ఈ మధ్య కొందరు మేధావులు భారతీయ విలువల్ని గురించి పెట్టిన మణిమాణిక్యాల్లాంటి కామెంట్లు చూశాను. పాపం పూటకతో వచ్చిన బుధ్దులు కదా, పక్కవాడిమీద ఏడవందే పూటా గడవదు వారికి. ప్రతీ సమూహంలో మంచీ, చెడు రెండూ ఉంటాయని వీళ్ళకి తెలియకనా? దేశాన్ని వెక్కిరించడం ఫేషన్ అంతే. ఇలాంటి తిన్న ఇంటివాసాలు లెక్కపెట్టే విశ్వాసఘాతక మేధోవర్గానికి భారతీయతకి సంబంధించినదేమీ మంచి కనబడకపోవడంలో ఆశ్చర్యం లేదు. అన్నట్టు నేనేమీ గోగోగోగోప్ప దేశభక్తుడిని కాను. కానీ తల్లిలాంటి దేశాన్ని దూషించి ద్వేషించే ఈ మేధోవర్గానికి చెందినవాడినైతే కాను. కానీ అసలు భారత దేశానికి ఉన్నవీ, చాలా దేశాలకు లేనివి అసలేమన్నా ఉన్నాయా? నాకు తెలిసిన కొన్ని:
1. కుటుంబ వ్యవస్థ: ప్రపంచానికి కుటుంబ విలువలని ఎత్తిచూపింది మనదేశం, కొంత వరకూ జపాన్. పెద్దల అనుభవం, పిల్లల సృజనాత్మకత కలిసి పనిచేసే అరుదైన నమూనా
2. వివాహ వ్యవస్థ: ఆడైనా మగైనా తన జీవిత భాగస్వామికోసం బ్రతకడం, తన భాగస్వామి పట్ల అపరిమితమైన, అచంచలమైన, నిరుపాధికమైన అనురాగాన్ని జీవితాంతం కలిగి ఉండడమనే భావన ఈ మేధావులకెప్పుడు అర్ధమవ్వాలి? తమకోసమే తాము బ్రతికేవారికీ, ద్వేషం తప్ప ప్రేమ అనే పదం తమ నిఘంటువులలో లేనివారికి ఇది అతిశయోక్తిగానే అనిపిస్తుంది.
3. భిన్నత్వంలో ఏకత్వం: భారత దేశంలో ఉన్న జాతులు వేరే ఏ దేశంలోనూ లేవు. అయినా కొన్ని చెదురుమదురు సంఘటనలు మినహాయిస్తే, నానాజాతి సమాగమైన భారతీయ సంతతికి ఒకేజాతిగా గుర్తింపు తీసుకొచ్చేది - భారతీయతే. "భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు" అన్న భావనొక్కటి చాలు దీని విలువని చాటడానికి
4. ఆప్యాయత: సంతానం పట్ల తల్లిదండ్రులు చూపించే బాధ్యతను ఒక్క జాపాన్ మినహా వేరే ఏ దేశంలోను ఇంతగా చూపించరు. ఒక వయస్సు వచ్చాక మనుషులు తమ కోసం బ్రతకడం మానేసి తమ సంతానం కోసమే బ్రతకుతారు మన దేశంలో. పదిహేనేళ్ళు రాగానే తన్ని తగిలేసే దృశ్యాలు అంతగా కనబడవు. (ఒకటి రెండు సంఘటనల్ని భూతద్దంలో చూపించే మేధావుల సంగతి వేరులేండి)- ఒక రూపాయి దాచినా అది తమ సంతానానికి ఉపయోగపడుతుందనుకునే వారే ఎక్కువ. అలాగే తల్లిదండ్రుల బాధ్యత కూడా పిల్లలు తీసుకునేలా చేసింది భారతీయ విలువలే. కొన్ని వందల/వేల మంది ఉన్న వయోవృధ్ధుల వంటరి తనాన్ని సాకుగా చూపించి కొన్ని కొన్ని కోట్లమంది మీద ఈ విషంలో నిందారోపణ చెయ్యడం జనాలకి మామూలేగా?
