26, జూన్ 2010, శనివారం

ఆర్యులా? ద్రవిడులా?? గాడిదగుడ్డా??? మూడవభాగం - ద బిగ్ ఫైట్

Pulling these old posts back (originally posted in March/April 2009)గత మూడురోజులుగా బ్లాగ్లోకాన్ని ఒక ఊపు ఊపిన ధూంధాం ల పెను తుఫాను తీరాన్ని దాటింది. ఇక మన పోట్లాటలు మళ్ళీ మొదలుపెట్టుకోవచ్చు ...

పోయిన భాగంలో కుళ్ళురాజకీయాల గురించి చర్చించాం. ఈ భాగంలో అసలు గొడవమీదకి దృస్టి మళ్ళిద్దాం.

ఆర్య్ల దండయాత్ర సిధ్ధాంతాన్ని నమ్మిన వారు తమ వాదనని గట్టిగానే వినిపించారు. వారి చేతిలోని ముఖ్య ఆయుధం సంస్కృతానికి, యూరోపియన్ భాషలకి దగ్గర పోలిక. ఆ పోలికేమిటయ్యా అంటే ...

మళ్ళీ కొంచం ఫ్లేష్ బేక్: ( జయరాం వీ: ద ఓరిజిన్ ఎండ్ ఎవల్యూషన్ ఆఫ్ సాంస్కృత్ నుండి)

అనగనగా 1783 నుంది 1794 దాకా సర్ విలియం జోన్స్ అనే ఆయన కలకత్తా సుప్రీం కోర్ట్ న్యాయమూర్తిగా ఉంటూ, భారదేశంలో ఉండి, భారతీయ సంస్కృతినీ, పాండిత్యాన్నీ, వంటబట్టించుకొని సంస్కృతాన్ని, యూరోపియన్ భాషలతో దాని పోలికలనీ క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే

The Sanskrit language, whatever be its antiquity, is of a wonderful structure; more perfect than the Greek, more copious than the Latin, and more exquisitely refined than either, yet bearing to both of them a stronger affinity, both in the roots of verbs and in the forms of grammar, than could possibly have been produced by accident; so strong, indeed, that no philologer could examine them all three, without believing them to have sprung from some common source, which, perhaps, no longer exists.ఇది యూరోపియన్ల పాత నమ్మకాల పునాదుల్ని కదిలించింది. ప్రపంచభాషలకు హెబ్రూనే మాతృక అని అని నమ్మిన వారు, తమ సిద్ధాంతాన్ని మార్చుకుని 'ప్రోటొ ఇండో యూరోపియన్ లేంగ్వేజ్" (PIE) అనేదానిని మాతృకగా అంగీకరించారు. దానినుండే ఇండో ఇరానియన్ (సంస్కృతం, పర్షియన్ గట్రా), బాల్టిక్ (లిథువేనియన్ గట్రా), స్లావిక్, ఆర్మీనియన్, గ్రీకు, సెలెటిక్, ఇటాలిక్ (లాటిన్ గట్రా), ఇటాలియన్, ఫ్రెంచ్, స్పానిష్, జెర్మన్, ఆంగ్ల, డచ్, స్కాండనేవియన్, అనటోలియన్, తోచారియన్ భాషలు ఆ PIE నుండే పుట్టాయన్న సిధ్ధాంతాన్ని ప్రతిపాదించారు.


మరి దీనికి సాక్ష్యం? నిరూపణ??

మొదటగా ఈ భాషలన్నిటిలో ఒకేరకమైన పదాలు చాలా ఉన్నాయి అని కనుగొన్నారు. ఆ తర్వాత సబ్దాల మీద, అచ్చులు, హల్లులు మొదలైన వాటిమీద కూడా పరిశొధన చేశారు. కానీ ఎప్పుడో చచ్చిపోయిన ఈ PIE భాష పుట్టుక మాత్రం (ఇప్పటిదాకా) కనిపెట్టలేకపోయారు. దానితో ఒకొక్కరూ ఒకొక్క నిర్ణయానికొచ్చారు. అనటోలియాలో పుట్టిందని కొందరంటే, ద్రవిడీయన్ భాషనుండి అని కొందరు, అది పాతకాలపు సంస్కృతమే అని మరికొందరు కొట్టుకోవడం మొదలెట్టి, ఈ రోజుకి కూడా కొట్టుకుంటున్నారు.

