23, మే 2010, ఆదివారం

భారతీయ విలువలా? అబ్బో!!

ఈ మధ్య కొందరు మేధావులు భారతీయ విలువల్ని గురించి పెట్టిన మణిమాణిక్యాల్లాంటి కామెంట్లు చూశాను. పాపం పూటకతో వచ్చిన బుధ్దులు కదా, పక్కవాడిమీద ఏడవందే పూటా గడవదు వారికి. ప్రతీ సమూహంలో మంచీ, చెడు రెండూ ఉంటాయని వీళ్ళకి తెలియకనా? దేశాన్ని వెక్కిరించడం ఫేషన్ అంతే. ఇలాంటి తిన్న ఇంటివాసాలు లెక్కపెట్టే విశ్వాసఘాతక మేధోవర్గానికి భారతీయతకి సంబంధించినదేమీ మంచి కనబడకపోవడంలో ఆశ్చర్యం లేదు. అన్నట్టు నేనేమీ గోగోగోగోప్ప దేశభక్తుడిని కాను. కానీ తల్లిలాంటి దేశాన్ని దూషించి ద్వేషించే ఈ మేధోవర్గానికి చెందినవాడినైతే కాను. కానీ అసలు భారత దేశానికి ఉన్నవీ, చాలా దేశాలకు లేనివి అసలేమన్నా ఉన్నాయా? నాకు తెలిసిన కొన్ని:

1. కుటుంబ వ్యవస్థ: ప్రపంచానికి కుటుంబ విలువలని ఎత్తిచూపింది మనదేశం, కొంత వరకూ జపాన్. పెద్దల అనుభవం, పిల్లల సృజనాత్మకత కలిసి పనిచేసే అరుదైన నమూనా

2. వివాహ వ్యవస్థ: ఆడైనా మగైనా తన జీవిత భాగస్వామికోసం బ్రతకడం, తన భాగస్వామి పట్ల అపరిమితమైన, అచంచలమైన, నిరుపాధికమైన అనురాగాన్ని జీవితాంతం కలిగి ఉండడమనే భావన ఈ మేధావులకెప్పుడు అర్ధమవ్వాలి? తమకోసమే తాము బ్రతికేవారికీ, ద్వేషం తప్ప ప్రేమ అనే పదం తమ నిఘంటువులలో లేనివారికి ఇది అతిశయోక్తిగానే అనిపిస్తుంది.

3. భిన్నత్వంలో ఏకత్వం: భారత దేశంలో ఉన్న జాతులు వేరే ఏ దేశంలోనూ లేవు. అయినా కొన్ని చెదురుమదురు సంఘటనలు మినహాయిస్తే, నానాజాతి సమాగమైన భారతీయ సంతతికి ఒకేజాతిగా గుర్తింపు తీసుకొచ్చేది - భారతీయతే. "భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు" అన్న భావనొక్కటి చాలు దీని విలువని చాటడానికి

4. ఆప్యాయత: సంతానం పట్ల తల్లిదండ్రులు చూపించే బాధ్యతను ఒక్క జాపాన్ మినహా వేరే ఏ దేశంలోను ఇంతగా చూపించరు. ఒక వయస్సు వచ్చాక మనుషులు తమ కోసం బ్రతకడం మానేసి తమ సంతానం కోసమే బ్రతకుతారు మన దేశంలో. పదిహేనేళ్ళు రాగానే తన్ని తగిలేసే దృశ్యాలు అంతగా కనబడవు. (ఒకటి రెండు సంఘటనల్ని భూతద్దంలో చూపించే మేధావుల సంగతి వేరులేండి)- ఒక రూపాయి దాచినా అది తమ సంతానానికి ఉపయోగపడుతుందనుకునే వారే ఎక్కువ. అలాగే తల్లిదండ్రుల బాధ్యత కూడా పిల్లలు తీసుకునేలా చేసింది భారతీయ విలువలే. కొన్ని వందల/వేల మంది ఉన్న వయోవృధ్ధుల వంటరి తనాన్ని సాకుగా చూపించి కొన్ని కొన్ని కోట్లమంది మీద ఈ విషంలో నిందారోపణ చెయ్యడం జనాలకి మామూలేగా?

5. పెద్దల పట్ల గౌరవం: తమ పెద్దవారి పట్ల భారతీయులు చూపించే గౌరవం మరేదేశంలోను ఇంతగా కనబడదు. భారతదేశాన్ని సందు దొరికితే తూలనాడే ఒకాయన్ని చూద్దాం. "ఎవడేమనుకుంటే నాకేంటి, నా బ్లాగులు నేను రాసుకుంటా" అనే తత్వం ఆయనది. జనాలు బండ బూతులు తిట్టినా ఎప్పుడూ పట్టీంచుకున్న దాఖలాల్లేవు. అలాంటిది నేను పొరపాటున తెలియకుండా వాళ్ళా నాన్నగారి పేరుని ఒకచోట వాడేసరికి, ఈ మధ్యకాలంలో ఏనాడూ నాతో మాట్లాడని ఆయన నాకు మెయిల్ పంపించాడు. కారణం చెప్పక్కరలేదనుకుంటా - ఆయనకి తన తండ్రిమీదున్న గౌరవం. తనని ఎవడైనా ఎమన్నా అన్నా సరే పట్టించుకోనివారు తల్లిదండ్రులని ఏమన్నా అంటేమాత్రం తట్టుకోలేరు. అదీ భారతీయులకి తమ పెద్దవారిపై ఉండే గౌరవం.

ఇంటికి వచ్చిన అతిధులని భారతీయులు ఆదరించినట్టుగా వేరెవరూ ఆదరించరు. తనకి చిన్నప్పుడెప్పుడో చదువు చెప్పిన గురువు ఎక్కడైనా కనిపిస్తే కులమతాలకతీతంగా గుండెల్లోంచి వచ్చిన గౌరవ భావంతో చేతులు జోడించినమస్కరించే గుణం భారతీయ విలువల్లో ఒకటికాదంటారా?

