18, జనవరి 2011, మంగళవారం

సంగీతప్రియుల కోసం - స్వరమాలిక ప్రోజెక్ట్


మాలిక టీం తరువాతి ప్రోజక్ట్ "స్వరమాలిక" సంగీతప్రియులకోసం. దీనిలో సంగీతానికి సంబంధించినవాటన్నిటితోపాటు (సినిమాపాటల రివ్యూలు చిత్రమాలికలో వస్తాయి కాబట్టి ఇక్కడ వాటికి మినహాయింపు), మీరు స్వరపరిచిన లేక పాడిన పాటలు నలుగురికీ వినిపించే వీలుబాటు కూడా రేడీయో చిల్లీ సౌజన్యంతో కల్పించదలచుకున్నాం.

అయితే ఆడీయో స్ట్రీమింగ్, కాపీరైట్లకి సంబంధించిన వ్యవహారాలపై సమగ్రమైన విధివిధానాలు రూపొందాక మాత్రమే స్వరమాలిక సైటును "లైవ్" మోడ్ లో పెట్టేది. కంటెంట్ పరంగా కానీ, టెక్నాలజీ పరంగాకానీ మీరు చేసే సహాయానికి ముందుగానే కృతజ్ఞతలు. సహాయము చేయదలచినవారు admin@maalika.org కు మెయిల్ పంపించగలరు.

ఇది ఒక కొలిక్కి వచ్చాక ఆన్లైన్ రేడియో సంగతి ఆలోచిస్తాం.

13, జనవరి 2011, గురువారం

పాపం మీ మీ రాశి మారిపోయిందా? ఇక జ్యోతిషులు తమ లెక్కలు మార్చుకోవాలా? :)

ముందుగా ఈ లంకె చూడండి.


నక్షత్రాలు కూడా మిగతా ఖగోళ రాశులవలే తిరుగుతూ ఉంటాయని మనకి తెలుసు. దానివల్ల జరిగిందేమిటంటే గత 2 వేల సంవత్సరాలలో నక్ష్త్ర సముదాయాలు (రాశులు) తమ తమ స్థానాలు మార్చుకున్నాయన్నమాట. చంద్రుని ఆధారంగా నడిచే మన భారతీయ జ్యోతిషుల సంగతి ఎలా ఉన్నా, సూర్యుని పై ఆధారపడ్డ పాశ్చాత్య జ్యోతిషులకి ఇప్పుడు పెద్ద ఇబ్బంది వచ్చిపడింది. ఈ నక్షత్రాల స్థాన చలనం వల్ల పదమూడవ రాశి పుట్టుకొచ్చిందని పార్క్ నకుల్, జో రావ్ వంటి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ ఇదంతా వట్టిదేననీ, సనాతనులు దీనిని పరిగణలోకి తీసుకునే తమ లెక్కలు వేసుకున్నారని కొంతమంది వాదిస్తున్నారు. ఏదెలా ఉన్నా, కొత్త రాశిగానీ పుట్టుకొస్తే చాలా మంది "సన్ సైనులు" మారిపోతాయి. ఎలాగో క్రింద చూడండి.


Capricorn: Jan. 20-Feb. 16.
Aquarius: Feb. 16-March 11.
Pisces: March 11-April 18.
Aries: April 18-May 13.
Taurus: May 13-June 21.
Gemini: June 21-July 20.
Cancer: July 20-Aug. 10.
Leo: Aug. 10-Sept. 16.
Virgo: Sept. 16-Oct. 30.
Libra: Oct. 30-Nov. 23.
Scorpio: Nov. 23-29.
Ophiuchus: Nov. 29-Dec. 17.
Sagittarius: Dec. 17-Jan. 20)

వనితామాలిక ప్రారంభం & నిర్వాహక బృందం వివరాలు

సైటుకు లంకె: http://vanita.maalika.com


నిర్వాహక బృందం:

* పద్మ (మాలిక)
* శ్వేత
* జ్యోతి
* నిశిగంధ
* ఉమ
* రమణి
* రాధారాణి


మరెవరికైనా ఈ గుంపు సభ్యులుగా చేరి మాకు సహాయం చెయ్యాలనుంటే admin@maalika.org కి మెయిల్ చెయ్యండి.


సైట్ నిర్మాణం: ఆర్కే (యోగి), విమల్

12, జనవరి 2011, బుధవారం

మాలిక పత్రిక - జనవరి 17న

ఎన్నాళ్ళనుండో వాయిదాలు పడుతూ వచ్చిన మాలిక పత్రిక ప్రారంభ సంచిక జనవరి 17న సిధ్ధం కాబోతోంది. దాని యూ.ఆర్.ఎల్. నూ, నిర్వాహక బృందాన్నీ అదేరోజు ప్రకటిస్తాం. ఈ ప్రయత్నంలో మాకు సహకరించిన అందరికీ మాలిక టీం తరపున కృతజ్ఞతలు.

