13, ఫిబ్రవరి 2010, శనివారం

జ్యోతికే మతిపోగొట్టిన ఘనుడు :))

ఎవడి పేరు చెబితే బ్లాగ్లోకం వణికిపోతుందొ - ఎవడు కధ వ్రాస్తే, కన్నీళ్ళకి బదులు రక్తం వస్తుందో, వాడే..వాడే..జ్యోతికి పిచ్చెక్కించాడు, వంటల జ్యోతిని మెంటల్ జ్యోతిగా మార్చాడు ..

ఒక కధని వేరే పేరుతో పంపించి దానిమీద ఆవిడ అభిప్రాయం అడిగాట్ట. దెబ్బకి ఆవిడకి పిచ్చెక్కి ఇదిగో ఇలాంటి దిక్కుమాలిన పోస్టులు వ్రాయడం మొదలెట్టింది. పంపినవాడెవరో ఆవిడకి తెలియకపోయినా కధ చదివాక మనకి తెలియదంటారా?

ఆ కధ కింద పోస్టుతున్నా ... ఇది రాసిందెవరో కనుక్కోడానికి శ్రమ పడక్కర లేదు. ప్రపీససలూ, మీరేమంటారు?

___________________________________________________________కొత్త చిగురుశాండిల్య తన బీరువా నుంచి టాల్స్టాయ్ వ్రాసిన “War and Peace” పుస్తకం తీసి చదువుతున్నాడు. ఆ సమయంలోనే శాండిల్య స్నేహితుడు మూర్తి వచ్చాడు. స్నేహితుడిని చూసి చూడనట్టు ఉండి పుస్తకం మీదే కాన్సెంట్రేషన్ పెట్టాడు శాండిల్య. ఎప్పుడూ పుస్తకాల మీదే కాన్సెంట్రేషన్ అయితే ఎలా రా, స్నేహ సంబంధాలు అవసరం లేదనుకుంటున్నావా? అని అడిగాడు మూర్తి. పుస్తకం మీద ఉన్న కాన్సెంట్రేషన్ మరల్చడం ఎందుకు అని నీ వైపు చూడలేదు, అంత మాత్రానికే నేను స్నేహ సంబంధాలు అవసరం లేదనుకుంటున్నానని దాని అర్థమా? అడిగాడు శాండిల్య. నీ క్లోజ్ ఫ్రెండ్ వచ్చినప్పుడు కూడా నువ్వు పుస్తకాలు పక్కన పెట్టకుండా వాటి మీదే కాన్సెంట్రేషన్ తో ఉంటే అలాగే అనిపిస్తుంది, పద మనం రెస్టారెంట్ కి వెళ్ళి కాస్సేపు కబుర్లు చెప్పుకుందాం అని అన్నాడు మూర్తి. నాన్ వెజ్ రెస్టారెంట్ కే కదా వెళ్ళబోయేది, నేను నాన్ వెజ్ తినడం మానేశాను అని జవాబు ఇచ్చాడు శాండిల్య. నువ్వు నాన్ వెజ్ తినడం మానేశావా? పార్టీలు, ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు ఫ్రీగా వస్తుంది కదా అని నాన్ వెజ్ బాగా మెక్కేసేవాడివి కదరా, నువ్వు నాన్ వెజ్ నిజంగా మానేశావని నేను అనుకోను అని సందేహం వ్యక్తం చేశాడు మూర్తి. నువ్వు అనుకున్నా, అనుకోకపోయినా నేను చెప్పేది మాత్రం నిజం. టాల్స్టాయ్ రచనలు చదివిన తరువాత నాన్ వెజ్ తినడం మానేశాను. నాలుక రుచి కోసం జంతువుల్ని చంపుకు తినడం ఆటవిక పద్దతిలాగ కనిపిస్తోంది అని జవాబు ఇచ్చాడు శాండిల్య. పక్కా నాస్తికుడివైన నువ్వు పక్కా క్రైస్తవుడైన టాల్స్టాయ్ బోధనలు చదివి మారిపోయావా? అడిగాడు మూర్తి. నేను నాస్తికుడినే కానీ నీతి విషయంలో మత విశ్వాసాలు కూడా ప్రభావం చూపుతాయనే విషయం మరచిపోను అని జవాబు ఇచ్చాడు శాండిల్య. రెస్టారెంట్ కి రావు కదా, ఇక్కడే కాస్సేపు కబుర్లు చెప్పుకుందాం అన్నాడు మూర్తి.

