25, ఫిబ్రవరి 2010, గురువారం

బాబోయ్ టెర్రరిస్టు!!!

(ఇదివరకూ తెలుగుపీపుల్ సైట్లొ వ్రాసిందే ఇది)

చికాగోలో మా పాత కంపెనీలో ఒక కలీగ్ ఉండేవాడు, విజయ్ సింగ్ అని - ఉత్తరభారతీయుడు. వెళ్ళక వెళ్ళక చాలాకాలానికి ఇండియా వెళ్ళాడు. తన ఊళ్ళో కొన్నాళ్ళుండి దేశాటనకి బయల్దేరాడు. పనిలో పనిగా హైదరాబాద్ కూడా వచ్చాడు. వచ్చినవాడు వచ్చినట్టూ ఊరుకోవచ్చుకదా, ఊహూ( నేను హైదరాబాదులో ఉన్నానోచ్ అని ఇక్కడ చిచాగో మిత్రులకి మెయిల్ కొట్టాడు. తన జీవితంలో మరిచిపోలేని ఒక తప్పు అది. ఎందుకో తెలుసుకదా, హైదరాబాద్ అనగానే ఇక్కడ చికాగో వాళ్ళు అక్కడ అమ్మానాన్నలకి ఫోన్లు చెయ్యడం, వాళ్ళూ పొడులు పచ్చళ్ళూ ఇచ్చెయ్యడం జరిగిపోయాయి. "చచ్చాన్రా దేవుడా" అనుకుంటూ అవన్నీ తీసుకుని చికాగో బయల్దేరాడు.

ప్రయాణం బాగానే సాగింది. దిగాక ఇమ్మిగ్రేషన్ అయ్యింది. కస్టంస్ చెక్ లో మనవాడీ మీదకి ఒక కుక్కని వదిలేశారు. అదసలే కుక్క, కష్టాల్లో, అదే కస్టంస్ లో ఉంది, కెలకడానికి ఇండియన్ దొరికాడు, ఇంకెం? రెచ్చిపోయి వాసన చూసేసి నోతికి అందినదేదో బయటకి లాగింది. వెంటనే ఒక మామ వచ్చి ఆ బేగ్ విప్పి చూపించమన్నాడు. మనవాడు కొంచం భయస్తుడు లేండి. దానికి తోడు విపరీతమైన ఖంగారు. వణుకుతూ బేగ్ ఓపెన్ చేసి అన్నీ చూపిస్తుంటే మామకి ఒక పొట్లం కనిపించింది. బయటకి తీశాడు. ఇక వాళ్ళీద్దరి మధ్యా జరిగిన సంభాషణ

Customs Officer: "Sir, where are you coming from?"

Vijay Singh: "Mumbai, India"

Officer: "Could you tell me what's inside this?"

Vijay: "Yeah, its Gun Powder"

Officer: "Whaaat?"

Vijay: "Yes it's Gun Powder from India"


దెబ్బకి మామ కూడా భయపడి మరో ఇద్దరిని పిలిచాడు. "వీడెవడో గన్ పౌడర్ తెచ్చిందే కాకుండా, తెచ్చాను అని ధైర్యంగా చెప్తున్నాడు రోయ్. ఖచ్చితంగా టెర్రరిస్టే" అనుకుంటు మరో ఇద్దరు, పిలవకపోయినా పరిగెత్తుకొచ్చారు. మనవాడీ భయం ఎక్కువయ్యింది. మామలకి ఇంకా అనుమానం వచ్చింది. ఇంటరాగేషన్ మొదలు పెట్టారు

Officer: "Are you sure this is Gun Powder?"

Vijay: "Yes"


చూస్తూంటే, భారతీయుడు, ఏ సూడాన్ వాడొ, అఫ్గాన్ వాడో కాదు. గన్ పౌడర్ తెచ్చాననంటున్నాడు!


Officer: "Do you know it's illegal to bring Gunpowder on the plane?"

Vijay: "NO, I dont"

Officer: "Yes it is. Would you like to tell us what you intend to do with this?"

Vijay: "We Eat it!"

Officer" "You what?"

Vijay: "We Eat it!"

Officer: How can you EAT Gun Powder man? Are you crazy?"

Vijay: "We dont eat it as it is. We can not. But we eat it with Rice. It tastes good!"

Officer: ???!!!???!!!???

హైదరాబాదులో మనవాడికి ఎవరో కందిపొడి ఇచ్చి, తెలుగు రానివాడికి ఆ పేరు అర్ధంకాదని "గన్ పౌడర్" అని చెప్పార్ట (కంది పొడిని మనం ఆంధ్రాలో గన్ పౌడర్ అనేగా పిలిచేది!). పాపం అదే మనవాడి కొంపముంచింది. "గన్ పౌడర్ అంటున్నాడు, తింటాను అంటున్నాడు, వీడు టెర్రరిస్టా, లేక పిచ్చివాడా?" అని అనుమానం వచ్చింది మామలకి.

Officer: Bringing explosives into the country is a serious offense.

మనవాడి బల్బ్ వెలిగింది.

Vijay: "Nooooooo, it's not that Gunpowder that you are imagining it to be. This is made of Indian Spices - Lenthil Powder - a Food Item from South India! We call it gun powder because its very spicy!!"


అప్పుడు పరిస్థితి అర్ధం అయ్యింది మామలకి. దానిని టెస్టు చేసి, ఎందుకైనా మంచిదని చెత్తబుట్టలో పడేసి, నవ్వుకుంటూ మనవాడిని వదిలేశారు.

కనుక సోదరసోదరీమణుల్లారా, అమ్మలారా, అయ్యలారా, మీరెవరికైనా కందిపొడి ఇస్తే, లెంథిల్ పౌడర్ అని చెప్పండిగానీ, గన్ పౌడర్ అని మాత్రం చెప్పకండి :))

24, ఫిబ్రవరి 2010, బుధవారం

నేనూ, నా "ఐస్ టీ" !!!

అనగనగా ఒక రోజు. చికాగో షాంబర్గులో మా ఆఫీసు ... సాయంకాలం .. ఆకలితో నేను .. అంద్తకు ముందు రాత్రి ఏమితినలేదు, ఆ రోజు పొద్దున్న మధ్యాహ్నం కూడ ఏమి తినలెదు. అయిదయ్యింది.. దాహం కూడా మొదలయ్యింది. సరే ఎదన్నా తాగుదామని మా బాస్ ని అడిగా, సరే అని ఒక ఆరుగురం గుంపుగా అక్కడే గాల్ఫ్ రోడ్ మీదున్న టీ జీ అఈ ఫ్రైడేస్ కి వెళ్ళాం. డ్రింక్ ఆర్డర్ చెయ్యమన్నాడు. నేనేదో ఫోన్ హడావిడిలో ఉండి మా బాస్ చెప్పిన ఐస్ టీనే నాకు కూడా తెమ్మన్నా. సరే నని తీసుకొచ్చాడు. అసలే ఆకలి, పైగా దాహం. నీరసానికి ఒళ్ళు తూలడం కూడ మొదలయ్యింది. వాడేమో ఫ్రైస్ తెచ్చి చావడు. సరే టీ తాగితే తగ్గుతుందేమో అని మొదలు పెట్టా, తగ్గలేదు సరి కదా తల తిరుగుడు ఇంకా ఎక్కువయ్యింది. పక్కవాళ్ళ సురాపానం, మనకేమో ఆ వాసనకి కడుపులో తిప్పుడు. సినీమా కష్టాలన్నమాట. ఇది లాభంలేదు జ్యూస్ ఏమన్నా తాగుదామని చూస్తే పక్క టేబుల్ మీడ ఎదో దానిమ్మ రసం మెన్యూ కనిపించింది. సరే అది తీసుకురమ్మన్నా. పక్కనే విస్కీ తాగుతున్న ఒకాయన, "మాగాడంటే విస్కీ తాగాలోయ్, అదేమిటి ఆడవాళ్ళ డ్రింకు తాగుతున్నావ్" అని కుళ్ళాడు. "నీ బొందలే, దానిమ్మ రసంలో ఆడా మగా ఏమిటి?" అనుకుని ఒక వెర్రి నవ్వు నవ్వి ఊరుకున్నా. నా నవ్వు వెనకాల వ్యంగ్యం అర్ధమయ్యిందేమో, మా బాస్ మొహంలో చిద్విలాసం.

సరే, ఆ సెర్వారాయుడు, నేనడిగింది తీసుకొచ్చాడు. అది త్రాగాక కూడా, ఊహు( లాభంలేదు, ఇంకా ఎక్కువయ్యింది గానీ తగ్గలేదు. సరే ఇక లాభంలేదని అందరికీ గుడ్ Bye చెప్పేసి పక్కనున్న పార్కింగ్ లాట్ లోకి నడిచా (నేను శరత్ ని కలిసింది ఆ పార్కింగ్ లాట్లోనే) ... తల తిరుగుడు, కడుపు తిప్పుడు, ఆకలి. తిన్నగా నడవవలసిన వాడిని చక్కర్లలో నడవడం మొదలు పెట్టా, జనాలేమొ నన్ను చూసి నవ్వు .. నా పరిస్థితి అర్ధం కాక. అదృష్టవశాత్తు నా స్నేహితుడు రేవంత్ (అదే ఝాన్సీ తో కలిసి ఏదో టీవీ సీరియల్ చేసినతను) ఇంటికి తీసుకెళ్ళడు. మా ఆవిడ పిల్ల ఊళ్ళో లేరు - రోడ్ ఐలేండ్లో ఉన్నరు. కునాల్ అని మరో ఫ్రెండ్ ఇంటికొచ్చి ఒక ఆరేడు దోసెలేసి పెట్టి వేళ్ళాదు. అవి తిన్నాక కాస్త ఓపిక వచ్చింది. వామ్మో, తిండీ తినకుండ అంత సేపు ఉండకూడదు అనుకున్నా...