వనితామాలిక - మాలిక టీం కొత్త సైట్/పత్రిక: జనవరి 14న

సంక్రాంతి సందర్భంగా మాలిక టీం ఒక కొత్త వెబ్ సైట్/పత్రిక మీముందుకు తీసుకొస్తోంది. పేరు వనితామాలిక. మాలిక పత్రికకన్నా మూడురోజుల ముందు ప్రారంభమయ్యే ఈ పత్రిక మహిళలకు ప్రత్యేకం - ఆగండాగండి.. ఇదేమీ మగవాళ్లని ఆడిపోసుకునే రేడికల్ ఫెమినిస్టు సైట్ కాదు. This is a site of the women, by the women for both women and men. మహిళలు మాత్రమే నిర్వహించే ఈ సైట్లో కేవలం మహిళలకు సంబంధించిన విషయాలే కాకుండా అందరికీ పనికి వచ్చేవి ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే వివిధ అంశాలపై మహిళల గొంతును ప్రపంచానికి వినిపించే సాధనాల్లో ఇదొకటి. అలాగే ప్రగతికి కావలసిన స్పూర్థిని మహిళలకు అందించటం కూడా ఈ సైట్/పత్రిక ఆశయం. ఇది పొద్దు పత్రిక తరహాలో ఎప్పటికప్పుడు realtime లో update కాబడుతుంది. దీని యూ.ఆర్.ఎల్., దీనిని నిర్వహించే సభ్యుల పేర్లు శుక్రవారం ప్రకటిస్తాం.

9, జనవరి 2011, ఆదివారం

సగం చదివిన "తెర్ర"రిష్టులతో తంటాలుండవు కదా, ఛా!

మనం కూడా మన బ్లాగ్లోకపు రెండోతరం మేతావిలాగానే సగం చదువుకున్నవాళ్ళం. మనకి కూడా సోదయ్య అనే స్నేహితుడుమండేవాడు. "ఒరేయ్! ప్రపంచంలో నీచులు టెర్రరిష్టులయితే అంతకన్నా దరిద్రులు తెర్రరిష్టులురా" అనేవాడు. "తెర్ర"రిష్టు అంటే వాడి దృష్టిలో మార్క్సిస్టని. అది అప్పట్లో పెద్దగా నమ్మకపోయినా రానూరానూ ఆధారాలు చూసాక నమ్మక తప్పలేదు - ముఖ్యంగా మన బ్లాగ్లోకం పోకడలు చూశాక.

ఈ తెర్రరిష్టుల ముఖ్యోద్దేశం - మన దేశం మీద విషం కక్కటం. మన దేశపు తిండి మేస్తూ చైనాకి వంతపాడటం. బ్లాగుందికదా అని కారుకూతూలు కుస్తారు - అవతలివాడు కూడా అలాంటి కూతలే కూసేసరికి పాపం ఫిర్యాదుల పర్వం మొదలవుతుంది. వీళ్ళు ఎవరినైనా తిట్టచ్చుగానీ అవతలివాడు తిడితే పాపం వీళ్ళకి మొహం చెల్లదు.

శాస్త్రీయపరంగా తప్పని మహామహులే ఒప్పుకున్న ఆర్య ద్రవిడ సిధ్ధాంతం వీరికి ఆయువుపట్టు. నోటికొచ్చిదేదో కూసి, నిరూపించమంటే సమాధానంలేక ఎవరో తొక్కలో థాపర్ రాసిందేదో చూపించి అదంతా నమ్మేయాలని అదేశాలు. అవన్నీ తప్పులని నిరూపిస్తే మళ్ళీ సమాధానం లేక వ్యూహాత్మక మౌనాలు, గాడిద గుడ్డూ! ఈ ద్రోహుల మొహాలకి పైగా సింధూ నాగరికతా - దానిమీద చర్చా. శాస్త్రీయపరమైన ఆధారాలు చూపించమంటే మళ్ళీ పారిపోయేది వీళ్ళే! మనలాగే సగం చదువులు కదా.

