18, ఆగస్టు 2010, బుధవారం

మీరు అందంగా కనబడాలనుకుంటున్నారా? అయితే మీవారికో, బాయ్ ఫ్రెండుకో బీర్ పట్టండి!

జోకనుకుంటున్నారా? కాదండీ నిజమే - ఎమ్మెస్సెన్ వారు అందించిన సమాచారం ప్రకారం.

జనాలకి తీరిక ఎక్కువయ్యి కొంతమంది మగవాళ్లమీద ఒక స్టడీ నిర్వహించారు, దేనిగురించయ్యా అంటే - బీరు తాగే ముందు తాగిన తరవాత వారు అమ్మయిలని ఎలా చూస్తారు అని. తాగక ముందు "ఓ మోస్తరు గా ఉన్నారులే" అనుకున్న అమ్మాయిలందరూ, తాగిన తరవాత చాలా అందంగా కనిపించార్ట. కావాలంటే ఈ లింకు చూడండి.

అందాన్ని నిర్ణయించడానికి సాధారణంగా కొలమానమైన Facial Symmetry ని తాగిన వారు సరిగ్గా గుర్తించలేకపోవడమే దీనికి కారణంట.

ఇంకేం, అబ్బాయిలనాకర్షించే కిటుకు తెలిసిపోయిందిగా, ఇక పండగ చేసుకోండి :))

కానీ ఇందులో ఒక చిక్కుందండోఇ, బీరు కొట్టినవాళ్ళు మాములుగా స్నేహంగా నవ్విన అమ్మాయిని కూడ అపార్ధం చేసుకునే ప్రమాదముంది. కనుక, మీవారికి గానీ, బాయ్ ఫ్రెండుకి గానీ బీరు పడితే, పక్కన ఇంకో అమ్మాయి లేకుండ చూసుకోండేం?

5 వ్యాఖ్యలు:

 1. బద్రి, నువ్వు బీర్ తాగితే, నీకు మాత్రమే అమ్మాయిలు అందంగా కనబడుతారు. అలా కాకుండా, రివర్స్‌లో అమ్మాయిలకు వోడ్కా లేదా వైన్ పట్టించావనుకో, అప్పుడు అమ్మాయిలకు నువ్వు మన్మథుడిలా కనిపిస్తావు. ఏది బెటరో ఆలోచించుకో. :-))

  ప్రత్యుత్తరంతొలగించు
 2. నాగా
  సీప్ గా దొరికే వోడ్కా ఎక్కడదొరుకుతుందో సెప్పు
  దొరకకపోతే
  simronoff బాటిల్ లో సారా కొట్టి కాస్త perfume కొట్టేయడమే

  ప్రత్యుత్తరంతొలగించు
 3. నాగా కి బీర్ తో పాటు కాజల్ అగర్వాల్ బొద్దు కూడా కావాలి
  is this true?

  ప్రత్యుత్తరంతొలగించు
 4. Ee kaalam lo ammayil daggara emundi naaga, anni pai pai merugule. Beer lone vundi asalu kikku.

  ప్రత్యుత్తరంతొలగించు