతయినా మనవారిది విశాలమైన గుండే కదండీ, దేశద్రోహపు విచ్ఛిన్నవాదుల్ని కూడా బిడ్డల్లాగా చుసుకుంటారు.

అన్నట్టు అయోధ్య విషయంలో కొని గజాల స్థలానికే ఏడ్చేసిన వాళ్ళు మొత్తం కాశ్మీరునే వదిలెయ్యాంటూన్నారెందుకో?

Its none of their friggin business to promote anti nationalism. Kashmir is pretty much a part of India as of now and its for the whole country to take a call on this. Forcing people to become traitors is a much bigger crime than any other social crime. Thats what these traitors have been doing in Kashmir.

17, అక్టోబర్ 2010, ఆదివారం

వడ్రంగిపిట్ట - చెవిలో పువ్వు

అబధ్ధాలు సృష్టించి రెండు ముడూ సార్లు వల్లెవేసి, అదే నిజమని నమ్మి పక్కవాడు కూడా నమ్మాలని గోల చేసేవాళ్ళు పాపం బ్లాగుల్లో ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు మన కత్తి వీక్షణ గేంగు, వడ్రంగి పిట్టలతో ఆ కొరత తీరింది.

ఆర్యులు బయటనుండి ఈ దేశంలోకి వచ్చేసి, ద్రవిడులని తన్ని తగిలేసి పండగలు చేసుకుటున్నారని ఈయన ఆరోపణ. రోమిలా థాపరే ఈ అబధ్ధాన్ని చెప్పి చెప్పి తీరా అది అబధ్ధమని నిరూపణ అయ్యాక ఏమి చెయ్యాలో తెలియక విలవిల్లాడుతోంది.

అది అబధ్ధాయినా ఫరవాలేదు దానివల్ల ఏదో తొక్కలో ఉద్యమం వచ్చేసిందోహో అదుకే అది నిజమని నమ్మేస్తానని మన మేధావి ఉవాచ.

మరి ఈ వడ్రంగి పిట్ట మన చెవులలో పువ్వులెందుకు పెడుతున్నాట్టూ? వీకు క్షణానికి పోటీ వద్దామనా? లేకపోతే వీకు, వీకెండుల మధ్య దూరదామనా??
ఈయన వ్రాసింది చూడండి

**************************************

వాళ్ళు ఈ భూభాగంపై ప్రవేశించే నాటికి ఇక్కడ నగరాలు నిర్మించబడి, నాగరికతతో, శతృ దుర్బేద్యంగా వున్న రాజ్యాలు విలసిల్లాయనడానికి పురాణాలలో వర్ణించబడ్డ రావణాసురిడి లంకా పట్టణం, బలిచక్రవర్తి కేరళ రాజ్యం, హిరణ్యాక్షుడి రాజ్యాల వర్ణణలు చూస్తే అర్థమవుతుంది

**************************************


అసలు ఆర్యులొస్తే ఎప్పుడొచ్చారు, రావణాసురుడు ఏ కాలం వాడూ, బలి చక్రవర్తి ఎప్పటివాడు - వీటిట్లో దేనికయినా ఈయనగారి దగ్గర సమాధానం ఉందా?

అదీ చూద్దాం - ఈయన ఇంతకు ముందు వ్రాసిన టపాలో

http://vadrangipitta.blogspot.com/2010/10/blog-post.html

"అసలు మీరన్న హిందూ ధర్మం ప్రకారమే యుగాల లెక్కల ప్రాప్తికి ఇప్పటికి రాముడు పుట్టి కొన్ని లక్షల సంవత్సరాలైంది. ఒక్కో యుగం అంతమైనప్పుడు మొత్తం నాశనమైందన్నది మీ లెక్కే. అలా అయినప్పుడు అన్ని లక్షల సం.క్రితం నాశనమైన వాటి ఆనవాళ్ళు ఇంకా ఎలా లభ్యమవుతాయి"

అదే రావణాసురుడి విషయానికొచ్చేసరికీ - నాగరికతతో, శతృ దుర్బేద్యంగా వున్న రాజ్యాలు విలసిల్లాయనడానికి పురాణాలలో వర్ణించబడ్డ రావణాసురిడి లంకా పట్టణం, బలిచక్రవర్తి కేరళ రాజ్యం, హిరణ్యాక్షుడి రాజ్యాల వర్ణణలు చూస్తే అర్థమవుతుంది

రామాయణం జరిగిందా? జరిగితే రాముడూ ఏ ఇంజనీరింగ్ కాలేజ్? మీకు తెలియదు కాబట్టీ రామాయణం కట్టుకథ అనే ఈ పెద్ద మనుషులే, తమదాకా వచ్చేసరికీ రాముడు ఉండేవాడు, రావణాసురిడిని చంపాడూ అని కొత్తపాట :))

10, అక్టోబర్ 2010, ఆదివారం

నా అల్ టైం ఫేవరేట్ కవ్వాలీ!

FULL VERSION (AUDIO)

A LIVE VERSION FEATURING THE QAWWAL AZIZ NAZAN HIMSELF


అందమైన అమ్మాయిలనుండి నన్ను రక్షించండి బాబోయ్!

వెటకారం కాదండీ బాబూ, నిజమే. గత ఏడాదిన్నర నుండీ నా మీద అందమైన అమ్మాయిల ఫోటోలదాడి జరుగుతోంది. ప్రతీ రెండు మూడురోజులకీ ఒక సారి జాతకం, ఒక నాలుగయిదు ఫోటోలు ఉన్న మెయిళ్ళొస్తున్నాయి -ఇదిగో మా అమ్మాయి జాతకం, ఫొటొలు, మీ అబ్బాయివి కూడ పంపించండి అని. నాకు కొడుకుల్లేరు, ఉన్న కూతురు కూడా పదేళ్ళవయసుది కదా అని బుఱ్ఱ చాలాసార్లు గోక్కున్నా.

చివరికి అర్థమయ్యిందేమిటంటే, నా ఖర్మ కాలి ఎవరో బెంగళురులో భరద్వాజ అనే పెద్దమనిషి తన కొడుక్కి పెళ్ళిచెయ్యాలనుకున్నట్టున్నాడు. తన కొడుకు వివరాలు కావాల్సిన వారిని తమ వివరాలు జత చేస్తు ఒక ఈమెయిల్ పంపించమన్నాడు - కాని ఆయన చేసిన పొరబాటు - నా యహూ ఈమెయిల్ ఐడీ ఇవ్వడం. అప్పటికీ ఆ మెయిళ్ళు పంపించినవారికి సమాధానం ఇస్తూనే ఉన్నా - అమ్మా, అయ్యా, ఆయనెవరో తెలిస్తే కాస్త ఈ విషయం చెప్పి పుణ్యం కట్టుకోండి అని - కానీ ఏమీ లాభం లేదు. దీనినుండి ఎవరు నన్ను రక్షిస్తారో!

చిరాకేసి ఒకళ్ళిద్దరికి తిక్క సమాధానాలు కూడా ఇచ్చా - నాకు పెళ్ళయ్యి ఒక పదేళ్ళ పిల్ల కూడా ఉంది - ఒక పెళ్ళాన్ని, ఒక కూతుర్ని తట్టుకోవడమే కష్టంగా ఉంది, రెండో పెళ్ళి చేసుకునే ఒపిక లేదు, అలాంటి విపరీతపు బుధ్ధి ఎమన్నా పుడితే ఫోటో పంపిస్తాను అని. అయినా సరే నాకు మెయిల్ తాకిడీ ఎక్కువయ్యింది గానీ ఏ మాత్రం తగ్గలేదు.

ఈ విషయంలో నన్ను రక్షించే ఐడియాలు మీదగ్గరేమన్నా ఉన్నాయా?

9, అక్టోబర్ 2010, శనివారం

జర్నల్ స్క్వేర్ డాండియా!

దేవీ నవరాత్రుల సంబరాలకోసం రోడ్లని మూసెయ్యడం మన భారత దేశంలో విచిత్రం కాదు - అదే న్యూయోర్క్ లో జరిగితే?

జెర్సీసిటీ జర్నల్ స్క్వేర్ దగ్గర న్యూ-ఆర్క్ ఎవెన్యూని ఈ తొమ్మిది రోజులూ సాయత్రం 7:30 నుండీ మూసివేస్తున్నారు - దసరా సందర్భంగా జరిగే గర్బా, డాండియాల కోసం. ఒక్కసారి అనుమానం వచ్చింది ఇది జెర్సీనా లేక గుజరాతా అని :))

ఈ పోస్టు వ్రాస్తున్న సమయానికి (అర్థరాత్రి 12:55) పూర్తి స్థాయిలో నడుస్తోంది ఈ కార్యక్రమం - with a gathering of around 5 thousand people!!