శాండిల్య తన వ్యక్తిగత విషయాలు చెప్పడం మొదలు పెట్టాడు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయికి ఆ విషయం చెప్పలేదు, ఆ అమ్మాయి ఒప్పుకుంటుందో లేదో అని భయంగా ఉంది అన్నాడు శాండిల్య. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ముందు ప్రేమ విషయం ఆ అమ్మాయికి చెప్పు, ఒప్పుకుంటుందో లేదో అనే సంగతి తరువాత అన్నాడు మూర్తి. ఆ అమ్మాయి పేరు లలిత. మా ఫామిలీకి బాగా తెలిసినవాళ్ళ అమ్మాయే. వాళ్ళ నాన్న గారు సింహాద్రి నాయుడు అని ఒక లాయర్. అతను మా నాన్న గారు పని చేసే బ్యాంక్ కి లీగల్ అడ్వైజర్ కూడా. వాళ్ళ నాన్న గారు విజయనగరం జిల్లాలోని కూనేరు అనే పల్లెటూరి నుంచి వచ్చారు. కూనేరులో మా బంధువులు ఉన్నారు. మా బంధువులకి కూడా వాళ్ళ ఫామిలీ తెలుసు. ఈ రకంగా కూడా వాళ్ళకీ, మాకూ మధ్య స్నేహం ఏర్పడింది. అంతా బాగానే ఉంది కానీ ఆ అమ్మాయి వయసులో నా కంటే ఐదేళ్ళు పెద్దది. ఆమె నా ప్రేమని ఒప్పుకుంటుందో లేదోనని భయం అన్నాడు శాండిల్య. సచిన్ టెండూల్కర్ లాగే నువ్వు కూడా నీ కంటే సీనియర్ ని పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నావన్న మాట అన్నాడు మూర్తి. నేను చలం గారి అభిమానిని. ప్రేమ, పెళ్ళి విషయంలో నాకు అలాంటి సంకుచిత పట్టింపులు లేవు అని జవాబు ఇచ్చాడు శాండిల్య. తెలుసురా, నేను కూడా చలం గారి అభిమానినే. నువ్వు కూడా చలం గారి సాహిత్యం చదవడం చూసాను అన్నాడు మూర్తి. నా పుస్తకాల బీరువా తెరిచి చూస్తే చలం, టాల్స్టాయ్ ల పుస్తకాలతో పాటు లెనిన్, స్టాలిన్, ఎడ్గర్ స్నో, సమీర్ అమీన్ తదితరులు వ్రాసిన పుస్తకాలు కూడా కనిపిస్తాయి అన్నాడు శాండిల్య. పుస్తకాలు చదవడమొక్కటే జీవితం కాదు రా, నేను కూడా చలం గారి పుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలు చదివాను. కొంత సేపు పుస్తకాలు పక్కన పెట్టి అమ్మాయి గురించి ఆలోచించు. పుస్తకాల ప్రభావం వల్ల నువ్వు నీ కంటే సీనియర్ తో ప్రేమలో పడ్డావు కానీ ఆ ప్రేమని నిలబెట్టుకోవడం నీ చేతుల్లో ఉంది. కేవలం చదివి తరువాత ప్రయత్నం ప్రారంభించకపోతే పని జరగదు, నీ ప్రేమ విషయం ముందు ఆ అమ్మాయికి చెప్పు అని సలహా ఇచ్చాడు మూర్తి. అలాగే అని సమాధానం చెప్పాడు శాండిల్య. ఒకవేళ ఆ అమ్మాయి నీ ప్రేమని అంగీకరించినా, మీ పెద్దవాళ్ళు మీ పెళ్ళికి ఒప్పుకోకపోవచ్చు, అప్పుడు మీరు వేరే కాపురం పెట్టుకుని బతకాలి కనుక ఉద్యోగ ప్రయత్నాలు కూడా చెయ్యు అని సలహా ఇచ్చాడు మూర్తి. ఉద్యోగం కాకపోతే వ్యాపారమైనా పెట్టుకుంటాను, మా నాన్న గారు బ్యాంక్ ఆఫీసర్ కదా, నాకు లోన్ ఇప్పించగలరు, ఆర్థికంగా సెటిల్ అయిన తరువాతే పెళ్ళి చేసుకుంటాను అన్నాడు శాండిల్య.

శాండిల్య ప్రేమించిన లలిత భరద్వాజ్ అనే ఇంకో వ్యక్తిని ప్రేమిస్తుంది. ఈ విషయం శాండిల్యకి తెలియదు. భరద్వాజ్ ప్రేమ పేరుతో పత్రికలలో కథలు, సీరియళ్ళు వ్రాస్తుంటాడు. అతని కథలు, సీరియళ్ళు చదివి లలిత అతని అభిమాని అయ్యింది. ఒకసారి అతను వ్రాసిన నవల ఒకటి పుస్తకాల షాపులో కొన్న లలిత ఆ పుస్తకంలో భరద్వాజ్ అడ్రెస్ కూడా చూసింది. అతనికి ఉత్తరాలు వ్రాయడం, ఫోన్లు చెయ్యడం, వ్యక్తిగతంగా కలవడం, ఇలా ఆమె భరద్వాజ్ తో పరిచయం పెంచుకుంది. ఇది ప్రేమ వరకు దారి తీసింది. ఈ విషయాలు తెలియని శాండిల్య లలితకి తన ప్రేమ గురించి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుంటాడు.

కూనేరు గ్రామంలో శాండిల్య బంధువుల ఇంటిలో పెళ్ళి నిశ్చితమయ్యింది. శాండిల్య తండ్రి దామోదరం వాళ్ళ బావ కూతురు పెళ్ళి. దామోదరం వాళ్ళ బావ, మేనల్లుడు ఇన్విటేషన్ కార్డు పట్టుకుని దామోదరం ఇంటికి వచ్చారు. దగ్గరి బందువులే కనుక శాండిల్య తల్లితండ్రులు కూనేరు వెళ్ళాలనుకున్నారు. దామోదరం వాళ్ళ బావ కుటుంబం లలిత తండ్రి సింహాద్రి నాయుడుకి కూడా తెలిసిన వాళ్ళు కావడం వల్ల లలిత కుటుంబాన్ని కూడా ఆహ్వానించారు. కూనేరు సింహాద్రి నాయుడు పుట్టిన ఊరు, సింహాద్రి నాయుడు వాళ్ళ నాన్న గారు ఉండేది అక్కడే. ఎలాగూ సొంత ఊరికి వెళ్ళినట్టు అవుతుందని సింహాద్రి నాయుడు ఈ పెళ్ళికి వెళ్ళాలనుకున్నాడు. పెళ్ళికి ఒక రోజు ముందు రెండు కుటుంబాలు కూనేరు బయలుదేరాయి. దామోదరం తన బావ ఉండేది పక్క జిల్లాలోనే అయినా కొన్ని సంవత్సరాలుగా అతన్ని కలవకపోవడం వల్ల ఈ సారి కొన్ని రోజులైనా వాళ్ళ ఊరిలో ఉండి రావాలని అనుకున్నాడు. కూనేరు ఎలాగూ లలిత తాతగారి ఊరే కనుక లలిత కుటుంబ సభ్యులు కూడా కొన్ని రోజులు అక్కడే ఉండాలనుకున్నారు.