**** నేను చిన్నప్పుడు విన్న విషయం ఇది: ఎమతవరకూ నిజమో తెలియదు - ఎవరో వివేకానందుడిని అడిగారట "ఏమిటయ్య? నీ బోడి భారతీయతలోని గొప్పదనం ఒక్కటి చెప్పు చూద్దాం" అని వెటకారంగా. దానికి ఆయన సమాధానం: "మేము భార్యని తప్ప మిగాతావారిని తల్లుల్లా చూస్తాం, మీరు తల్లిని తప్ప మిగతావారిని భార్యల్లా చూస్తారు" :))


సరే ఇక మన మేధావుల కామెంట్లని కెలికి వద్దామా?


సరే ఇక మన మేధావుల కామెంట్లని కెలికి వద్దామా?


1. భారతీయ విలువలు అంటే: తాము పాటించకుండా ఎదుటివారు మాత్రం తప్పక పాటించాల్సినవిగా అందరూ కోరుకునేవి.
____________________________________________________________________________

ఈయన తన విలువలని దేశం మొత్తానికి ఆపాదిస్తున్నట్టుగా లేదూ? తన బ్లాగులో పూజ, పునస్కారాలని వెక్కిరిస్తూ రాయచ్చు. కుహానా ఆస్తికులని కొంతమందిని విమర్శించచ్చు. కానీ మిగతావారు కుహానా నాస్తికత్వం పేరు ఎత్తితేమాత్రం ఊరుకోరు.

2. ఉత్తమమైన భారతీయ విలువ హిపొక్రెట్ గా బ్రతకడం.
____________________________________

ఈయన ఎంత హిపోక్రైటో ఈయన బ్లాగులు చదివే ఎవరికైనా అర్ధమవుతుంది. ఆయన మార్కు ద్వంద్వ ప్రమాణాలు నా పదకండవ ప్రమాదసూచికలోనే ఊఆయిగా.

ఎంతయినా ఇది ఈయన విలువ కాబట్టి పచ్చ కామెర్ల టైపులో మొత్తం భారతదేశమంతా అలాగే కనిపిస్తుందన్నమాట.

3. భారతీయత అంటే భారత దేశంలో మాత్రమే కనిపించేవి, ఇతరత్రా కనిపించనివి.

కుల వ్యవస్థ, సతీ సహగమనం, వితంతు వ్యవస్థ, స్త్రీలపై కట్టుబాట్లు, జోగినీ వ్యవస్థ, పురుషాహంకారం వగైరా. వీటన్నిటికి తోడు పైన ఎవరో చెప్పినట్టు దేశ జనాభాలో అత్యంత మైనారిటీ అయిన ఒక కులం వారిలో కొంతమంది చేసే 'సంధ్యావందనం' కూడా కావచ్చు.

_______________________________________________________________________________________________________

మిగతా దేశాల్లో వర్ణ వ్యవస్థ ఈయన కళ్ళకి కనిపించదు. మిగతా దేశల్లో ఆడవాళ్ళని మగవాళ్ళు పెట్టే హింసలు కూడ కనించవు. మిగతా దేశాల్లోని పురుషాహంకారం అస్సలు కానరాదు. కానీ కార్తీక్ ఎదన్నా విషయం చెప్తే అపొపుడు గుర్తొస్తుంది ఈయనకి అది మిగా దేశాల్లో కూడా ఉందని. కార్తీక్ మాటల్లోనే చెపాలంటే "సూపర్ లాజిక్". మన దేశ విలువల మీద ఇంత విషం చిమ్మే ఈయన ఎవరో ఒక నాస్తికవాదిని ఒక మాట అనేసరికీ విషం చిమ్మేస్తున్నారొహో అని గోల.

marO vishayam: vijay varma vraasinadi:


ఏమి నేర్పింది నా భారతదేశం? నన్ను నన్నుగా చూడమంది. నా చుట్టూ ఉన్న ప్రపంచంలో నా ఉనికిని గమనించమంది. ప్రతి చెట్టులో, పుట్టలో, తినే తిండిలో, నీ తోడులో, వాగులో, వంకలో, మాటలో, మంచిలో ఉన్న నన్ను నన్నుగా చూడడం నేర్వమంది. ఆ క్రమంలో దానవత్వం నుండి, మానవత్వం వైపుకు, అటునుండి దైవత్వం వైపుకు పురోగమించే నా శక్తిని వీక్షించమంది.

భారతదేశం ఒక యోగ భూమి. ఇక్కడి నుండి ఆ ప్రకంపనలు ప్రపంచం నలువైపులా విస్తరించి వెలుగును ప్రసాదించాయి. ఇక్కడ ఎందరో మహాపురుషులు తమ జీవితాలను లోకకళ్యాణం కోసం ధారపోసి ఎన్నో యోగ రహస్యాలను మధించి, వాటిని మనకు ఆచరణ యోగ్యంగా ఉండేలా ఓ జీవన విధానం రూపొందించి మనకు ప్రసాదించారు.


నిజం చెప్పండి తోటి వారి కష్టాన్ని తమ కష్టంగా భావించే వారు లేరంటారా? ఆడ వారికి రక్షణ లేదంటున్న నేటి లోకంలో వారికి చేయూతనిచ్చే మొగవారు లేరంటారా? పోనీ నేటికీ సంధ్యావందనాదులు చేసే బ్రాహ్మలు లేరంటారా? వారానికో సారైనా గుడికి వెళ్లే వారు లేరంటారా? ఇంటి ముందు అందమైన ముగ్గుని చూసినంతనే పొంగిపోయే హృదయాలు లేవంటారా? తమలోని తప్పును దిద్దుకునే వారు లేరంటారా? మంచి కోసం పరి తపంచే, సత్యాన్వేషణ సాగించే మీ వంటి వారు లేరంటారా?


ఇందులో మన సారుకి కనిపించిది కేవలం సంధ్యావందనం. సరే దానిలో తప్పులేదు. మనకు కావలసిందే మనం వాదనలోకి తీసుకుంటాం. కానీ సంధ్యావందనాన్ని సతీ సహగమనం, జోగినీ, పురుషాహంకారం పక్కన చేర్చడంలో ఈయన ద్వేషం దేనిమీదో అర్ధం కావట్లేదా? కులగజ్జి అంటే అన్నానని ఏడుస్తారుగానీ? :))

చూస్తుంటే పైన ముగ్గురూ నాస్తికులల్లే ఉంది. (రెండో ఆయన సంగతి అంతగా చెప్పలేము లెండి, ఆయన సిధ్ధాంతాలు నిరంతరం మారుతూ ఉంటాయి) - అలా అని నాస్తికత్వానికీ దేశం పై వ్యతిరేకతకీ సంబంధం ఏమన్నా ఉందా అంటే కాదని అంటాను.