జయరాంగారి విశ్లేషణ ప్రకారం:

సంస్కృతంలో "మం", యూరొపియన్ భాషలలో అమ్ముక్, ఎమె, మీ, మనె, మూ
"తువం" ఏమో తు, థౌ, దు, త్వే, తి
పితర్ ఏమో పేతర్, ఫాదర్, పేసర్
సమ - సేం
సంత్ -సెయింట్
సర్ప - సర్పెంట్

ఇలా వందలకొద్దీ ఉన్నాయి. ఇంకా కావాలంటే ఈ సైట్

http://www.hinduwebsite.com/general/sanskrit.asp

మన గొడవలకొస్తే, తికమక ఇక్కడ మొదలయ్యింది. వామ పక్ష వాదులేమో సంస్కృతం బయటనుంది వచ్చిందని - వ్యతిరేకులేమో మన దగ్గరనుండి బయటకెళ్ళిందని ...

ఇక్కడితో ఆగారా? లేదే! ఇంకా చాలా విషయాల్లో గొడవలు జరిగాయి (బీ వీ గిరి)

1. హరప్పా - మొహెంజొదారో:

దీనిగురించి తెలియనివాళ్ళెవ్వరు? కానీ చాలా గొడవలకి ఇదే కారణం కూడా. ఎలా అంటారా? తినబోతూ రుచి అడగడమెందుకూ? చదవండి మరి:

అక్కడ తవ్వకాలు సాగించిన వాళ్ళకు డజన్లకొద్దీ, అస్తిపంజరాలు లభ్యమయ్యాయి. దానిని బట్టి ఏమన్నారంటే ఆర్యులు దండయాత్ర చేసి అక్కడీవారిని చంపేశారన్నారు. ఇది విన్న వ్యతిరేకులు ఒంటికాలిమీద లేచారు - "1922 నుండి 1931 వరకు 9 ఏళ్ళు సాగించిన తవ్వకాలలో 37 అస్తిపంజరాలు దొరికాయి - అదికూడా అన్నీ ఒకేచోట. అది స్నశానం కాకూడాదా?" అంటూ. పైగా ఒక్క ఆయుధం కూడా దొరకలేదు అని కూడ వాదించారు

2. గుర్రాలు, రధాలు:

దండయాత్ర సమర్ధకులు వేదాలలో చెప్పబడీన గుర్రాలు రధాల గురించి ప్రస్తావిస్తూ సింధూలోయ జనాలకి అవి తెలియవని, ఆర్యులతోపాటు భారతదేశానికి వచ్చాయని కనుక ఆర్యులు సింధులోయా యుగం తరవాత వచ్చారని ఊదరగొట్టేశారు. క్రీ పూ 2600 లో మొదలయిన సింధూలోయా నాగరికతను క్రీ పూ 1500 లో వచ్చిన ఆర్యులు ధ్వంసం చేశారని కూడా ప్రతిపాదించారు.