లలితని ఒంటరిగా కలుసుకునే అవకాశం కోసం శాండిల్య ఎదురు చూస్తూ లలితని గమనిస్తూ ఉన్నాడు. శాండిల్య తన బంధువుల ఇంటి మేడ మీద కూర్చుని ఎదురుగా ఉన్న లలిత తాతగారి ఇంటి వైపు చూస్తూ ఉన్నాడు. లలిత ఇంటిలో బోర్ కొట్టి కొంత సేపు ప్రకృతి రమణీయతని చూద్దామని బయటకి వచ్చింది. ఆమెని కొంచెం దూరం నుంచి ఫాలో అవుతూ వెళ్ళాడు శాండిల్య. ఆమె రైల్వే కల్వర్టు (చిన్న బ్రిడ్జి) దగ్గర ఆగింది. శాండిల్య లలిత దగ్గరకి వచ్చి ఎదురుగా నిలబడి ఆమెతో “నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, చాలా కాలం నుంచి ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను కానీ చెప్పడానికి ధైర్యం రాలేదు. ప్రేమని ఎక్కువ కాలం దాచుకోలేక మీరు నా ప్రేమని ఓకే చెయ్యాలని ఆశిస్తూ మీకీ విషయం చెపుతున్నాను” అని అన్నాడు భయపడుతూ. లలిత ఇలా సమాధానం చెప్పింది “నేను నీ ప్రేమకి ఓకే అనడమా? నా వయసెంత? నీ వయసెంత?”. శాండిల్య ఆమెతో ఇలా అన్నాడు “మీరు ఇలాంటి సమాధానం చెపుతారని నేను ముందే ఊహించాను. ప్రేయసి, ప్రియులు / భార్య, భర్తలు మధ్య అండర్ స్టాండింగ్ ముఖ్యం. అండర్ స్టాండింగ్ ఉంటే భర్త భార్య కంటే వయసులో చిన్నవాడైనా ఎలాంటి సమస్యలూ రావు. నేను మీకు చిన్నప్పటి నుంచి తెలిసిన వాడినే కదా, మన ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ సులభమే, ఆలోచించండి”. లలిత ఇలా సమాధానం చెప్పింది “నీ వయసు ఇంకా ఇరవై సంవత్సరాలే, నీకు పెళ్ళికి అంత తొందర ఎందుకు? ముందు చదువు పూర్తి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వడం గురించి ఆలోచించు”. శాండిల్య ఏమి చెప్పాలో ఆలోచించాడు. అంతలోనే పెద్ద శబ్దం చేసుకుంటూ గూడ్సు రైలు వచ్చింది. ఆ శబ్దం వల్ల శాండిల్య చెప్పాలనుకున్నది చెప్పలేకపోయాడు. అతను చెప్పేలోపు లలిత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. లలిత సెల్ ఫోన్ నంబర్ శాండిల్య దగ్గర ఉంది. తరువాత లలితతో ఫోన్ లో మాట్లాడాలనుకుంటాడు.

సెలవులు ముగిసాయి. శాండిల్య, లలితల కుటుంబాలు పట్టణానికి తిరిగి వచ్చాయి. శాండిల్య లలిత గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు. కూర్చుంటే ప్రయోజనం ఉండదు, అనుకున్నట్టు గానే లలితకి ఫోన్ చేద్దాం అనుకుంటూ లలిత సెల్ ఫోన్ కి కాల్ చేశాడు. లలిత రిసీవ్ చేసింది. శాండిల్య మొదలు పెడుతూ “నేనే లలితా, మొన్న నేను నీతో మాట్లాడుతున్నప్పుడు ట్రెయిన్ వచ్చి ఆ శబ్దం వల్ల ఏమీ మాట్లాడలేకపోయాను. ఆ లోగా నువ్వు వెళ్ళిపోయావు. నా వయసు ఇరవై ఏళ్ళేననీ, పెళ్ళికి తొందర పడొద్దనీ అన్నావు. పెళ్ళి కోసం కొంత కాలం ఆగగలను, ఇప్పుడు ప్రేమించడంలో మాత్రం తప్పు లేదు కదా” అని అన్నాడు. “నేను వయసులో నీ కంటే పెద్దదాన్ని, నాతో నీకు ప్రేమేమిటి” అని ఫోన్ పెట్టేసింది లలిత. రేపు మళ్ళీ ఫోన్ చేద్దాం అని శాండిల్య కూడా రిసీవర్ పెట్టేశాడు. మరుసటి రోజు లలితకి మళ్ళీ కాల్ చేశాడు. లలిత ఫోన్ ఎత్తగానే “నిన్న నేను చెపుతున్నది పూర్తిగా వినకుండా ఫోన్ పెట్టెయ్యడం బాగా లేదు, ఈ సారైనా విను” అన్నాడు శాండిల్య. “నేను ఇంకొకరిని ప్రేమించాను. ఇంత వరకు వచ్చిన తరువాత నిజం దాచడం ఎందుకు, అందుకే చెప్పేస్తున్నాను. ఒకరితో ప్రేమలో పడిన తరువాత ఇంకొకరిని ప్రేమించలేను కదా, అందుకే ఫోన్ పెట్టేశాను” అని సమాధానం చెప్పింది లలిత. నన్ను ప్రేమించడం ఇష్టం లేక అలా అంటున్నావా అని అడిగాడు శాండిల్య. నిజంగానే నేను ఇంకొకరిని ప్రేమించాను, నువ్వు ఇది కట్టు కథ అనుకుంటే నేనేమీ చెయ్యలేను అంటూ ఫోన్ పెట్టేసింది లలిత. ఫోన్ లో ప్రేమ గురించి చెప్పడం కష్టం, ఎందుకంటే ఫోన్ పెట్టేయడం అవతలి వాళ్ళ చేతిలోని పని, మళ్ళీ అవకాశం దొరికితే మళ్ళీ ఆమెని ఒంటరిగా కలుద్దాం అనుకున్నాడు శాండిల్య.