ఎందుకంటే శరత్ నాస్తికుడే, కానీ ఏనాడూ ఆస్తికులని కించపరచడం నేను చూడలేదు ఇప్పటిదాకా. అలాగే నేను అభిమానించే రచయితల్లో ఒకరైన కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు కూడా నాస్తికులే. కానీ ఆయన విమర్శలు చాలా సహేతుకంగా ఉంటాయి, ఆస్తికత్వంలోని మంచినీ స్వీకరించే గుణం ఉంది ఆయనలో.

ఈ ద్వేషం మనుషులది కానీ నాస్తికవాదానిది కాదుకదా.



కృష్ణా,

నేనెవ్వరినీ కెలకకుండా చేస్తానని శపధం చేసావు కబట్టి చెప్తున్నా - ఒక్కరిని కాదు ఇప్పుడు ముగ్గిరిని కెలికాను. గుంపుగా
నలుగురూ కట్టగట్టుకొస్తారో, విడివిడిగా వస్తారో రండి.

66 కామెంట్‌లు:

  1. ఈ చర్చకు కారణమైన టపా ఏంటి అంటే ఏదొ కథ లో ఎవడొ తన భార్య శీలవతిగా ఉండాలనుకున్నడట.శీలవతిగా ఉండటం భారతీయ విలువ అని అతని ఉద్దేశ్యం,ఇందులో తప్పేముంది? ఏ మగాడు తన భార్య శీలవతి గా ఉండాలని కోరుకోవడం తప్ప,కథ కోసం అతడిని virgin కాదు అని తేల్చేసారు.అంటే దేశం లోని మగాళ్ళంతా శీలవంతులు కాదా కాబట్టి భారతీయత అసలు లేదా?పెళ్ళి, ప్రేమ అనేవి నమ్మకం పైన ఆధారపడిన విషయం.శీలపరీక్షలు పెట్టడం ఆడవాళ్ళను అవమానించడమే కాదని అనను.భారతీయత అంటే ఇది అని వాళ్ళే చెప్తారు అదంతా చెత్త భారతీయ అనేది అసలు లేదు అని వాళ్ళే డిసైడ్ చేస్తారు.This is what you call Hippocratic nature.

    రిప్లయితొలగించండి
  2. Rao garu,

    Thanx


    Raghav,

    ఇదెలా ఉందంటే - మన మార్తాండ ఒక కధ వ్రాసి, అందులో ఒక పాత్రని ఒక విధంగా చిత్రీకరించి, దేశమంతా ఇలాగే ఉంటుందన్నాక, ఎవరైనా ఒక ఉదాహరణ చెప్పమంటే, తన వేరే కధలో పాత్రని ఉదాహరణగా చూపించినట్టుంది :))

    రిప్లయితొలగించండి
  3. This is what you call Hippocratic nature.

    __________________________________________

    and they think the whole nation is like them.

    రిప్లయితొలగించండి
  4. I have been thinking of late that I am following blogs religiously. Looks like I'm wrong. whats this abt?

    రిప్లయితొలగించండి
  5. ఇంతా వ్రాశి ... చివర్లో చూస్తే తొడ కొట్టే లెవల్ లో సవాల్ కనిపించింది... ఇది వ్రాశారు కాబట్టీ తొడ కొట్టాలనిపించిందా లేక తొడ కొట్టాలని ఇంత వ్రాశారా ? ఈ ప్రశ్నకి తెలిసీ సమాధానం చెప్పక పోయారో... శరత్ గే పురాణం వాళ్ళ ఇంట్లో తెలిసేలా శపిస్తా ....

    రిప్లయితొలగించండి
  6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  7. @ jingsay pingchoo
    :))
    నా గే పురాణం/పేరేడ్ హై లైట్స్ సోమవారం వివరిస్తా. ఇంట్లో ఏం జరిగిందో కూడా చెబుతా.

    రిప్లయితొలగించండి
  8. http://venkatakrishnanaram.wordpress.com/2010/05/24/ఏది-సత్యం/

    రిప్లయితొలగించండి
  9. Jingsay,

    నేను కొట్టుకోకపోతే శరత్ కొట్టేస్తారేమో అని భయమేసింది. అసలే బస్కీలు తీస్తున్న చేతులాయె.

    రిప్లయితొలగించండి
  10. మలకూ ఏమాటకామాటే. అటువైపున ఎంతమందున్నా ధైర్యంగా నీ వాదన వినిపిస్తావు.

    రిప్లయితొలగించండి
  11. బ్రాహ్మణులపై ఇలాంటి అబ్రాహ్మణుల దాడులను నిరసించాల్సిందే.

    రిప్లయితొలగించండి
  12. అజ్ఞాత గారూ,

    ఇప్పటిదాకా పడిన కులగజ్జి కామెంట్లలో మొదటి బహుమతి మీకే వస్తుంది. మిగతావారు చాలా నయం, ఏదో అంతర్లీనంగా నెట్టుకొస్తున్నారు. మీరు మరీ బాహాటంగా ప్రదర్శిస్తున్నారుగా?

    రిప్లయితొలగించండి
  13. మరో విషయం: పైన ముగ్గురిలో ఇద్దరి కులం ఎవరికీ తెలియదు. ఏమో వాళ్ళు కూడా బ్రాహ్మణులే అయ్యుండచ్చుకదా? ఒకవేళ వాళ్ళు బ్రాహ్మణులయితే వాళ్ళేమన్నా సమర్ధించెయ్యచ్చా?

    రిప్లయితొలగించండి
  14. now the brahmins start abusing you. goodluck.

    రిప్లయితొలగించండి
  15. Let them. I know how to respond. You may feel free to join them too.