ఆ మర్నాడు ఆఫీస్ కి వెళ్ళిన వెంటనే జనాలు నన్ను చూడడం, నవ్వడం. ఎందుకో నాకర్ధం కాలేదు. ఒకళ్ళని అడిగితే "నిన్న నువ్వేం చేశావో తెలుసా?" అని ప్రశ్న. "ఏహే! ఒంట్లో బాలేదు, అందుకే ఇంటికెళ్ళిపోయాను" అన్నా ..

"దానికి ముందు ఏం చేశావ్?"

"ఐస్ టీ, దానిమ్మ జ్యూస్ తాగి, ఏవో ఫ్రైస్ తిన్నా, టిజీఐ ఫ్రైడేస్ లో" అన్నా

మళ్ళీ నవ్వు

"తెలుగు సినీమా హీరోయిన్ వెకిలి నవ్వు చాలు గానీ విషయం చెప్పి తగలడు" నాకు కోపమొచ్చింది.

"పిచ్చినా వెర్రినా బుజ్జీ, నువ్వు త్రాగింది మామూలు ఐస్ టీ కాదు, లాంగ్ ఐలాండ్ ఐస్ టీ - దానిలో రం, జిన్, వోద్కా కలిసి ఉంటాయి)

అలాగే తరవాత తాగింది పోమెగ్రేనైట్ మార్గరీటా, దానిమ్మ జ్యూసు కాదు. నీ హడావిడిలో "లాంగ్ ఐలాండ్" వినకుండా "ఐస్ టీ" మాత్రమే విన్నావ్, అలగే "మార్గరీటా" చూడకుండా "పోమెగ్రేనైట్" మాత్రమే చూసావ్. అదీ సంగతి - జీవితంలో మొదటిసారి తాగడం, అది కూడ ఖాళీ కడుపుమీద, పైగా ఇంత స్ట్రాంగ్ డోసు" అని ఒకటే నవ్వు.

"హతోస్మి" అనుకున్నా. అప్పటినించీ ఎక్కడికెళ్ళినా తెలియని డ్రింక్ అడిగేడప్పుడు దాంట్లో ఆల్కహాల్ ఉందా లేదా అని మరీ కనుక్కుంటా!

"ఆడవాళ్ళ డ్రింక్" అని పక్కన ఉన్నాయన ఎందుకు వెక్కిరించాడో అప్పుడు తెలిసింది. అది మార్గరీటా అన్న విషయం వెలిగాక ఆయన కుళ్ళలేదని అర్ధమయ్యింది. నాకు తాగుడలవాటు లేదని తెలిసిన మా బాస్ నవ్వు వెనకాల అంతరార్ధంకూడా అప్పుడే క్లిక్కుమంది.

వెంటనే వెళ్ళీ "నే తాగనని తెలుసు కదా, మరి నాకెందుకు చెప్పలేదు?" అని అడిగితే దానికి ఆయన సమాధానం "నువ్వడగలేదు, నేను చెప్పలేదు" అని!!!! పైగా మళ్ళీ "మరో టీటోటలర్ చేత విజయవంతంగా మందుకొట్టించా" అని ముసిముసినవ్వులు, "నువ్వు వెధవ్వనుకున్నాను గానీ , మరీ ఇంత వెధవ్వనుకోలేదు" అని అర్ధం వచ్చేడట్టు ఒక లుక్కూను!

ఒక్క పూటకే నాకు అంత దారుణమైన ఫీలింగ్ వచ్చింది. రోజూ తాగేవాళ్ళకి చేతులెత్తి దణ్ణం పెట్టాల్సిందే.

20, ఫిబ్రవరి 2010, శనివారం

సరే! మిమ్మల్ని భయపెట్టాలని డిసైడైపోయా!

దమ్ముంటే ఇది విని స్థిరంగా ఉండండి!! (లింకు మీద క్లిక్కండి) - విని ఎవరైనా ఆత్మహత్యలు చేసుకున్న ఎడల బాధ్యత నాది కాదుgsss.wav

ఈ పాట గుర్తుపట్టగలరా?

ఈ పాట గుర్తుపట్టగలరా?

మొదటిది ఇన్స్రుమెంటల్, రెండవది కరియోకే

మరేమీలేదు - అసలు గుర్తుపట్టేలానైన ఉందోలేదో అని చెక్ :))

Pardon me for the relatively poor quality Mp3 file - Have had some problems with Wav uploads today


నాకు ఈ పాట వింటూంటే పాత ఐసీఐసీఐ ప్రకటన గుర్తొస్తుంది,. ఎందుకంటారు? అలాగే ఓ పాకిస్తాని బేండ్ వాళ్ళ "సుట్టా" పాట కూడా :))


Get this widget | Track details | eSnips Social DNA


gssskaraoke.wavFeel free to use the karaoke if at all you like it.

PS: Ekalingam, MIDI thing is not working - too bad!

రాయప్రోలువారి పద్యానికో పేరడీ!

కోడు విరిగిన డబల్ బెడ్డై
కాలు జారిన బాత్ రూమై
ఏడ్చుచున్నది భరత ఖండము
బాగు చెయ్యర తమ్ముడా

టెర్రరిష్టులు దాడిచేయగ
లంచగొండులు రాజ్యమేలగ
ప్రజలనందరు మోసపుచ్చగ
తెలుసుకొనరా తమ్ముడా

యువత శక్తిని కోల్పోచుండగ
క్రికెట్ కోసమె బ్రతుకుతుండగ
సినిమాహాళ్ళలో తిరుగుచుండగ
ఏంచేయుదువురా తమ్ముడా?

( Thanks to my cousin Prasanna for reminding me of the original)

18, ఫిబ్రవరి 2010, గురువారం

తెలంగాణా - సమైక్య: "తూనీగ పోరాటం"

ఈ సమైక్యాంధ్ర్ర తెలంగాణా గొడవ హైకూల్లో తేలడంలేదని, సినిమా పాటల్లోకి దిగారు ఉద్యమకారులు. తనకిష్టమైన "తూనీగ తూనీగా" పాట ట్యూనులో ఒక తెలంగాణావాది సందేశం


ఆంధ్రోడ ఆంధ్రోడా, తట్టాబుట్టా నువ్ సర్దుకుపోరా దూరంగా
తెలంగాణా మాదేరా నీ దోపిడీ ఇకపై సాగదు లేరా ఓ దొంగా

అదిలాబాద్, నల్గొండ .. ఓహో
వరంగల్ కరీం నగరూ ..
మెదకూ రంగారెడ్డీ .. ఆహా
ఖమ్మం, మెహబూబ్నగరూ
నిజామాబద్, హైదరాబాదూ అన్నీ మావేరా

ఆంధ్రోడ ఆంధ్రోడా, తట్టాబుట్టా నువ్ సర్దుకుపోరా దూరంగా
తెలంగాణా మాదేరా నీ దోపిడీ ఇకపై సాగదు లేరా ఓ దొంగా

చరణం:

సిక్స్ టెన్ నీ పక్కనబెట్టీ
ముల్కీని తుంగలో తొక్కీ
నువ్ చేసిన మోసం మేమూ మరచిపోమురో

గోదావరి కృష్ణా నీరు
కోస్తా జిల్లాలకి చేరు
మానోట్లో మాత్రం
ఆల "మట్టి" కొట్టెరో

ఆపరా డాబు, వెళ్ళరా బాబూ
మాజోలికి ఇకపై రాకురా ... ఆ.. ఆ.. ఆ..

ఆంధ్రోడ ఆంధ్రోడా, తట్టాబుట్టా నువ్ సర్దుకుపోరా దూరంగా
తెలంగాణా మాదేరా నీ దోపిడీ ఇకపై సాగదు లేరా ఓ దొంగా


సమైక్యవాది సమాధానం - అదే ట్యూనులో


తెలంగాణా కుర్రోడా, నీ లాజిక్ చెత్తలా ఉంది వినరా శాంతంగా
హైదరాబాద్ అందరిదీ, దానిని కొట్టేద్దామనుకు - న్నావా ఏకంగా?


చరణం:


నగరాన్ని పక్కనపెట్టీ
దొంగ పద్దుల చుట్టలు చుట్టి
నువ్ బొంకిన బొంకులు
మాకు, తెలిసిపోయేరో


మీప్రాంతం నేతలు సారూ
సీయం పీయం అయ్యారు
అయినా మేమంటే ఎందుకు
నీకు కుళ్ళురో

స్వార్ధం కొందరిదీ, రాష్ట్రం అందరిదీ
అబద్ధాలు చాలు, ఆపరా .. ఆ.. ఆ.. ఆ..

17, ఫిబ్రవరి 2010, బుధవారం

ముగ్గురు బ్లాగర్లు కలిసి సృష్టించిన పాట ఇది - వారిని కనుక్కోండి చూద్దాం!