5. పెద్దల పట్ల గౌరవం: తమ పెద్దవారి పట్ల భారతీయులు చూపించే గౌరవం మరేదేశంలోను ఇంతగా కనబడదు. భారతదేశాన్ని సందు దొరికితే తూలనాడే ఒకాయన్ని చూద్దాం. "ఎవడేమనుకుంటే నాకేంటి, నా బ్లాగులు నేను రాసుకుంటా" అనే తత్వం ఆయనది. జనాలు బండ బూతులు తిట్టినా ఎప్పుడూ పట్టీంచుకున్న దాఖలాల్లేవు. అలాంటిది నేను పొరపాటున తెలియకుండా వాళ్ళా నాన్నగారి పేరుని ఒకచోట వాడేసరికి, ఈ మధ్యకాలంలో ఏనాడూ నాతో మాట్లాడని ఆయన నాకు మెయిల్ పంపించాడు. కారణం చెప్పక్కరలేదనుకుంటా - ఆయనకి తన తండ్రిమీదున్న గౌరవం. తనని ఎవడైనా ఎమన్నా అన్నా సరే పట్టించుకోనివారు తల్లిదండ్రులని ఏమన్నా అంటేమాత్రం తట్టుకోలేరు. అదీ భారతీయులకి తమ పెద్దవారిపై ఉండే గౌరవం.
ఇంటికి వచ్చిన అతిధులని భారతీయులు ఆదరించినట్టుగా వేరెవరూ ఆదరించరు. తనకి చిన్నప్పుడెప్పుడో చదువు చెప్పిన గురువు ఎక్కడైనా కనిపిస్తే కులమతాలకతీతంగా గుండెల్లోంచి వచ్చిన గౌరవ భావంతో చేతులు జోడించినమస్కరించే గుణం భారతీయ విలువల్లో ఒకటికాదంటారా?
**** నేను చిన్నప్పుడు విన్న విషయం ఇది: ఎమతవరకూ నిజమో తెలియదు - ఎవరో వివేకానందుడిని అడిగారట "ఏమిటయ్య? నీ బోడి భారతీయతలోని గొప్పదనం ఒక్కటి చెప్పు చూద్దాం" అని వెటకారంగా. దానికి ఆయన సమాధానం: "మేము భార్యని తప్ప మిగాతావారిని తల్లుల్లా చూస్తాం, మీరు తల్లిని తప్ప మిగతావారిని భార్యల్లా చూస్తారు" :))
సరే ఇక మన మేధావుల కామెంట్లని కెలికి వద్దామా?
సరే ఇక మన మేధావుల కామెంట్లని కెలికి వద్దామా?
1. భారతీయ విలువలు అంటే: తాము పాటించకుండా ఎదుటివారు మాత్రం తప్పక పాటించాల్సినవిగా అందరూ కోరుకునేవి.
____________________________________________________________________________
ఈయన తన విలువలని దేశం మొత్తానికి ఆపాదిస్తున్నట్టుగా లేదూ? తన బ్లాగులో పూజ, పునస్కారాలని వెక్కిరిస్తూ రాయచ్చు. కుహానా ఆస్తికులని కొంతమందిని విమర్శించచ్చు. కానీ మిగతావారు కుహానా నాస్తికత్వం పేరు ఎత్తితేమాత్రం ఊరుకోరు.
2. ఉత్తమమైన భారతీయ విలువ హిపొక్రెట్ గా బ్రతకడం.
____________________________________
ఈయన ఎంత హిపోక్రైటో ఈయన బ్లాగులు చదివే ఎవరికైనా అర్ధమవుతుంది. ఆయన మార్కు ద్వంద్వ ప్రమాణాలు నా పదకండవ ప్రమాదసూచికలోనే ఊఆయిగా.