* ఇరాక్ పై అమేరికా దాడిని ఖండిస్తూనే దక్షిణకోరియా పై ఉత్తర కొరియా దాడిని సమర్ధిస్తారు

* అమేరికన్లు ఇండియాలో పనిచెయ్యటాన్ని విమర్శిస్తునే చైనా ఇంజనీర్లు పనిచెయ్యడాన్ని సరథిస్తారు

* భారత్ అణుపరీక్ష తప్పంటునే ఉత్తర కొరియా పరీక్షని సమర్ధిస్తారు

* పేలెస్తైన్ పై ఇస్రాయెల్ ఆక్రమణ తప్పంటునే టిబెట్ పై చైనా ఆక్రమణని సమర్ధిస్తారు

పైన చెప్పిన విరుధ్ధభావాలను అబధ్ధాలతో కలిపి, వడపోస్తే దానిలోంచి బయటకువచ్చిన అతిపెద్ద అబధ్ధమే contemporary Marxism అన్న సంగతీ వీళ్ళొప్పుకోరుగా :))

"చదువుకున్న వాడికన్నా చాకలి మేలు, బుధ్ధిలేని మార్క్సిస్టుకన్నా బుఱదలో పొర్లే పంది మేలన్"ని మా పక్కింటి బామ్మగారు చెప్పిన సామెత ఇందుకేనేమో నాకు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తోంది.సాధ్యమైన ప్రతీచోటా అబధ్ధాలు గుప్పించి చరిత్రని మార్చిన ఈ మార్క్సిస్టు చరిత్రకారుల బండారాలు ఒకొక్కటీ బయటపడుతున్నాయిగా. చూద్దాం ఇంకా ముందు ముందు ఏమి జరుగుతుందో.వెయ్యి పూలను వికసించనివ్వాలిట. లక్ష ఆలోచనలను గమనించాలిట. మరి చైనాలో, ఉత్తర కొరియాలో, క్యూబాలో ఈ ప్రబుధ్ధులు చేస్తున్న పనులేమిటో? కమ్యూనిసానికి వ్యతిరేకంగా వ్రాసేవారు కమ్యూనిష్టు దేశాలలో బ్రతికి ఉండగలరా? ఇలాంటి రెండు నాల్కల త్రాచులకి భారత్లోనూ, అమేరికాలోను మాత్రమే వాక్స్వాతంత్ర్యం కావాలి.

సమాజం మారేది కాస్తంద నీతి, నిజాయితీ, నిబధ్ధత ఉండే మనుష్యులతో అంతేకానీ నాలాంటి వెధవలతోనో లేక మన రెండోతరం మేధావిలాంటి చీడపురుగులతోనోకాదుగా!

"శా"స్త్రంలో "శా" కూడా తెలియని మనలాంటి "శా"ల్తీలు "శా"స్త్రీయత గురించి మాట్లాడితే "శా"నా శండాలంగా ఉంటుంది.

PS: If you can give me one, I can give you TEN! Gone are the days when you guys kept on churning bull manure allover the one-sided tabloids. Its now the web 2.0 generation - every one of your lies is getting exposed and people are spitting on you guys now via the same medium that you have used for generations in order to spread your lies.

It is you guys who are forced to run away from the discussions because of the shallowness in your ideology.


YOU SOW SO YOU REAP! I'M CHEAPER WHILE YOU ARE SO CHEAP!!

మాలిక పత్రిక - త్వరలో

మెమెప్పుడో ప్రకటించిన మాలిక త్రైమాసిక పత్రిక మొదటి సంచిక వివిధ అనివార్య కారణాలవల్ల కాస్తంత ఆలస్యంగా సంక్రాంతి సమయానికి మీముందు ఉండబోతోంది. త్వరలో విడుదల తేదీ, ముఖ్యాంశాలూ ప్రకటిస్తాం.

6, జనవరి 2011, గురువారం

కాస్త సీరియస్ కెలుకుడు - ఊరిచివర పుస్తకం.net :)

తెలుగు సాహిత్యకారుల్లో, కవుల్లో గ్రూపులు తెగలు ఉన్నాయని ఎప్పటినించో తెలిసినా అవేస్థాయిలో ఉన్నాయో ఒక ఆరేడేళ్ళ క్రితం తెలిసింది. తెలుగుపీపుల్ డాట్ కాం సైట్లో నేను ఇలాంటి వివాదంలో వేలుపెట్టి విశ్వ,కే. గారికీ, కాళనాధభట్ల వీరభద్రశాస్త్రిగారికీ మధ్య జరిగిన గొడవలో ఇరుక్కుని, పాపం మిత్రులు కడప రఘోత్తమరావు, కొండముది సాయికిరణ్ కుమార్ గార్లని అనుకోకుండా బలిపశువుల్ని చేసిన సంఘటన ఇంకా గుర్తుంది. అప్పటినుండీ అలాంటి గొడవలకి సాధ్యమైనంతవరకూ దూరంగా ఉంటూ వచ్చా. కానీ ఇప్పుడు జరుగుతున్న ఊరిచివర గోల చూస్తూంటే ఎందుకో చేతులు మళ్ళీ దురదపెడుతున్నాయి. అందుకే ఈ టపా.