ఈ పాటని ముగ్గురు బ్లాగర్లు కలిసి సృష్టించారు. పాట వ్రాసింది ఒక బ్లాగరు, సంగీతం సమకూర్చింది మరో బ్లాగరు, పాడింది ఇంకొకరు. ఆ ముగ్గురినీ గుర్తుపట్టగలరా?

కనీసం ఇద్దరినైనా?

విచిత్రమేమిటంటే, ఆ బ్లాగర్లు ఒకళ్ళనొకళ్ళు ఇప్పటిదాకా కలుసుకోలేదు.


Update 1: విజయమోహన్ గారు, భావన గారు కనుక్కున్నారు కాబట్టి చెప్పేస్తున్నా:

పాట వ్రాసింది భా.రా.రె; సంగీతం కూర్చింది, మిక్స్ చేసింది నేనే, ఇకపోతే గాయకురాలిని పట్టుకోవడం కాస్త కష్టం - ఆవిడ బ్లాగులకి కొత్త. కాస్త కష్టం - ఆవిడ బ్లాగులకి కొత్త. But people from Telugupeople.com can easily identify her voice!

Update 2: Yes, Ravi got it right .. its Amrapali. కానీ ఆవిడ బ్లాగుని కనుక్కోండి చూద్దాం!


ఆరు నెలల క్రితం అవ్వాల్సిన పాట ముక్కుతూ మూలుగుతూ ఇప్పటికయ్యింది :))


పాటకోసం క్రింద బొమ్మ మీద ఉన్న లింకు మీద క్లిక్కండి (Use Internet Explorer)chilipigano.wav

హైకూలతో రామాయణం: 5-7-5 నిబంధనతో

ఇది కెలుకుడు టపా కాదండోయ్. నా రాముడితో పరాచికాలాడతానా? "కోతి మూక టపాల బదులు కాస్త మంచిదేమన్నా వ్రాయచ్చుగా?" నన్న ఒక స్నేహితురాలి సూచనననుసరించి ఇది వ్రాయడం మొదలుపెట్టాను. అదేమి విచిత్రమోగానీ మొదలుపెట్టాక ముగించేదాకా నా చేతులు ఆగలేదు - మొత్తం వ్రాయడానికి పట్టింది 15 నిముషాలకన్నా తక్కువే - కాకతాళీయంగా 24 హైకూలు వచ్చాయి - రాముడా మజాకా మరి!

ఇది నచ్చితే సంతోషం, నచ్చకపోతే క్షమించండి - కాని ఇది హాస్యంకోసం వ్రాసినది కాదు, భక్తితో వ్రాసినదే.దశరధుడు
ముగ్గురి పెనిమిటి
అయోధ్య రాజు

ఆ మారాజుకు
పిల్లలు పుట్టకున్న
యజ్ఞం చేసెను

అగ్నిదేవుడు
ఇచ్చిన పాయసాన్ని
భార్యలకిచ్చె


ఆ ఱేడునకు
నలుగురు పిల్లల
సంతతిగల్గె

రామ లక్ష్మణ
భరత శతృఘ్నులు
తన పిల్లలు

జనకునకు
కూతురు దొరికెను
సీతరూపాన

స్వయంవరాన
విరిచెను రాముడు
శివ ధనుస్సు

సీతతో పెండ్లి
జరిగెను రామునకు
వైభవముగా

అయోధ్యలోన
కైకేయి పెట్టినది
మడతపేచీ

పంపించాలంది
రాముని అడవికి
వనవాసిగా

బయల్దేరెను
సీతాలక్ష్మణులతో
రాముడు ఇక

ఒక రక్కసి
రాముని వెంటాడగా
తమ్ముడు జూసె

శూర్పణఖవి
ముకుచెవులుగోసి
చేతిన బెట్టె

మాయలేడిని
చూసిన సీతాదేవి
కావాలనెను

రాముడు వెళ్ళె
తరువాత తమ్ముడు
లక్ష్మణుడెళ్ళె

రావణుడొచ్చి
భిక్షమునడగుచూ
కుట్రనుపన్నె

లక్ష్మణ రేఖ
దాటిన సీతమ్మను
అపహరించె

హనుమంతుడు
రాముని భక్తుడయ్యి
లంకనిజేరె

సీతను జూసి
తను తీసుకొచ్చిన
ముద్రిక జూపె

రాక్షస మూక
తనను బంధింపగా
లంకను గాల్చె

వానర సేన
సాయముతో రాముడు
వారధి కట్టె

సేతువు దాటి
లంకను జేరగనే
యుధ్ధముజేసె

ఆ యుధ్ధమున
హతుడై రావణుడు
నేలన్ గూలె

సీతతో సహా
మన రామయ్యతండ్రి
అయోధ్యజేరె!

16, ఫిబ్రవరి 2010, మంగళవారం

సమైక్య, తెలంగాణావాదులు హైకూలలో తన్నుకుంటే ఎలా ఉంటుంది? (5-7-5)

తెలంగాణావాది(తె):

తెలంగాణాలో
సమైక్యవాదులకు
రంగుపడుద్ది

సమైక్యవాది (స):

హైదరాబాదు
నీ బాబుగాడి సొమ్ము
అనుకున్నావా?

తె:

స్వయం పాలన
ప్రత్యేక తెలంగాణా
మా జన్మ హక్కు

స:

విడిపోయిన
రాష్ట్రాలెన్నో అయ్యాయి
బుట్టలో తుక్కు

తె:

గిట్లా మమ్మల్ని
పరేషాన్ జెయ్యక
గమ్మునుండు బే!


స:

ఏటేటేటేటీ?
మాతో పెట్టుకోమాక
బేగెల్లిపోరా!


తె:

ముయ్యిబే నోరు
ఆపలేవు మా హోరు
జై తెలంగాణా!

స:

నువ్వే మూసుకో
మా గ్రూపుదే విజయం
జై సమైక్యాంధ్ర!

కొన్ని కై.కూ.లు (కెలుకుడు హైకూలు): 5-7-5

బైకు పైనుండి
క్రిందపడ్డ పవను
పైకూ ఓ హైకూ

(పైకూ: పైత్యపు కూత)

మార్తాండగారి
సాహిత్యావలోకనం
పిచ్చెక్కించింది

కాగడాగారి
బ్లాగులో పేరడీలు
వివాదాస్పదం

రవిగారిని
రీడిఫ్ చాట్ లోనే
కలిశా నేను

వికటకవి
శ్రీనివాసుకి బెస్టు
ఫ్రెండు రాజేషే

జ్యోతి బ్లాగులో
వంటల ఘుమఘుమ!
ఆకలేస్తోందీ!!!!

సుజాతగారి
మనసులోమాటలు
మీకు తెలుసా?

భావనగారు
బ్లాగులలో వ్రాసిన
కామెంట్లెక్కడ?

శరత్ కాలం
స్వలింగసంపర్కుల
ప్రతినిధేగా?

ప్రపీససలో
ప్రనా ని కెలుకుతూ
గొప్ప టైంపాస్

ఏకలింగమే
మలక్పేట్ రౌడీనా?
ప్రనా ఉవాచ


రౌడీరాజ్యంలో
హైకూల కెలుకుడు
చూస్తునే ఉండు

15, ఫిబ్రవరి 2010, సోమవారం

పెడితే పెట్టాలిరా బ్లాగు పెట్టాలీ ...

పొద్దున్న లేస్తునే వికటకవి శ్రీనివాస్ మెసేజ్:

"కాగడా మీడ ఫుల్ లెంగ్త్ పేరడీ వ్రాయకూడదూ - కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలీ ట్యూనులో?" అని

మొహం కడుక్కుని మొదలు పెట్టా .. ఇదిగో:కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలీ
పెడితే పెట్టాలిరా బ్లాగు పెట్టాలీ

ఏదేమైనా గానీ పేరడీ వ్రాయాలీ
క్లేసిక్ స్టైల్ లో గొడవలు పెట్టుకోవాలీ
మరువం, చిన్ని, భారారే పై బాంబులెయ్యాలీ

ఉంటే ఉండాలీ మహారాజు లాగా
పోస్టులు వెయ్యాలీ కాగడా లా
కెలుకుడు కెలకాలీ కవితలని బాగా
పోతే పోవాలీ కూడలి లోంచి, హారం లోంచీ


చరణం:

ఏగ్రిగేటర్ ఉన్నది బ్లాగు చూసేటందుకే
బ్లాగులే అసలున్నవి పోస్టేసేటందుకే

ఏగ్రిగేటర్ ఉన్నది బ్లాగు చూసేటందుకే
బ్లాగులే అసలున్నవి పోస్టేసేటందుకే

కామెంట్ల బాక్సుందీ ఏ చెత్తైనా వ్రాయడానికే
మోడరేషన్ ఉండెదీ వ్రాసినదాన్నీ పీకడానికే

ఈ బ్లాగూ, పోస్టు, కామెంట్ అన్నీ టైంపాసుకే

ఉంటే ఉండాలీ మహారాజు లాగా
పోస్టులు వెయ్యాలీ కాగడా లా
కెలుకుడు కెలకాలీ కవితలని బాగా
పోతే పోవాలీ కూడలి లోంచి, హారం లోంచీ

కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలీ
పెడితే పెట్టాలిరా బ్లాగు పెట్టాలీ

ఏదేమైనా గానీ పేరడీ వ్రాయాలీ
క్లేసిక్ స్టైల్ లో గొడవలు పెట్టుకోవాలీ
మరువం, చిన్ని, భారారే పై బాంబులెయ్యాలీ

ఉంటే ఉండాలీ మహారాజు లాగా
పోస్టులు వెయ్యాలీ కాగడా లా
కెలుకుడు కెలకాలీ కవితలని బాగా
పోతే పోవాలీ కూడలి లోంచి, హారం లోంచీ

14, ఫిబ్రవరి 2010, ఆదివారం

కాగడా పై వివిధ బ్లాగర్ల పోస్టులు

అ మధ్య అబ్రకదబ్ర గారు కుక్క పై వివిధ బ్లాగర్ల పోస్టులు ఎలా ఉంటాయో చెప్పారు. అంతకు ముందు పొద్దు వారు చీమ గురించి చెప్పారు. Now, కాగడా మీదైతే ఎలా ఉంటాయోనన్న అలోచన - వారి స్ఫూర్తి తో
టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్: కాగడా KAGADA

శరత్ కాలం: కా-గే-డా కి ప్రేమ ముఖ్యమా? పెళ్ళి ముఖ్యమా?

