10, అక్టోబర్ 2010, ఆదివారం

అందమైన అమ్మాయిలనుండి నన్ను రక్షించండి బాబోయ్!

వెటకారం కాదండీ బాబూ, నిజమే. గత ఏడాదిన్నర నుండీ నా మీద అందమైన అమ్మాయిల ఫోటోలదాడి జరుగుతోంది. ప్రతీ రెండు మూడురోజులకీ ఒక సారి జాతకం, ఒక నాలుగయిదు ఫోటోలు ఉన్న మెయిళ్ళొస్తున్నాయి -ఇదిగో మా అమ్మాయి జాతకం, ఫొటొలు, మీ అబ్బాయివి కూడ పంపించండి అని. నాకు కొడుకుల్లేరు, ఉన్న కూతురు కూడా పదేళ్ళవయసుది కదా అని బుఱ్ఱ చాలాసార్లు గోక్కున్నా.

చివరికి అర్థమయ్యిందేమిటంటే, నా ఖర్మ కాలి ఎవరో బెంగళురులో భరద్వాజ అనే పెద్దమనిషి తన కొడుక్కి పెళ్ళిచెయ్యాలనుకున్నట్టున్నాడు. తన కొడుకు వివరాలు కావాల్సిన వారిని తమ వివరాలు జత చేస్తు ఒక ఈమెయిల్ పంపించమన్నాడు - కాని ఆయన చేసిన పొరబాటు - నా యహూ ఈమెయిల్ ఐడీ ఇవ్వడం. అప్పటికీ ఆ మెయిళ్ళు పంపించినవారికి సమాధానం ఇస్తూనే ఉన్నా - అమ్మా, అయ్యా, ఆయనెవరో తెలిస్తే కాస్త ఈ విషయం చెప్పి పుణ్యం కట్టుకోండి అని - కానీ ఏమీ లాభం లేదు. దీనినుండి ఎవరు నన్ను రక్షిస్తారో!

చిరాకేసి ఒకళ్ళిద్దరికి తిక్క సమాధానాలు కూడా ఇచ్చా - నాకు పెళ్ళయ్యి ఒక పదేళ్ళ పిల్ల కూడా ఉంది - ఒక పెళ్ళాన్ని, ఒక కూతుర్ని తట్టుకోవడమే కష్టంగా ఉంది, రెండో పెళ్ళి చేసుకునే ఒపిక లేదు, అలాంటి విపరీతపు బుధ్ధి ఎమన్నా పుడితే ఫోటో పంపిస్తాను అని. అయినా సరే నాకు మెయిల్ తాకిడీ ఎక్కువయ్యింది గానీ ఏ మాత్రం తగ్గలేదు.

ఈ విషయంలో నన్ను రక్షించే ఐడియాలు మీదగ్గరేమన్నా ఉన్నాయా?

18 వ్యాఖ్యలు:

 1. వాళ్ళు అదృష్టవంతులు. మీకొస్తున్నాయి కాబట్టి సరిపోయింది. వేరే ఎవరైనా అయితే ఏమి జరిగివుండేదో!!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. రౌడీ వేషాలేసున్నారని , మీ ఆవిడే ఏడిపిస్తోందో ? పరీక్షిస్తోందో ? లేకపోతే మీ ఐడి ఆయనేవరో ఎందుకిస్తాడు ? జాగ్రత్త ( బాగైందిలే లల ల్లా )

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మీకు తెలీదని కాదు గాని, యహూ మైల్ కే గదా వస్తున్నాయి. అవి ఏ ప్యాటర్న్ లో వస్తున్నాయో చూసి ఒక ఫిల్టర్ పెట్టండి. వచ్చినవి వచ్చినట్లు డిలీట్ అయ్యేలా సెట్ చేయండి. అంతే కదా..!!

  ప్రత్యుత్తరంతొలగించు
 4. లేకపోతే ఆ మెయిల్సన్నింటినీ మాలాంటి బ్రహ్మీలకు ఫార్వర్డ్ చేయండి. మాకు మ్యాచ్ అవుతుందేమో చూసుకుంటాం... :D

  ప్రత్యుత్తరంతొలగించు
 5. దానికి వొకటే మార్గం మీరొప్పుకుంటే నేను టీవి నైను వాడికి ఉప్పు అందిస్తా .
  అంతే రాత్రి క్రైము వాచ్ లో ''రెండో పెళ్ళికి సిద్ద పడుతున్న యెన్ ఆర్ అయి ప్రబుద్దుడు
  భార్య, పిల్ల తోనే వుంటూ మలక్పేట రౌడి గా నెట్ లో ప్రసిద్దుడై పెళ్ళికాని ఆడపిల్లల
  తండ్రులకు (శరత్ క్షమించు గాక } వల వేసి వారికి తన మెయిల్ ఐడి ఇచ్చి
  ఎక్కువ కట్నం ఇస్తే వొకటి రెండు అనయవాలు లేక పోయినా సద్దుకు పోతానని
  మబ్య పెడుతూ ఎలా మోసం చేసాడో లైవ్ లో శ్రీకాకుళం నుంచి మోసపోయిన
  ప్రవీన్సర్మ గారు చెపుతారు .
  నేను మా వదిన గారి అమ్మాయికి పెళ్లి సంభంధం కోసం నెట్ లో
  వళ్ళు హూనం చేసుకుని వెతుకుతుంటే ఈ రౌడి తారస బడ్డాడు
  గూగుల్ టాక్ లో తన పెళ్ళికి వాళ్ళ శ్రీమతి ని పాపని కూడా పిలవాలన్న షరతు
  పెట్టడం తో వోస్ అంతే కదా యింకో రెండు ప్లే టూలు ఎక్ష్త్ర అని సరే అన్నా,
  తర్వాత యెన్ జరిగింది ?రౌడి శ్రీకాకుళం వచ్చాడా?భార్య పిల్లని తెచ్చాడా?
  వదిన మోస పోయిందా?మరిది పారి పోయాడా?తెలుసు కోవాలంటే బ్రేక్ తర్వాత చూడండి .
  యింక ఆతర్వాత మీకు మెయిల్స్ ఆగి పోతాయని వేరే చేప్పక్కర్లేద్దు గా ?