    కులగజ్జి అనేది కులాకకతీతంగా ఉంటుంది మనుషుల్లో. ఏదో పాతకాలంలో ఏర్పడిన వాటిని కఠినతరం చేసి కులం పేరుతో దేశాన్ని భ్రష్టుపట్టించిన పాపంలో భాగస్వాములు చాలామందే ఉన్నారు - కులాకకతీతంగా

    రిప్లయితొలగించండి
  16. guys i had posted some new comments in the previous post.let s see how genuienly he answers them.

    రిప్లయితొలగించండి
  17. నేను లేని సమయం చోసి గొప్ప పోస్టు వేశారు :)

    రిప్లయితొలగించండి
  18. "మేము భార్యని తప్ప మిగాతావారిని తల్లుల్లా చూస్తాం, మీరు తల్లిని తప్ప మిగతావారిని భార్యల్లా చూస్తారు"

    మన మేధావులు అదే టైప్ కదా

    రిప్లయితొలగించండి
  19. బాగా రాశారు. విలువలు కథ రాసినాయనా దాన్ని పట్టుకు ఎగిరేవాళ్ళు అంతా ఏదో హాఫ్ నాలెడ్జీ తో నెట్టుకొస్తున్నారు. వాళ్ళకు కావలసింది విలువలో తొక్కలో కాదు. ఎలాగోలా పబ్లిసిటీ కావాలి దానికోసం వాళ్ళేదైనా రాస్తారు. ఆయన బ్లాగ్ చూస్తే నవ్వొస్తుంది నాకు!

    ఇంకో భారతదేశ ద్వేషి తనేదో ప్రపంచమంతా పర్యటించినట్టు అక్కడ మూఢనమ్మకాలు లేనట్టు చీ తూ భారతదేశం అంటాడు :)
    వీళ్ళు కోరినట్టు ఇప్పుడు దేశంలో జీవనం క్రమంగా పాశ్చాత్య విధానంలోకి మారుతోంది, ఒంటరితనం, ఒత్తిడి మానసిక రోగాలు, పోటీలు తోపులాటలు, HIV,Hepatitis, cancer,diabetes ఇదంతా బాగా నచ్చుతోందనుకుంటా పాశ్చాత్య రోగాలు అన్నా పడిచస్తారు కదూ :)

    రిప్లయితొలగించండి
  20. చాలా రోజుల తర్వాత ఆడవాళ్ళు కూడా comment చేసేటట్లు ఒక మంచి పోస్ట్ వ్రాశారు. భారతీయత అంటే ఏమిటి అని నన్ను ఒకరు అడిగారు, మీలాగా నేను చెప్పలేక పోయాను.ఇపుడు ఈ పోస్ట్ చూపిస్తాను.

    రిప్లయితొలగించండి
  21. Relevent post on my blog

    http://akasaramanna.wordpress.com/2010/05/24/%E0%B0%A4%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA%E0%B1%81-%E0%B0%AE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B7%E0%B0%BF%E0%B0%A6%E0%B0%BE-%E0%B0%AE%E0%B0%A4%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%A6%E0%B0%BE/

    రిప్లయితొలగించండి
  22. Thanks all and Krishna, I am answering them on the sasme post - deleted duplicate comments

    రిప్లయితొలగించండి
  23. @ పై అజ్ఞాత
    అసలు ప్రాబ్లం అకధ రాసినాయన లో లేదు. ఆయన ఆ కధ రాసి చాలా రోజులు అయింది. ఈమద్యనే ఒకావిడ ఆ కధకి చీర్ లీడింగ్ చేసింది మళ్లీ!! అక్కడ భారతీయ విలువలని కొందరు తల్లిపాలు తాగి రోమ్ముగుద్దె గుంటనక్కలు అపహాస్యం చేసినా ఆ వాఖ్యలు ప్రచురించిన ఆ చీర్ లీడర్ ని అందరూ ఒకసారి మొహమ్మీద ఉమ్మితే అన్నా సిగ్గు వస్తుందేమో!

    రిప్లయితొలగించండి
  24. Well, she stopped publishing the comments once they went out of control right?

    I think publicizing the story is fine, its ones own like and dislike - I am talking more about the people who see one side of a coina nd get judgemental

    రిప్లయితొలగించండి
  25. కధ అన్నది మనం చూసిన జీవితాలనుండి పుడుతుంది. నేను రాసిన కధల్లో పాత్రలు అన్నీ సమాజంలో చూసిన జీవితాలే.

    రిప్లయితొలగించండి
  26. But when somebody asks for an example, one expects a real life one. Not from a story

    రిప్లయితొలగించండి
  27. విలువలు/వలువలు గురించి ఎవరు వ్రాసారబ్బా. అన్ని టపాలూ చదవలేము కదా. ఎక్కడో లింక్ మిస్సవుతోంది నాకు. కాస్త ఎవరయినా క్లూ ఇద్దురూ.

    రిప్లయితొలగించండి
  28. Chari garu thanx

    Sarat .. check "bharatiya viluvalu" post on Jyoti's blog and its comments

    రిప్లయితొలగించండి
  29. Krishna, I am moving the comment to the other thread. I need comments there, not here.

    రిప్లయితొలగించండి
  30. please visit godsavemedia.wordpress.com

    రిప్లయితొలగించండి
  31. Each of the 5 points you listed as Bharatiyata is BS. The key to this post is in the labels with which you've tagged it.

    రిప్లయితొలగించండి
  32. Oh yeah! I'm not surprised that people who dont have any of those five values would find it BS. Sour grapes you see :))

    రిప్లయితొలగించండి
  33. మలకూ

    పచ్చకామెర్లవాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు ఆ పెద్దాయనకి లోకమంతా కామాంధులుగా కనిపిస్తుందిలే. అదంతే.

    రిప్లయితొలగించండి
  34. He is not only characterless but also shameless. Just look at the way he goes after females on the blogs. N.D. Tiwari is no match to him.

    రిప్లయితొలగించండి
  35. malak,
    I know one of the 3 you kelikified, is mandushaala pornesh.Who are the other 2 ? is one kottapali ? anduke bhujaalu tadumukuntunnaaraa ?

    Btw, kottapali declared himself as blog bheeshmudu. bharatiya samskruti ni avamaaninchadaaniki kakapote, prathi vedhavaa ( no offence to him ), tanani taanu bheeshmudu ani cheppukotame. bheeshmudekkada, viluvalu, valuvalu antha midhya ane veellu ekkada ?