ప్ర పీ స స: ఇవాళ్టి టాపిక్: కాగడ జ్యోతిగారింటికి వెడితే ఎలా ఉంటుంది? ఇక కుమ్మెయ్యండి, కామెంట్లు 2000 కి తగ్గకూడదు

పవన్: నేనేరా కాగడా, ఏం పీక్కుంటావో పీక్కో!

రవిగారు: కాగడా తో నా మరచిపోలేని అనుభవం (వివాదంలోనే సుమండీ)

వికటకవి శ్రీనివాస్: కాగడాని కలిసిన రాజేష్

మార్తాండ: కాగడాపై రంగనాయకమ్మగారి ఎనాలసిస్

తెలుగు తూలిక: కాగడా కి కార్లు, నాకు టికెట్లు

తూర్పు - పడమర: కాగడా కధ - బ్లాగు దొంగ

పర్ణశాల: కాగడాకి ధూం ఏమవుతాడు?

సందేహం: నా గాల్ ఫ్రెండుకి కాగడా లైనెయ్యడంలో తెలంగాణావాదుల కుట్రేమన్నా ఉందా?

ఏకలింగం: కాగడాకి స్కాట్ లేండులో తీసిన ఫోటోలు

తెలుగోడు: ఒక కాగడా, పది జ్యోతులు

పుస్తకం: కాగడా రచనలపై యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రివ్యూ

బుక్స్ & గాల్ ఫ్రెండ్స్: కాగడా: వన్ బ్లాగ్ లవ్ స్టోరీ

తెలుగు వ్యూస్: కాగడా తో కాఫీకెళ్ళిన కాజల్

ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు: కాగడాపై నేటి టీవీ ఛానెళ్ళ ప్రభావం

ఆంధ్రామృతం: పోర్న్ కు వ్యతిరేకంగా కాగడా ఉద్యమం - ఐ న్యూసులో

ధరణి ఆర్ట్ బీట్: ఆ కాగడా ఫోటో ని ఫోటోషాప్ సాయంతో కొవ్వొత్తిగా మార్చా, అంతే!

నా క్లిక్ లొ మంచి కిక్ ఉంది: కాగడ అటు ఇటూ ఊగుతున్నప్పుడు ఒక పొసిషన్ లో ఇలా క్లిక్కుమనిపించా

గుండెచప్పుడు: కాగడా బ్లాగుకు వ్యతిరేకంగా తెలంగాణాలో మానవహారం

భవదీయుడు: కాగడా పై అమావస్య ప్రభావం, అందుకే దాడులు

భూమిక స్త్రీవాద పత్రిక: కాగడా పేరుని స్త్రీలింగం చేసి కాగడీ అని మార్చాలి

సాహితి ఝరి - నా హృదయమంఝరి: ముక్కాలా, ము-కాగడా లైలా, ఓ లైలా

శ్రీనివాస్ పప్పు: పరువు తీసిన కాగడా

జ్యోతి: కాగడా(ని) పచ్చడి చేద్దాం రండి

సుజాత: కాగడా మనసులో మాట - ఎందుకీ బలవంతపు బ్లాగింగ్?

కలవరమాయే మదిలో: నా మొదటి ఫ్లైటులో కాగడాతో ఫైట్

మధుర భావాల సుమమాల: కాగడా తన బ్లాగుకి బానిసా?

సహచరుడు: కాగడా మానవ హక్కులనుల్లంఘించిన కాగడా మొగుడు

13, ఫిబ్రవరి 2010, శనివారం

జ్యోతికే మతిపోగొట్టిన ఘనుడు :))

ఎవడి పేరు చెబితే బ్లాగ్లోకం వణికిపోతుందొ - ఎవడు కధ వ్రాస్తే, కన్నీళ్ళకి బదులు రక్తం వస్తుందో, వాడే..వాడే..జ్యోతికి పిచ్చెక్కించాడు, వంటల జ్యోతిని మెంటల్ జ్యోతిగా మార్చాడు ..

ఒక కధని వేరే పేరుతో పంపించి దానిమీద ఆవిడ అభిప్రాయం అడిగాట్ట. దెబ్బకి ఆవిడకి పిచ్చెక్కి ఇదిగో ఇలాంటి దిక్కుమాలిన పోస్టులు వ్రాయడం మొదలెట్టింది. పంపినవాడెవరో ఆవిడకి తెలియకపోయినా కధ చదివాక మనకి తెలియదంటారా?

ఆ కధ కింద పోస్టుతున్నా ... ఇది రాసిందెవరో కనుక్కోడానికి శ్రమ పడక్కర లేదు. ప్రపీససలూ, మీరేమంటారు?

___________________________________________________________కొత్త చిగురుశాండిల్య తన బీరువా నుంచి టాల్స్టాయ్ వ్రాసిన “War and Peace” పుస్తకం తీసి చదువుతున్నాడు. ఆ సమయంలోనే శాండిల్య స్నేహితుడు మూర్తి వచ్చాడు. స్నేహితుడిని చూసి చూడనట్టు ఉండి పుస్తకం మీదే కాన్సెంట్రేషన్ పెట్టాడు శాండిల్య. ఎప్పుడూ పుస్తకాల మీదే కాన్సెంట్రేషన్ అయితే ఎలా రా, స్నేహ సంబంధాలు అవసరం లేదనుకుంటున్నావా? అని అడిగాడు మూర్తి. పుస్తకం మీద ఉన్న కాన్సెంట్రేషన్ మరల్చడం ఎందుకు అని నీ వైపు చూడలేదు, అంత మాత్రానికే నేను స్నేహ సంబంధాలు అవసరం లేదనుకుంటున్నానని దాని అర్థమా? అడిగాడు శాండిల్య. నీ క్లోజ్ ఫ్రెండ్ వచ్చినప్పుడు కూడా నువ్వు పుస్తకాలు పక్కన పెట్టకుండా వాటి మీదే కాన్సెంట్రేషన్ తో ఉంటే అలాగే అనిపిస్తుంది, పద మనం రెస్టారెంట్ కి వెళ్ళి కాస్సేపు కబుర్లు చెప్పుకుందాం అని అన్నాడు మూర్తి. నాన్ వెజ్ రెస్టారెంట్ కే కదా వెళ్ళబోయేది, నేను నాన్ వెజ్ తినడం మానేశాను అని జవాబు ఇచ్చాడు శాండిల్య. నువ్వు నాన్ వెజ్ తినడం మానేశావా? పార్టీలు, ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు ఫ్రీగా వస్తుంది కదా అని నాన్ వెజ్ బాగా మెక్కేసేవాడివి కదరా, నువ్వు నాన్ వెజ్ నిజంగా మానేశావని నేను అనుకోను అని సందేహం వ్యక్తం చేశాడు మూర్తి. నువ్వు అనుకున్నా, అనుకోకపోయినా నేను చెప్పేది మాత్రం నిజం. టాల్స్టాయ్ రచనలు చదివిన తరువాత నాన్ వెజ్ తినడం మానేశాను. నాలుక రుచి కోసం జంతువుల్ని చంపుకు తినడం ఆటవిక పద్దతిలాగ కనిపిస్తోంది అని జవాబు ఇచ్చాడు శాండిల్య. పక్కా నాస్తికుడివైన నువ్వు పక్కా క్రైస్తవుడైన టాల్స్టాయ్ బోధనలు చదివి మారిపోయావా? అడిగాడు మూర్తి. నేను నాస్తికుడినే కానీ నీతి విషయంలో మత విశ్వాసాలు కూడా ప్రభావం చూపుతాయనే విషయం మరచిపోను అని జవాబు ఇచ్చాడు శాండిల్య. రెస్టారెంట్ కి రావు కదా, ఇక్కడే కాస్సేపు కబుర్లు చెప్పుకుందాం అన్నాడు మూర్తి.