లలిత భరద్వాజ్ కి ఫోన్ చేసింది. మనం ఏడాది నుంచి ప్రేమించుకుంటున్నాం, ఇప్పటి వరకు పెళ్ళి మాట ఎత్త లేదు, ఇక ఆలస్యం ఎందుకు, మన పెద్ద వాళ్ళకి ఈ విషయం చెప్పేదాం అంది లలిత. సరే అన్నాడు భరద్వాజ్. ఆలస్యం చెయ్యకుండా చెప్పేయ్ అంది లలిత. లలిత తన తండ్రి దగ్గరకి వెళ్ళింది. నాన్నా అని భయంతో నెమ్మదిగా పలికింది. ఏమిటి? అని అడిగాడు సింహాద్రి. ఇది ప్రేమ వ్యవహారం కనుక తన తండ్రి ఏమంటాడోనని భయపడుతూనే నెమ్మదిగా విషయమంతా చెప్పింది లలిత. ఆలోచించి చెపుతాను, భరద్వాజ్ కి కూడా అతని తల్లి తండ్రులకి విషయం చెప్పమను అన్నాడు సింహాద్రి. లలిత భరద్వాజ్ కి మళ్ళీ ఫోన్ చేసింది. తాను తన తండ్రికి ప్రేమ విషయం చెప్పానని, మీ పెద్దలకు కూడా ప్రేమ విషయం చెప్పమని నాన్న గారు అన్నారని చెప్పింది. భరద్వాజ్ కూడా ధైర్యం చేసి తన తల్లితండ్రులకి ప్రేమ విషయం చెప్పాడు. ప్రేమించావులే కానీ వాళ్ళ కులం ఏమిటో, గోత్రం ఏమిటో తెలుసుకున్నావా? అని అడిగింది భరద్వాజ్ తల్లి. ఏమో తెలియదు సమాధానం చెప్పాడు భరద్వాజ్. కులం సంగతి పక్కన పెట్టండి, వాళ్ళ నాన్న గారు లాయర్ కనుక కట్నం బాగా ఇవ్వగలడు, మన ఫామిలీ నచ్చితే కులం పట్టింపు లేకుండా పెళ్ళికి ఒప్పుకుంటాడో లేదో చూద్దాం అన్నాడు భరద్వాజ్ తండ్రి. రేపు మనం వాళ్ళ ఇంటికి సంబంధం మాట్లాడడానికి వెళ్దాం, కులం గురించి ఏమీ మాట్లాడొద్దు. వాళ్ళంతట వాళ్ళుగా కులం పట్టింపులు లేకుండా పెళ్ళికి ఒప్పుకుంటే మంచిది. మనం వాళ్ళకి అనవసరంగా కులం గుర్తు చెయ్యకూడదు అని సూచనలు ఇచ్చాడు భరద్వాజ్. భరద్వాజ్ లలితకి ఫోన్ చేశాడు. మా అమ్మానాన్నలు రేపు సాయింత్రం సంబంధం మాట్లాడడానికి మీ ఇంటికి వస్తారు, మీ వాళ్ళకి ఆ టైమ్ కి ఇంటిలో ఉండమని చెప్పు అన్నాడు భరద్వాజ్. అలాగే అంది లలిత. మరుసటి రోజు భరద్వాజ్ తన తల్లితండ్రులతో కలిసి లలిత ఇంటికి వెళ్ళాడు. భరద్వాజ్ తల్లితండ్రులు, లలిత తల్లితండ్రులు అవీ ఇవీ మాట్లాడుకున్నారు. రెండు కుటుంబాలు సంబంధం కలుపుకోవడానికి అంగీకరించాయి.

ఒక రోజు సింహాద్రి ఇన్విటేషన్ కార్డు పట్టుకుని దామోదరం ఇంటికి వచ్చాడు. ఇన్విటేషన్ కార్డు ఇస్తూ వాళ్ళ అమ్మాయికి కుదిరిన పెళ్ళి సంబంధం గురించి చెప్పాడు. ఇది విన్న శాండిల్య షాక్ అయ్యాడు. ఇక లలిత మీద ఆశలు వదులుకోవలసిందే అనుకున్నాడు. కొన్ని రోజుల పాటు బాధతోనే కాలం గడిపాడు శాండిల్య. పోయిన ప్రేమ కోసం జీవితాంతం బాధ పడడం వృథా కనుక బాధని దిగ మింగుకుని మళ్ళీ పుస్తకాలు మీద కాన్సెంట్రేషన్ పెంచాడు శాండిల్య. ఎలాగూ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తయ్యింది కాబట్టి పోస్టు గ్రాడ్యుయేషన్ చేద్దామా, స్వయం ఉపాధికి ఉపయోగపడే కోర్సులో చేరుదామా అని కూడా ఆలోచిస్తుంటాడు. ఇలా రోజులు గడిచిన తరువాత ఒక రోజు మూర్తి శాండిల్య వాళ్ళ ఇంటికి వచ్చాడు. శాండిల్య మూర్తికి ప్రేమ ఫైల్యూర్ గురించి చెప్పాడు. మూర్తి విని బాధ పడ్డాడు. మూర్తి తాను చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు చెయ్యాలనుకుంటున్నట్టు శాండిల్యకి చెప్పాడు. కేవలం ఉద్యోగం కోసం వేచి చూస్తే దొరకదు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి కూడా ఆలోచించాలి, చార్టర్డ్ అకౌంటెన్సీ ప్రొఫెషన్ ఎంచుకున్నా మంచిదే, ఆలోచించు అని శాండిల్యకి సలహా ఇచ్చాడు మూర్తి. నేను చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు చెయ్యడానికి విజయవాడ వెళ్ళాలనుకుంటున్నాను. నీకు కూడా ఈ ప్రొఫెషన్ చేపట్టాలని ఉంటే నాతో పాటు విజయవాడ రా అన్నాడు మూర్తి. ఆలోచించి చెపుతాను అన్నాడు శాండిల్య. శాండిల్య తాను చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సులో చేరాలనుకుంటున్నట్టు అమ్మానాన్నలకి చెప్పాడు. చేరు, మంచిదే, నువ్వు ఎలాగూ B.Com చదివావు కాబట్టి చార్టర్డ్ అకౌంటంట్ గా కూడా రాణించగలవు అన్నాడు దామోదరం. నా ఫ్రెండ్ మూర్తి విజయవాడ వెళ్ళి చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సులో చేరాలనుకుంటున్నాడు, నేను కూడా అతనితో కలిసి విజయవాడ వెళ్ళాలని అనుకుంటున్నాను అన్నాడు శాండిల్య. మీ బాబాయ్ ఎలాగూ ఇబ్రహీంపట్నం థర్మల్ పవర్ ప్లాంట్ లో పని చేస్తున్నాడు కదా. నువ్వు ఇబ్రహీంపట్నంలో ఉంటూ రోజూ విజయవాడ అప్ & డౌన్ అవ్వొచ్చు అన్నాడు దామోదరం. దామోదరం శాండిల్యని ఇబ్రహీంపట్నంలోని వాళ్ళ బాబాయ్ ఇంటికి పంపించాడు. మూర్తి విజయవాడలో హాస్టల్ లో చేరాడు. శాండిల్య, మూర్తి ఇద్దరూ ఒకే దగ్గర కోర్సులో చేరారు.