ఎంతయినా ఇది ఈయన విలువ కాబట్టి పచ్చ కామెర్ల టైపులో మొత్తం భారతదేశమంతా అలాగే కనిపిస్తుందన్నమాట.
3. భారతీయత అంటే భారత దేశంలో మాత్రమే కనిపించేవి, ఇతరత్రా కనిపించనివి.
కుల వ్యవస్థ, సతీ సహగమనం, వితంతు వ్యవస్థ, స్త్రీలపై కట్టుబాట్లు, జోగినీ వ్యవస్థ, పురుషాహంకారం వగైరా. వీటన్నిటికి తోడు పైన ఎవరో చెప్పినట్టు దేశ జనాభాలో అత్యంత మైనారిటీ అయిన ఒక కులం వారిలో కొంతమంది చేసే 'సంధ్యావందనం' కూడా కావచ్చు.
_______________________________________________________________________________________________________
మిగతా దేశాల్లో వర్ణ వ్యవస్థ ఈయన కళ్ళకి కనిపించదు. మిగతా దేశల్లో ఆడవాళ్ళని మగవాళ్ళు పెట్టే హింసలు కూడ కనించవు. మిగతా దేశాల్లోని పురుషాహంకారం అస్సలు కానరాదు. కానీ కార్తీక్ ఎదన్నా విషయం చెప్తే అపొపుడు గుర్తొస్తుంది ఈయనకి అది మిగా దేశాల్లో కూడా ఉందని. కార్తీక్ మాటల్లోనే చెపాలంటే "సూపర్ లాజిక్". మన దేశ విలువల మీద ఇంత విషం చిమ్మే ఈయన ఎవరో ఒక నాస్తికవాదిని ఒక మాట అనేసరికీ విషం చిమ్మేస్తున్నారొహో అని గోల.
marO vishayam: vijay varma vraasinadi:
ఏమి నేర్పింది నా భారతదేశం? నన్ను నన్నుగా చూడమంది. నా చుట్టూ ఉన్న ప్రపంచంలో నా ఉనికిని గమనించమంది. ప్రతి చెట్టులో, పుట్టలో, తినే తిండిలో, నీ తోడులో, వాగులో, వంకలో, మాటలో, మంచిలో ఉన్న నన్ను నన్నుగా చూడడం నేర్వమంది. ఆ క్రమంలో దానవత్వం నుండి, మానవత్వం వైపుకు, అటునుండి దైవత్వం వైపుకు పురోగమించే నా శక్తిని వీక్షించమంది.
భారతదేశం ఒక యోగ భూమి. ఇక్కడి నుండి ఆ ప్రకంపనలు ప్రపంచం నలువైపులా విస్తరించి వెలుగును ప్రసాదించాయి. ఇక్కడ ఎందరో మహాపురుషులు తమ జీవితాలను లోకకళ్యాణం కోసం ధారపోసి ఎన్నో యోగ రహస్యాలను మధించి, వాటిని మనకు ఆచరణ యోగ్యంగా ఉండేలా ఓ జీవన విధానం రూపొందించి మనకు ప్రసాదించారు.
నిజం చెప్పండి తోటి వారి కష్టాన్ని తమ కష్టంగా భావించే వారు లేరంటారా? ఆడ వారికి రక్షణ లేదంటున్న నేటి లోకంలో వారికి చేయూతనిచ్చే మొగవారు లేరంటారా? పోనీ నేటికీ సంధ్యావందనాదులు చేసే బ్రాహ్మలు లేరంటారా? వారానికో సారైనా గుడికి వెళ్లే వారు లేరంటారా? ఇంటి ముందు అందమైన ముగ్గుని చూసినంతనే పొంగిపోయే హృదయాలు లేవంటారా? తమలోని తప్పును దిద్దుకునే వారు లేరంటారా? మంచి కోసం పరి తపంచే, సత్యాన్వేషణ సాగించే మీ వంటి వారు లేరంటారా?
