10, సెప్టెంబర్ 2013, మంగళవారం

తెలుగువాడి ఆత్మగౌరవం Vs. తెలంగాణా ఆత్మ గౌరవం

--- A repost... original dated back to 2010 .. but still relevant  ...









ఈ మధ్య కాలంలో నేను విన్న అతి పెద్ద అబధ్ధం - "మా పోరాటం హైదరాబాద్ కోసం కాదు!" .. ఇది రెండు పార్టీలూ చెప్తున్న మాటే .. "తెలుగువాడి ఆత్మగౌరవం", "తెలంగాణా ఆత్మ గౌరవం" ముసుగేసుకుని ...

ఒకవేళ సమైక్య వాదులకి హైదరాబాద్ అక్కరలేకపోతే ఉద్యమమంతా హైదరబాద్ మీదే ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? ఒక్కరైనా "జరిగిందేదో జరిగింది... ఇప్పుడయినా తెలంగాణాకి జరిగిన అన్యాయానికి ప్రాయశ్చితం చేద్దాం" అన్నారా? అబ్బే!! ఎందుకంటారూ? "మిగిలినవాళ్ళు ఎటుపోతే మాకేం? మా హైదరాబాద్ మాకొస్తే చాలు" - అంతేనా?

ఇక వేర్పాటువాదుల సంగతి - నిజంగానే తెలంగాణా కావాల్సినవారైతే "సరే, ఉన్న చిక్కంతా హైదరాబాదే కదా. దానిని కొన్నాళ్ళు విడిగా పెడదాం - మిగిలిన జిల్లాలని కలిపి వెంటనే తెలంగాణా ఇవ్వండి - హైదరాబాద్ తేలేదాకా విడిగా పెడదాం" అనుండే వారు, సమైక్యవాదులు అందరూకాకపోయినా చాలామంది ఒప్పేసుకునేవారు - కానీ అలా అన్నారా? లేదే! "హైదరాబాద్ లేని తెలంగాణా మాకొద్దు" అనడంలోనే తెలుస్తోంది తెలంగాణామీద ఎంత ప్రేముందో. మిగిలిన జిల్లాలు జిల్లాలు కావా? వాటిట్లో మనుషులు ఉండరా? అదీ కాక మహరాష్ట్రకీ, కర్నాటక కి జిల్లాలని మొత్తం వదులుకోలేదా? ఇది అంతకన్నా ఘోరమేమీ కాదే?




స్వగతం: రెండు గుంపులనీ కెలికి రాళ్ళేసా ... ఇద్దరూ కలిపి వాయిస్తారేమో? Let them :P

11 కామెంట్‌లు:

  1. గీ లత్కోరు మాటలొద్దు .... మాది మాగ్గావలె.
    మాది మాజేతులో పెట్టున్ద్రి .

    రిప్లయితొలగించండి
  2. Looks like you don't have enough work and have ample amount of free time):

    Surabhi

    రిప్లయితొలగించండి
  3. Surabhi ;)

    హీహీ ... గూగుల్ ప్లస్, ఫేస్ బుక్ వల్ల చచ్చిపోయిన బ్లాగులని కెలికి కాస్త జీవకళ తెప్పిద్దామని :P

    రిప్లయితొలగించండి
  4. బలే ప్రశ్న సార్ :) హైదరాబాదు లేకపోతె తెలంగాణా పూర్తిగా అన్యాయం అయిపోతుంది. కలిసుంటే రోజు ఎలాగో నస్తాపోతున్నం, మళ్ళి ఈ నిలువు నామం ఏంటి అనిపించింది :)

    తెలంగాణా వాదులు అంత తొందరలో లేరండి. కాస్త ఆలస్యం అయినా హైదరాబాదు తో కూడిన తెలంగాణా నే ప్రకటించే వరకు వేచి చూస్తారు. హైదరాబాదు తోనే కలిసింది, హైదరాబాదు తోనే విడిపోతుంది.

    అదే కాకుండా చాలా హైదరాబాదు ప్రాంతం పరిసర తెలంగాణా జిల్లాలలో ఉంది. అవన్నీ జిల్లాలకు అప్పగిస్తే హైదరాబాదు పెద్దగా ఉండదు.

    ఇక లాస్ట్ ఏమిటంటే తెలంగాణా అభివృద్ధి పణంగా పెట్టి హైదరాబాదు అభివుర్ద్ది చెందింది, హైదరాబాదు తీసేస్తే తెలంగాణాలో ఇంకేమి లేదు. ఉదాహరణకు

    రాష్ట్రంలో వివిధ ఉనివెర్సితిలు http://en.wikipedia.org/wiki/List_of_institutions_of_higher_education_in_Andhra_Pradesh
    ----------------------------------------------
    HYD-8 (కేంద్ర ప్రభుత్వం ఏర్పరిచినవి కూడా కలిపితే 11)
    SA-21 (కేంద్ర ప్రభుత్వం ఏర్పరిచినవి కూడా కలిపితే కూడా 21)
    TG-6 (కేంద్ర ప్రభుత్వం చె ఏర్పడినవి కలిపితే 7)

    ఇక గవర్నమెంటు మెడికల్ కాలేజిలు చూస్తే
    http://dme.ap.nic.in/dme_medcolleges.html
    --------------------------------------------
    HYD-2
    SA-7
    TG-1

    రిప్లయితొలగించండి
  5. GreenStar,
    7 జిల్లాలతో కూడిన తెలంగాణా వచ్చినంక జిల్లాకొక మెడికల్ కాలేజి పెడదాం అప్పుడు అవి 8 అవుతయి.
    జిల్లాకు రెండు యూనివర్సిటీలు పెడదాం.. అప్పుడు అవి 20 అవుతయి, అందరికంటే మనకే ఎక్కువుంటయి. మన సంస్క్రుతి, సంప్రదాయం హైదరాబాద్ తెహజీబ్ తో కూడా కలవకుండా బిల్కుల్ మస్తుగుంటది. స్వపరిపాలనకు కొత్త అర్ధం యిద్దాం, దేశంలో ప్రతి రాష్ట్రానికి దిక్సూచిగా నిలుద్దాం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆయన్ని కొత్తగా పెట్టుకునే బదులు తెలంగాణా ఉన్నదున్నట్లు ఇచ్చేస్తే ఆళ్ళ బాదలు వాళ్ళు పడతారు.

      తొలగించండి
  6. రిప్లయిలు
    1. మరి మిగిలిన తెలంగాణా జిల్లాలలో లక్షలలో ఉన్న సిమాన్డ్రుల సంగతేంది బ్రదర్? ముక్యంగా రంగారెడ్డిలో ఎంతో'మంది. ఆల్లను గాలికొదెలెద్దామా? స్వార్థం బ్రదర్.

      తొలగించండి
  7. సరే మా తెలంగాణా, హైదరాబాద్ సంగతి మేం చూసుకుంటాం, కాని మీరు ఏమంటునారు తెలంగాణా ఇస్తే ఇచ్చారు గాని హైదరాబాద్ ని తెలంగాణాలో వద్దు యుటి చేయండి అంటున్నారు.అంటె మీకు దక్కనిది ఎవరికి దక్కకూదదు అని. ఎంత కుళ్ళు,ఎంత స్వార్దం

    రిప్లయితొలగించండి