శాండిల్య తన వ్యక్తిగత విషయాలు చెప్పడం మొదలు పెట్టాడు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయికి ఆ విషయం చెప్పలేదు, ఆ అమ్మాయి ఒప్పుకుంటుందో లేదో అని భయంగా ఉంది అన్నాడు శాండిల్య. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ముందు ప్రేమ విషయం ఆ అమ్మాయికి చెప్పు, ఒప్పుకుంటుందో లేదో అనే సంగతి తరువాత అన్నాడు మూర్తి. ఆ అమ్మాయి పేరు లలిత. మా ఫామిలీకి బాగా తెలిసినవాళ్ళ అమ్మాయే. వాళ్ళ నాన్న గారు సింహాద్రి నాయుడు అని ఒక లాయర్. అతను మా నాన్న గారు పని చేసే బ్యాంక్ కి లీగల్ అడ్వైజర్ కూడా. వాళ్ళ నాన్న గారు విజయనగరం జిల్లాలోని కూనేరు అనే పల్లెటూరి నుంచి వచ్చారు. కూనేరులో మా బంధువులు ఉన్నారు. మా బంధువులకి కూడా వాళ్ళ ఫామిలీ తెలుసు. ఈ రకంగా కూడా వాళ్ళకీ, మాకూ మధ్య స్నేహం ఏర్పడింది. అంతా బాగానే ఉంది కానీ ఆ అమ్మాయి వయసులో నా కంటే ఐదేళ్ళు పెద్దది. ఆమె నా ప్రేమని ఒప్పుకుంటుందో లేదోనని భయం అన్నాడు శాండిల్య. సచిన్ టెండూల్కర్ లాగే నువ్వు కూడా నీ కంటే సీనియర్ ని పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నావన్న మాట అన్నాడు మూర్తి. నేను చలం గారి అభిమానిని. ప్రేమ, పెళ్ళి విషయంలో నాకు అలాంటి సంకుచిత పట్టింపులు లేవు అని జవాబు ఇచ్చాడు శాండిల్య. తెలుసురా, నేను కూడా చలం గారి అభిమానినే. నువ్వు కూడా చలం గారి సాహిత్యం చదవడం చూసాను అన్నాడు మూర్తి. నా పుస్తకాల బీరువా తెరిచి చూస్తే చలం, టాల్స్టాయ్ ల పుస్తకాలతో పాటు లెనిన్, స్టాలిన్, ఎడ్గర్ స్నో, సమీర్ అమీన్ తదితరులు వ్రాసిన పుస్తకాలు కూడా కనిపిస్తాయి అన్నాడు శాండిల్య. పుస్తకాలు చదవడమొక్కటే జీవితం కాదు రా, నేను కూడా చలం గారి పుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలు చదివాను. కొంత సేపు పుస్తకాలు పక్కన పెట్టి అమ్మాయి గురించి ఆలోచించు. పుస్తకాల ప్రభావం వల్ల నువ్వు నీ కంటే సీనియర్ తో ప్రేమలో పడ్డావు కానీ ఆ ప్రేమని నిలబెట్టుకోవడం నీ చేతుల్లో ఉంది. కేవలం చదివి తరువాత ప్రయత్నం ప్రారంభించకపోతే పని జరగదు, నీ ప్రేమ విషయం ముందు ఆ అమ్మాయికి చెప్పు అని సలహా ఇచ్చాడు మూర్తి. అలాగే అని సమాధానం చెప్పాడు శాండిల్య. ఒకవేళ ఆ అమ్మాయి నీ ప్రేమని అంగీకరించినా, మీ పెద్దవాళ్ళు మీ పెళ్ళికి ఒప్పుకోకపోవచ్చు, అప్పుడు మీరు వేరే కాపురం పెట్టుకుని బతకాలి కనుక ఉద్యోగ ప్రయత్నాలు కూడా చెయ్యు అని సలహా ఇచ్చాడు మూర్తి. ఉద్యోగం కాకపోతే వ్యాపారమైనా పెట్టుకుంటాను, మా నాన్న గారు బ్యాంక్ ఆఫీసర్ కదా, నాకు లోన్ ఇప్పించగలరు, ఆర్థికంగా సెటిల్ అయిన తరువాతే పెళ్ళి చేసుకుంటాను అన్నాడు శాండిల్య.

శాండిల్య ప్రేమించిన లలిత భరద్వాజ్ అనే ఇంకో వ్యక్తిని ప్రేమిస్తుంది. ఈ విషయం శాండిల్యకి తెలియదు. భరద్వాజ్ ప్రేమ పేరుతో పత్రికలలో కథలు, సీరియళ్ళు వ్రాస్తుంటాడు. అతని కథలు, సీరియళ్ళు చదివి లలిత అతని అభిమాని అయ్యింది. ఒకసారి అతను వ్రాసిన నవల ఒకటి పుస్తకాల షాపులో కొన్న లలిత ఆ పుస్తకంలో భరద్వాజ్ అడ్రెస్ కూడా చూసింది. అతనికి ఉత్తరాలు వ్రాయడం, ఫోన్లు చెయ్యడం, వ్యక్తిగతంగా కలవడం, ఇలా ఆమె భరద్వాజ్ తో పరిచయం పెంచుకుంది. ఇది ప్రేమ వరకు దారి తీసింది. ఈ విషయాలు తెలియని శాండిల్య లలితకి తన ప్రేమ గురించి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుంటాడు.

కూనేరు గ్రామంలో శాండిల్య బంధువుల ఇంటిలో పెళ్ళి నిశ్చితమయ్యింది. శాండిల్య తండ్రి దామోదరం వాళ్ళ బావ కూతురు పెళ్ళి. దామోదరం వాళ్ళ బావ, మేనల్లుడు ఇన్విటేషన్ కార్డు పట్టుకుని దామోదరం ఇంటికి వచ్చారు. దగ్గరి బందువులే కనుక శాండిల్య తల్లితండ్రులు కూనేరు వెళ్ళాలనుకున్నారు. దామోదరం వాళ్ళ బావ కుటుంబం లలిత తండ్రి సింహాద్రి నాయుడుకి కూడా తెలిసిన వాళ్ళు కావడం వల్ల లలిత కుటుంబాన్ని కూడా ఆహ్వానించారు. కూనేరు సింహాద్రి నాయుడు పుట్టిన ఊరు, సింహాద్రి నాయుడు వాళ్ళ నాన్న గారు ఉండేది అక్కడే. ఎలాగూ సొంత ఊరికి వెళ్ళినట్టు అవుతుందని సింహాద్రి నాయుడు ఈ పెళ్ళికి వెళ్ళాలనుకున్నాడు. పెళ్ళికి ఒక రోజు ముందు రెండు కుటుంబాలు కూనేరు బయలుదేరాయి. దామోదరం తన బావ ఉండేది పక్క జిల్లాలోనే అయినా కొన్ని సంవత్సరాలుగా అతన్ని కలవకపోవడం వల్ల ఈ సారి కొన్ని రోజులైనా వాళ్ళ ఊరిలో ఉండి రావాలని అనుకున్నాడు. కూనేరు ఎలాగూ లలిత తాతగారి ఊరే కనుక లలిత కుటుంబ సభ్యులు కూడా కొన్ని రోజులు అక్కడే ఉండాలనుకున్నారు.

లలితని ఒంటరిగా కలుసుకునే అవకాశం కోసం శాండిల్య ఎదురు చూస్తూ లలితని గమనిస్తూ ఉన్నాడు. శాండిల్య తన బంధువుల ఇంటి మేడ మీద కూర్చుని ఎదురుగా ఉన్న లలిత తాతగారి ఇంటి వైపు చూస్తూ ఉన్నాడు. లలిత ఇంటిలో బోర్ కొట్టి కొంత సేపు ప్రకృతి రమణీయతని చూద్దామని బయటకి వచ్చింది. ఆమెని కొంచెం దూరం నుంచి ఫాలో అవుతూ వెళ్ళాడు శాండిల్య. ఆమె రైల్వే కల్వర్టు (చిన్న బ్రిడ్జి) దగ్గర ఆగింది. శాండిల్య లలిత దగ్గరకి వచ్చి ఎదురుగా నిలబడి ఆమెతో “నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, చాలా కాలం నుంచి ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను కానీ చెప్పడానికి ధైర్యం రాలేదు. ప్రేమని ఎక్కువ కాలం దాచుకోలేక మీరు నా ప్రేమని ఓకే చెయ్యాలని ఆశిస్తూ మీకీ విషయం చెపుతున్నాను” అని అన్నాడు భయపడుతూ. లలిత ఇలా సమాధానం చెప్పింది “నేను నీ ప్రేమకి ఓకే అనడమా? నా వయసెంత? నీ వయసెంత?”. శాండిల్య ఆమెతో ఇలా అన్నాడు “మీరు ఇలాంటి సమాధానం చెపుతారని నేను ముందే ఊహించాను. ప్రేయసి, ప్రియులు / భార్య, భర్తలు మధ్య అండర్ స్టాండింగ్ ముఖ్యం. అండర్ స్టాండింగ్ ఉంటే భర్త భార్య కంటే వయసులో చిన్నవాడైనా ఎలాంటి సమస్యలూ రావు. నేను మీకు చిన్నప్పటి నుంచి తెలిసిన వాడినే కదా, మన ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ సులభమే, ఆలోచించండి”. లలిత ఇలా సమాధానం చెప్పింది “నీ వయసు ఇంకా ఇరవై సంవత్సరాలే, నీకు పెళ్ళికి అంత తొందర ఎందుకు? ముందు చదువు పూర్తి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వడం గురించి ఆలోచించు”. శాండిల్య ఏమి చెప్పాలో ఆలోచించాడు. అంతలోనే పెద్ద శబ్దం చేసుకుంటూ గూడ్సు రైలు వచ్చింది. ఆ శబ్దం వల్ల శాండిల్య చెప్పాలనుకున్నది చెప్పలేకపోయాడు. అతను చెప్పేలోపు లలిత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. లలిత సెల్ ఫోన్ నంబర్ శాండిల్య దగ్గర ఉంది. తరువాత లలితతో ఫోన్ లో మాట్లాడాలనుకుంటాడు.