ఫోటొలూ, వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది :)
7, అక్టోబర్ 2010, గురువారం

నాకు నచ్చిన దేవానంద్ సోలోలు - ఆఖరి భాగం - 5 నుండీ 1 దాకా

వీడియో చూసి దడచుకోవద్దు :))

Disclaimer: I cant be held responsible if someone pukes or dies of laughter after watching the video :)నాకు నచ్చిన దేవానంద్ సోలోలు - మూడవ భాగం - 10 నుండి 6 దాకా

10. జాల్: యే రాత్ యే చాంద్ నీ - గాత్రం: హేమంత్ కుమార్, సంగీతం: ఎస్ డీ బర్మన్
9. పేయింగ్ గెస్ట్: ఓ నిగాహే( మస్తానా - గాత్రం: కిషోర్ కుమార్, సంగీతం: ఎస్ డీ బర్మన్
8. బాత్ ఏక్ రాత్ కీ: న తుం హమే ( జానో - గాత్రం: హేమంత్ కుమార్, సంగీతం: ఎస్ డీ బర్మన్7. సోల్వా సాల్: హై అప్నా దిల్ - గాత్రం: హేమంత్ కుమార్, సంగీతం: ఎస్ డీ బర్మన్


6. జబ్ ప్యార్ కిసీ సే హోతా హై: జబ్ ప్యార్ కిసీ సే హోతా హై - గాత్రం: మహమ్మద్ రఫీ, సంగీతం: శంకర్ జైకిషెన్
6, అక్టోబర్ 2010, బుధవారం

నాకు నచ్చిన దేవానంద్ సోలోలు - రెండవ భాగం - 15 నుండి 11 దాకా

మొదటి లిస్టు మరీ పెద్దదిగా ఉందన్నారు - అందుకే దీనిలో 5 మాత్రమే - 15 నుండి 11 దాకా15. టేక్సీ డ్రైవర్: జాయే తో జాయే కహా( - గాత్రం: తాలత్ మెహ్మూద్ - సంగీతం: ఎస్ డీ బర్మన్

14. మునీంజీ: జీవన్ కె సఫర్ మే( రాహీ - గాత్రం: కిషోర్ కుమార్ - సంగీతం: ఎస్ డీ బర్మన్


13. తీన్ దేవియా(: ఖ్వాబ్ హో తుం యా - గాత్రం: కిషోర్ కుమార్ - సంగీతం: ఎస్ డీ బర్మన్

12. తేరే ఘర్ కే సామ్నే: దిల్ క భవ్(అర్ - గాత్రం: మహమద్ రఫీ - సంగీతం: ఎస్ డీ బర్మన్
11. జ్యూయల్ థీఫ్: యె దిల్ న హొతా బేచారా - గాత్రం: కిషోర్ కుమార్ - సంగీతం: ఎస్ డీ బర్మన్

5, అక్టోబర్ 2010, మంగళవారం

నాకు నచ్చిన టాప్ 25 దేవానంద్ సోలో పాటలు - మొదటి భాగం - 25 నుండి 16 దాకా

.


మీలో చాలామందికి తెలిసే ఉంటుంది - నేను దేవానంద్ అభిమానిని, ముఖ్యంగా పాటల విషయంలో. ఓ రెండు మూడేళ్ళ క్రితం నాకు నచ్చిన టాప్ 25 సోలోస్ ని కలిపి ఒక యూట్యూబ్ వీడియో తీస్తే, దానిని కాస్తా కాపీరైట్ ఉల్లంఘన పేరుతో పీకి పారేశారు. చేసిన నాలుగు భాగాల్లో మూడూ పోగా ఒకటే మిగిలింది. ఆ ఒక్కదాన్నీ ఉంచి మిగిలిన వాటిని బ్లాగులో పెట్టచ్చుకదా అనిపించినా పెద్దగా శ్రద్ధ చూపలేదు ఇన్నాళ్ళూ. అయితే హేమంత్ కుమార్ పోస్టుకి ఏదో కాస్త మంచి స్పందనే వచ్చింది కాబట్టీ దీన్ని మీమీదకి వదిలేద్దామని డీసైడ్ అయిపోయా.

ఇది మూడు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగంలో 25 నుండీ 16 దాకా, రెండవ భాగంలో 15 నుండీ 6 దాకా, మూడవభాగం (నా దగ్గర మిగిలిన వీడియో) లో 5 నుండీ 1 దాకా ఉంటాయి.

మరో విషయం - ఇది కేవలం దేవానంద్ సోలో పాటల కౌంట్ డౌన్ - 25 నుండి 1 దాకా, అది కూడా నాకు నచ్చినవే - ఒక సినిమాలో రెండూగానీ అంతకన్నా ఎక్కువగానీ సోలోలు ఉంటే మాత్రం అందులోంచి ఒకటే తీసుకోవడం జరిగింది - అంటే సినిమాకి ఒకటన్నమాట.

25 నుండీ 16 దాకా ఇవిగో:


25. జోషీలా: కిస్కా రస్తా దేఖే - గాత్రం: కిషోర్ కుమార్, సంగీతం: ఆర్.డీ.బర్మన్

24. గేంబ్లర్: దిల్ ఆజ్ షాయర్ హై - గాత్రం: కిషోర్ కుమార్, సంగీతం: ఎస్.డీ.బర్మన్

23. ఫంటూష్: దుఖీ మన్ మేరే - గాత్రం: కిషోర్ కుమార్, సంగీతం: ఎస్.డీ.బర్మన్

22. చుపా రుస్తం: ధీరె సే జానా - గాత్రం: కిషోర్ కుమార్, సంగీతం: ఎస్.డీ.బర్మన్దీనీ అసలు పాట ఎస్ డీ బర్మన్ స్వయంగా పాడింది


21. జానీ మేరా నాం: పల్ భర్ కేలియే కోయ్ - గాత్రం: కిషోర్ కుమార్, సంగీతం: కల్యాణ్ జీ - ఆనంద్ జీ20. షరాబీ: కభి న కభీ - గాత్రం: మహమ్మద్ రఫీ, సంగీతం: మదన్ మోహన్

19. కాలాపానీ: హం బేఖుదీ మే - గాత్రం: మహమ్మద్ రఫీ, సంగీతం: ఎస్ డీ బర్మన్

18. అస్లీ నక్లీ: ఎక్ బుథ్ బనాఊంగా - గాత్రం: మహమ్మద్ రఫీ, సంగీతం: శంకర్ జైకిషెన్17. హరే రామ, హరే కృష్ణ: ఫూలోంకా తారోంకా - గాత్రం: కిషోర్ కుమార్, సంగీతం: ఆర్ డీ బర్మన్16. డార్లింగ్ డార్లింగ్: ఐసే న ముఝే తుం దేఖో - గాత్రం: కిషోర్ కుమార్, సంగీతం: ఆర్ డీ బర్మన్ (అసలుపాటకన్నా ఆ మధ్య వచ్చిన రీమిక్సులు బాగున్నాయి, వికాస్ భల్లా మిక్సుతో సహా)
వికాస్ భల్లా మిక్స్:
.

టేకాఫ్ ముందు ఫ్లైట్ ఎటెండెంట్లు ఇచ్చే సేఫ్టీ ఇంస్ట్రక్షన్లు చిరాకు తెప్పిస్తున్నాయా?

విమానాల్లో ప్రయాణించే ఫ్రీక్వెంట్ ఫ్లైయర్లకి సాధారణంగా చిరాకు తెప్పించే అంశం టేక్కఫ్ ముందు ఎటెండెంట్లు చేసే సేఫ్టీ డ్రిల్లు. కానీ ఈ విమానయాన సంస్థ వారి సృజనాత్మకత చూడండి :))


23, సెప్టెంబర్ 2010, గురువారం

అమరగాయకుడు హేమంత్ కుమార్

రేఖాచిత్రం వెంకటప్పారావుగారి టపా ఇప్పుడే చూసి అర్జెంటుగా మూడొచ్చేసి రాసేస్తున్న మినీ టపా ఇది :)


ఉస్తాద్ ఫైయజ్ ఆలి ఖాన్ శిష్యుడు, సంగీతకారుడు శైలేష్ దత్తాగుప్తాకి ఆప్తుడైన హేమంత్ కుమార్ ముఖోపాధ్యాయ తరువాత కాలంలో ఒక ప్రసిధ్ధగాయకునిగా, సంగీత దర్శకునిగా సంగీతాభిమానులపై ఒక చెరగని ముద్ర వేశారు. మొట్టమొదటి పాట 1933 లో ఆకాశవాణికి పాడినా, తన మొట్టమొదటి ఆల్బం కోసం 1937 దాకా ఆగవలసి వచ్చింది. ఆ రోజుల్లో ఆయన సినీమాలకు పాడివాటికన్నా ప్రైవేటుగా పాడిన పాటలే ఎక్కువ.

మరో నాలుగేళ్ళ తరువాత, అంటే మొదటి పాట పాడిన 8 సంవత్సరాల తరవాత (ఆ రోజుల్లో పాపం ఇండియన్ ఐడల్, సరెగమ లేవు కదా, ఇలా పాడగానే అలా సినీమా చాన్సు వచ్చెయ్యడానికి) ఒక బెంగాలీ సినీమా ద్వారా ఆయన చలన చిత్ర రంగ ప్రవేశం చెయ్యడం జరిగింది. ఆ తరవాత మరో సంగీత దర్శకుడైన సలీల్ చౌదరి ( అదే నండీ, మధుమతి సినీమాలో "దిల్ తడప్ తడప్ కే" అనబడే కాపీ పాటని మనకి అందించినాయన - హీ హీ ఊరికే అన్నాలేండి, ఆ పాట కాపీ కొట్ట్నా ఆయన మంచి సంగీత దర్శకుడే) తో కలిసి ఒక రంగస్థల సంఘాన్ని కూడ స్థాపించారు. 1952 లో ఆనందమఠ్ అనే చిత్రం ద్వారా సంగీత దర్శకత్వానికి నాంది పలికారు. ఆ చిత్రంలో లతా మంగేష్కర్ పాడిన "వందేమాతర" గీతాన్ని ఇప్పటికి కూడా ఎవరూ మర్చిపోలేదు.

సచిందా - సచిన్ దేవ్ బర్మన్ - దర్శకత్వంలో దేవానంద్ కోసం ఆయిన పాడిన పాటలు "యే రాత్ యే చాంద్నీ ఫిర్ కహా(", "హై అప్నా దిల్ తో ఆవారా"లాంటిగీతాలు ఇప్పటికి కూడ జనాల గుండెల్లో, పెదవులపై పదిలంగానే ఉన్నాయి. అలాగే గురుదత్ కోసం పాడిన "జానె వో కైసే లోగ్ థె" పాట ఒక సారి విన్నవాళ్ళు మళ్ళీ మర్చిపోగలరా?

1954 లో ఆయన సంగీత దర్శకత్వం వహించిన "నాగిన్" చిత్రం సంచలనాన్ని సృష్టించడమే కాక ఆయనకి ఉత్తమ సంగీత దఋసకుని ఎవార్డ్ కూడ తెచ్చిపెట్టింది. నాలాంటి ప్రతీ కీబోర్డు వాయిద్యగాడూ జీవితంలో ఎప్పుడో ఒకసారి "మన్ డోలే మెర తన్ డోలే" పాటని ప్రేక్టీస్ చేసే ఉంటాడు. ఇప్పటీకి కూడా ఆ పాటని వివిధ సంగీత దర్శకులు కాపీ / రీమిక్స్ చేస్తూనే ఉన్నారు.

