17, ఫిబ్రవరి 2010, బుధవారం

హైకూలతో రామాయణం: 5-7-5 నిబంధనతో

ఇది కెలుకుడు టపా కాదండోయ్. నా రాముడితో పరాచికాలాడతానా? "కోతి మూక టపాల బదులు కాస్త మంచిదేమన్నా వ్రాయచ్చుగా?" నన్న ఒక స్నేహితురాలి సూచనననుసరించి ఇది వ్రాయడం మొదలుపెట్టాను. అదేమి విచిత్రమోగానీ మొదలుపెట్టాక ముగించేదాకా నా చేతులు ఆగలేదు - మొత్తం వ్రాయడానికి పట్టింది 15 నిముషాలకన్నా తక్కువే - కాకతాళీయంగా 24 హైకూలు వచ్చాయి - రాముడా మజాకా మరి!

ఇది నచ్చితే సంతోషం, నచ్చకపోతే క్షమించండి - కాని ఇది హాస్యంకోసం వ్రాసినది కాదు, భక్తితో వ్రాసినదే.



దశరధుడు
ముగ్గురి పెనిమిటి
అయోధ్య రాజు

ఆ మారాజుకు
పిల్లలు పుట్టకున్న
యజ్ఞం చేసెను

అగ్నిదేవుడు
ఇచ్చిన పాయసాన్ని
భార్యలకిచ్చె


ఆ ఱేడునకు
నలుగురు పిల్లల
సంతతిగల్గె

రామ లక్ష్మణ
భరత శతృఘ్నులు
తన పిల్లలు

జనకునకు
కూతురు దొరికెను
సీతరూపాన

స్వయంవరాన
విరిచెను రాముడు
శివ ధనుస్సు

సీతతో పెండ్లి
జరిగెను రామునకు
వైభవముగా

అయోధ్యలోన
కైకేయి పెట్టినది
మడతపేచీ

పంపించాలంది
రాముని అడవికి
వనవాసిగా

బయల్దేరెను
సీతాలక్ష్మణులతో
రాముడు ఇక

ఒక రక్కసి
రాముని వెంటాడగా
తమ్ముడు జూసె

శూర్పణఖవి
ముకుచెవులుగోసి
చేతిన బెట్టె

మాయలేడిని
చూసిన సీతాదేవి
కావాలనెను

రాముడు వెళ్ళె
తరువాత తమ్ముడు
లక్ష్మణుడెళ్ళె

రావణుడొచ్చి
భిక్షమునడగుచూ
కుట్రనుపన్నె

లక్ష్మణ రేఖ
దాటిన సీతమ్మను
అపహరించె

హనుమంతుడు
రాముని భక్తుడయ్యి
లంకనిజేరె

సీతను జూసి
తను తీసుకొచ్చిన
ముద్రిక జూపె

రాక్షస మూక
తనను బంధింపగా
లంకను గాల్చె

వానర సేన
సాయముతో రాముడు
వారధి కట్టె

సేతువు దాటి
లంకను జేరగనే
యుధ్ధముజేసె

ఆ యుధ్ధమున
హతుడై రావణుడు
నేలన్ గూలె

సీతతో సహా
మన రామయ్యతండ్రి
అయోధ్యజేరె!

45 కామెంట్‌లు:

  1. రౌడీ రాజ్యంలో రామ రాజ్యం. బాగుంది. :))

    రిప్లయితొలగించండి
  2. అబ్బా ఎన్నాళ్ళనించో అనుకుంటున్నా ఇలాంటిది మీరు వ్రాస్తే చదవాలని.. చాలా బాగా రాసారు.. ఇందాక నుండి గింజుకుంటున్నా ఇలాగా నేను ట్రైచేయాలని.. ఉహు ఏమీ తట్టడం లేదు :)

    రిప్లయితొలగించండి
  3. రామాయణం.. కట్టె కొట్టె తెచ్చె అన్న రీతిలో ఉంది....

    రిప్లయితొలగించండి
  4. Thanks Naga & Nestam

    Yeah Ravichandra, its done in 15 min - just an attempt

    శ్రీనివాస్ గారు, కోతిమూక అన్నది మనల్నే. Hehehehehe

    మీ వ్యాఖ్యలో రెండోభాగాన్ని కాస్త ఎడిట్ చెయ్యండీ సారూ. రామాయణం మీద ఇలాంటి జోకువల్లే తెలుగుపీపుల్ సైట్లో పెద్ద యుధ్ధం జరిగింది. ప్లీజ్.

    రిప్లయితొలగించండి
  5. కోతి మూక టపాలు అని మీతో అన్న మె స్నేహితురాలు గారు కోతి మూక అన్నది ఎవర్ని ?????????? ఆమె ఎవరో......... ఎవరిని ఉద్దేసించి అన్నారో కాస్త చెబుదురూ.

    రిప్లయితొలగించండి
  6. ఇక జఫ్ఫా గాడి మీద పోస్టులు వేయరా మలక్ మీరు ?