సెలవులు ముగిసాయి. శాండిల్య, లలితల కుటుంబాలు పట్టణానికి తిరిగి వచ్చాయి. శాండిల్య లలిత గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు. కూర్చుంటే ప్రయోజనం ఉండదు, అనుకున్నట్టు గానే లలితకి ఫోన్ చేద్దాం అనుకుంటూ లలిత సెల్ ఫోన్ కి కాల్ చేశాడు. లలిత రిసీవ్ చేసింది. శాండిల్య మొదలు పెడుతూ “నేనే లలితా, మొన్న నేను నీతో మాట్లాడుతున్నప్పుడు ట్రెయిన్ వచ్చి ఆ శబ్దం వల్ల ఏమీ మాట్లాడలేకపోయాను. ఆ లోగా నువ్వు వెళ్ళిపోయావు. నా వయసు ఇరవై ఏళ్ళేననీ, పెళ్ళికి తొందర పడొద్దనీ అన్నావు. పెళ్ళి కోసం కొంత కాలం ఆగగలను, ఇప్పుడు ప్రేమించడంలో మాత్రం తప్పు లేదు కదా” అని అన్నాడు. “నేను వయసులో నీ కంటే పెద్దదాన్ని, నాతో నీకు ప్రేమేమిటి” అని ఫోన్ పెట్టేసింది లలిత. రేపు మళ్ళీ ఫోన్ చేద్దాం అని శాండిల్య కూడా రిసీవర్ పెట్టేశాడు. మరుసటి రోజు లలితకి మళ్ళీ కాల్ చేశాడు. లలిత ఫోన్ ఎత్తగానే “నిన్న నేను చెపుతున్నది పూర్తిగా వినకుండా ఫోన్ పెట్టెయ్యడం బాగా లేదు, ఈ సారైనా విను” అన్నాడు శాండిల్య. “నేను ఇంకొకరిని ప్రేమించాను. ఇంత వరకు వచ్చిన తరువాత నిజం దాచడం ఎందుకు, అందుకే చెప్పేస్తున్నాను. ఒకరితో ప్రేమలో పడిన తరువాత ఇంకొకరిని ప్రేమించలేను కదా, అందుకే ఫోన్ పెట్టేశాను” అని సమాధానం చెప్పింది లలిత. నన్ను ప్రేమించడం ఇష్టం లేక అలా అంటున్నావా అని అడిగాడు శాండిల్య. నిజంగానే నేను ఇంకొకరిని ప్రేమించాను, నువ్వు ఇది కట్టు కథ అనుకుంటే నేనేమీ చెయ్యలేను అంటూ ఫోన్ పెట్టేసింది లలిత. ఫోన్ లో ప్రేమ గురించి చెప్పడం కష్టం, ఎందుకంటే ఫోన్ పెట్టేయడం అవతలి వాళ్ళ చేతిలోని పని, మళ్ళీ అవకాశం దొరికితే మళ్ళీ ఆమెని ఒంటరిగా కలుద్దాం అనుకున్నాడు శాండిల్య.

లలిత భరద్వాజ్ కి ఫోన్ చేసింది. మనం ఏడాది నుంచి ప్రేమించుకుంటున్నాం, ఇప్పటి వరకు పెళ్ళి మాట ఎత్త లేదు, ఇక ఆలస్యం ఎందుకు, మన పెద్ద వాళ్ళకి ఈ విషయం చెప్పేదాం అంది లలిత. సరే అన్నాడు భరద్వాజ్. ఆలస్యం చెయ్యకుండా చెప్పేయ్ అంది లలిత. లలిత తన తండ్రి దగ్గరకి వెళ్ళింది. నాన్నా అని భయంతో నెమ్మదిగా పలికింది. ఏమిటి? అని అడిగాడు సింహాద్రి. ఇది ప్రేమ వ్యవహారం కనుక తన తండ్రి ఏమంటాడోనని భయపడుతూనే నెమ్మదిగా విషయమంతా చెప్పింది లలిత. ఆలోచించి చెపుతాను, భరద్వాజ్ కి కూడా అతని తల్లి తండ్రులకి విషయం చెప్పమను అన్నాడు సింహాద్రి. లలిత భరద్వాజ్ కి మళ్ళీ ఫోన్ చేసింది. తాను తన తండ్రికి ప్రేమ విషయం చెప్పానని, మీ పెద్దలకు కూడా ప్రేమ విషయం చెప్పమని నాన్న గారు అన్నారని చెప్పింది. భరద్వాజ్ కూడా ధైర్యం చేసి తన తల్లితండ్రులకి ప్రేమ విషయం చెప్పాడు. ప్రేమించావులే కానీ వాళ్ళ కులం ఏమిటో, గోత్రం ఏమిటో తెలుసుకున్నావా? అని అడిగింది భరద్వాజ్ తల్లి. ఏమో తెలియదు సమాధానం చెప్పాడు భరద్వాజ్. కులం సంగతి పక్కన పెట్టండి, వాళ్ళ నాన్న గారు లాయర్ కనుక కట్నం బాగా ఇవ్వగలడు, మన ఫామిలీ నచ్చితే కులం పట్టింపు లేకుండా పెళ్ళికి ఒప్పుకుంటాడో లేదో చూద్దాం అన్నాడు భరద్వాజ్ తండ్రి. రేపు మనం వాళ్ళ ఇంటికి సంబంధం మాట్లాడడానికి వెళ్దాం, కులం గురించి ఏమీ మాట్లాడొద్దు. వాళ్ళంతట వాళ్ళుగా కులం పట్టింపులు లేకుండా పెళ్ళికి ఒప్పుకుంటే మంచిది. మనం వాళ్ళకి అనవసరంగా కులం గుర్తు చెయ్యకూడదు అని సూచనలు ఇచ్చాడు భరద్వాజ్. భరద్వాజ్ లలితకి ఫోన్ చేశాడు. మా అమ్మానాన్నలు రేపు సాయింత్రం సంబంధం మాట్లాడడానికి మీ ఇంటికి వస్తారు, మీ వాళ్ళకి ఆ టైమ్ కి ఇంటిలో ఉండమని చెప్పు అన్నాడు భరద్వాజ్. అలాగే అంది లలిత. మరుసటి రోజు భరద్వాజ్ తన తల్లితండ్రులతో కలిసి లలిత ఇంటికి వెళ్ళాడు. భరద్వాజ్ తల్లితండ్రులు, లలిత తల్లితండ్రులు అవీ ఇవీ మాట్లాడుకున్నారు. రెండు కుటుంబాలు సంబంధం కలుపుకోవడానికి అంగీకరించాయి.

ఒక రోజు సింహాద్రి ఇన్విటేషన్ కార్డు పట్టుకుని దామోదరం ఇంటికి వచ్చాడు. ఇన్విటేషన్ కార్డు ఇస్తూ వాళ్ళ అమ్మాయికి కుదిరిన పెళ్ళి సంబంధం గురించి చెప్పాడు. ఇది విన్న శాండిల్య షాక్ అయ్యాడు. ఇక లలిత మీద ఆశలు వదులుకోవలసిందే అనుకున్నాడు. కొన్ని రోజుల పాటు బాధతోనే కాలం గడిపాడు శాండిల్య. పోయిన ప్రేమ కోసం జీవితాంతం బాధ పడడం వృథా కనుక బాధని దిగ మింగుకుని మళ్ళీ పుస్తకాలు మీద కాన్సెంట్రేషన్ పెంచాడు శాండిల్య. ఎలాగూ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తయ్యింది కాబట్టి పోస్టు గ్రాడ్యుయేషన్ చేద్దామా, స్వయం ఉపాధికి ఉపయోగపడే కోర్సులో చేరుదామా అని కూడా ఆలోచిస్తుంటాడు. ఇలా రోజులు గడిచిన తరువాత ఒక రోజు మూర్తి శాండిల్య వాళ్ళ ఇంటికి వచ్చాడు. శాండిల్య మూర్తికి ప్రేమ ఫైల్యూర్ గురించి చెప్పాడు. మూర్తి విని బాధ పడ్డాడు. మూర్తి తాను చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు చెయ్యాలనుకుంటున్నట్టు శాండిల్యకి చెప్పాడు. కేవలం ఉద్యోగం కోసం వేచి చూస్తే దొరకదు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి కూడా ఆలోచించాలి, చార్టర్డ్ అకౌంటెన్సీ ప్రొఫెషన్ ఎంచుకున్నా మంచిదే, ఆలోచించు అని శాండిల్యకి సలహా ఇచ్చాడు మూర్తి. నేను చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు చెయ్యడానికి విజయవాడ వెళ్ళాలనుకుంటున్నాను. నీకు కూడా ఈ ప్రొఫెషన్ చేపట్టాలని ఉంటే నాతో పాటు విజయవాడ రా అన్నాడు మూర్తి. ఆలోచించి చెపుతాను అన్నాడు శాండిల్య. శాండిల్య తాను చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సులో చేరాలనుకుంటున్నట్టు అమ్మానాన్నలకి చెప్పాడు. చేరు, మంచిదే, నువ్వు ఎలాగూ B.Com చదివావు కాబట్టి చార్టర్డ్ అకౌంటంట్ గా కూడా రాణించగలవు అన్నాడు దామోదరం. నా ఫ్రెండ్ మూర్తి విజయవాడ వెళ్ళి చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సులో చేరాలనుకుంటున్నాడు, నేను కూడా అతనితో కలిసి విజయవాడ వెళ్ళాలని అనుకుంటున్నాను అన్నాడు శాండిల్య. మీ బాబాయ్ ఎలాగూ ఇబ్రహీంపట్నం థర్మల్ పవర్ ప్లాంట్ లో పని చేస్తున్నాడు కదా. నువ్వు ఇబ్రహీంపట్నంలో ఉంటూ రోజూ విజయవాడ అప్ & డౌన్ అవ్వొచ్చు అన్నాడు దామోదరం. దామోదరం శాండిల్యని ఇబ్రహీంపట్నంలోని వాళ్ళ బాబాయ్ ఇంటికి పంపించాడు. మూర్తి విజయవాడలో హాస్టల్ లో చేరాడు. శాండిల్య, మూర్తి ఇద్దరూ ఒకే దగ్గర కోర్సులో చేరారు.