    రిప్లయితొలగించండి
  36. btw = by the way, krishna... not between.

    that's why you are using in btw, 'coz you're thinking btw = between. I used to think so before, but a friend of mine corrected me.

    రిప్లయితొలగించండి
  37. nenu blog kuruvruddhudini ( bheeshmudini ), kabatti nenu cheppindi vinukondi ani oka sari eeyana ediste, taana tandana antu chekkana bhajana brundam okati bayalu derindi.bheeshmulungaaru cheppindi vinukokundaa, ediristaara antu, panashaala brundaanni.

    when yogi started a blog, his first comment was neetulu cheppoddu, upayoga padedi cheppu ani. mari eeyana okkare neetulu cheppaali kadaa bloggers ki, blog bheeshmudu kadaa mari ? ade aadalla blogs ki aithe, vijayostu, doosukupondi anthe ani chonga kaarustu cheptaadu. asalu eeyana lantollaki chekka bhajana brundam lo maagallu elaa untaaro naaku artham kaadu.poni aadallu ante, vallani emanna egesukuntu vachestaadu kabatti support chestaaru anukovachu.

    btw this incident happened when panashaala first arrived. mahesh ki defense gaa eeyana bayalu deraadu, blogs ki bheeshmudu ani self-declare chesukuni, panche oopukuntoo.

    I don't agree with the keludkudu brundam regarding few things,but if they were not there, the blog sphere would have been rotten with self-proclaimed saints who're much similar to donga saadhuvulu like nityananda.so kudos to you guys, and don't stop keliking such foul souls.

    రిప్లయితొలగించండి
  38. అజ్ఞాత

    లెస్స పలికితివి. వలచి వచ్చిన స్త్రీని తృణీకరించిన భీష్ముడెక్కడ? ఛీ ఛీ అంటున్నా, కుక్కలా అమ్మయిల వెంటపడే వీరెక్కడ?

    రిప్లయితొలగించండి
  39. If I remember correctly, yogi's first post was only 1 line: naa vanthu chettha nenu andistaa blogs ki ani. Daaniki kottapali was first to comment, neetuloddu, pani chudu type lo.yogi asked why he thought he'd tell neetulu, ventane naaluka karchukunna blog bheeshmudu, emo enduku ani direct gaa adigite em cheptaam, enduko ala anipinchidanthe, anyway sorry tappu lo kaalesaa ( idi naaku maamole anuko ani swagatham lo anukuni) ! ani replied.

    ante neetulu cheppatam chetthaa ? mari eeyana chesevi kooda chettha panle anna maata. mari eeyana raase neeti kathalu on bharateeyata giving some neeti as messagee ye kova kinda vastaayo ?

    inthaki malak is not replying this question. aa mugguru medhavulu evaru ( I still don't know which comment pornesh made, to me it looks like all 3 you stated in post are by pornesh ) in the same order iste, aa aani mutyaala methaavulani memu tagina reethi satkaristaam kadaa. :-))

    రిప్లయితొలగించండి
  40. Ajnaata .. check Jyoti's post on Bharatiya viluvalu .. you will know who they are :))

    రిప్లయితొలగించండి
  41. This man was not originally one of them - but after his comment - HE IS!

    As one of the above guys said, just because one doesnt comply with the values that need a strong character, one cant say that the others are same as that one!

    రిప్లయితొలగించండి
  42. @Kottapaali

    "Each of the 5 points you listed as Bharatiyata is BS."

    Your thoughts, knee-jerk reactions, as always punch the lights out of any man who happens to have his head in the right place and have an iota of sensibility. How do you maintain such consistency of thought, I wonder. Shivers me timbers!!

    Coming to your enlightened observation - It is jolly good of you, as the British say - to engage in a monumental and legendary mission of relentless literary proselytizing drive in Telugu blogs. Well, the less loaded formulation, in simpler terms that mere mortals like me can understand - nitpicking. Bitching.

    When you say that Malak's version of 'Bharateeyata' is BS, any rational man would intuitively understand that you either:

    1. Have a better theory/understanding/explanation of 'bhaarateeyata', your version which is superior, which makes sense to everybody, which is reasonable etc.,

    Or

    2. You don't *see* any 'bhaarateeyata' at all, and you feel people are merely parroting meaningless crap.

    If it is (1), Give us your version of Bharateeyata, Sir! What is it? What consists of Bharateeyata? What makes somebody a Bharateeya? What values/traits/beliefs/practices? Passing a sarcastic comment (should I say - a vain attempt at sarcasm?) that something is BS doesn't go well with a celebrated 'critic' like you. That root is for boy lovers. Escapists. Cowards. I am inclined to think you are not any of this, YET.

    If it is (2), The freedom of expression and 'chigurinchE cheTTu' talk that you so eloquently advocate in your blog, is not just a one way deal. You gotta understand that. Just because something doesn't make sense to you, doesn't necessarily make it non-existent and meaningless.

    If what you meant was neither of the above, then you are evidently talking crap. I don't know about you and the gang - but some people don't particularly enjoy crap. If you know what I mean :)

    NOW, I am tired of "whatever", "I will try, you are my fan", "Okay" kind of desperate attempts at being indifferent to criticism from you. Lets just face it. I am your critic. A kick ass one at that. Show me answers. Criticism is an art, facing it is more so. Show us whactha got. :)

    Cheers
    Yogi

    రిప్లయితొలగించండి
  43. "I Love Hitmen. No Matter What You Do To Them, You Don't Feel Bad" -- Sin City

    రిప్లయితొలగించండి
  44. ahha, His version of Bharatiyata is "One expecting ones fiancee to be a virgin" - His thoughts dont go beyond sexuality. May be, for him anything other than that is BS - who knows?