పోతే ఇండియానా యూనివర్సిటీ నుండి పీ హెచ్ డీ పట్టా తీసుకున్న డా రాజారాం గారు హిందూ సనాతన వాది. ఆయన పరిశొధనలు చేసి సింధూలోయా నాగరికతలో అశ్వాలను మచ్చిక చేసుకున్నారని ప్రతిపాదించారు. కానీ హార్వార్డ్ ఊనివర్సిటి లో సంస్కృత ఆచార్యుడయిన మైఖేల్ విట్జెల్ రాజారాం ని 2002 లో తూర్పారబట్టారు. ఈయన కనుగొన్నదొక ఎద్దు, గుర్రం కానేకాదు పొమ్మన్నారు. లెక్కల వాడివి నీకేం చరిత్ర తెలుసొయ్ అని ఎగతాళి చేశారు. దానికి రాజారం తిరగబడి సంస్కృతం చెప్పుకునేవాడివి నీకేమి తెలుసు - నేను కనీసం సైంటిస్టుని అని ఘాటుగానే సమాధానం ఇచ్చారు. ఈ వీట్జల్ రోమిలా థాపర్ కి మద్దతుదారుడు. తనని తనే ఓ పెద్ద చరిత్రకారుడిగా వర్ణించుకుంటాదు. ఆ మధ్య కాలిఫోర్నియా పుస్తకాల గొడవలలో కూడా తలదూర్చాడు. అటువైపు రాజారాం కూడా ఏమీ తగ్గలేదు. చివరికి వీళ్ళిద్దరి గొడవ పెద్ద రాజకీయమై కూర్చుంది. కానీ యస్ ఆర్ రావు గారు చేసిన పరిశొధనలు మాత్రం ఆ కాలంలో గుర్రాలున్నాయని నిర్ద్వంద్వంగా తేల్చి చెప్పాయి

3. శివుడా విష్ణువా?

మరొక సిధ్దాంతం ప్రకారం ఆర్యులు విష్ణు భక్తులనీ, ద్రవిడులు శివ భక్తులని ప్రాచుర్యమైంది. కానీ ఆర్యులు వచ్చాఇన కాలం అని చెప్పబడేదానికన్నా చాలా ముందు కాలమ్నాటి వినాయకుని విగ్రహం ఇరాన్లో బయటపడింది. ఆ సిధ్ధాంతం కూడా తుస్సుమంది.

ఇక దీనితో దండయాత్రవాదులు కొంచం తగ్గి "అబ్బే ఆర్యులు దండయాత్ర చెయ్యలేదు వలస వచ్చారంతే అని వాదన మార్చారు". వ్యతిరేకులు మాత్రం తగ్గలేదు. "ఏదో కొద్ది మంది వస్తే వ్హచ్చి ఉండచ్చుగాక - కానీ ఆర్యులు భారతీయులే" అని నొక్కో నొక్కకుండానో వక్కాణించేశారు. అంతటితో ఊరుకోలేదు. చాన్సు దొరికింది కదా అని ఎదురుదాడి మొదలు పెట్టారు.


4. సరస్వతీ నది: మన పురాణాలలో సరస్వతీనది గురించిన ప్రసావన చాలా ఉంది. వలసవాదులు "అలాంటిదేమీ లేదు! సరస్వతీనది ఒక బూటకం" అని వాదించారు. కానీ ఇటీవలే కనుగొనబడిన సరస్వతీ నది ఇప్పఋఇకి 5 వేల సంవత్సరాల క్రితమే ఎండిపోయింది అని నిర్ధారింపబడింది. కనుక ఆర్యులు అప్పటికే భారతదేశంలో ఉన్నరని, క్రీ పూ 1500 లో రాలేదన్న వాదం బలపడింది.

5. అలగే సింధూలోయా కాలమ్నాటి స్వస్తిక గుర్తుకూడా ఈ వాదనకి బలాన్ని చేకూర్చింది.

6. "ఉత్తరాదినుండి దక్షిణ భారతానికి తమిళులు మొదలైన వారు తరిమివేయబడితే ఉత్తరంలో వారు ఉన్న గుర్తులేవి?" అన్న ప్రశ్నకి సరైన సమాధానం లేదు.


వ్యతిరేకులే గెలిచేస్తున్నారొహో అనుకునే సమయానికి కధలో ట్విస్టు వచ్చిపడింది -

హైదరబాద్ - సీ సీ యం బీ 2002-2003 లో జన్యుకణాల పరిశొధన చేశి అగ్రవర్ణాల జీన్స్, దళితుల జీన్స్ వేరు వేరని తెల్చి చెప్పింది. అలగే ఉత్తర దక్షిణ రాష్ట్రాల ప్రజల జన్యుకణాలు వేరని కూడా తేల్చి చెప్పింది.