ఇందులో మన సారుకి కనిపించిది కేవలం సంధ్యావందనం. సరే దానిలో తప్పులేదు. మనకు కావలసిందే మనం వాదనలోకి తీసుకుంటాం. కానీ సంధ్యావందనాన్ని సతీ సహగమనం, జోగినీ, పురుషాహంకారం పక్కన చేర్చడంలో ఈయన ద్వేషం దేనిమీదో అర్ధం కావట్లేదా? కులగజ్జి అంటే అన్నానని ఏడుస్తారుగానీ? :))
చూస్తుంటే పైన ముగ్గురూ నాస్తికులల్లే ఉంది. (రెండో ఆయన సంగతి అంతగా చెప్పలేము లెండి, ఆయన సిధ్ధాంతాలు నిరంతరం మారుతూ ఉంటాయి) - అలా అని నాస్తికత్వానికీ దేశం పై వ్యతిరేకతకీ సంబంధం ఏమన్నా ఉందా అంటే కాదని అంటాను.
ఎందుకంటే శరత్ నాస్తికుడే, కానీ ఏనాడూ ఆస్తికులని కించపరచడం నేను చూడలేదు ఇప్పటిదాకా. అలాగే నేను అభిమానించే రచయితల్లో ఒకరైన కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు కూడా నాస్తికులే. కానీ ఆయన విమర్శలు చాలా సహేతుకంగా ఉంటాయి, ఆస్తికత్వంలోని మంచినీ స్వీకరించే గుణం ఉంది ఆయనలో.
ఈ ద్వేషం మనుషులది కానీ నాస్తికవాదానిది కాదుకదా.
కృష్ణా,
నేనెవ్వరినీ కెలకకుండా చేస్తానని శపధం చేసావు కబట్టి చెప్తున్నా - ఒక్కరిని కాదు ఇప్పుడు ముగ్గిరిని కెలికాను. గుంపుగా
నలుగురూ కట్టగట్టుకొస్తారో, విడివిడిగా వస్తారో రండి.
23, మే 2010, ఆదివారం
16, మే 2010, ఆదివారం
ఈ మధ్య కాలంలో నేను ఎక్కువగా విన్న 20 పాటలు
నేను స్వహతాగా రాక్/మెటల్ (డీప్ పర్పుల్, ఏసీ/డీసీ, మెటాలికా, ఐరన్ మెయ్డెన్ గట్రా) పాటల అభిమానిని. కానీ నా కూతురి పుణ్యమా అని ఈ మధ్య కాస్త పాప్ & కంట్రీ కూడా వినడం మొదలెట్టా( లేడీ గాగా, మైఖేల్ జాక్సన్, బియాన్సే, టేలర్ స్విఫ్ట్ గట్రా) - ఇది ముసలితనానికి చిహ్నమని స్నేహితులు వెక్కిరించినా కూడా :))
ఈ మధ్య విన్న పాటల్లో నా టాప్ 20: (వరుస క్రమంలో అయితే లేవు) - ముందు అసలు వీడియోలు లేకుండా కేవలం ఆడియోలే పెడదామనుకున్నా - కానీ ఈ-స్నిప్స్ లో అన్నీ దొరకలేదు, దొరికినవి కూడ చాలా నింపాదిగా లోడ్ అవుతున్నాయ్.