ఆ తరవత వెంకటప్పారావు గారు చెప్పినట్టు బీస్ సాల్, బాద్, కొహ్రా, ఖామోషి చిత్రాలలో ఆయన పాడిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అలాగే బెంగాలీలో కూడా ఆయన తనదైన ఒక ప్రత్యేక శైలిని, ముద్రని శ్రోతలకందించారు.

బాలీవుడ్ లో ఆయనది ఎప్పటికీ ఒక ప్రత్యేక స్థానమే.


ఆయన పాటలు కొన్ని మీకోసం ఇక్కడ


1. హై అప్నా దిల్
2. హై అప్నా దిల్ (విషాదం) - ఈ పాట చాలా మంది విని ఉండరు


Original film video here:


http://www.youtube.com/watch?v=JHJ4oeUagXU3. యే రాత్ యే చాంద్నీ

Original film video here


http://www.youtube.com/watch?v=dBw_JSiNF9c

4. యాద్ కియా దిల్ నే కహా( హో తుం
5. జానే వో కైసే లోగ్ థే
6. తుం పుకార్ లో
7. యె నయన్ డరే డరే8. బేకరార్ కర్కే హమే(


9. మన్ డోలే మెర తన్ డోలే

10. వందే మాతరం - Dont miss this


19, సెప్టెంబర్ 2010, ఆదివారం

మాలికలో రసజ్ఞ బ్లాగ్ ఎందుకు లేదు?

మాలికకి ముఖ్యంగా మూడు నియమాలున్నాయి ఈ నియమాలు పాటించని తెలుగు బ్లాగులు/తెలుగు వెబ్ సైట్ లు మాలికలో కనబడవు.


http://maalika.org/add_your_telugu_blog_to_maalika.php


1) బ్లాగు తప్పకుండా తెలుగులోనే రాయాలి
2) అశ్లీల, అసభ్య వ్రాతలు వ్రాయకూడదు. "పెద్దలకు మాత్రమే" బ్లాగులకు మాలికలో స్థానం లేదు (Extreme, explicit sexual content and "adults only" blogs are not allowed in Maalika).
3) వేరే బ్లాగుల నుండి, వెబ్ సైట్ల నుండి అరువు తెచ్చుకున్న కాపీ రాతలు ఉండకూడదు. (No plagiarism)

రసజ్ఞ బ్లాగు విషయానికి వస్తే ఆ బ్లాగుకి "ఎడల్ట్స్ ఒన్లీ" టేగ్ ఉంది కాబట్టీ అది మాలికకి జత చెయ్యడం కుదరదు (#2). "ఎడల్ట్స్ ఒన్లీ" టేగ్ లేని బ్లాగులని కలపడానికి మాలికకేమీ అభ్యంతరం లేదు. టేగ్ లేకుండా ఏ చెత్తయినా రాసుకోవచ్చా అంటే మీ ఇష్టం. మీరు రాసుకునే దానికి మాలికకి ఎటువంటి సంబంధం లేదు.

కానీ ఎడల్ట్ టేగ్ లేకుండా ఉన్న బ్లాగుల మీద ఎవరైనా గూగుల్ కి మళ్ళీ కంప్లెయిన్ చేసి మళ్ళీ ఆ టేగ్ తగిలిస్తే మళ్ళి దాన్ని తీసెయ్యాల్సి ఉంటుంది.

15, సెప్టెంబర్ 2010, బుధవారం

హీరోకన్నా ఎక్కువ పేరు తెచ్చుకున్న అతిథి నటుడు? - Post updated with my choice

ఒక ప్రముఖ హీరో నటించిన సినిమాలో నటించి, ఆ నటించిన కొద్దిసేపట్లోనే హీరోకన్నా ఎక్కువ పేరు తెచ్చుకున్న అతిథి నటుడొకరిని ఉదహరించగలరా?

To put the question in the other words

మీ అభిమాన లేదా మీ దృష్టిలో అత్యంత ప్రాచుర్యమైన అతిథి నటి/నటుడి పాత్ర ఏది?


*****************************************************************UPDATE:చాలా మంది చాలా పేర్లు చెప్పారు. అన్నీ సరైనవే. ( May be not Malakpet Rowdy, Sarat, Kagada and Ongolu Sreenu .. hehehe)నా దృష్టిలో అయితే ఒక అతిథి పాత్రలో పది నిముషాల కన్నా తక్కువ నటించి ఆ పది నిమిషాల వల్లే ఆ సినీమా హిట్ అయ్యేలా చేసింది - "అందాజ్ (1971)" సినీమాలో రాజేష్ ఖన్నా. అసలా సినిమా హీరో షమ్మీ కపూరని చాలా మందికి అప్పట్లో తెలియదు. రాజేష్ ఖన్నా, అతనెక్కిన బుల్లెట్, ఆ "జిందగీ ఎక్ సఫర్ హై సుహానా" సృష్టించిన ప్రభంజనంలో పాపం స్టార్ నటుడైన షమ్మీ కపూరే కొట్టుకుపోక తప్పలేదు. దేశంలో మోటార్ సైకిళ్ళ మార్కెట్ కూడా ఒక్కసారిగా ఊపందుకుంది.

అన్నట్టు ఈ సినీమా, శంకర్ జైకిషన్ జైకిషన్ జోడీకి ఆఖరిది (ఇది విడుదలైన కొన్నాళ్లకి జైకిషన్ మరణించారు). షమ్మీ కపూర్ కి హీరో గా ఆఖరి హిట్.
"Zindagi ek safar" song for you:Kishore Kumar's version:
Mohd. Rafi's version:

Asha Bhonsle's version:

Whose version do you like the best?

.
.
.
.

12, సెప్టెంబర్ 2010, ఆదివారం

ఈ ఫోటో ప్రత్యేకత ఏంటి?

ఫోకస్ కూడా సరిగ్గాలేని ఈ ఫోటో ప్రత్యేకత ఏమిటో చెప్పగలరా?Scroll down if you cant ...

.....................................................................
.........................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

అది వినాయక చవితినాటిది :))

తిట్టుకుంటున్నారా?

విషయమేమిటంటే నేనొక్కడినే ఎందుకు బలవ్వాలన్న్న కుళ్ళు అంతే :))

........................
........................
........................
........................

7, సెప్టెంబర్ 2010, మంగళవారం

YSR వర్ధంతి వేడుకలా?

నాకు ఆంగ్లం గానీ, తెలుగు గానీ - ఏ భాష మీదా అంత పట్టు లేదు, అందుకే ఈ చొప్పదంటు ప్రశ్న.

గత కొద్ది రోజులుగా బ్లాగుల్లో, బయటా నాకు ప్రముఖంగా కనిపిస్తున్న ప్రకటన - " YSR వర్ధంతి వేడుకలు", Celebrating YSR vardhanti గట్రా. నరకాసురుడు చచ్చిన రోజు దీపావళి జరుపుకుంటున్నట్టు YSR శత్రువులెవరైనా ఇది చేస్తున్నారా అనిపించింది. కాని వీటిని నిర్వహిస్తోంది YSR అభిమానులని తెలిసి నాలుక కరచుకున్నా.

ఇంతకీ ఇది వారి భాషతో సమస్యా లేక నా బుఱ్ఱ .. సోరీ, మోకాటితో సమస్యా? I do understand that celebration refers to ceremony, but I thought it always pointed to the happier side.

1, సెప్టెంబర్ 2010, బుధవారం

29, ఆగస్టు 2010, ఆదివారం

మాలిక త్రైమాసిక తెలుగు పత్రిక

.

తెలుగు భాషాదినోత్సవ సందర్భంగా మాలిక టీం మీకోసం ఒక త్రైమాసిక తెలుగు పత్రికను ప్రారంభించబోతోంది. రకరకాల అంశాలు కలిగిన ఈ పత్రిక గురించిన పూర్తివివరాలు త్వరలో ఆర్కే ద్వారా మీ ముందుకు!

28, ఆగస్టు 2010, శనివారం

పాపం బ్లాగు వీక్షణం

"ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలద్దురా" అంటూ అంటూ మమ్మల్ని బద్నాం చెయ్యబోయిన బ్లాగ్ వీక్షణం చిన్న ప్లేన్ కూడ execute చెయ్యలేక బోర్లాపడి, ముక్కులు బద్దలుకొట్టుకుని, "అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తాకొట్టింది బ్లాగు వీక్షణం గేంగు" అనిపించుకుని మళ్ళీ లేవడానికి ట్రై చేస్తోంది.

వెధవ పనులు చెయ్యాలంటే కాస్తంత బుఱ్ఱ ఉండాలి - పదవ తరగతి స్లిప్పులు లేకుండా పేస్ అవ్వలేని శాల్తీ బ్లాగుల్ని వీక్షిస్తే ఇలాగే ఉంటుంది మరి :)) "ఝనకు ఝనకు ఝాం పట్టుకో పట్టుకో ఛాన్సు దొరికెరో హొయ్యా" అని మొదలుపెట్టింది "అంతా భ్రాంతియేనా?" అని ముగిసింది.