దీనితో వలసవాదుల్లో నూతనోత్సాహం వచ్చింది. వ్యతిరేకుల్ల గుండెల్లో రాయి పడింది.

( ఈ సస్పెన్స్ తరువాయి/ఆఖరి భాగం దాకా) - కాదు కూడదు అనుకుంటే దీనిగురించి ముందుగా చెప్పగలిగేది ఒకరే ఉన్నరు ....


వారే ...

వారే ....

వారే .....


వికటకవి బ్లాగులో రాజేష్ :))

10 వ్యాఖ్యలు:

 1. ఏంటో అంతా అయోమయం. ఇంతకూ మనము ఆర్యులా? ద్రవిడులా? సచినులా? గంగులీలా?

  ప్రత్యుత్తరంతొలగించు
 2. చివరకు నా కామెంట్ కూడా moderate చేస్తారా? రౌడీ రాజ్యం డౌన్ డౌన్. పెజారాజ్యంకే మీ ఓటు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. అమెరికా నానా జాతి సమాగమం కాదా? అక్కడ ఏ దేశం నుంచి వచ్చిన, అక్కడే పుట్టినా , ముందు వచ్చినా వెనక వచ్చినా ఆ దేశాని loyal గా లేక పొతే నడ్డి విరగ కొడతారు.
  ఇక్కడ వాళ్లేమో ఎక్కడి నుంచైనా చావనీండి కనీసం పది తరాల్నించి ఇక్కడే ఉంటున్నారు కదా ... అయినా ఒక్కళ్ళ లో దేశభక్తి లేదు. కొందరేమో చైనా కు loyal, కొందరేమో పాకిస్తాన్ కి loyal, హైదరాబాదు లో కొందరు ఏమో ఇరాన్ కి loyal, పోపు డబ్బులు మింగు తున్న వాళ్ళేమో ఇటలి కి loyal. కొందరేమో అమెరికా కి loyal. డబ్బు ఇస్తే కుక్కల్లా విశ్వాసం గా ఉంటారా... మీకు చదువు సంధ్య నేర్పిన దేశం, పక్క వాడి నోటి కాడి తిండి చదువు మీకు అందించిన దేశం మీకు అక్కరలేదా.
  వాడిది ఈ దేశం కాదు. నాదే అనే హక్కు మనకెక్కడిది? ఈ ముష్టి సిద్దాంతాల్ని పట్టుకొని తమిలాల్లు బ్రహ్మల్ని, కాశ్మీరీలు హిందువుల్ని ఎలా తరమగాలుగుతున్నారు. ? దీనికి పోటిగా కొందరు ముస్లిం లను బయటకు పంప మానటం కూడా అంతే అన్యాయం.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. పొదిగిన గుడ్డు పిల్ల ఐనప్పుడు కోడి కి ఉండే ఆనందం .... ఇప్పుడు రాజేష్ ని చూసి నాకు కలిగింది

  ఆనంద భాష్పాల మద్య.......

  రాజేష్ ని ఎవరన్నా తమ సందేహాలు అడగాలనుకుంటే అడగవచ్చు (ఇదే బ్లాగులో )

  ప్రత్యుత్తరంతొలగించు
 5. tanu busy ga unna karanam saaku gaa choopi comment moderation pettina malak ee gadde digaali rowdeerajyam paggalu rajesh ki appaginchaali

  ani oka prakatanalo nenu demand chesthunanu

  ప్రత్యుత్తరంతొలగించు
 6. మీ చివరి భాగానికై కళ్ళు కాయలు కాస్తున్నాయి.......పండి పోయి నేల రాలక ముందే రాయాలి మీరు.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. ఆర్యుల ద్రవిడుల సంగతేమో కానీ రాజేష్ ఎవరు?

  ప్రత్యుత్తరంతొలగించు
 8. (సరదాగా...) ఆంధ్రులలో 'ఆ' 'మ్...' ద్రవిడులలో 'ద్ర'... ఏంటబ్బా అది... ???

  ప్రత్యుత్తరంతొలగించు