    రిప్లయితొలగించండి
  7. మోటార్ సైకిల్ మీద నీ ఫీట్లు చూసి అనుంటుందిలే ఆవిడ :))

    రిప్లయితొలగించండి
  8. ఎందుకు వెయ్యను? "ఎప్పుడూ అవేనా? కాస్త మార్చ" మని అడిగితే మార్చా, అంతే

    రిప్లయితొలగించండి
  9. Sir I am one of the followers of this blog...

    యజ్ఞం చేసెను -- యజ్ఞం చేసె

    పుట్టారపుడు
    పిల్లలు నలుగురు
    ఆ ఱేడునకు ---- ఆ ఱేడునకు నలుగురు పిల్లలు కలిగె
    ఇలా అంత్య ప్రాస లా వుంటే ఇంకా బాగుండేదేమో అని నా భావన... మిగతావి మీరు వ్రాస్తే చూడాలని కోరిక..ఒకవేళ తప్పుగా చెప్పి వుంటే క్షంతవ్యుడను...

    రిప్లయితొలగించండి
  10. బాగుంది !

    రాముడేతెంచె అంటే, రాముడు - వచ్చెను కాదా? రాముడు వెళ్ళెను అనా?

    "రాముడేతెంచె
    ..
    లక్ష్మణుడెళ్ళె"

    పార్ట్ నుంచి

    రిప్లయితొలగించండి
  11. అజ్ఞాత గారూ,

    ధన్యవాదాలండీ. 5-7-5: మొదటి పంక్తిలో 5, రెండవదానిలో 7, మూడవదానిలో 5 - వల్ల అలా వ్రాయడం జరిగింది. ప్రాస విషయంలో మీ సూచనను తప్పక పాటిస్తా.

    రిప్లయితొలగించండి
  12. వావ్ ..చాలా బాగా వ్రాసారు భరద్వాజ్:)

    రిప్లయితొలగించండి
  13. అమ్మయ్యా, ఏదో మాలాంటి మామూలు మనుష్యులు చదివేవి రాశారన్నా మాటా. బావుంది. 15 నిముషాల్లో ఇంత బాగా రాయగలిగే మీ ప్రతిభను ఎప్పుడూ మంచి పేరడీలు రాసే వాటికే ఉపయోగించకూడదా? బోడి సలహానే అనుకోండి.

    రిప్లయితొలగించండి
  14. hey, are you an alumini of AMAA ?
    thought i've seen you some where and found ya !! ha haa... !!!

    రిప్లయితొలగించండి
  15. ramayanam 24 thousand slokas.Each 1000 represent gayatri mantra. yu also got 24 haikulu.

    రిప్లయితొలగించండి
  16. కల్పన గారు మంచి పేరడీలు రాయమంటే మీ ఉద్దేశం ???? వేరే బ్లాగులో పేరడీలు రాసే ఆయనెవరో ఈయనె అనేనా?

    రిప్లయితొలగించండి
  17. Very good Malak...

    MS రామారావు గారి సుందరాకాండలా, మీరి కిష్కిందకాండ పారాయణం మొదలు పెట్టొచ్చు కదా? :)

    రిప్లయితొలగించండి
  18. Thnks Ekalingam though

    శ్రీనివాసూ,

    నిజమేకదా! నేనే కాగడా అని అర్ధమా ఆ కామెంటుకి? :))

    రిప్లయితొలగించండి
  19. హైకులంటే 5-7-5 ఫార్మటు లో నే రాయాల్నా? రూల్స్ బ్రేక్ చెయ్యకూడదా?

    నేనింత వరకు చదివిన హైకులు చివరి వాక్యం వరకు అర్థం కాకుండా (కాని అమేజింగ్ వర్డ్స్) ఉండి చివరి వాక్యం చదవగానే వావ్ అనిపించేలా ఉండేవి కాని మీ హైకూలు అలాలేవు ఎందువల్ల? రూల్స్ బ్రేక్ చేసారా? (హి హి )

    (ధన్యవాదాలండీ. 5-7-5: మొదటి పంక్తిలో 5, రెండవదానిలో 7, మూడవదానిలో 5 - వల్ల అలా వ్రాయడం జరిగింది. ప్రాస విషయంలో మీ సూచనను తప్పక పాటిస్తా.) అంటే మీరు ఇల్లాంటి హైకులు ఇంకా రాస్తారా? వా...ఆ...ఆ ..

    చివరిగా నా హైకు

    రౌడి కవిత రాసాడు
    పురాణాల్లో చెప్పినా నేను నమ్మలేదు
    నిజమేమో ఆడాళ్ళకి చాల శక్తి ఉంది .

    రిప్లయితొలగించండి
  20. LOL Kamal .. heheheheheee

    Well, I am not well versed with all the rules of Haikus. I just used the 5-7-5 format.

    And about the "Wow" factor, I am not a poet - not a scholar either .. just a timepass blogger - If you are looking for Nannaya's class then you are in for a major disappointment hehehe :))

    రిప్లయితొలగించండి
  21. One more thing ... the lady I was talking about aint from the Pramadaavanam gang. So Relax .. she has nothing to do with the controversies

    రిప్లయితొలగించండి
  22. చాలా నైసు.. !