ప్లేన్ 1: మార్తాండ మీద సింపథీ - మనవాడే తిరిగి చేసిన కామెంట్ల వల్ల ఫెయిల్ - "జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట, కెలుకుడుగాళ్లని కెలికితే వలిచారే నాతాట"

ప్లేన్ 2: ఒంగోలు శ్రీనువే ఏనానిమస్ కామెంట్లు - బ్లాగు సోదరి అడ్డం తగలడంతో బోల్తా. వీళ్ళబ్లాగులో వీళ్ళని వీళ్ళే తిట్టుకుని దానిని ఒంగోలుశ్రీను మీదకి నెడదామని చేసిన యత్నం కూడా ఫెయిల్. పాపం మిగిలింది - ఒకటొసారి, రెండోసారి అంటూ బెండప్పారావు చెప్పినట్టు అరుపులు :)) - "ప్లేను ఫెయిలయితే పొరబాటు లేదోయ్, ఓడిపోలేదోయ్ "

ప్లేన్ 3: మలక్పేటే కాగడా - పాపం వాళ్ళ గేంగు మెంబర్లే అత్యుత్సాహంతో ఇచ్చిన స్క్రీన్ షాట్ల వల్ల మలక్పేట్ కాగడా కాదని నిరూపణ - ""కట్టుకధలు చెప్పి నిన్ను కవ్విస్తే, నవ్విస్తే బ్లాగుల్లో సోదరొక్కరూ నాకే తలంటారే చకాచకా"

ప్లేన్ 4: కులాలని, రిజర్వేషన్లనీ మధ్యలోకి లాగి పెట్టిన పోస్టు - సూపర్ ఫ్లాప్ - ""నీ ఆశ అడియాశ, లంబోడోళ్ళ రాందాసా"

ప్లేన్ 5: మీ ఇంటికి పోలీసులని పంపిస్తామని ఎవరికో ఈ మెయిళ్ళు - వాళ్ళు తిరిగి మధ్య వేలు చూపించేసరికీ - "అయ్యాయ్యో, చేతిలో చాన్సులు పోయెనే, అయ్యయ్యో, బుఱ్ఱలు ఖాళీ ఆయెనే"


పై గొడవల వల్ల unique హిట్లు పెరిగిన మాలిక :)) - 40% raise since the blog got added to Maalika - that way we should thank that blogger (Of course Sujata's article has the greatest contribution and Jyoti's post helped too)

పాపం ఏం చేస్తారూ, అరికాలు మర్దనా చేసుకోవడం మొదలు పెట్టారు. మార్తాండ తోక పట్టుకుని గోదావరి ఈదలేకపోయామే, కాస్త పిల్లకాకి రెక్కలు పట్టుకునైనా బయటపడామని "చిన్ని చిన్ని ఆశ". కనీసం పిల్లకాకయినా వీరిని కరుణిస్తాడో లేక "పోతే పోనీ పోరా" అంటాడో చూద్దాం.

ఇంతకీ వీళ్ళ బాధ ఏమిటంటే నిప్పురవ్వ నేనేమో, ఆ ఎనానిమస్సులు నేనేమో అని అనుమానం. ఎంతైనా నిప్పురవ్వ దెబ్బకి కళ్ళు లొట్టబోయాయికదా వీళ్ళందరికీ - పాపం కసి, పగ, ప్రతీకార వాంఛ, ఏడుపు ఒక్కసారిగా :))


వీళ్ళ అరికాలి తెలివి: "నేను కత్తిని అని చెప్పలేదు, కత్తికూడా ఆ మాట అనలేదు - కనుక నేను కత్తిని కాను" :)))))))))))))) మరి వీళ్ళే నన్ను కాగడా, నిప్పురవ్వ etc అన్నప్పుడు ఈ లాజిక్ పనిచెయ్యదా? అందుకే అనేది నాకు మోకాళ్ళలో ఉంటే ఈ శాల్తీలకి అరికాళ్ళలో ఉందని (అసలు ఈ దెబ్బకి చెప్పుల్లోకి జారిపోయిందేమో కూడా) -

If I now declare that I am Blog Veekshanam, will I become Blog Veekshanam? Also, if I post a message from this blog that Pramaadavanam is not mine and another message from Pramaadavanam that Rowdy Rajyam is not mine, will that lead to a conclusion that I am not me? :))

ఇంతకన్నా ఈ బ్లాగు వీక్షణం గారు నేను పెట్టినట్టు ఒక post మలకే బ్లాగు వీక్షణం అనే అనుమానం తెప్పించేలా కొట్టుంటే మాలికకి ప్రచారం కల్పించుకోడానికి మేమే ఈ బ్లాగు వీక్షణం హడావిడి చేశామనే నింద మమ్మల్ని వెంటాడి ఇబ్బంది పెట్టేది - కాని ఈ గేంగుకి అంత సీనేదీ?

27, ఆగస్టు 2010, శుక్రవారం

మాలిక అధికార ప్రతినిధి

మాలిక గుంపు వేగంగా పెరుగుతోంది, దీనివలన సమాచారం చేరవెయ్యడంలో ఇబ్బందులు తలెత్తకుండా ఒకరే మాలిక తరపున మాట్లాడాలని నిర్ణయించుకున్నాం.

ఇక మీదట మాలికకు సంబంధించిన అన్నివిషయాలకూ రంజిత్ కుమారే అధికార ప్రతినిధి.

26, ఆగస్టు 2010, గురువారం

ఎవడిది దొడ్డిదారి? - తమదే :))

Ref: Every time, when this particular person is on the verge of losing an argument, that person would bring up the caste issue to provoke a few people and divert the attention of the bloggers, so that the main issue gets side-tracked.

But the pity is that, each time he does it, he messes it up so much, that he ends up getting brickbats for two issues instead of one!

------ An independent blog observer
తిన్నగా వాదించే
సత్తాలేక
తింగర వాదనలు
చేసే పర్ణశాలదా

నువ్వన్న మాట
నిరూపించమంటూ
ఛాలెంజులు విసిరిన
కెబ్లాసదా

కేసుల బ్లేక్ మెయిల్ చేసింది తమరే
ప్రూఫ్ లేకుండా ఆరోపణలు చేసింది తమరే
గూగుల్ ని అడుగుదామంటే తోకముడిచింది తమరే
పక్కవాడి భావాల మీద విషం చిమ్మింది తమరే
అన్ని దారులూ మూసుకుపోయేసరికి
ఎప్పటిలాగే హైవేలంటూ కులగజ్జి
వెళ్ళగక్కింది ముందుగా తమరే

తమరి కుక్కకాటుకి చెప్పుతో జవాబివ్వడానికి
పట్టేది కేవలం ఐదంటే ఐదు నిమిషాలు
తమరి అరికాలిబుఱ్ఱకే ఇంత సీనుంటే
మా మోకాటికి మరెంతుండాలి?

అప్పుడు తప్పించునే యత్నం కమ్మ బ్రాహ్మణ మోడల్
ఇప్పుడు దారి మళ్ళించడానికి కోర్పోరేట్ లేప్టాపులు


కులోన్మాదానికి ప్రతిరూపమా
నీపేరెవడికి తెలియదులే? :))


పోలీస్ స్టోరీ సాయికుమార్ డయలాగ్:
ఒక వాక్యాన్ని నాలుగు ముక్కలు చేసి నాలుగులైన్లలో పేరిస్తే అది కవిత అవ్వదురా ఫూల్!

25, ఆగస్టు 2010, బుధవారం

పెన్సిల్ పేరుతో భావ దారిద్ర్యపు జల్లు - Post no longer relevant and hence edited.

పెన్సిళ్ళ భావదారిద్ర్యం గురించి ఒక బ్లాగరు ఒక టపా వ్రాశారు.టపా బాగానే ఉంది - ఒక విషయం ఎవరైనా మాట్లాడితే వేరే చోట జరిగిన విషయాన్ని లాగి గోల చేసేవాళ్ళకోసం.

24, ఆగస్టు 2010, మంగళవారం

ఈ గొడవలతో జ్యోతక్కకున్న సంబంధం

1. జ్యోతి పేరు వాడుకుని మన వాడి బ్లాగు వీక్షణం గేంగ్ నాపై బురద జల్లడం

2. కాగడా నేనే అన్న అబధ్ధాన్ని నమ్మకపోవడం

3. ఎన్ని అబధ్ధాలు చెప్పినా వారితోనే ఉంటుందనుకున్న జ్యోతి నిజాన్ని ధైర్యంగా బయటపెట్టి సదరు కత్తిగారి తిత్తి తీయడం

4. కత్తి మహేష్ ఎంత పచ్చి అబధ్ధాలకోరో నిరూపించడం (Particularly his comment that I am Kagada)

5. కాగడాని కెలికి జ్యోతి మీదకు ఉసిగొలుపుదామనే రాజకీయ వ్యూహం చిత్తవ్వడం (Internal bickering)

23, ఆగస్టు 2010, సోమవారం

కొత్త ఆరోపణలు చెయ్యండెహే

ఇప్పటికే అవసరమైనదానికన్నా ఎక్కువ వాదన జరిగిందేమో అనిపిస్తోంది. ఎంత సేపటికీ వీడు కాగడా, వీడు వాడిని కాల్చుకు తిన్నాడు అని తప్పితే కొత్త ఆరోపణలు లేవే.

ఎంచక్కా శరత్తే ఒసామా బిన్ లాడేన్ అనో, ఏకలింగం అయ్ ఎస్ ఐ ఏజెంటనో లేక సౌమ్య తమిళ ఆత్మాహుతిదళ సభ్యురాలనో ఆరోపణలు చేస్తే మరి కాస్త హాట్ హాట్ గా ఉంటుంది కదా. Even the readers would be interested. ఆలోచించండి :))

20, ఆగస్టు 2010, శుక్రవారం

ఈనాడులో మాలిక, తదితర ఎగ్రిగేటర్ల గురించిన వ్యాసం


ఇక్కడ


URL : http://eenadu.net/specialpages/sp-etaram.asp?qry=sp-etaram1


Ongolu Seenu and Dhanaraj Manmadha are joining the Maalika team very soon.


But well, they say I am from Guntur, whereas I am not, WAAAAAAAAAAAAAAAAAAAAA!!!!!!!


Also, do we now understand why Blogveekshanam chose this specific time for the attack? :)) These Koodali seniors (కూడలిలో తచ్చాడడానికి అలవాటు పడిన కొందరు సీనియర్లు ) just couldn't stand the mention of the name Maalika. Good for them though :))

18, ఆగస్టు 2010, బుధవారం

మీరు అందంగా కనబడాలనుకుంటున్నారా? అయితే మీవారికో, బాయ్ ఫ్రెండుకో బీర్ పట్టండి!