    రిప్లయితొలగించండి
  45. భజన బృందం భజన చేస్తుంటే, పెద్దరికం నేరపటం తప్ప, నేను వాగే తల తిక్క వాగుడుకి explanation ఇచ్చేంత దమ్ము నాకు లేదు. నన్ను ప్రశ్నించే సాహసం చేస్తే, ఎవురైనా, సాధారణంగా అక్కడి నుంచి లగెత్తి పారిపోతా. నా భజన బృందం దగ్గర ఏడవటానికి. అయినా ఓరోరి యోగి, చెప్తా వినుకో. భారతీయత అంటే, నాకు లాగే చాల మంది మగాళ్ళు తాము పవిత్రంగా లేకపోయినా, చేసుకోబోయే ఆడదాని పవిత్రత గురించి ఒకటే ఇదైపోతుంటారు. అదే భారతీయత. ఇంకా భారతీయత అంటే, వాక్ స్వాత్రంత్యం.అంటే ఏ వెధవైనా నేను తొక్కలో సంఘానికి భీష్ముడిని అన్నాడనుకో, వాడ్ని భజన చేసుకుంటూ, ఫాలో ఐపోతం కూడా భారతీయతే. ఇది కేవలం భారత దేశం లోనే కనిపిస్తుంది. ఇది నాకు భారతీయత లో నచ్చే మారొక అంశం. ఇంకా భారతీయత అంటే, ఆడది కనిపిస్తే చాలు virtual space లో అయినా, ఒకటే ఇదైపోతం, మగాళ్ళ బ్లాగ్స్ మీద, ముఖ్యం నేను భీష్ముడు అంటే నన్ను భజన చేయని వాళ్ళని దుమ్మెత్తి పోసేందుకు, నాకున్న వాక్ స్వాతంత్రం భారతీయత.ఇంకా చెప్పాలంటే, విలువలు లేని నాకు, నాలాంటి చెత్త గాళ్ళకి, ఏది ఏ సమయంలో ఉపయోగపడితే అవన్నీ భారతీయతే. మిగితాది నా కళ్ళకి కనపడదు అబ్బయ్యా, అయన్నీ BS నాకు. అయితే ఇప్పుడు ఎతంటావు ?
    - చెత్త పాళీ

    రిప్లయితొలగించండి
  46. మలకు, ఏందయ్యా నువ్వు ? ఎప్పుడూ ఇంగ్లిపీస్ లోనే ఇష్టయిల్ గా రాస్తుంటావు కంమెంట్లు. కాస్తంత తెలుగులో రాయొచ్చు గందా. గూగుల్ transliterate install చేసుకుని ఫైరుఫాక్సు లో,( దీన్ని కొందరు తెలుగు తీవ్రవాదులు, చెత్త పాళీ, తాటి కాయల పల్లి లాంతోల్లు గుంత నక్కో, మంట నక్కో అంటారు అనుకో అసయ్యం గా , మనం చెక్క భజన బృందం కాదు కామట్టి, అంతొద్దు కానీ ) నువ్వు ఇంగ్లిపీస్ లో రాసేది వీజీగా అదే తెలుగులో మార్చుద్ది, ఒకే మౌస్ క్లిక్ లో. నీకు చెప్పేంత టెక్నాలజీ లేకపోయినా నా దగ్గర, ఏదో ఇంగ్లిపీస్ అర్థం చేసుకోలేక, నువ్వు తెలుగు లో రాస్తే ఎంత బాగుంతాడో అనిపించి చెప్తుండా. మరి నీ ఇట్టం.కూసింత ఆలోహించు.

    రిప్లయితొలగించండి
  47. >>>కుల వ్యవస్థ, సతీ సహగమనం, వితంతు వ్యవస్థ, స్త్రీలపై కట్టుబాట్లు, జోగినీ వ్యవస్థ, పురుషాహంకారం వగైరా. వీటన్నిటికి తోడు పైన ఎవరో చెప్పినట్టు దేశ జనాభాలో అత్యంత మైనారిటీ అయిన ఒక కులం వారిలో కొంతమంది చేసే 'సంధ్యావందనం' కూడా కావచ్చు.

    ఈ కామెంటు చేసింది నేనే. ఒకాయన బ్రాహ్మణులు చేసే సంధ్యావందనాన్ని భారతీయతగా చూపెట్టే ప్రయత్నం చేస్తే దాన్ని ఎత్తి పొడవడం కులగజ్జి ఎలా అవుతుంది?

    పచ్చ కామెర్ల రోగికి అన్నీ పచ్చగా కనపడటం మామూలే కదా! కుల గజ్జి అంటే తన కులం గురించి గొప్ప చేసుకుని చెప్పడం. తమ కులంపై ఈగ వాలినా ఎగేసుకుంటూ వచ్చి వాదనలకు దిగడం. అలాంటి వారికి సమాధానాలు చెప్పడం కాదు.

    రిప్లయితొలగించండి
  48. ఓహో! వాళ్ళు చేస్తారు కాబట్టీ కాకూడడు కదా. అయినా నేను అన్నది దానిని మిగతా వాటితో పోల్చడం గురించి. తిన్నదరక్క పక్కవాడిమీద పడి ఏడవడం కులగజ్జి అంటే.


    అజ్ఞాతా, కొన్ని కామెంట్లు నేను నా ఫోన్ నించి పెడుతూ ఉంటా. అప్పుడు తెలుగులో రాయడానికి కాస్త ఇబ్బంది. తెలుగు ఫాంట్లు సరిగ్గా కనబడవు

    రిప్లయితొలగించండి
  49. >>>తిన్నదరక్క పక్కవాడిమీద పడి ఏడవడం కులగజ్జి అంటే<<<

    మీ నిర్వచనం మరొక్క సారి పరిశీలిస్తే మీకే తెలుస్తుంది.

    ఇక్కడ ఎవరికీ తిన్న దరగ లేదు? ఎవరు పక్క వారి మీద పది ఏడుస్తున్నారు? పక్క వాడి మీద పడి ఏడవడం కులగజ్జా?

    'బ్రాహ్మణులు చేసే సంధ్యావందం భారతీయతోహో' అంటూ చాటింపు వేసుకోవడం, ఒక కులం వారు చేసే పనిని భారతీయత గా చూపించడం కులగజ్జి కాదు. అలా చూపించిన వారిని దెప్పి పొడవడం మాత్రం కులగజ్జి! అలా తన కులం వాడిని దెప్పి పొడవగానే లగేత్తుకోచ్చిన వాడిది మాత్రం కులగజ్జి కాదు! బాగుందండి. అలాగే కానీయండి. మీ బ్లాగు, మీ ఇష్టం.

