తెలంగాణావాది(తె):
తెలంగాణాలో
సమైక్యవాదులకు
రంగుపడుద్ది
సమైక్యవాది (స):
హైదరాబాదు
నీ బాబుగాడి సొమ్ము
అనుకున్నావా?
తె:
స్వయం పాలన
ప్రత్యేక తెలంగాణా
మా జన్మ హక్కు
స:
విడిపోయిన
రాష్ట్రాలెన్నో అయ్యాయి
బుట్టలో తుక్కు
తె:
గిట్లా మమ్మల్ని
పరేషాన్ జెయ్యక
గమ్మునుండు బే!
స:
ఏటేటేటేటీ?
మాతో పెట్టుకోమాక
బేగెల్లిపోరా!
తె:
ముయ్యిబే నోరు
ఆపలేవు మా హోరు
జై తెలంగాణా!
స:
నువ్వే మూసుకో
మా గ్రూపుదే విజయం
జై సమైక్యాంధ్ర!
కెవ్!
రిప్లయితొలగించండినిజం చెప్పండి ఘోస్ట్ రైటర్ గా తెలంగాణా వాదులకు, సమైక్యాంధ్ర వాదులకు స్క్రిప్ట్ సమకూరుస్తుంది మీరే కదా!! LOL :-)
రిప్లయితొలగించండిఅబ్బే.....ఇంత త్వరగా జై కొట్టేసి బై చెప్పేటం బాలేదు
రిప్లయితొలగించండిAwesome! Truly hilarious.
రిప్లయితొలగించండిబాగావ్రాసారు
రిప్లయితొలగించండికాకపొతే నాలుగు ముక్కలో తేల్చడం బాలేదు