జోకనుకుంటున్నారా? కాదండీ నిజమే - ఎమ్మెస్సెన్ వారు అందించిన సమాచారం ప్రకారం.

జనాలకి తీరిక ఎక్కువయ్యి కొంతమంది మగవాళ్లమీద ఒక స్టడీ నిర్వహించారు, దేనిగురించయ్యా అంటే - బీరు తాగే ముందు తాగిన తరవాత వారు అమ్మయిలని ఎలా చూస్తారు అని. తాగక ముందు "ఓ మోస్తరు గా ఉన్నారులే" అనుకున్న అమ్మాయిలందరూ, తాగిన తరవాత చాలా అందంగా కనిపించార్ట. కావాలంటే ఈ లింకు చూడండి.

అందాన్ని నిర్ణయించడానికి సాధారణంగా కొలమానమైన Facial Symmetry ని తాగిన వారు సరిగ్గా గుర్తించలేకపోవడమే దీనికి కారణంట.

ఇంకేం, అబ్బాయిలనాకర్షించే కిటుకు తెలిసిపోయిందిగా, ఇక పండగ చేసుకోండి :))

కానీ ఇందులో ఒక చిక్కుందండోఇ, బీరు కొట్టినవాళ్ళు మాములుగా స్నేహంగా నవ్విన అమ్మాయిని కూడ అపార్ధం చేసుకునే ప్రమాదముంది. కనుక, మీవారికి గానీ, బాయ్ ఫ్రెండుకి గానీ బీరు పడితే, పక్కన ఇంకో అమ్మాయి లేకుండ చూసుకోండేం?

మార్తాండ నాపై ఎంతో ప్రేమతో చేసిన వీడీయో :))

ఇప్పటినించీ నా పేరు గబ్బర్ భరద్వాజ్ హీహీహాహాహా!

http://teluguwebmedia.asia/videos/gabbar_bharadwaj/index.html

An Ajnaata has returned the favor with this video


http://www.worldsgreatestbusinessmind.com/20081216-PRAVEEN-SARMA-create.html&WT.mc_id=WGBM|

15, ఆగస్టు 2010, ఆదివారం

అరుదైన ఫోటోలు

ఆగస్టు 14 - 2010 అర్ధరాత్రి భారత జాతీయ పతాక వర్ణాల్లో మిలమిలా మెరుస్తున్న ఎంపయర్ స్టేట్ బిల్డింగ్
NJ Transit రైల్లో యుధ్ధనపూడి మోహిత నవల
దీని భావమేమి తిరుమలేశా? ( వాషింగ్టన్ డీసీ లో )


ఇంతకీ వన్ వే ఎటు? ( వాషింగ్టన్ డీసీ లో )
ఇలాంటి కోతి గేంగ్ ప్రపంచమంతా ఉన్నారు ........................


NJ Transit రైల్లో ఉండే నోటీసుదానిని మార్చాక :))


8, ఆగస్టు 2010, ఆదివారం

వేర్పాటువాదం - థియరీ ఆఫ్ రిలేటివిటీ?

అవునండీ, మొన్న ఒక స్నేహితుడితో సుత్తేసుకుంటున్నప్పుడు నా బుఱ్ఱని ఒక ప్రశ్న తొలవడం మొదలయ్యింది. దెబ్బకి మోకాలు వాచిపోయిందిగానీ అది వేరే సంగతి. ఇంతకి ఆ ప్రశ్న ఏమిటంటే, వేర్పాటువాదులెవరు? సమైక్యవాదులెవరు అని

"ఇదేం ప్రశ్న రా కీకరకాయ వెధవా" అంటారా? ఒక్క నిముషం ఆలోచించండి: ఈ ప్రశ్నని రెండిటికింద విడగొడదాం!

ఆంధ్రా - తెలంగాణా విషయంలో వేర్పాటు, సమైక్యవాద గ్రూపులేవి?

తెలంగాణా - హైదరాబాద్ విషయంలో వేర్పాటు, సమైక్యవాద గ్రూపులేవి?

Einstein, where are you?

27, జులై 2010, మంగళవారం

అనఘ మరో పాట - టెలిఫోన్ (లేడీ గాగా, బియాన్సే) కవర్

పాడను మొఱ్ఱో అంటున్నా సరే వెంటపడి మరీ పాడించా ఓ పావుగంట క్రితం :))

.

10, జులై 2010, శనివారం

వినరా ఓ బ్లాగువీరా, ఆచార్యుని కధ చెబుతా...

వినరా ఓ బ్లాగువీరా, Professor కధ చెబుతా
అందరికీ ఝలక్కు ఇచ్చిన వైనం వివరిస్తా ...

అనగనగా ఒక గుంటూరు యువకుడు ప్రొఫెసర్ అయ్యాడు,
ప్రొఫెసర్ అయ్యి ఒక బైకరుతో స్నేహం చేశాడూ
ఆ ఇద్దరూ బయల్దేరి చెట్టాపట్టాలేసుకునీ
మోటర్ సైకిల్ వేసుకునీ దేశం చుట్టారూ

అప్పుడేమయ్యిందాయ్యా అంటే:

ఒక దేశంతో సంతృప్తి చెందని ప్రొఫెసర్ గారేమో
తన పనికోసం భారత్ నుండీ మెక్సికోకొచ్చే
సడన్ గా లవర్ పై బెంగొచ్చే
పదేళ్ళ ప్రేమ గుర్తొచ్చే
రేపటి రోజున అట్లేంటిక్ పై
వరుడుకాబోతున్నాడూ!


Geetacharya .. my hearty congratulations to you on losing your Bachelors degree - Have a great married life ahead..

(and of course my hearty condolences on losing your freedom too)Background -

Here is the mail from Geetacharya I received a few minutes ago!*******************************************


అన్నయ్యా,

మీకో శుభ వార్త. రేపు మెక్సికో సమీపంలో అత్లాంటిక్ సముద్రం మీద నేను ఒక ఇంటి వాడిని కాబోతున్నాను. న్యూసు మీకు స్వయమ్గా చెపుదామనుకుంటే ఆన్లైన్ లో మీరు లేరు. ఇక మీ ఆశీస్సుల కోసం మెయిల్ ని ఆశ్రయించక తప్పలేదు. ఇంటి వాడిని అంటే అట్లాంటిక్ సముద్రం మీద ఇల్లు కట్టుకుంటున్నానని కాదు. నా పదేళ్ళ ప్రేమని క్లైమాక్స్ కి చేరుస్తున్నానని :D

అలాగే నా మెక్సికన్ టూర్ సకెస్ అయింది కూడా

హవార్యూ ఆల్?
ప్లీజ్ మెయిల్
అదర్వైజ్ కాల్
ఎనీథింగ్ బోల్
యువార్ ఇన్ మై సోల్
ఇటీజ్ నాట్ కోల్
ఇట్ హాజ్ నో హోల్

గీతాచార్య

26, జూన్ 2010, శనివారం

ఆర్యులా? ద్రవిడులా?? గాడిదగుడ్డా? చివరిభాగం - డార్ట్ మౌత్ చావుదెబ్బ!!

Pulling these old posts back (originally posted in March/April 2009)ఏమిటొ ఈ ధూం కి మిగతా బ్లాగర్లకి జరుగుతున్న గొడవ కూడా ఈ ఆర్యుల ద్రవిడుల గొడవలాగానే నిరంతరంగా సాగుతొంది జీడిపాకంలా! అన్నట్టు భీమవరం మావూళ్ళమ్మ జాతరలో జీళ్ళ రుచి మర్చిపోలేరు తిన్నవారెవరైనా ..

ఇక మన గొడవలోకొస్తే, వామపక్ష చరిత్రకారులు సీసీఎంబీ ప్రయోగరూపంలో వేసిన బౌన్సర్ కి హిందుత్వ వాదుల దిమ్మ తిరిగింది. దెబ్బకి వారు కూడా జీనోం మీద పరిశోధనలు మొదలు పెట్టారు - లెకపోతే వారి ఉంకే ప్రశ్నార్ధకమౌతుంది కదా .. కానీ ఇందులో ఓ చిక్కుంది - కాలక్రమంలో ఒకరివి మరొకరికి కలిసి కలగూరగంప అయిన జన్యువులని పట్టుకోవడం కష్టమే.

2006 లో అమేరికా లోని మేస్చూసెట్స్ రాష్ట్రంలో ఉన్న డార్ట్ మౌత్ లోని సెంటర్ ఫర్ ఇండిక్ స్టడీస్ జూన్ 2006 లో ఈ విషయంతో సంబంధం ఉన్న చరిత్రకారులనీ, భాషావేత్తలనీ, శాస్త్రజ్ఞులని అందరినీ ఒకే వేదికపైకి రప్పించి "ఇంక కొట్టుకోండీరా!" అంది - అదే నండి కాంఫరెన్స్ ఏర్పాటుచేసింది. అందులో రాజారం, విట్జెల్ లతో పాటు ఆర్కియాలజిస్టు బీ బీ లాల్, శ్టాన్ ఫోర్డ్ యూనివర్సిటి నుండి పీటర్ అండర్హిల్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయలాజికల్స్ నుండి వీ కే కాశ్యప్ మున్నగువారు పాల్గొన్నారు.

రాజారాo ఈ సందర్భంగా 1929 లో బ్రిటిష్ ప్రధాని స్టేన్లీ బాల్డ్విన్ సభలో ఇచ్చిన ఒక ఆసక్తికరమైన ప్రకటనని ఉటంకించారు

“Now, after ages, …the two branches of the great Aryan ancestry have again been brought together by Providence… By establishing British rule in India, God said to the British, “I have brought you and the Indians together after a long separation, …it is your duty to raise them to their own level as quickly as possible …brothers as you are…”

అంటే - భారతీయ ఆర్యులు బ్రిటిష్ వారి సోదరులని దేవుడు చెప్పినట్టా?