    రిప్లయితొలగించండి
  50. ఇక్కడ ఎవరికీ తిన్న దరగ లేదు?
    _____________________

    మీ మెసెజ్ చూస్తే ఎవరికో అర్దమౌంతి :))

    అలా చూపించిన వారిని దెప్పి పొడవడం మాత్రం కులగజ్జి!
    ___________________________________

    అబ్బా, ఛా! తమరక్కడ మనిషిని దెప్పిపొడిచారో విషాన్ని వెళ్ళగక్కారో తెలియట్లేదా?

    రిప్లయితొలగించండి
  51. మీరెంత మాట మర్చడానికి ప్రయత్నించినా నేను మళ్ళి అక్కడికే వస్తా. నేను ముఖ్యంగా మాట్లడింది అక్కడ పోలిక గురించి.

    రిప్లయితొలగించండి
  52. మీరు ఒక కులాన్ని, ఒక మతాన్ని వెనకేసుకు రావడం అనేక చోట్ల చర్విత చర్వణం. నేను మీలాగా ఏ ఒక్క కులాన్ని ఎన్నడు సపోర్ట్ చేసింది గాని వ్యతిరేకించింది కాని లేదు. మీకు నా కామెంటు అర్థం కాక పోతే మరోసారి ప్రయత్నించండి. ఒళ్ళంతా కులగజ్జి, మతతామర లతో కుళ్ళిపోయిన మీరు ఇతరులను వెక్కిరించాలని చూడడం గురివింద గింజ సామెతని తలపిస్తుంది.

    >>>నేను ముఖ్యంగా మాట్లడింది అక్కడ పోలిక గురించి<<<

    ఇది తమరి మూర్ఖత్వానికి పరాకాష్ట. 'మలక్పేట రౌడీ గారికి మూర్ఖత్వంతో పాటు దాన గుణం కూడా ఉంది' అంటే రెండిటినీ పోల్చినట్టా? మీ అజ్ఞానానికి వందనాలు. సెలవ్.

    రిప్లయితొలగించండి
  53. అదే మరి :))

    ఆ కులం వాళ్ళు వేరే వాళ్ళనన్నా నా ప్రతిస్పందన అలాగే ఉంది

    మీకు మెదడే కాదు, చూపు కూడా మందమేనన్నమాట ))

    ఒక్క సారి పైన చూస్తే నా రెస్పాన్స్ కనిపిస్తుంది.మీలాంటి తిన్నింటివాసాలు లెక్కపెట్టే విశ్వాసఘాతకులకి నా లాంటి మూర్ఖులే సరైన జోడీ


    తమలాంటీ కులగజ్జి మత ద్వేషుల్ని చాలమందినే చూశాను.


    మీ అజ్ఞానానికి వందనాలు
    _________________

    తమరేడో నోబెల్ అందుకున్న జ్ఞానులు కదా? మీ గురించే లోకమంతా చెప్పుకుంటున్నారు మీ అంత తెలివి జ్ఞానం ఇంకెవడికీ లేదని ))


    I can match you comment to comment :))

    రిప్లయితొలగించండి
  54. @కొసమెరుపు, "కుల గజ్జి అంటే తన కులం గురించి గొప్ప చేసుకుని చెప్పడం. తమ కులంపై ఈగ వాలినా ఎగేసుకుంటూ వచ్చి వాదనలకు దిగడం. అలాంటి వారికి సమాధానాలు చెప్పడం కాదు. " అంతేకాదు, ఓ రకమయిన ఆత్మనూన్యతా భావంతోనో, లేక తమ వసతి కోసం కొంతమంది ఎర్రజేండాలవాల్లో, తెల్ల తోలు దొరలో చెప్పిన మాటలను పట్టించుకోవాల్సిన దానికంటే పట్టించుకొంటూ, ప్రతిదానికి తమది కాని కులాల మీద పడిఏడవటం కూడా కులగజ్జి కిందకు వస్తుంది.
    మీరు ఒరిజినల్గా చేసిన కామెంట్లో మీరు పోల్చినవాటికి, సంధ్యావందనానికి సంభంధం ఏమయినా ఉందా? మాటి మాటికి మన దేశంలోని సాంఘిక దురాచారాలు గుర్తుకు తెచ్చుకొనే మీరు, అంతకంటే మరింత ఎక్కువ దురాచారాలు ఉన్న మిగతా దేశాలు, తెల్లతోలు వాడి అరాచాకాలగురించి ఎందుకు మర్చిపోతారు? నిజానికి సాంఘిక దురాచారాలు లేని సమాజం ఎ దేశం లోనయినా ఉందా? వాటిని మించిన విలువలు, సంస్కృతీ ఇచ్చిన మన దేశాన్ని తిట్టతంలో వచ్చే సునకావెసాన్ని ఎందుకు కోరుకుంటున్నారు?

    ఇంకో "నూన్యత"శాల ఆయన/ ఆయన నూన్యత భావజాలం గల మీల్లాంటి వాళ్ళు , మాట్లాడితే ఓ కులం మీదో, ఓ మతం మీదో విషం కక్కుతుంటారు, నిజానికి కులాల కుమ్ములాటలలో అన్నికులాల పాత్ర లేదంటారా చరిత్రలో కాని, ఈ రోజుకు కాని, ఎంతమంది మాలలు వాళ్ళ వాళ్ళ ఇళ్ళలో మాదిగలకు మర్యాద ఇస్తారో చెప్తారా, నేను పెరిగింది కొంతకాలం మాలపల్లెలు లోనే, మాలలు, మాదిగలు అడిగే (రెండా, మూడా) గురించి నీకేమి తెలుసు అని మాత్రం అడగకండి. నిజానికి మాదిగా దండోరా ప్రకాశం లో పుడతానికి మాదిగలు, మాలల మీదున్న వ్యతిరేకత కారణం కాదంటారా, అలాగే ఎంతమంది మాదిగలు ఈరోజుకు ఎరుకలతో కలసితిరగటానికి ఇష్టపడతారో చెప్తారా? వాళ్ళ ఇళ్ళల్లో గలీజుగా ఉండే వాళ్ళను తిడటానికి ఎ తిట్లు వాడతారో తెలుసా? అలాగే ఎరుకలు ఎంతమంది యానాదుల తో కలసి ఉండటానికి అది హాస్టల్స్ కావచ్చు, మాదిగగూడేల ప్రాంతాలు కావచ్చు ఇష్టపడతారో చెప్తారా?
    ప్రతికులం వాడు, ఇంకో కులాన్ని తక్కువగా చూసినోడే/చూస్తున్నోడే కొంతవరకు, కాకపొతే ప్రతోడు తమ క్రింది నలుపు తెలియకుండా, ఇంకో కులపోడి మీద పడి ఎడ్చేవాడే!!!
    ఇక మతం గురించి, మాట్లాడితే మీరు విషం గక్కే హిందూ మతం అని చెప్పబడుతున్న మతం కంటే గోప్పమతాన్ని వేరే దాన్ని ఏమయినా చూపగలరా? లేదు, మాకు మతాలూ వద్దు అంటే ఇక మతం మీద పడి ఏడవటం ఎందుకు? మీరు నమ్మిన నాస్తికవాదమో/హేతువాదామో/ పైత్యవాదమో గురించి చెప్పండి, దానిలో నచ్చింది ఉంటె, ఆ వాదాలను నెత్తిన పెట్టుకోవటానికి ఇష్టమయిన వాళ్ళు ఎటూ ఉంటారు. మీ గీత పెద్దది అని చెప్పటానికి ప్రక్క గీతను చిన్నది చేయటమో లేక ఆ గీత మీద బురద చల్లటమో అవసరం లేదని ఆలోచించండి.