    మీ స్నేహితురాలికి చాలోటి ధన్యవాదాలు.
    మీరు చాలా బాగా రాస్తారు సారూ. 15 ని.. ల్లో రాశానన్నారు కదా. జీ కే కోసం అడుగుతున్నాను. కెలుకుడు కి మీకు ఎంత టైం పడుతుంది?

    జై శ్రీరాం.

    రిప్లయితొలగించండి
  23. నన్నయ్య గారు తలుచుకున్నా మీరు రాసే పేరడీలు కామెంట్లు రాయలేడని కీ బోర్డు లో స్పేస్ బటన్ గ్గాట్టి గ నొక్కి మరి చెపుతున్న .. కాని మిమ్మల్ని మీ స్నేహితురాళ్ళు change చేస్తున్నారు. ఇందులో కుట్ర ఏదైనా ఉందేమో నని నా ప్రగాడా (కాగడా కాదు)నమ్మకం .

    రిప్లయితొలగించండి
  24. లేదు లేదు అందుకే చెప్పా. ఆమె బ్లాగుల్లోకొచ్చి వారం రోజులవుతోందేమో.

    She is new, but she used to read my stuff whenever I sent my links to her.

    నేనేమి మారలేదు - PRAMAADAVANAM is still active :))

    రిప్లయితొలగించండి
  25. Hehe Sujatagaru,

    Kelukudu doesnt take time .. whatever comes to my mind I just pour that on the blogs :))

    నాకు ఓపిక తక్కువ.

    రిప్లయితొలగించండి
  26. అద్దరకొట్టావని వేరే చెప్పాలా తమ్ముడూ.

    రిప్లయితొలగించండి
  27. నా రాముడితో పరాచికాలాడతానా? సింప్లీ హార్ట్ టచింగ్ బాసూ. రాముడా మజాకా మరి!

    రిప్లయితొలగించండి
  28. Is it really you?! :)

    very nice indeed. Please write more posts like this. There are so many out there for your other kind of posts.

    Best wishes.

    Chandra Mohan

    రిప్లయితొలగించండి
  29. Srinivas saru

    TanQ TanQ


    Chandramohan garu

    Yes its me, the same me. Thanks - The thing is I am not enough skilled to post serious matter and hence the other kind of posts.

    రిప్లయితొలగించండి
  30. అదుర్స్ అన్నాయ్.

    btw, పైన కామెంట్స్ చూసి commit అయిపోకు. కావలంటె ఈ serious stuff కోసం వేరే బ్లాగ్ పెట్టు, ఈ బ్లాగులో కెలుకుడు మాత్రం వదిలెయ్యొద్దు. ఇక్కడ కె బ్లా స సభ్యులు, అభిమానులు హర్ట్ అవుతున్నారు.

    రిప్లయితొలగించండి
  31. వహ్వా వహ్వా చాలా బాగున్నాయి ఆ చేత్తోనే మా కిట్టయ్యపై కూడా రాసేయ్యండి మరి!

    రిప్లయితొలగించండి
  32. మీ ప్రయత్నం బాగుంది అండి. వ్యాసుడు తన తరువాతి తరం వాళ్ళు వేదాలను గుర్తుంచుకోలేకపోతున్నారు (మనిషికి ఙాపకశక్తి తగ్గిపోతోంది) అని గుర్తించి, వేదాలను విభజించాడు. అలాగే మా తాతగారికి దాదాపు పోతనభాగవతం అంతా వచ్చును, మా నాన్నగారికి కొన్ని important పద్యాలే వచ్చును. నాకు ఏవో అరకో పరకో. మన పిల్లలికి "భాగవతం" అంటే ఏమిటో తెలియకుండాపోకుండా ఉండాలంటే ఇంత simple గా వ్రాస్తే తప్పితే కుదరదు.

    రిప్లయితొలగించండి
  33. Thanks Badri, Vijayamohana nd Sandeep


    Well Badri .. the actual Kelukudu blog is Pramaadavanam and it is active. I hope u know that is my blog too

    రిప్లయితొలగించండి
  34. I think, I heard the same story some where... It is open violation of intellectual property! You should be sued in OU-JAC.

    'dammunTE OU campus ku vachchi eemaaTa anu' tarimi tarimi koDataamu. jai telangaaNa meeda O kaikoo raayaalsindE! khabaDdaar!

    Sankar ;)

    రిప్లయితొలగించండి
  35. Heyy Sankar,

    Welcome! I was remembering you a few minutes back and here you land ... solid 1000 years boss!


    IP rights violation? Where? Did anybody try this before? Not that I know of!

    రిప్లయితొలగించండి
  36. By the way .. was your comment supposed to be in Samaikya vs Telangana post?

    రిప్లయితొలగించండి
  37. Hi Malak bhai,

    thanks, but 1000 is a bit too much. 70years is ok. :) how are you?

    Your haiku is not IP violation but story! The story is from ' Sreemad Telagana Ramayanam', no?! :))

    Sankar

    రిప్లయితొలగించండి
  38. LOLA .. Telangana Ramayan .. thats what Sreenivas precisely posted ( and deleted) above

    రిప్లయితొలగించండి