సరే- ఇక విషయంలోకి వస్తే,

అఫ్సర్, భూషణ్ గార్ల మధ్య ప్రస్తుతానికి అమేరికా - ఇరాక్ .. కాదు కాదు భారత్ - పాకిస్తాన్ .. అబ్బే, జగన్ - సోనియా .. ఛీ ఛీ .. సమరసింహారెడ్డి - వీరరాఘవరెడ్డి స్థాయిలో గొడవ జరుగుతోంది -అఫ్సర్ గారు విడుదల చేసిన "ఊరిచివర" పుస్తకం మీద. ఈ గొడవ వేణుగోపాల్ గారు వ్రాసిన ముందుమాటతో మొదలయ్యింది. అది చినికి చినికి గాలివానై ఇప్పుడు భూషణ్ గారి విమర్శతో తుఫానుగా మారింది - అయితే ప్రస్తుతానికి రెండవ నెంబరు ప్రమాదసూచిక దగ్గరే ఉందిలెండి. అఫ్సర్ గారి కవితలు అస్సలు బాలేవు, కొన్ని పదాలని మళ్ళీ మళ్ళీ వాడారు అని భూషణ్ గారి మరియు వారి గ్రూపు సభ్యుల అభిప్రాయం. "ఠాఠ్! మీరు అఫ్సర్ పై వ్యక్తిగత ద్వేషంతో విషం చిమ్ముతున్నారు. మీ కవితలకన్నా అఫ్సర్ గారివి చాలా బాగుంటాయం"టూ అఫ్సర్ గారి గుంపు సభ్యులు ఒంటికాలిమీద లేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో "నల్ల ఇరుక్కు" అంటూ "బాగా ఇరుక్కున్నది" పాపం పుస్తకం సైటు, దానిని నడిపేవారు. "కరవమంటే కప్పకీ, విడవమంటే పాముకీ" (వెళ్లమంటే మెక్ కెయిన్ కీ, ఉండమంటే ఒబామాకీ అని కూడ అనుకోవచ్చు) అన్న చందాన సాగుతున్న గొడవలో పాపం ఆ ఇద్దరమ్మాయిలూ ఏమి చెయ్యాలో తెలియక కామెంట్లని ఆపేశారు. దెబ్బతో రెండువైపులనుండీ వాళ్ళకి "జింతాతా జితా చితా" :))

సరే, ఇప్పుడు కెలుకుడు విషయం ఏమిటంటే "ఊరి చివర" మీద భూషణ్ గారి విమర్శ మరీ కటువుగా, కర్కశంగా ఉందా లేక ముక్కుసూటి విమర్శని అఫ్సర్ గారి అభిమానులు అపార్థం చేసుకుంటున్నారా? "ఇది మంచి కవిత - ఇది కాదు" అని విమర్శకులు నిర్ణయించినట్టే "ఇది మంచి విమర్శ - ఇది కాదు" అని నిర్ణయించే అధికారం విమర్శింపబడినవారికి ఉందా?


చూస్తారేం? కామెంట్ బాక్స్ ఇక మీదే :))

5, జనవరి 2011, బుధవారం

మాలికలో రెండు లేక మూడు పక్క పక్క శీర్షికలని కలిపి చదివితే? :))

• చలికి చర్మం వడలినట్టుగా ఉండి దురదగా అనిపిస్తే పట్టుచీరలను ఉతికేటప్పుడు రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పదన్న మాట

• మీ పళ్లబుట్టలో ఐశ్వర్యారాయ్ రిలాక్స్ కోసం పడుకుంటున్న సదా!


• బ్లాగ్ టెక్నికల్ వర్డ్స్ - రాముడు కాదు కాముడు

• నిస్సహాయ స్థితిలో "పాక్" ప్రభుత్వం - తెలుగు వారికి ఓ అరుదైన కానుక...


• నాన్నగారు ఫైర్ఫాక్స్ లో తెలుగులో టైప్ చెయ్యడానికి ఇండిక్ ఇన్పుట్ ఎక్స్టెన్షన్

• వల్లభనేని వంశీ... ఎదుగుతున్న(?) ఒక యువ నాయకుడు అమరావతి వెళ్ళొచ్చా

• పీకల్లోతు ప్రేమలో ప్రియాంక సమస్యా పూరణం - 190 (అమృతపానమ్ము)


• శోకించే మేఘం - ములక్కాడ పిండి కూర

• Raj News Coming Soon To USA - 2011లో బ్లాగ్లోకం అజెండా కూడా ఇదే అయితే సూపర్

• ‘హైటెక్కు బాబయ్య’ యే కన్ను పొడుచుకుంటాడో - ఏ నిముషంలో ప్రాణం పోతుందో ...?