లలితకి భరద్వాజ్ తో పెళ్ళయ్యింది. భరద్వాజ్ డబ్బు మనిషనీ, అతనికి తన మీద కంటే డబ్బు మీదే ప్రేమ ఎక్కువ అని తెలియక భరద్వాజ్ తో కాపురం చేస్తుంది. కొంత కాలం గడిచింది. ఇంటిలో ఖాళీగా ఉండడం ఎందుకని లెక్చరర్ ఉద్యోగంలో చేరింది లలిత. ఆమె సంపాదించిన జీతం ప్రతి నెలా తనకి ఇవ్వాలని కోరాడు భరద్వాజ్. అందుకు ఒప్పుకోలేదు లలిత. అందుకు కోపంగా ఉన్న భరద్వాజ్ ఎప్పుడు ఏ చిన్న కారణం దొరికినా లలితని తిట్టడం, సూటిపోటి మాటలతో వేధించడం మొదలు పెట్టాడు. అప్పుడప్పుడూ కొట్టడం కూడా చేస్తుంటాడు. ఇలా వారి కలహాల కాపురం సాగుతోంది. లలిత ప్రెగ్నెంట్ అయ్యింది. పుట్టబోయేది ఆడ బిడ్డో, మగ బిడ్డో స్కానింగ్ టెస్ట్ ద్వారా తెలుసుకుందాం అన్నాడు భరద్వాజ్. అందుకు లలిత ఒప్పుకోలేదు. ఆడ పిల్ల పుడితే పెద్దైన తరువాత ఆమె పెళ్ళికి లక్షలు కట్నం ఇవ్వాలనీ, మగ పిల్లవాడు పుడితే తనకే కట్నం వస్తుందనీ ఇలా భవిష్యత్ డబ్బు గురించి బిడ్డ పుట్టక ముందే ఆలోచించ సాగాడు భరద్వాజ్. పుట్టబోయేది ఆడపిల్ల అయితే అబార్షన్ చెయ్యించాలని భరద్వాజ్ అనుకున్నాడు. స్కానింగ్, అబార్షన్ ల ఐడియాలకి లలిత వ్యతిరేకించింది. పుట్టబోయేది మగ బిడ్డే కావాలని కోరుతూ దేవుడిని తలచుకోవడం ఒక్కటే భరద్వాజ్ కి మార్గంగా మిగిలింది. భరద్వాజ్ తలచినదానికి విరుద్ధంగా ఆడ పిల్ల పుట్టింది. భరద్వాజ్ కి లలిత మీద కోపం మరింత పెరిగింది. లలితని మరింతగా వేధించ సాగాడు. ఇతని వేధింపులు భరించలేక విడాకులు ఇస్తానన్నది లలిత. లలిత తనని విడాకులు ఇస్తే మళ్ళీ పెళ్ళి చేసుకోవచ్చు, మళ్ళీ కట్నం వస్తుంది అనే ఆశతో విడాకులకి ఒప్పుకున్నాడు భరద్వాజ్. నేను విడాకులకి రెడీ, ఇప్పుడే ఫామిలీ కోర్టుకి వెళ్దాం, ఇద్దరం ఒప్పుకుంటే విడాకులు వెంటనే వచ్చేస్తాయి అన్నాడు భరద్వాజ్. నాకు కూడా ఆలస్యం ఇష్టం లేదు, నీలాంటి డబ్బు మనిషితో నేను ఒక క్షణం కూడా కాపురం కొనసాగించలేను అంది లలిత. ఇద్దరూ కోర్టుకి వెళ్ళారు, విడాకులు తీసుకున్నారు. లలిత తన పాపతో కలిసి పుట్టింటికి వచ్చేసింది.

శాండిల్య చేరిన నాలుగేళ్ళ చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు పూర్తయ్యింది. ఇంటికి తిరిగొచ్చాడు శాండిల్య. తన మాజీ ప్రియురాలు లలిత ఎక్కడ ఉందో, ఎలాగుందో తెలుసుకోవాలని అనుకున్నాడు శాండిల్య. శాండిల్య తన తల్లి దగ్గరకి వెళ్ళాడు. అమ్మా, నాలుగేళ్ళు నేను ఊర్లో లేను కదా, ఈ నాలుగేళ్ళు ఇక్కడ జరిగిన విషయాలు నాకు తెలియవు, అందుకే అడుగుతున్నాను, సింహాద్రి గారి అమ్మాయి లలితకి పెళ్ళయ్యింది కదా, లలిత ఆమె భర్త ఇక్కడే ఉంటున్నారా, ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారా? అని అడిగాడు శాండిల్య. లలిత ఆమె భర్తకి విడాకులు ఇచ్చేసింది అని సమాధానం చెప్పింది శాండిల్య తల్లి. ఎందుకు విడాకులిచ్చేసింది అని అడిగాడు శాండిల్య. ఆమె భర్త పక్కా డబ్బు మనిషి, అతనితో కాపురం చెయ్యలేక విడాకులు ఇచ్చేసింది అని చెప్పింది శాండిల్య తల్లి. లలిత తన భర్తకి విడాకులు ఇచ్చింది కనుక తాను లలితని పెళ్ళి చేసుకోవచ్చనీ, ఓడిపోయిన ప్రేమని మళ్ళీ బతికించుకోవాలనీ నిర్ణయించుకున్నాడు శాండిల్య.