ఇదిలా ఉండగా గ్రహాల పరిభ్రమణాన్ని లెక్కలు కట్టి మెంఫిస్ విశ్వవిద్యాలయానికి చెందిన నరహరీ ఆచార్ మహా భారతం కెఈ పూ 3067 లో జరిగింది అని ప్రతిపాదించారు. ఇదే గనక నిజమయితే ఆర్యులు క్రీ పూ 1500 లో వచ్చారు అనే సిధ్ధాంతానికి తూట్లు పడ్డట్టేగా? ఈ సందర్భంగా విట్జెల్ నోరు పారేసుకోవడం అక్కడ చాలామందికి నచ్చలేదు.

సరే - ఇక అందరూ సరస్వతీ నది గురించి, వేదాల గురించి, హరప్పా గురించి తర్జన భర్జనలు పడ్డ తర్వాత జెనిటిక్స్ మీదకి దృష్టి మరలింది. అండర్హిల్ మాట్లాడుతూ

“…the spatial frequency distributions of both L1 frequency and variance levels show a spreading pattern emanating from India, referring to a Y chromosome marker"

అన్నారు. అంటే ఆర్యుల జన్యువులు భారత ప్రదేశానికే చెందినవిగా ఉన్నాయని. అయితే దాన్ని ఆయన నూటికి నూరు ఆతం ధృవీకరించలేదు. కానీ తరవాత మాట్లాడిన కాశ్యప్ మాత్రం తన పరిశొధన (mtDNA and Y-Chromosome) ఫలితాలని ఉటంకిస్తూ ఆర్యుల యూరోపియన్ల జన్యువులు వేరు వేరని, వాటికి కులాలతో కూడా సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా కాలక్రమంలో జన్యువుల మ్యుటేషన్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన "మ్యుటేషన్ మీద ఇంకా పరిశొధన జరగవల్సి ఉన్నా - ఆర్యుల యూరోపియన్ల జన్యువులలో భారీ తేడాలు ఉండడమే ఆర్యులు భారతీయులనడాని తార్కాణం" అని తెగేసి చెప్పారు.

ఆసక్తికరం గా అప్పుడే విట్జెల్ తాను ఆర్యుల దండయాత్ర సిధ్ధాంతాని ఆమోదించట్లేదని బహిరంగంగా ప్రకటించారు.

దీనితో వామపక్ష వాదులకి చావుదెబ్బ తగిలింది. సైన్సో సైన్సో అని చెవికోసిన మేకల్లా అప్పటిదాకా అరిచి గీపెట్టిన కమ్యూనిష్టుల నోళ్ళూ మూతబడ్డాయి. (మరో విషయంలో ఒక బీజేపీ చరిత్రకారుడు ఒక మార్క్సిస్టు చరిత్రకారుడిని దేనిగురించో "సైంటీFఇచ్ ప్రూఫ్" అడిగితే దానికి రోమిలా థాపర్ కామేంటు: "I felt bad when he asked that question about the proof. History is not learnt that way" - What happened to their scientific methods then?)

మన సీ సీ యం బీ పరిశొధనలనీ, డార్ట్మౌత్ పరిశొధనలనీ పక్కపక్కన పెట్టుకుని చూస్తే మనకి అర్ధమయ్యేదేమిటంటె -

"భారతదేశం నానా జాతి సమాగమమైనా అన్నీ జాతులూ భారత జాతులే" అని. ఇది తప్పు అని మరెవరైన నిరూపించేదాకా ఇదే నిజమని అందరు నమ్ముతారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే "నాలుగవ రోజు ఆట ముగిసే సమయానికి వ్యతిరేకులు వలసవాదులపై భారీ ఆధిక్యంలో ఉండి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి" నట్టు. వామపక్షవాదులు దీనిని ఎల ఎదుర్కొంటారో వేచి చూద్దాం!!

javascript:void(0)
Ref: Center for Indic Studies Dartmouth Conference 2006 Press Release

ఆర్యులా? ద్రవిడులా?? గాడిదగుడ్డా??? మూడవభాగం - ద బిగ్ ఫైట్

Pulling these old posts back (originally posted in March/April 2009)గత మూడురోజులుగా బ్లాగ్లోకాన్ని ఒక ఊపు ఊపిన ధూంధాం ల పెను తుఫాను తీరాన్ని దాటింది. ఇక మన పోట్లాటలు మళ్ళీ మొదలుపెట్టుకోవచ్చు ...

పోయిన భాగంలో కుళ్ళురాజకీయాల గురించి చర్చించాం. ఈ భాగంలో అసలు గొడవమీదకి దృస్టి మళ్ళిద్దాం.

ఆర్య్ల దండయాత్ర సిధ్ధాంతాన్ని నమ్మిన వారు తమ వాదనని గట్టిగానే వినిపించారు. వారి చేతిలోని ముఖ్య ఆయుధం సంస్కృతానికి, యూరోపియన్ భాషలకి దగ్గర పోలిక. ఆ పోలికేమిటయ్యా అంటే ...

మళ్ళీ కొంచం ఫ్లేష్ బేక్: ( జయరాం వీ: ద ఓరిజిన్ ఎండ్ ఎవల్యూషన్ ఆఫ్ సాంస్కృత్ నుండి)

అనగనగా 1783 నుంది 1794 దాకా సర్ విలియం జోన్స్ అనే ఆయన కలకత్తా సుప్రీం కోర్ట్ న్యాయమూర్తిగా ఉంటూ, భారదేశంలో ఉండి, భారతీయ సంస్కృతినీ, పాండిత్యాన్నీ, వంటబట్టించుకొని సంస్కృతాన్ని, యూరోపియన్ భాషలతో దాని పోలికలనీ క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే

The Sanskrit language, whatever be its antiquity, is of a wonderful structure; more perfect than the Greek, more copious than the Latin, and more exquisitely refined than either, yet bearing to both of them a stronger affinity, both in the roots of verbs and in the forms of grammar, than could possibly have been produced by accident; so strong, indeed, that no philologer could examine them all three, without believing them to have sprung from some common source, which, perhaps, no longer exists.ఇది యూరోపియన్ల పాత నమ్మకాల పునాదుల్ని కదిలించింది. ప్రపంచభాషలకు హెబ్రూనే మాతృక అని అని నమ్మిన వారు, తమ సిద్ధాంతాన్ని మార్చుకుని 'ప్రోటొ ఇండో యూరోపియన్ లేంగ్వేజ్" (PIE) అనేదానిని మాతృకగా అంగీకరించారు. దానినుండే ఇండో ఇరానియన్ (సంస్కృతం, పర్షియన్ గట్రా), బాల్టిక్ (లిథువేనియన్ గట్రా), స్లావిక్, ఆర్మీనియన్, గ్రీకు, సెలెటిక్, ఇటాలిక్ (లాటిన్ గట్రా), ఇటాలియన్, ఫ్రెంచ్, స్పానిష్, జెర్మన్, ఆంగ్ల, డచ్, స్కాండనేవియన్, అనటోలియన్, తోచారియన్ భాషలు ఆ PIE నుండే పుట్టాయన్న సిధ్ధాంతాన్ని ప్రతిపాదించారు.


మరి దీనికి సాక్ష్యం? నిరూపణ??

మొదటగా ఈ భాషలన్నిటిలో ఒకేరకమైన పదాలు చాలా ఉన్నాయి అని కనుగొన్నారు. ఆ తర్వాత సబ్దాల మీద, అచ్చులు, హల్లులు మొదలైన వాటిమీద కూడా పరిశొధన చేశారు. కానీ ఎప్పుడో చచ్చిపోయిన ఈ PIE భాష పుట్టుక మాత్రం (ఇప్పటిదాకా) కనిపెట్టలేకపోయారు. దానితో ఒకొక్కరూ ఒకొక్క నిర్ణయానికొచ్చారు. అనటోలియాలో పుట్టిందని కొందరంటే, ద్రవిడీయన్ భాషనుండి అని కొందరు, అది పాతకాలపు సంస్కృతమే అని మరికొందరు కొట్టుకోవడం మొదలెట్టి, ఈ రోజుకి కూడా కొట్టుకుంటున్నారు.

జయరాంగారి విశ్లేషణ ప్రకారం:

సంస్కృతంలో "మం", యూరొపియన్ భాషలలో అమ్ముక్, ఎమె, మీ, మనె, మూ
"తువం" ఏమో తు, థౌ, దు, త్వే, తి
పితర్ ఏమో పేతర్, ఫాదర్, పేసర్
సమ - సేం
సంత్ -సెయింట్
సర్ప - సర్పెంట్

ఇలా వందలకొద్దీ ఉన్నాయి. ఇంకా కావాలంటే ఈ సైట్

http://www.hinduwebsite.com/general/sanskrit.asp

మన గొడవలకొస్తే, తికమక ఇక్కడ మొదలయ్యింది. వామ పక్ష వాదులేమో సంస్కృతం బయటనుంది వచ్చిందని - వ్యతిరేకులేమో మన దగ్గరనుండి బయటకెళ్ళిందని ...

ఇక్కడితో ఆగారా? లేదే! ఇంకా చాలా విషయాల్లో గొడవలు జరిగాయి (బీ వీ గిరి)

1. హరప్పా - మొహెంజొదారో:

దీనిగురించి తెలియనివాళ్ళెవ్వరు? కానీ చాలా గొడవలకి ఇదే కారణం కూడా. ఎలా అంటారా? తినబోతూ రుచి అడగడమెందుకూ? చదవండి మరి:

అక్కడ తవ్వకాలు సాగించిన వాళ్ళకు డజన్లకొద్దీ, అస్తిపంజరాలు లభ్యమయ్యాయి. దానిని బట్టి ఏమన్నారంటే ఆర్యులు దండయాత్ర చేసి అక్కడీవారిని చంపేశారన్నారు. ఇది విన్న వ్యతిరేకులు ఒంటికాలిమీద లేచారు - "1922 నుండి 1931 వరకు 9 ఏళ్ళు సాగించిన తవ్వకాలలో 37 అస్తిపంజరాలు దొరికాయి - అదికూడా అన్నీ ఒకేచోట. అది స్నశానం కాకూడాదా?" అంటూ. పైగా ఒక్క ఆయుధం కూడా దొరకలేదు అని కూడ వాదించారు

2. గుర్రాలు, రధాలు:

దండయాత్ర సమర్ధకులు వేదాలలో చెప్పబడీన గుర్రాలు రధాల గురించి ప్రస్తావిస్తూ సింధూలోయ జనాలకి అవి తెలియవని, ఆర్యులతోపాటు భారతదేశానికి వచ్చాయని కనుక ఆర్యులు సింధులోయా యుగం తరవాత వచ్చారని ఊదరగొట్టేశారు. క్రీ పూ 2600 లో మొదలయిన సింధూలోయా నాగరికతను క్రీ పూ 1500 లో వచ్చిన ఆర్యులు ధ్వంసం చేశారని కూడా ప్రతిపాదించారు.