1. పేరలైసర్ - ఫింగర్ ఇలెవెన్ - మొదటిసారి వినగానే నాకు నచ్చేసిన పాట
2. లెట్ ఇట్ రాక్ - కెవిన్ రుడాల్ఫ్, లిల్ వేన్ ( పిల్లలతో వినేటప్పుడు జాగ్రత్త - లిరిక్స్ అక్కడక్కడ బాగుండవు)
3. పేపర్ ప్లెయిన్స్ - ఎం.ఐ.ఏ. ( స్లం డాగ్ సినీమా నేను చూడలేదు గానీ, ఈ పాట అందులో వాడుకున్నారని విన్నా) - ఒక పాత రేప్ నెంబర్ కి కాపీలా అనిపిస్తుంది ఇందులో ఒక లైన్. అన్నట్టు ఎం ఐ ఏ ఒక శ్రీలంక తమిళ నాయకుని కూమార్తె
4. ఇఫ్ యూ సీక్ ఏమీ - బ్రిట్నీ స్పియర్స్ - చాలా వివాదం సృష్టించిన పాట - ఇఫ్ బదులు F, యూ బదులు U .. అలాగే మిగతా అక్షరలు కూడా పెట్టి చూడండి - వివాదమేమిటో మీకు అర్ధమవుతుంది :)) కానీ పాట మాత్రం మెలోడియస్ - కాస్త గాడ్ ఫాదర్ ట్యూన్ ని కాపీకొట్టినా. వివాదం తెలియని మా అమ్మాయి ఈ పాట పాడుతుంటే ఆపేసరికి తల ప్రాణం తోకకొచ్చింది :))
5. సో వాట్ - పింక్ - పక్కా పింక్ బ్రేండ్ పాట
6. వెన్ ఐ గ్రో అప్ - పుస్సీ కేట్ డాల్స్
7. టిక్ టాక్ - కేషా
8. వుమనైసర్ - బ్రిట్నీ స్పియర్స్
9. ఆల్ ద సింగిల్ లేడీస్ - బియాన్సే - నిజంగానే గ్రేమీ సాంగ్ - వీడీయోలో కూడా వైవిధ్యముంది
10. డోంట్ ట్రస్ట్ మీ - థ్రీ ఓ థ్రీ ( 303 ) - డెన్వర్ లో ఫోన్ నెంబర్లు 303 తో మొదలవుతాయిలేండి. పాట చూసేడప్పుడు జాగ్రత్త - అక్కడక్కడ వెకిలిగా ఉంటుంది
11. గివ్స్ యూ హెల్ - ఆల్ అమేరికన్ రిజెక్ట్స్ - కేచీ గా ఉంటుంది
12. డిస్టబియా - రిహానా - ప్రపంచాన్ని ఒక ఊపు ఊపిన దయ్యం పాట
13. బూం బూం పేవ్ - బ్లేక్ ఐడ్ పీస్ - 2009 సూపర్ హిట్లలో ఒకటి
14. టెలఫోన్ - లేడీ గాగా & బియాన్సే - ప్రస్తుతం ప్రపంచాన్ని ఒక ఊపుతున్న పాట - వీడియో మాత్రం పిల్లలని చూడనివ్వకండి - వీడియో మొదలైన మూడు నిమిషాలకి పాట మొదలవుతుంది.
15. లవ్ స్టోరీ - టేలర్ స్విఫ్ట్ - పక్కా టీనేజ్ అమ్మాయిల పాట
16. రాక్ స్టార్ - మైలీ సైరస్ (హెనా మోంటేనా) - మరో టీనేజ్ పాట
17. వన్ స్టెప్ ఎట్ ఏ టైం - జోర్డిన్ స్పార్క్స్ - Supposedly a song with a message
18. ఐ నో యూ వాంట్ మీ - పిట్ బుల్ - వీడియో మాత్రం చుట్టుపక్కలెవ్వరూ లేనప్పుడే చూడండి. "ఆట" కార్యక్రమంలో చిన్న పిల్లల చేత డేన్సులు వేయించడానికి అనువైన పాట ఇది! శరత్, ఈ పాట 3D లో కావాలని అడగద్దు :))
19. ద డే దట్ నెవర్ కంస్ - మెటాలికా - నాకు అత్యంత ఇష్టమైన పాటల్లో ఇదొకటి. అసలు వీడియో ఎంబెడ్ చెయ్యడానికి కుదరలేదు - ఈ వీడియో కింద యూ ఆర్ ఎల్ ఇస్తున్నా - చూడండ - The song should be heard in full volume and the video is good too!