శాండిల్య లలితకి ఫోన్ చేశాడు. లలిత కాల్ రిసీవ్ చేసుకోగానే “నేను శాండిల్యని మాట్లాడుతున్నాను, నాలుగేళ్ళ క్రితం నువ్వు నా ప్రేమని కాదని ఇంకొకరిని పెళ్ళి చేసుకున్నావు. నువ్వు భర్త నుంచి విడాకులు తీసుకున్నావని నాకు తెలిసింది. ఇప్పుడు కూడా నువ్వంటే నాకు ప్రేమే, నువ్వు ఓకే అంటే పెళ్ళికి సిద్ధమే” అన్నాడు శాండిల్య. లలిత ఏమి సమాధానం చెప్పాలో ఆలోచిస్తోంది. “నేను నీ కంటే వయసులో చిన్న వాడినే, ప్రేమకి వయసు అడ్డు రాదు, మగవాడు తన కంటే వయసులో పది పదిహేనేళ్ళు చిన్నదైన స్త్రీని పెళ్ళి చేసుకోగా తప్పు లేనప్పుడు, ఆడది తన కంటే వయసులో ఐదేళ్ళు చిన్న వాడిని పెళ్ళి చేసుకోవడం తప్పేమీ కాదు, నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్ళికి సిద్ధమే” అన్నాడు శాండిల్య. “నేను నీతో పర్సనల్ గా మాట్లాడాలి, రేపు మీ అమ్మానాన్నలు ఆఫీస్ కి వెళ్ళిపోయిన టైమ్ లో మీ ఇంటికి వస్తాను, అప్పుడు మాట్లాడుకుందాం” అంది లలిత. “మా అమ్మానాన్నలు పది గంటలకి ఆఫీస్ కి వెళ్తారు, రేపు పది గంటలు తరువాత సాధ్యమైనంత తొందరగా రా” అన్నాడు శాండిల్య.

మరుసటి రోజు అనుకున్న టైమ్ కి లలిత శాండిల్య ఇంటికి వచ్చింది. లలిత శాండిల్య దగ్గర కూర్చుని మాటలు మొదలు పెట్టింది “నాలుగేళ్ళ క్రితం నీ ప్రేమని కాదన్నాను కానీ ఇప్పుడు కాదనాలని అనుకోవడం లేదు. మగవాడు తన కంటే 25 ఏళ్ళు చిన్నదైన స్త్రీని పెళ్ళి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి కానీ చాలా మంది మగవాళ్ళు తమ కంటే వయసులో పెద్దైన స్త్రీని పెళ్ళి చేసుకోవడానికి సంకోచిస్తారు, నేను నీ కంటే వయసులో పెద్ద దాన్ని అని తెలిసి కూడా నువ్వు నన్ను ప్రేమించడం చూస్తోంటే నీకు ఆడవాళ్ళ పట్ల నెగటివ్ ఫీలింగ్ అంతగా లేనట్టు అనిపిస్తొంది, అప్పట్లో నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను, నేను ఇంకొకరితో ప్రేమలో పడడం వల్ల కూడా నేను నీ ప్రేమని అంగీకరించలేదు, ఇప్పుడు నీ ప్రేమని అంగీకరిస్తున్నాను” అని అంది లలిత. శాండిల్య ముఖంలో సంతోషం కళ కనిపించింది. “నన్ను పెళ్ళి చేసుకోవాలంటే నువ్వు ఒక కండిషన్ కి ఒప్పుకోవాలి, నాకు ఒక పాప ఉంది. నా కూతురుని నీ కూతురు లాగ పెంచడానికి నువ్వు సిద్ధమేనా? నాకు కాబోయే భర్త నా కూతురుకి మంచి తండ్రి కూడా కావాలని కోరుకుంటున్నాను” అంది లలిత. నీ కూతురుని పెంచడానికి నాకు అభ్యంతరం లేదు, నీ కూతురుని నా కూతురు లాగ పెంచడం నాకు కష్టం కాదు అన్నాడు శాండిల్య. “మీ అమ్మానాన్నలు ఈ పెళ్ళికి ఒప్పుకోకపోవచ్చు, మగవాడికి భార్య ఉండగానే మళ్ళీ పెళ్ళి చేస్తారు, భార్య చనిపోతే నెల రోజులు తిరగక ముందే రెండవ పెళ్ళి ప్రయత్నాలు మొదలు పెడతారు కానీ ఆడదానికి భర్త చనిపోయిన తరువాత లేదా విడాకులు తీసుకున్న తరువాత మళ్ళీ పెళ్ళి చెయ్యడం గురించి ఆలోచించేవాళ్ళు తక్కువ, నువ్వు విడాకులు తీసుకున్న స్త్రీని పెళ్ళి చేసుకోవడానికి మీ అమ్మానాన్నలు అంత సులభంగా ఒప్పుకోరేమో, ఒకవేళ మీ అమ్మానాన్నలు ఒప్పుకోకపోయినా నన్ను పెళ్ళి చేసుకోవడానికి నువ్వు సిద్ధమేనా?” అని అడిగింది లలిత. మా అమ్మానాన్నలు ఒప్పుకోకపోయినా నిన్ను పెళ్ళి చేసుకోవడానికి నేను సిద్ధమే, వాళ్ళు ఒప్పుకోరని నేను కూడా అనుకుంటున్నాను, మా వాళ్ళకి ఈ విషయం చెపితే నువ్వు విధవల్నీ, విడాకులు తీసుకున్న వాళ్ళనీ ఉద్దరించక్కరలేదు అని అంటారు అని అన్నాడు శాండిల్య. పెద్దవాళ్ళు ఒప్పుకోకపోయినా మన పెళ్ళి విషయం వాళ్ళకి చెప్పాలి కనుక చెప్పు. ఒకవేళ ఒప్పుకుంటే మంచిదే, ఒప్పుకోకపోతే వాళ్ళ నిర్ణయంతో నిమిత్తం లేకుండా పెళ్ళి చేసుకుందాం అంది లలిత. సరే, నాలుగేళ్ళ క్రితం నేల రాలిన నా ప్రేమ మళ్ళీ చిగురించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, థాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ మై లవ్ అంటూ లలిత చేతులు పట్టుకుని అభినందించాడు శాండిల్య.