  ప్రత్యుత్తరంతొలగించు
 6. ఇటువంటి విషయాల్లో ఇతను మంచి సలహాలు ఇస్తాడు, ప్రయత్నించండి.
  http://ayaskantam.blogspot.com/2009/05/8_20.html


  లేదంటే ఆ ప్రొఫైల్స్ తో మాలికకి అనుబంధంగా ఒక మాట్రిమొనియల్ సైట్ ఒపెన్ చేస్తే ఓ పనైపోతుంది :P

  ప్రత్యుత్తరంతొలగించు
 7. అంకుల్ అనితెలిశాక మీక్రేజ్ ఇంకా పెరిగిందేమో? స్క్రీనింగ్ చేసి మాకు ఫార్వార్డ్ చెయ్యొచ్చుగా :)

  ప్రత్యుత్తరంతొలగించు
 8. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. వారి జాతకాలు అన్నగారికి పంపించు. పెళ్ళేమో గాని పోస్ట్మార్టం రిపోర్ట్ చక్కగా రాసి పోస్టుతారు. సరదాగా చదువుకోవచ్చు.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. Venu,ఆకాశరామన్న,సుబ్రహ్మణ్య ఛైతన్య,
  చీ చీ మీలాంటి వాళ్ళ వల్ల మన బ్రహ్మీల పరువుపోతోంది.. ఎంత అమ్మాయిలు దొరక్కపొయినా మరీ ఇంతగా అడగాలా? ఈ కామెంట్లు ఏ పప్పు శ్రీనివాసరావో చూశాడాంటే అందరినీ కలిపి ఫుట్ బాల్ ఆడుకుంటాడు.. ఆయన వచ్చేలోపు త్వరగా ఈ కామెంట్లు డిలీట్ చేసేయ్యండి..

  ఇదంతా నేను ఊర్లో లేని టైం చూసి బ్ర.బ్లా.స కు వ్యతిరేకంగా మలక్ అంకుల్ చేసిన కుట్ర అని తెలిసిపోతోంది.. ఇందుకుగానూ వెంటనే శరత్ అంకుల్ వచ్చి బ్రహ్మాచారులందరికీ అపాలజీ చెప్పాలి...

  ప్రత్యుత్తరంతొలగించు
 11. బద్రీ,
  ఇప్పుడుకాదు కానీ ఇంకొక 5ఏళ్ళ తర్వాత ఐతే ఆ ప్లాన్ కమర్షియల్ గా వర్కౌట్ అవుతుంది.. అప్పటికి మాలిక ఫాలోవర్స్ బాగా పెరిగి ఉంటారు, అంతే కాక చాలా మంది అంకుల్స్, బామ్మల పిల్లలు పెళ్ళికి ఎదుగుతారు.. కనుక మనకు ఒక కస్టమర్ బేస్ రెడీగా ఉంటుంది.. :P

  ప్రత్యుత్తరంతొలగించు
 12. ఒక పెళ్ళాన్ని, ఒక కూతుర్ని తట్టుకోవడమే కష్టంగా ఉంది, ......

  - ఇది పెళ్ళయిన మగవాళ్ళందరికీ కామన్ గా నోట్లో నానుతుండే డైలాగన్నమాట! ప్చ్!

  ప్రత్యుత్తరంతొలగించు
 13. నాకెందుకో మాల గారు చెప్పినదే నిజమనిపిస్తున్నాది. మీ ఇంటావిడే మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నారేమో...ఓ పాలి కనుక్కోండి.

  @కార్తీక్
  అబ్బా చా నువ్వెప్పుడూ 16 యేళ్ళ బాలాకుమారుడిగానే ఉండిపోతావా బామ్మల, అంకుళ్ళ కూతుర్లని పెళ్ళి చేసుకోవడానికి?
  ఆల్రెడీ నువ్వు 40 యేళ్ళ బ్రమ్మీవి...ఎక్కువ ఆశలు వద్దు బాబూ, ఆరోగ్యం పాడవుతుంది. :D

  ప్రత్యుత్తరంతొలగించు
 14. మీరు చాలా అదృష్టవంతులు
  ఇంకా మీ భార్య మిమ్మలి ఉతికి ఆరేయకుండా అర్ధం చేసుకున్నారు
  @ రవి గారు , టీవి 9 చెప్పండి, మలక్ గారి దగ్గర రెండు లక్షలు తీసుకుంటాడు, ఆయన ఇవ్వకపోతే రోజులు ఇదే చూపించుకుని పండగ చేసుకుంటాడు

  ప్రత్యుత్తరంతొలగించు
 15. nenu inka "nannu love cheyara plz nannu love cheyara (don seenu)" ala ammayilu mi venta paduthunnaremo anukunnane :P

  ప్రత్యుత్తరంతొలగించు