లలితకి భరద్వాజ్ తో పెళ్ళయ్యింది. భరద్వాజ్ డబ్బు మనిషనీ, అతనికి తన మీద కంటే డబ్బు మీదే ప్రేమ ఎక్కువ అని తెలియక భరద్వాజ్ తో కాపురం చేస్తుంది. కొంత కాలం గడిచింది. ఇంటిలో ఖాళీగా ఉండడం ఎందుకని లెక్చరర్ ఉద్యోగంలో చేరింది లలిత. ఆమె సంపాదించిన జీతం ప్రతి నెలా తనకి ఇవ్వాలని కోరాడు భరద్వాజ్. అందుకు ఒప్పుకోలేదు లలిత. అందుకు కోపంగా ఉన్న భరద్వాజ్ ఎప్పుడు ఏ చిన్న కారణం దొరికినా లలితని తిట్టడం, సూటిపోటి మాటలతో వేధించడం మొదలు పెట్టాడు. అప్పుడప్పుడూ కొట్టడం కూడా చేస్తుంటాడు. ఇలా వారి కలహాల కాపురం సాగుతోంది. లలిత ప్రెగ్నెంట్ అయ్యింది. పుట్టబోయేది ఆడ బిడ్డో, మగ బిడ్డో స్కానింగ్ టెస్ట్ ద్వారా తెలుసుకుందాం అన్నాడు భరద్వాజ్. అందుకు లలిత ఒప్పుకోలేదు. ఆడ పిల్ల పుడితే పెద్దైన తరువాత ఆమె పెళ్ళికి లక్షలు కట్నం ఇవ్వాలనీ, మగ పిల్లవాడు పుడితే తనకే కట్నం వస్తుందనీ ఇలా భవిష్యత్ డబ్బు గురించి బిడ్డ పుట్టక ముందే ఆలోచించ సాగాడు భరద్వాజ్. పుట్టబోయేది ఆడపిల్ల అయితే అబార్షన్ చెయ్యించాలని భరద్వాజ్ అనుకున్నాడు. స్కానింగ్, అబార్షన్ ల ఐడియాలకి లలిత వ్యతిరేకించింది. పుట్టబోయేది మగ బిడ్డే కావాలని కోరుతూ దేవుడిని తలచుకోవడం ఒక్కటే భరద్వాజ్ కి మార్గంగా మిగిలింది. భరద్వాజ్ తలచినదానికి విరుద్ధంగా ఆడ పిల్ల పుట్టింది. భరద్వాజ్ కి లలిత మీద కోపం మరింత పెరిగింది. లలితని మరింతగా వేధించ సాగాడు. ఇతని వేధింపులు భరించలేక విడాకులు ఇస్తానన్నది లలిత. లలిత తనని విడాకులు ఇస్తే మళ్ళీ పెళ్ళి చేసుకోవచ్చు, మళ్ళీ కట్నం వస్తుంది అనే ఆశతో విడాకులకి ఒప్పుకున్నాడు భరద్వాజ్. నేను విడాకులకి రెడీ, ఇప్పుడే ఫామిలీ కోర్టుకి వెళ్దాం, ఇద్దరం ఒప్పుకుంటే విడాకులు వెంటనే వచ్చేస్తాయి అన్నాడు భరద్వాజ్. నాకు కూడా ఆలస్యం ఇష్టం లేదు, నీలాంటి డబ్బు మనిషితో నేను ఒక క్షణం కూడా కాపురం కొనసాగించలేను అంది లలిత. ఇద్దరూ కోర్టుకి వెళ్ళారు, విడాకులు తీసుకున్నారు. లలిత తన పాపతో కలిసి పుట్టింటికి వచ్చేసింది.

శాండిల్య చేరిన నాలుగేళ్ళ చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు పూర్తయ్యింది. ఇంటికి తిరిగొచ్చాడు శాండిల్య. తన మాజీ ప్రియురాలు లలిత ఎక్కడ ఉందో, ఎలాగుందో తెలుసుకోవాలని అనుకున్నాడు శాండిల్య. శాండిల్య తన తల్లి దగ్గరకి వెళ్ళాడు. అమ్మా, నాలుగేళ్ళు నేను ఊర్లో లేను కదా, ఈ నాలుగేళ్ళు ఇక్కడ జరిగిన విషయాలు నాకు తెలియవు, అందుకే అడుగుతున్నాను, సింహాద్రి గారి అమ్మాయి లలితకి పెళ్ళయ్యింది కదా, లలిత ఆమె భర్త ఇక్కడే ఉంటున్నారా, ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారా? అని అడిగాడు శాండిల్య. లలిత ఆమె భర్తకి విడాకులు ఇచ్చేసింది అని సమాధానం చెప్పింది శాండిల్య తల్లి. ఎందుకు విడాకులిచ్చేసింది అని అడిగాడు శాండిల్య. ఆమె భర్త పక్కా డబ్బు మనిషి, అతనితో కాపురం చెయ్యలేక విడాకులు ఇచ్చేసింది అని చెప్పింది శాండిల్య తల్లి. లలిత తన భర్తకి విడాకులు ఇచ్చింది కనుక తాను లలితని పెళ్ళి చేసుకోవచ్చనీ, ఓడిపోయిన ప్రేమని మళ్ళీ బతికించుకోవాలనీ నిర్ణయించుకున్నాడు శాండిల్య.

శాండిల్య లలితకి ఫోన్ చేశాడు. లలిత కాల్ రిసీవ్ చేసుకోగానే “నేను శాండిల్యని మాట్లాడుతున్నాను, నాలుగేళ్ళ క్రితం నువ్వు నా ప్రేమని కాదని ఇంకొకరిని పెళ్ళి చేసుకున్నావు. నువ్వు భర్త నుంచి విడాకులు తీసుకున్నావని నాకు తెలిసింది. ఇప్పుడు కూడా నువ్వంటే నాకు ప్రేమే, నువ్వు ఓకే అంటే పెళ్ళికి సిద్ధమే” అన్నాడు శాండిల్య. లలిత ఏమి సమాధానం చెప్పాలో ఆలోచిస్తోంది. “నేను నీ కంటే వయసులో చిన్న వాడినే, ప్రేమకి వయసు అడ్డు రాదు, మగవాడు తన కంటే వయసులో పది పదిహేనేళ్ళు చిన్నదైన స్త్రీని పెళ్ళి చేసుకోగా తప్పు లేనప్పుడు, ఆడది తన కంటే వయసులో ఐదేళ్ళు చిన్న వాడిని పెళ్ళి చేసుకోవడం తప్పేమీ కాదు, నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్ళికి సిద్ధమే” అన్నాడు శాండిల్య. “నేను నీతో పర్సనల్ గా మాట్లాడాలి, రేపు మీ అమ్మానాన్నలు ఆఫీస్ కి వెళ్ళిపోయిన టైమ్ లో మీ ఇంటికి వస్తాను, అప్పుడు మాట్లాడుకుందాం” అంది లలిత. “మా అమ్మానాన్నలు పది గంటలకి ఆఫీస్ కి వెళ్తారు, రేపు పది గంటలు తరువాత సాధ్యమైనంత తొందరగా రా” అన్నాడు శాండిల్య.