సాయింత్రం అయ్యింది. శాండిల్య తల్లితండ్రులు ఇంటికి వచ్చారు. శాండిల్య తన తల్లితండ్రులకి తన ప్రేమ విషయం చెప్పాడు. శాండిల్య ఊహించినట్టుగానే అతని తల్లితండ్రులు అతని ప్రొపోజల్ ని వ్యతిరేకించారు. మీరు ఒప్పుకోరని నేను ముందే ఊహించాను, మీరు ఒప్పుకోకపోయినా లలితని పెళ్ళి చేసుకుంటాను అన్నాడు శాండిల్య. నువ్వు లలితని పెళ్ళి చేసుకుంటే దానితోనే వేరే కాపురం పెట్టు కానీ ఆమెని నా ఇంటికి కోడలిగా తీసుకురాకు అంది శాండిల్య తల్లి. వేరే కాపురం పెట్టడం నాకేమీ సమస్య కాదు అని సమాధానం చెప్పాడు శాండిల్య. లలిత కూడా తన తల్లితండ్రులకి ఈ ప్రేమ విషయం చెప్పింది. శాండిల్యని ఇంటికి పిలిపించి అతనితో మాట్లాడారు లలిత తల్లితండ్రులు. తమ కూతురు మొదటి పెళ్ళి విఫలమయ్యింది, రెండవ పెళ్ళి చేసుకునైనా సంతోషంగా ఉండాలని ఈ పెళ్ళికి ఒప్పుకున్నారు ఆమె తల్లితండ్రులు. శాండిల్య, లలిత రిజిస్ట్రార్ ఆఫీస్ లో పెళ్ళి చేసుకున్నారు. పెళ్ళికి లలిత తల్లితండ్రులు, శాండిల్య స్నేహితుడు మూర్తి సాక్షి సంతకాలు పెట్టారు. నాలుగేళ్ళ క్రితం నేల రాలిన తన స్నేహితుని ప్రేమ మళ్ళీ చిగురించినందుకు మూర్తికి కూడా సంతోషం కలిగింది. పోగొట్టుకున్నది తిరిగి పొందావు, యూ ఆర్ లక్కీ అంటూ శాండిల్యని పొగిడాడు మూర్తి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ లక్, ఇట్ ఈజ్ మై యాక్సిడెంటల్ సక్సెస్ అన్నాడు శాండిల్య. ఏ పేరుతో అనుకుంటేనేం, నీ ప్రేమ నిలబడినందుకు సంతోషించు అన్నాడు మూర్తి.

.
.
.
.

33 వ్యాఖ్యలు:

 1. roflllllllllllllllllllllll


  roflllllllllllllllllllllllllllllll  looooooooooooooooooooooool


  navvu aapukovadam na valla kaledu

  ప్రత్యుత్తరంతొలగించు
 2. జ్యోతి ఆ పోస్టు రాయడం సహజాతి సహజంగానే తోస్తోంది. నేనింకా మొత్తం కథ చదవలా! అందుకే కామెంట్ సక్రమంగా రాస్తున్నా!

  శ్రీనివాస్, మీకు నవ్వొస్తోందా?

  నాకేడుపొస్తోంది!

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఆటోమేటిగ్గా మౌస్ స్క్రోల్‌బార్ వైపు వెళ్ళిపోయింది, కామెంట్ల కోసం...

  ప్రత్యుత్తరంతొలగించు
 4. శ్రీనివాస్ గారూ,

  ఇందుకే మరి ప్ర.పీ.సం.సలో ఒక్క రోజులో వెయ్యి నూట ముప్పై కామెంట్ల రికార్డు చెయ్యగలిగాం. అన్న సామాన్యుడేంటీ, ఎవరి కధ చదివితే దిమ్మ తిరిగి మతి తప్పుతుందో .... అతనే ప్రవీణు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. అమ్మో ఇది నేను'' బెల్లం తక్కువ ''(చిని కం )తెలుగు లో
  తియ్యడం కోసం వొక శ్రీకాకుళం నిర్మాత కి చెప్పిన స్టొరీ .
  అది ఇలా గ్రంధ చౌర్యం అయ్యి గజి బిజీ గా తయారవుతుందని
  కలలో కూడా అనుకోలే దేవుడోయి.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. naaku anthantha matram jnaanam. katha konchem chadivaaka scroll down chesi mugimpu chadiaanu. artham kaaka madhya lo chadivaanu. overall story chaala baavundi kaanee ekkadi nundi copy kottinatto, translate chesinatto undi.
  Comment chesina vaallaku naa prasna emante, navvu endukosthondi? story vallanaa? rasina vidhaanam vallanaa?

  ప్రత్యుత్తరంతొలగించు
 7. ఈ కధ మొత్తం చదివి కూడా మాములుగా ఉన్నారంటే - అజ్ఞాత గారికి పరమవీర చక్ర బిరుదివ్వాల్సిందే!

  ప్రత్యుత్తరంతొలగించు
 8. హ్హహ్హహ్హ వివాహభోజనంబూ అహహ్హహ్హహ్హహ్హ,
  వివాహభోజనంబూ,వింతైన వంటకంబూ,
  ప్ర.పీ.స.స లోనే విందూ, అహహ్హా మాకే ముందూ,
  ఔరౌర పైత్యమంతా,అయ్యారే రోత రాతా,
  చదవెయ్యబోతే మనకీ,అయ్యేను వాంతులెల్లా. అహహ్హహ్హహ్హా
  మఝారే కొత్తచిగురూ,రమణీయవిమోచనమూ,
  వహ్వారే స్టాలిన్మ్యావో ఇవెల్ల పైత్యకధలు,
  అహహ్హహ్హ అహహ్హహ్హహా అహహ్హహ్హ అహహ్హహ్హహా.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. కధ బానే ఉంది కాని రచయుత కధని సరిగా చెప్పలేకపోయాడు. ప్రేమకు వయస్సు , పెళ్ళీ, పిల్లలు అడ్డుకాదు అని చెప్పాలనుకనన్నట్టున్నడు .కాని ఇదే కధను పాలిష్ చేసి రాస్తే బానేవస్తాది. ఈ ప్రేమికుల రోజున పార్క్క్ లో కనపడే లవర్స్ అందరిచేతా ఈ కధను చదివించాలి :)

  ప్రత్యుత్తరంతొలగించు
 10. Shiva Bandaru@

  (ఈ ప్రేమికుల రోజున పార్క్క్ లో కనపడే లవర్స్ అందరిచేతా ఈ కధను చదివించాలి)
  -------------------------
  అ పని చేయండి దేబ్బకు చచ్చి ఉరుకుంటారు

  ప్రత్యుత్తరంతొలగించు
 11. Seriously, katha chaala bavundi.
  RaviTeja movie -Na Autograph chusaaka naaku ade doubt vachindi, hero chivarlo enduku thanu enthagano preminchina aa kerala ammaayini pelli chesukoledu ani. Okarinokaru entho preminchukuntaaru kada.Ante adi prema kaadu. Nijamaina prema, okarimeeda okariki eppuduu untundi. pellainaa, pillalunnaa Ee kathalo Sandilya laaga. Prema ku artham cheppina katha.