పోతే ఇండియానా యూనివర్సిటీ నుండి పీ హెచ్ డీ పట్టా తీసుకున్న డా రాజారాం గారు హిందూ సనాతన వాది. ఆయన పరిశొధనలు చేసి సింధూలోయా నాగరికతలో అశ్వాలను మచ్చిక చేసుకున్నారని ప్రతిపాదించారు. కానీ హార్వార్డ్ ఊనివర్సిటి లో సంస్కృత ఆచార్యుడయిన మైఖేల్ విట్జెల్ రాజారాం ని 2002 లో తూర్పారబట్టారు. ఈయన కనుగొన్నదొక ఎద్దు, గుర్రం కానేకాదు పొమ్మన్నారు. లెక్కల వాడివి నీకేం చరిత్ర తెలుసొయ్ అని ఎగతాళి చేశారు. దానికి రాజారం తిరగబడి సంస్కృతం చెప్పుకునేవాడివి నీకేమి తెలుసు - నేను కనీసం సైంటిస్టుని అని ఘాటుగానే సమాధానం ఇచ్చారు. ఈ వీట్జల్ రోమిలా థాపర్ కి మద్దతుదారుడు. తనని తనే ఓ పెద్ద చరిత్రకారుడిగా వర్ణించుకుంటాదు. ఆ మధ్య కాలిఫోర్నియా పుస్తకాల గొడవలలో కూడా తలదూర్చాడు. అటువైపు రాజారాం కూడా ఏమీ తగ్గలేదు. చివరికి వీళ్ళిద్దరి గొడవ పెద్ద రాజకీయమై కూర్చుంది. కానీ యస్ ఆర్ రావు గారు చేసిన పరిశొధనలు మాత్రం ఆ కాలంలో గుర్రాలున్నాయని నిర్ద్వంద్వంగా తేల్చి చెప్పాయి

3. శివుడా విష్ణువా?

మరొక సిధ్దాంతం ప్రకారం ఆర్యులు విష్ణు భక్తులనీ, ద్రవిడులు శివ భక్తులని ప్రాచుర్యమైంది. కానీ ఆర్యులు వచ్చాఇన కాలం అని చెప్పబడేదానికన్నా చాలా ముందు కాలమ్నాటి వినాయకుని విగ్రహం ఇరాన్లో బయటపడింది. ఆ సిధ్ధాంతం కూడా తుస్సుమంది.

ఇక దీనితో దండయాత్రవాదులు కొంచం తగ్గి "అబ్బే ఆర్యులు దండయాత్ర చెయ్యలేదు వలస వచ్చారంతే అని వాదన మార్చారు". వ్యతిరేకులు మాత్రం తగ్గలేదు. "ఏదో కొద్ది మంది వస్తే వ్హచ్చి ఉండచ్చుగాక - కానీ ఆర్యులు భారతీయులే" అని నొక్కో నొక్కకుండానో వక్కాణించేశారు. అంతటితో ఊరుకోలేదు. చాన్సు దొరికింది కదా అని ఎదురుదాడి మొదలు పెట్టారు.


4. సరస్వతీ నది: మన పురాణాలలో సరస్వతీనది గురించిన ప్రసావన చాలా ఉంది. వలసవాదులు "అలాంటిదేమీ లేదు! సరస్వతీనది ఒక బూటకం" అని వాదించారు. కానీ ఇటీవలే కనుగొనబడిన సరస్వతీ నది ఇప్పఋఇకి 5 వేల సంవత్సరాల క్రితమే ఎండిపోయింది అని నిర్ధారింపబడింది. కనుక ఆర్యులు అప్పటికే భారతదేశంలో ఉన్నరని, క్రీ పూ 1500 లో రాలేదన్న వాదం బలపడింది.

5. అలగే సింధూలోయా కాలమ్నాటి స్వస్తిక గుర్తుకూడా ఈ వాదనకి బలాన్ని చేకూర్చింది.

6. "ఉత్తరాదినుండి దక్షిణ భారతానికి తమిళులు మొదలైన వారు తరిమివేయబడితే ఉత్తరంలో వారు ఉన్న గుర్తులేవి?" అన్న ప్రశ్నకి సరైన సమాధానం లేదు.


వ్యతిరేకులే గెలిచేస్తున్నారొహో అనుకునే సమయానికి కధలో ట్విస్టు వచ్చిపడింది -

హైదరబాద్ - సీ సీ యం బీ 2002-2003 లో జన్యుకణాల పరిశొధన చేశి అగ్రవర్ణాల జీన్స్, దళితుల జీన్స్ వేరు వేరని తెల్చి చెప్పింది. అలగే ఉత్తర దక్షిణ రాష్ట్రాల ప్రజల జన్యుకణాలు వేరని కూడా తేల్చి చెప్పింది.

దీనితో వలసవాదుల్లో నూతనోత్సాహం వచ్చింది. వ్యతిరేకుల్ల గుండెల్లో రాయి పడింది.

( ఈ సస్పెన్స్ తరువాయి/ఆఖరి భాగం దాకా) - కాదు కూడదు అనుకుంటే దీనిగురించి ముందుగా చెప్పగలిగేది ఒకరే ఉన్నరు ....


వారే ...

వారే ....

వారే .....


వికటకవి బ్లాగులో రాజేష్ :))

25, జూన్ 2010, శుక్రవారం

ఆర్యులా? ద్రవిడులా?? గాడిదగుడ్డా? - రెండవభాగం: కుళ్ళు రాజకీయాలు

Pulling these old posts back (originally posted in March/April 2009)


సరే గొడవ మొదలయ్యింది ... (మన బ్లాగుల్లో కూడా)

ఒకవైపు లెఫ్టిస్టులు .. మరొకవైపు రైటిస్టులు ... అసలు ఈ విషయం ఇంత పెద్దది అవ్వడానికి కారణం ఒకటే - కుళ్ళు రాజకీయాలు ..

19 వ శతాబ్దంలో పాశ్చాత్యులకు మన సంస్కృతి మీద ఆసక్తి ఎక్కువయ్యింది. (అదే సమయంలో మన దేశం బ్రిటిష్ వారి అధీనంలో ఉంది). ఒక అభివృధ్ధి చెందిన నాగరికత ఐరోపా ఖండం బయట ఉండడం సహజంగానే వారికి మింగుడుపడలేదు. [ బీ వీ గిరి - ఆర్యన్ ఇన్వేజన్ వ్యాసంలో ] అప్పూడు ఉన్న చరిత్రకారుల్లో చాలామంది మతపరమైన దృష్టికోణం కలవారే. ప్రపంచం క్రీ పూ 4000 లో, నోవా క్రీ పూ 2500 లో సంభవించిందని నమ్మినవారే. కనుక ఆ కాలం కన్నా ముందు మనిషి భూమి మీద ఉన్నాడని నమ్మలేకపోయారు. వాళ్ళ లెక్కలు వేసుకుని క్రీ పూ 1500 లో ఐరోపానుండి ఆర్యులు భారతదేశానికి వచ్చారని తేల్చేశారన్నమాట. అదీకాక అప్పట్లో సంస్కృతానికి, ఇరానియన్, యూరోపియన్ భాషలకి సంబంధం ఉండేది అని భాషాప్రవీణులు అభిప్రాయపడ్డారు. అంటే వీటన్నికి మాతృభాష ఎడో ఉండాలని దానితో ఆ భాషకూడా యూరోపియనే అని నిర్ణయించేశారు.

ఇది బ్రిటిషువారికి కలిసొచ్చింది. ఆర్యుల ద్రవిడుల పేర్ చెప్పి జనాలని విడగొట్టారు. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. "మన భూమి ననాజాతి సంగమం" అని ఋగ్వేదంలోనే చెప్పబడింది - కానీ ఈ బ్రిటిష్వారు వాటిని రెండు జాతులని చేసి శత్రుత్వం ఎక్కువయ్యేలా చూసుకున్నారు. పది జాతుల మధ్య ఉన్న శత్రుత్వం కన్నా రెండు పెద్ద జాతుల మధ్యది తీవ్రంగానే ఉంటుంది కదా? అదీ వారి రాజకీయం .. అదీ కాక పాఠ్యాంశాలలో కూడా ఈ సిధ్ధాంతాన్ని చొప్పించేశారు ...

ఇక మన కాలానికి వస్తే బుర్ర తక్కువ నోరు ఎక్కువ ఉన్న నియో లిబరల్ కమ్యూనిష్టు మూక ఉండనే ఉన్నారు కదా మన దేశానికి వ్యతిరేకంగా ఉన్న ఏ సిధ్ధాంతాన్నయుఇనా నెత్తికెక్కించుకోడానికి. చైనా ఇరాన్ దేశాల అణ్వస్త్ర వ్యాప్తికి చప్పట్లు కొట్టి మన దేశం విషయంలో మాత్రం సన్నాయినొక్కులు నొక్కే ఈ ద్రోహులకి ఇలాంటి సిధ్ధాంతాలని తలకెక్కించుకోవడం ఎంతసేపు? విచిత్రమేమిటంటె ప్రతీదానికీ శాస్త్రీయమైన ఆధారం, సైంటిఫిక్ ప్రూఫు అని సుత్తి కబుర్లు చెప్పే ఈ పిచ్చి మూక ఈ సిధ్ధాంతాన్ని మాత్రం నమ్మేసింది - ఎలాంటి సైంటిఫిక్ నిరూపణా లేకపోయినా లింగ్విస్టిక్ (భాషాపరమయిన) నిరూపణ ఉంటే చాలు అనుకుంటూ. దీనిలో వీళ్ళకేమిటి లాభం అంటారా ...

