ఒక రోజు శంకరశాస్త్రిగారో టిఫిన్ సెంటర్కి వెళ్ళారు. ఆయన చెప్పినదాన్ని సెర్వర్ ఒక పట్టాన తీసుకురాకపోయేసరికి కాస్త దీనంగా, కాస్త కోపంగా "శంకరా! నాదశరీరాపరా" ట్యూనులో ఈ పేరడీ ఎత్తుకున్నారు.
పల్లవి:
సెర్వరా! నాన్చుడు ఇక ఆపరా..
వేగముగా సాగరా
టిఫిన్ తీసుకురా...!
సెర్వరా!
నాన్చుడు ఇక ఆపరా..
వేగముగా సాగరా
టిఫిన్ తీసుకురా...!
చరణం 1:
గారెలు ఎఱుపని, ఆవడ తెలుపని
మూకుడే నలుపుయనీ ...
నిన్నటి పుల్లని పెఱుగును కలిపితే
గారెనే ఆవడనీ ..
గారెలు ఎఱుపని, ఆవడ తెలుపని
మూకుడే నలుపుయనీ ...
నిన్నటి పుల్లని పెఱుగును కలిపితే
గారెనే ఆవడనీ ..
పాకపు కిటుకులు తెలిసినవాడవు మరోనలుడవు నీవైతే ...
పాకపు కిటుకులు తెలిసినవాడవు మరోనలుడవు నీవైతే ...
ఇడ్లీ పూరి బిసిబెళేబాత్ ఉప్మా
మఱువరా నీవు మఱువరా
కుక్కులెరుగనీ కొత్తవంటకం
స్వయంశక్తితో చేసిపెట్టరా .. వేసిపెట్టరా...
సెర్వరా!
నాన్చుడు ఇక ఆపరా..
వేగముగా సాగరా
టిఫిన్ తీసుకురా...!
చరణం 2:
ఉడికే కుడుములు అతివకు గుచ్చిన మన్మథ చూపులు కాబోలూ ..
వేగే పుణుకులు నరకపు యమునికి చిక్కిన పాపులు కాబోలూ ..
పెనం మీదపడవేయంగా .. చఱ్ఱున కాలెనుగదా వంగా...
పెనం మీద పడవేయంగా .. చఱ్ఱున కాలెనుగదా వంగా...
సాంబారే దానితో చేయంగా ... ఆ తలపుకే నానోరూరంగా ...
ఆ ..ఆ .. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
సెర్వరా! నాన్చుడు ఇక ఆపరా.. వేగముగా సాగరా టిఫిన్ తీసుకురా...! సెర్వరా! సెర్వరా!! సెర్వరా!!!
sir, mee peradi mmu reprint chesukovachhaa?
రిప్లయితొలగించండి- sunday Andhra Jyothi
Sure, as long as you give proper credits, I have no issues. I do this just to kill time.
రిప్లయితొలగించండిఒక మంచి పాటని ఖూనీ చేశారు. అఫ్కోర్స్ కోడిని చంపకుండా చికెన్ కర్రీ కావాలంటే దొరకదుగా. అందుచేత ఈ పాటని ఎంజాయ్ చేస్తున్నాం.
రిప్లయితొలగించండిచాలా లేటుగా రాసారు.ఆ రోజుల్లో విశ్వనాథ్ గారికి చూపిస్తే ఇదే పెట్టి ఉండే వారేమో!
రిప్లయితొలగించండి