http://www.youtube.com/watch?v=mRitfbhITLM
20. రాక్ ఎండ్ రోల్ ట్రెయిన్ - ఏసీ / డీసీ - అసలు వీడియో ఎంబెడ్ చెయ్యడానికి కుదరలేదు - ఈ వీడియో కింద యూ ఆర్ ఎల్ ఇస్తున్నా - చూడండి
http://www.youtube.com/watch?v=bX2xbqWtyJU
అన్నట్టు పైవాటిట్లో ఓ మూడు పాటలు మా అమ్మాయి వెంటపడి పాడించేసా. ఈ బ్లాగులో ఇంతకు ముందే రెండు సార్లు పెట్టా అవి - మూడోసారి ఇవిగో:

13, మే 2010, గురువారం
అందమైన అమ్మాయిలు/అబ్బాయిలు మీ కలల్లోకి వస్తున్నారా? అయితే నా స్నేహితుడి ఈ పోస్టు చదవండి
అందమైన అమ్మాయిలు/అబ్బాయిలు మీ కలల్లోకి వస్తున్నారా? అయితే నా స్నేహితుడి ఈ పోస్టు చదవండి
దీనికి inspiration లిండా గుడ్ మేన్ :))
URL: http://www.aavakaaya.com/showArticle.aspx?a=li&articleId=2154&pageNo=0
దీనికి inspiration లిండా గుడ్ మేన్ :))
URL: http://www.aavakaaya.com/showArticle.aspx?a=li&articleId=2154&pageNo=0
5, మే 2010, బుధవారం
చరిత్రని చూడగలమా?
నేనయితే కొంతవరకూ అవుననే అంటాను - కానీ చరిత్రలోకి వెళ్ళడం సాధ్యం కాదు.
వెళ్ళడం సాధ్యం కాని చరిత్రని ఎలా చూస్తామంటారా? కాంతి ద్వారా!
కాంతి సెకనుకు 186,000 మైళ్ళ వేగం తో ప్రయాణిస్తుంది. ఒక వెయ్యి కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న వస్తువునుండీ వచ్చే కాంతి మనకి వెయ్యేళ్ళ క్రితం అక్కడ ఏం జరిగిందో తెలియజేస్తుంది. అలాగే భూమికి వెయ్యి కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నవారికి వెయ్యేళ్ళ క్రితం భూమి మీద జరిగినవి కనిపించే అవకాశం ఉంది.
కానీ ఒకటి, ఉద్భవించే కాంతి ఎంత, అది సక్రమంగా చేరుతుందా, మనకి కనిపించేవాటి పరిణామమెంత .. ఇలాంటి ప్రశ్నలు పక్కనపెట్టాలి :))

3, మే 2010, సోమవారం
2, మే 2010, ఆదివారం
బాలయ్యకి మొగుళ్ళు!
పాపం చిరంజీవీ, బాలయ్యా కాదండీ - మిమ్మల్నీ, నన్నూ, అందరినీ, ఆఖరికి మార్తాండ ఫోటోని కూడా నవ్వించగలిగేవాడొకడున్నాడు - టీ రాజేందర్ - ఈ వీడియో చూడండి, మీకే అర్ధమవుతుంది :))
టూ మచ్ అనుకుంటున్నారా? ఇది చూడండి. విజయకాంత్ ది.
త్రీ మచ్ అంటారా, అయితే ఈ వీడియో మీరు చూడాల్సిందే - Sundar C ది
అసలు సిసలైన సీను, వీళ్ళ ముందు బాలయ్యా, చిరంజీవీ ఒక లెక్కా?
టూ మచ్ అనుకుంటున్నారా? ఇది చూడండి. విజయకాంత్ ది.
త్రీ మచ్ అంటారా, అయితే ఈ వీడియో మీరు చూడాల్సిందే - Sundar C ది
అసలు సిసలైన సీను, వీళ్ళ ముందు బాలయ్యా, చిరంజీవీ ఒక లెక్కా?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)