"భారతదేశం 1947 కన్నా ముందు రాజకీయంగా ఒక్కటి కాకపోయినా, ప్రజలు నానాజాతి సమ్మేళనమయినా, సాంస్కృతికంగా ఇది ఒకే దేశం" అనే భావం కనక ప్రజల్లో వస్తే వారికి ఓట్లు వేసేదెవరు? (అలాగే ఆర్యులు అనేది జాతే కాదని, వారికి ద్రవిడులకి మధ్య యుధ్ధమేమి జరగలేదని తేలితే మన తమిళ పార్టీల గతేంకాను?).

అన్నట్టు బృహస్పతి ఆగమంలో (ఇది 1947 కన్నా ముందే) ఒక శ్లోకం ఉంది ..

"హిమాలయం సమారభ్య యావదిందు సరోవరం
తందేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్ష్యతే" అని ... (అక్షరదోషాలుంటే మన్నించగలరు - ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న శ్లోకం ఇది)

"హిందుస్థానం అనగా హిమాలయాలకు, ఇందూ సరోవరానికి (హిందూమహా సముద్రం) మధ్య దేవుడు నిర్మించిన దేశం" అని ...

(అలాగే హిమాలయాలలో ' హి ', ఇందూసరోవరంలో "ఇందు" కలిపి "హిందు" అయిందనికూడ కొందరు అంటారు .. నిజానిజాలయితే మనకి తెలియదు)

సరే మళ్ళీ రాజకీయాలలోకి వస్తే - అందరికన్నా ఈ విషయం జనన-మరణ సమస్య అయ్యింది హిందుత్వ వాదులకు .. ముఖ్యంగా జన సంఘ్ - బీజేపీ లకు. ఎందుకంటే "భారత ప్రజ ఒకటి కాదు" అనే భావన కలిగితే పార్టీ పునాదులే లేచిపొయే పరిస్థితి. వారి రాజకీయాలకి ఆయువుపట్టు ఆర్యులు భారతీయులనే భావన .

ఈ విధంగా చాలామందికి ముఖ్యమయిన ఈ విషయం పతాకశీర్షికలకెక్కింది. కాని విచిత్రంగా తన సిధ్ధాంతానికి వచ్చిన వ్యతిరేకత చూసి మాక్స్ ముల్లర్ ప్లేటు ఫిరాయించాడు. 1888 లో "Biographies of Words and the Home of the Aryas" లో ఆయన అన్న మాటలు

"I have declared again and again that if I say Aryas, I mean neither blood nor bones, nor hair, nor skull; I mean simply those who speak an Aryan language...to me an ethnologist who speaks of Aryan race, Aryan blood, Aryan eyes and hair, is as great a sinner as a linguist who speaks of a dolichocephalic dictionary or a brachycephalic grammar."


ఇది జరిగిన 100 సంవత్సరాల తరవాత, అంటే 1990 లలో కూడా ఈ గొడవ కొనసాగింది - ఒకవైపు రోమిలా థాపర్ లాంటి మార్క్సిష్టులు, మరోకవైపు ఆర్.యస్.యస్ మద్దతుదారులతో ...

( ఆ గొడవ గురించి వివరంగా వచ్చే పోస్టులో )

ఆర్యులా? ద్రవిడులా?? గాడిదగుడ్డా??? - మొదటి భాగం

Pulling these old posts back (originally posted in March/April 2009)ఆ మధ్య కాలంలో మేధావులని ఒక ఊపు ఊపింది ఆర్య-ద్రవిడుల సిద్ధాంతం. నేడు కూడా అది ఒక వివాదాస్పదమైన విషయమే - కాకపోతే అప్పుడు ఎవరో ఒకరిద్దరు వ్రాసిన పుస్తకాల ఆధారంగా వాదోపావాదాలు జరుగుతుండేవి, ఇప్పుడీ ఇంటర్నెట్ విప్లవం వల్ల ఈ విషయం మీద రచనలు, చర్చలు చాలా వెలుగులోకి వచ్చాయి. పని భారం వల్ల కాస్త ఆఫీసులో ఆలస్యమై, బయటనుండి తిండి తెప్పించుకుని తిని, పొట్ట బరువెక్కితే పార్కింగ్ లాట్ దాకా నడవడానికి బద్ధకం వేసి వ్రాస్తున్న టపా ఇది. పొట్ట బరువు తగ్గేలోగా ఈ నా సుత్తి అయిపోవాలని దేవుని ప్రార్ధించుకోండి.

సరే విషయంలోకొస్తే (సీరియస్ పోస్టులు రాయడం మనకి చేతకాదు - దేవుడి మీద భారం వేసి ప్రయత్నిస్తున్నా),

విషయంలోకొస్తే ...

అనగనగా ఓ విశ్వం ఉంది
ఆ విశ్వంలో పాలపుంత ఉంది
ఆ పుంతలో సౌర మండలముంది
దానిలో ఓ భూగోళం ఉంది
భూగోళం పై ప్రపంచముంది
ప్రపంచంలో ఐరోపా ఖండముంది
దానిలో జర్మనీ దేశం ఉంది
"మేక్స్ ముల్లర్" అనే శాల్తీ ఉంది

ఆ శాల్తీ మనకి కావాలీ
అతనిగురించే నేను వ్రాయాలీ!!!!


ఖంగారు పడద్దు .. ఏమి లెదు లెండి ... ఆ విధంగా 1823 లో జర్మనీలో పుట్టిన మేక్స్ ముల్లర్ ఏమి చేశాడయ్యా అంటే ...

1841 లో లీప్జిగ్ యునివర్సిటీకెళ్ళాడూ ... తందానా తానా
1843 లో పీ హెచ్ డీ దిగ్రీ తెచ్చుకున్నాడూ ... తందానా తానా
1846 ఇంగ్లండ్లో సంస్కృతం చదివాడూ ... తందానా తానా
ఆ తర్వాత ఇండీయా వచ్చీ చరిత్రని కెలికాడూ .. ... తందానా తానా
కెలికి కెలికి మన భారతీయుల మధ్య చిచ్చే పెట్టాడూ .. తందానా తానా

చిరాకేస్తోందా? చెప్పు తియ్యాలనిపిస్తోందా?? వద్దులేండి, కాస్త సీరియస్ గా వ్రాస్తా ...

ఈయన చేసిన ఘనకార్యం, తను చదివినదాని ఆధారంగా "భారతీయులలో రెండు వర్గాలున్నాయి - యూరోపు నుండి వచ్చిన ఆర్యులు, వారిచేత తరిమివెయ్యబడిన ద్రవిడులు" అని చెప్పి చక్కా పోవడం. దానిని పట్టుకుని హిట్లర్ తను ఆర్యుడనని ప్రకటించుకోవడం, మన రోమిలా థాపర్ లాంటి కమ్మ్యూనిష్టు స్కాలరు దానిని తలకెక్కించుకుని చరిత్ర పుస్తకాలు వ్రాయడం మనందరికీ తెలిసిందే. ఆ సిధ్ధాంతాన్ని కాస్తంత పరికించి చూడడమే ఈ పోస్టు ముఖ్యోద్దేశం.

ఆర్యుల దండయాత్ర సిధ్ధాంతాన్ని బలపరిచేవారు చెప్పేదేమిటంటే ...

* శ్వేతవర్ణపు ఆర్యులు క్రీ పూ 1500 దగ్గరలో భారతదేశం మీద దండెత్తారు
* ఉత్తర భారతంలో నివశించిన భారతీయులను దక్షిణానికి వెళ్ళగొట్టారు
* తమతో పాటుగా ప్రొటొ యూరోపియన్ భాష అయిన సంస్కృతాన్ని తీసుకొచ్చారు
* వాళ్ళ గౌరవం పెంచుకోడానికి వేదాలు, పురాణాలు సృష్టించారు
* హిందుమతం అనబడే కొత్త పధ్ధతిని ప్రవేశపెట్టారు
* 6000 సంవత్సరాల భారత చరిత్ర అంతా బూటకం
* శ్వేతవర్ణపు ఆర్యులు అగ్రకులావారు, యూరోపునుండి / ప్రష్యానుండి వచ్చినవారు
* నీలివర్ణపు ద్రవిడులు దళితులు

మనమందరం చిప్పూడు స్కూళ్ళలో ఇవే పాఠాలు చదువుకున్నాం కూడా - బ్రిటిషు ప్రభుత్వం వారు మన పాఠ్యాంశాలలోనికి చాలా తెలివిగా దీనిని చొప్పించారు. తర్వాత వచ్చిన భారత ప్రభుత్వాలు కూడా దీనిని మార్చే ప్రయత్నం చెయ్యలేదు. కమ్యూనిష్టులు సరే సరి - భారదేశంలో భిన్నత్వాన్ని సొమ్ముచేసుకుని మనుషుల మధ్య అగాధాలు సృష్టిస్తేనే కదా వాళ్ళకి వోట్లు పడేది. బ్రిటిషువారి హయాంలో పనిచేసిన కొంతమంది అగ్రవర్ణాలవారు కూడా "నిజమే కదా. మనము ఆర్యులమే. మిగిలిన వారికన్నా గొప్పవారమే" అని తేల్చేశారు.

హిందువుల పై అసలైన/నకిలీ ప్రేమతోనొ, ఓట్లకోసమో, లేక హిందువుల మద్దతుకోసమో గానీ కొంతమంది హిందుత్వ వాదులు ఈ సిధ్ధాంతంలో పసలేదు అనే గొడవ లేవదీశారు. దీనితో కమ్యూనిష్టు చరిత్రకారుల గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. చరిత్రని క్షుణ్ణంగా అధ్యయనం చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడినుండి గొడవ మొదలయ్యింది.

(సశేషం)