మరుసటి రోజు అనుకున్న టైమ్ కి లలిత శాండిల్య ఇంటికి వచ్చింది. లలిత శాండిల్య దగ్గర కూర్చుని మాటలు మొదలు పెట్టింది “నాలుగేళ్ళ క్రితం నీ ప్రేమని కాదన్నాను కానీ ఇప్పుడు కాదనాలని అనుకోవడం లేదు. మగవాడు తన కంటే 25 ఏళ్ళు చిన్నదైన స్త్రీని పెళ్ళి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి కానీ చాలా మంది మగవాళ్ళు తమ కంటే వయసులో పెద్దైన స్త్రీని పెళ్ళి చేసుకోవడానికి సంకోచిస్తారు, నేను నీ కంటే వయసులో పెద్ద దాన్ని అని తెలిసి కూడా నువ్వు నన్ను ప్రేమించడం చూస్తోంటే నీకు ఆడవాళ్ళ పట్ల నెగటివ్ ఫీలింగ్ అంతగా లేనట్టు అనిపిస్తొంది, అప్పట్లో నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను, నేను ఇంకొకరితో ప్రేమలో పడడం వల్ల కూడా నేను నీ ప్రేమని అంగీకరించలేదు, ఇప్పుడు నీ ప్రేమని అంగీకరిస్తున్నాను” అని అంది లలిత. శాండిల్య ముఖంలో సంతోషం కళ కనిపించింది. “నన్ను పెళ్ళి చేసుకోవాలంటే నువ్వు ఒక కండిషన్ కి ఒప్పుకోవాలి, నాకు ఒక పాప ఉంది. నా కూతురుని నీ కూతురు లాగ పెంచడానికి నువ్వు సిద్ధమేనా? నాకు కాబోయే భర్త నా కూతురుకి మంచి తండ్రి కూడా కావాలని కోరుకుంటున్నాను” అంది లలిత. నీ కూతురుని పెంచడానికి నాకు అభ్యంతరం లేదు, నీ కూతురుని నా కూతురు లాగ పెంచడం నాకు కష్టం కాదు అన్నాడు శాండిల్య. “మీ అమ్మానాన్నలు ఈ పెళ్ళికి ఒప్పుకోకపోవచ్చు, మగవాడికి భార్య ఉండగానే మళ్ళీ పెళ్ళి చేస్తారు, భార్య చనిపోతే నెల రోజులు తిరగక ముందే రెండవ పెళ్ళి ప్రయత్నాలు మొదలు పెడతారు కానీ ఆడదానికి భర్త చనిపోయిన తరువాత లేదా విడాకులు తీసుకున్న తరువాత మళ్ళీ పెళ్ళి చెయ్యడం గురించి ఆలోచించేవాళ్ళు తక్కువ, నువ్వు విడాకులు తీసుకున్న స్త్రీని పెళ్ళి చేసుకోవడానికి మీ అమ్మానాన్నలు అంత సులభంగా ఒప్పుకోరేమో, ఒకవేళ మీ అమ్మానాన్నలు ఒప్పుకోకపోయినా నన్ను పెళ్ళి చేసుకోవడానికి నువ్వు సిద్ధమేనా?” అని అడిగింది లలిత. మా అమ్మానాన్నలు ఒప్పుకోకపోయినా నిన్ను పెళ్ళి చేసుకోవడానికి నేను సిద్ధమే, వాళ్ళు ఒప్పుకోరని నేను కూడా అనుకుంటున్నాను, మా వాళ్ళకి ఈ విషయం చెపితే నువ్వు విధవల్నీ, విడాకులు తీసుకున్న వాళ్ళనీ ఉద్దరించక్కరలేదు అని అంటారు అని అన్నాడు శాండిల్య. పెద్దవాళ్ళు ఒప్పుకోకపోయినా మన పెళ్ళి విషయం వాళ్ళకి చెప్పాలి కనుక చెప్పు. ఒకవేళ ఒప్పుకుంటే మంచిదే, ఒప్పుకోకపోతే వాళ్ళ నిర్ణయంతో నిమిత్తం లేకుండా పెళ్ళి చేసుకుందాం అంది లలిత. సరే, నాలుగేళ్ళ క్రితం నేల రాలిన నా ప్రేమ మళ్ళీ చిగురించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, థాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ మై లవ్ అంటూ లలిత చేతులు పట్టుకుని అభినందించాడు శాండిల్య.

సాయింత్రం అయ్యింది. శాండిల్య తల్లితండ్రులు ఇంటికి వచ్చారు. శాండిల్య తన తల్లితండ్రులకి తన ప్రేమ విషయం చెప్పాడు. శాండిల్య ఊహించినట్టుగానే అతని తల్లితండ్రులు అతని ప్రొపోజల్ ని వ్యతిరేకించారు. మీరు ఒప్పుకోరని నేను ముందే ఊహించాను, మీరు ఒప్పుకోకపోయినా లలితని పెళ్ళి చేసుకుంటాను అన్నాడు శాండిల్య. నువ్వు లలితని పెళ్ళి చేసుకుంటే దానితోనే వేరే కాపురం పెట్టు కానీ ఆమెని నా ఇంటికి కోడలిగా తీసుకురాకు అంది శాండిల్య తల్లి. వేరే కాపురం పెట్టడం నాకేమీ సమస్య కాదు అని సమాధానం చెప్పాడు శాండిల్య. లలిత కూడా తన తల్లితండ్రులకి ఈ ప్రేమ విషయం చెప్పింది. శాండిల్యని ఇంటికి పిలిపించి అతనితో మాట్లాడారు లలిత తల్లితండ్రులు. తమ కూతురు మొదటి పెళ్ళి విఫలమయ్యింది, రెండవ పెళ్ళి చేసుకునైనా సంతోషంగా ఉండాలని ఈ పెళ్ళికి ఒప్పుకున్నారు ఆమె తల్లితండ్రులు. శాండిల్య, లలిత రిజిస్ట్రార్ ఆఫీస్ లో పెళ్ళి చేసుకున్నారు. పెళ్ళికి లలిత తల్లితండ్రులు, శాండిల్య స్నేహితుడు మూర్తి సాక్షి సంతకాలు పెట్టారు. నాలుగేళ్ళ క్రితం నేల రాలిన తన స్నేహితుని ప్రేమ మళ్ళీ చిగురించినందుకు మూర్తికి కూడా సంతోషం కలిగింది. పోగొట్టుకున్నది తిరిగి పొందావు, యూ ఆర్ లక్కీ అంటూ శాండిల్యని పొగిడాడు మూర్తి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ లక్, ఇట్ ఈజ్ మై యాక్సిడెంటల్ సక్సెస్ అన్నాడు శాండిల్య. ఏ పేరుతో అనుకుంటేనేం, నీ ప్రేమ నిలబడినందుకు సంతోషించు అన్నాడు మూర్తి.

.
.
.
.

7, ఫిబ్రవరి 2010, ఆదివారం

సూపర్ బౌల్ విజేత ఎవరు??? - New Orleans సెయింట్స్!!!!

ఈ పోస్ట్ వ్రాసే సమయానికి కోల్ట్స్ సెయింట్స్ పై 3-0 అధిక్యతతో ఉన్నారు

Update 1: Colts lead Saints: 10-3

Update 2: Colts lead 10-7 Half time

Update 3: Colts leading 17-16

Update 4: 3 minutes to go: Shocking interception and a touchdown from Saints:

Saints now leading 31-17 !!!!!!

Final: Thats it .. Saints win 31 - 17!!!!! Way to go Saints!!!!!!!!

2, ఫిబ్రవరి 2010, మంగళవారం

సరే! ఇప్పుడేంటి??

నా తోలు కాస్తంత మందం - సాధారణంగా ఏడుపొచ్చే కధలకి, సంఘటనలకి స్పందించను నేను. మూడు రోజుల పాటు కూడలి చూడకపోవడం వల్లనేమో, నిన్న శ్రీనివాస్ చెప్పేదాకా ఈ వైష్ణవి సంగతి తెలియలేదు. అప్పుడెప్పుడో సికింద్రాబాద్ స్కూలు ముందు ఏక్సిడెంట్ సంఘటన తరవాత అంత బాధ పెట్టిన సంఘటన ఇది -

సరే, జరిగిందేదో జరిగింది మనమేం చేద్దాం? మీ ఛాయిస్ ఎస్.ఎం.ఎస్ ద్వారా మెయిల్ చెయ్యక్కర్లేదు గానీ క్రిందవాటిట్లో ఒకటి ఎంచుకోండి ...

(1) రెండు విషాధభరిత కవితలు వ్రాసి "ఆహా, ఓహో" అనిపించుకుందాం

(2) అసలేమి పట్టనట్టు మన బ్లాగులు మనం వ్రాసుకుందాం - నాలాగా ప్రపీసస కి అభినందనలు తెలుపుతూ

(3) రెండు రోజులు కన్నీళ్ళు కార్చి మూడోరోజునుండి, జూనియర్ ఎంటీఅరా లేక మహేష్ బాబా అని కొట్టుకుందాం

(4) తెలంగాణావాడినో, లేక కోస్తా ఆంధ్రా వాడినో బండబూతులు తిట్టుకుందాం

(5) "ఎంతటి రక్కసులీనధములు" అని రెండు నిమిషాలు తిట్టుకుని అవతార్ సినీమాకి చెక్కేద్దాం

(6) దీనంతటికీ కారణం మీరే అని పోలిసులనీ, రాజకీయనాయకులని కాసేపు తిట్టూకుని తరవాత క్రికెట్ లోనో, టివీ సీరియల్ లోనో మునిగిపోదాం

(7) "ఛీ! దీనంతటికీ కారణం మన మీడియా చానెళ్ళే" అనుకుంటునే వాటినే కళ్ళార్పకుండా చూసెద్దాం

(8) థూ! వాడెవడండీ "ఇలాంటివి ఇకముందు ఆగాలంటే ముందు మనం మారాలి, ప్రతీదానికీ పోలీసులమీద ఆధారపడకుండా మనమే ఏదో ఒకటి చెయ్యాలి, అలాంటి నేరస్థులకి సమాజంలో స్థానం లేకుండా మనమే ఏదో ఒకటి చెయ్యడం ఇప్పటికైనా మొదలు పెట్టాలి" అంటున్నాడు? కబుర్లెక్కువ, పని శూన్యం - పిచ్చివాడిలా ఉన్నాడు - .. రాళ్ళేసి కొట్టండి!

ప్రపీసస కు అభినందనలు

నా 561 కామెంట్ల రెకార్డ్ బ్రద్దలుకొట్టీన సందర్భంగా :))

http://onlyforpraveen.wordpress.com