  Ika raasina vidhaanam ante, katte kotte teche apudu ilaa ayindi ani ullo jarigina visayaanni oka friend ki cheppinattu undi. Chadivinchelaa ledu.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. I read her post but couldn't follow anything.thanks for clarifying !

  off-context, found this blog :
  http://kaagadamogudu.blogspot.com/

  ప్రత్యుత్తరంతొలగించు
 13. శివ బండారు గారూ,
  పాపం ప్రేమికులకి మరీ అంత శిక్షా? దీనికంటే పక్కన కనపడ్డవాళ్ళతో బలవంతంగా పెళ్ళి చేసినా నయం కాదూ!

  ప్రత్యుత్తరంతొలగించు
 14. శివ గారు సమూహిక మారణకాండకు ప్రయత్నిస్తున్నారు. నేను మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేస్తాను ఖబడ్దార్. మనుషుల్లో నానాటికీ మానవత్వం నశించిపోతోంది ప్చ్....

  ప్రత్యుత్తరంతొలగించు
 15. MalakpetaRowdy gaaru,
  Nenu ee madhyane blogs chadavatm modalu pettaanu, Sujatha gaari manasu lo maata tho.
  I think I am missing some link in this discussion, I still can't understand all of your your reactions...

  ప్రత్యుత్తరంతొలగించు
 16. Ajnaata garu,

  Many of my posts are context specific .. this post is related to a popular blogger

  ప్రత్యుత్తరంతొలగించు
 17. ROFL...
  I just cant stop laughing...ha ha ha
  hi hi hi.. hu hu hu...

  ప్ర.పీ.స.స. ప్రజలు ఎంత పవర్ ఫుల్ అనేది ప్రజలు ఇప్పటికైనా తెలుసుకుంటారు.. ఈ శుభ సందర్భం లో ప్ర.పీ.స.స. లో ఒక కొత్త టపా వేస్తున్నాను..

  ప్రత్యుత్తరంతొలగించు
 18. http://onlyforpraveen.wordpress.com/2010/02/14/%E0%B0%AE%E0%B0%B0%E0%B0%A3%E0%B1%80%E0%B0%AF%E0%B0%82-%E0%B0%92%E0%B0%95-%E0%B0%95%E0%B0%A5/

  ప్రత్యుత్తరంతొలగించు
 19. Ajnaata

  I have not been seeing his blog of late so I dont have the URL ..

  Look for Saahitya Avalokanam or maoist leninist on Koodali

  I'll try to get the links .. Pra Pi Sa Sa .. can you guys help him?

  ప్రత్యుత్తరంతొలగించు
 20. yeah sure..
  @ajnaata,
  read at your own risk, highly disturbing material.. dont blame us if you can recognise your kids/wife/parents after reading them
  http://blogzine.sahityaavalokanam.gen.in/

  ప్రత్యుత్తరంతొలగించు
 21. Thanks MalakpetRowdy and Karthik for the link. Telusukunna visayamemante... Telugu lo kanpisthondi kadaa ani koodali lo vachina blogulannee chadiveyakudadu. You will go mad!
  That Saahithyavalokanam guy needs counselling... big time!

  ప్రత్యుత్తరంతొలగించు
 22. it was not bad actually.
  better than the telugu movie i saw last nite

  ప్రత్యుత్తరంతొలగించు
 23. ఈ కథలన్నీ మాకు జుజూపి, ఇంతకన్న బాబుల్లాంటి కథలు, కవితలు చదివాం. జ్యోతిగారికి పాపం కొత్త కాబోలు. నాకు తెలిసి ప్ర.పీ.స.స ప్రస్థానంలో ఈ కథ నేను చిన్నప్పుడు ఏడో క్లాసులో చదువుకున్న కథ లాంటిది. ఇప్పుడు ఏడు, పది, ఇరయై ముప్పై అన్ని దాటి పి.హెచ్.డి చేసేసాను.

  మీలో ఎవరైనా గట్టిపిండాలుంటే ఈ కింది కథ చదివి నిలదొక్కుకోండి చూద్దాం

  http://streevadam.co.cc/mag/node/12

  ప్రత్యుత్తరంతొలగించు
 24. ఇప్పుడే అదేదో దిక్కుమాలిన ఛానల్ లో ఊ ప్రోగ్రాం చూసా, ఈ కథ చదివా, ఇది చాలదన్నట్టు సౌమ్య గారు మీరు ఇంకో కథకి లంకె ఇవ్వాలా చెప్పండి, ఐన నాకున్న ధైర్యం తో అది కూడా చదువుదమనుకున్న కానీ నా మెదడు సహకరించుట లేదు..అజ్ఞాత గారు చెపినట్టు ఇప్పుడొచ్చే సినిమా కథల కన్నా బెటర్ అండి బాబు ..
  ఈ కథ కూడా ఈ డబ్బున్న నిర్మాతో చూస్తే సినిమా తీసెయ్యొచ్చు ..

  ప్రత్యుత్తరంతొలగించు
 25. ppppppppppppppprrrrrrrrrrrrrrrrrrrrrrrrreeeeeeeeeeeeeeeeeemmmmmmmmmmmmmmmmmeeeeeeeeeeeeeeennnnnnnnnnnnnnnnaaaaaaaaaaaaaa?

  ప్రత్యుత్తరంతొలగించు
 26. prema pichhi okate bhanumathi paata intha baaga gurtocheelaa chesindi

  ప్రత్యుత్తరంతొలగించు
 27. ప్ర.పీ.స.స. అంటే ఎంటి?

  ప్రత్యుత్తరంతొలగించు