    p.s. నేను అబ్రాహ్మనుడను. ఓ సూద్ర కులానికి చెందిన హిందువును. ఇది అవసరం లేకపోయినా ఎందుకు చెప్తున్నాను అంటే, పైన నేను చెప్పిన నాలుగు ముక్కలు కూడా, కులం కళ్ళజోడు లోనుండి చుసే కులగజ్జి గాళ్ళు ఉన్నారు అని నా నమ్మకం కాబట్టి.
    మలక్, నా కామెంట్ చర్చను పక్క దారి పట్టిస్తుంది అనుకొంటే నిరభ్యంతరంగా తీసివేయండి.

    రిప్లయితొలగించండి
  55. hey malak.. dont delete the below comment of mine. this is a safety back up gesture..

    karthik said...
    @Witreal,
    prapisasa is a group of people who see utter comedy in the writings of prana. As a principle we never use any abusive language or derogatory remarks.. today in fact we completed 100 posts and soon we are going to ahve a big celebration in this regard.
    >>వీరికి "మార్తాండా" అనే బిరుదు ఇవ్వటం జరిగింది
    అది బిరుదు కాదు అన్నకు చాలానే మారు పేర్లు ఉన్నాయి వాటిలో అదొకటి.. ఇవి కాక నాదెండ్ల వగైరా వగైరా కూడా ఉన్నాయి..
    >>ఈ బ్లాగులొ కాంట్రిబ్యుటర్స్ - బాగా చదువుకున్న వారి లాగా అనిపిస్తారు. అంటే PhD గట్రా అన్నమాట. అయినా ఇలా ఒక వ్యక్తికి వ్యతిరేకంగా రాయటం నాకు సబబుగా అనిపించలేదు
    బాగా చదువుకున్నవారు సెటైర్లు వెయ్యకూడదా?? నవ్వొస్తే నవ్వకూడదా?? ఇక అన్న రాతలు అలాంటివి.. we cant help but laugh..

    I bet if you read atleast half of his stories i'm sure we will have one more member in our group ;)

    6 June 2010 21:30
    karthik said...
    >>నేను కోస్తా ఆంధ్రలో ఉంటున్నా తెలంగాణాదిని కావడం వల్ల నా మీద ద్వేషం పెంచుకుంది, నా మీద ద్వేషంతో స్త్రీవాదం మీద కూడా ద్వేషం పెంచుకుంది.
    అబ్బ చా!
    స్త్రీవాదం=వదినవాదం ఐతే మాకు అదంటే ద్వేషమే..

    సంస్కారం అనే పదాన్ని ఉచ్చరించే అర్హత కూడా నీకు లేదు.. మలక్ కుటుంబం గురించి నీ లేకి కామెంట్లు మేము చూడలేదనుకున్నావా?? స్క్రీన్ షాట్లు తీసి పెట్టాం.. ఎవరికైనా కావాలంటే పంపిస్తాం.. నీకు ఎమోషనల్ దయ్యం పట్టి ఒక మహిళా బ్లాగరి గురించి హీనంగా మాట్లాడావే అప్పుడేమైంది నీ సంస్కారం?? మహిళ అని కూడా చూడకుండా తిట్టావ్ అదేనా నీ స్త్రీవాదం??
    తమరిని తామే పెద్దమనుషులు మేధావులు అని చెప్పుకునే వళ్ళకు చెప్పుకో నీ కాకమ్మ కబుర్లు.. మా దగ్గర కాదు..

    బ్లాగ్ ఓనర్ గారూ,
    నేను రాసిన రెండు కామెంట్లు మీ టపాకు సంబంధించినవి కానందుకు చింతిస్తున్నాను. మా సంఘం గురించి,సెగట్రీ గురించీ అన్న అవాకులు చెవాకులు పేలితే సమాధానం చెప్పడం నా బాధ్యత కాబట్టి ఇది రాశాను. మీకు ఇష్టం లేకపోతే తీసెయ్యచ్చు..
    I mean no disrespect to the content of the post.

    రిప్లయితొలగించండి
  56. నేను నా బ్లాగ్ లో శరత్ అనే పేరు ఉచ్చరించినందుకు నానా యాగీ చేశాడు వెధవ . వీడు సంస్కారం గురించి మాట్లాడేంత గొప్పవాడు అయ్యాడా?

    రిప్లయితొలగించండి
  57. కామేంట్లు సీరియస్ గా పట్టించుకుని బ్యాకప్లు తీసుకునేంత సీన్ మార్థాండ కి ఎప్పుడు వచ్చింది.. అంత అవసరమంటారా :-))
    అయినా ఈ బ్యాకప్ మలక్ బ్లాగులొ ఎందుకు ??

    రిప్లయితొలగించండి
  58. మలక్ గారి బ్లాగులో మార్తాండకామెంట్లు ఎన్నాళ్లకెన్నాళ్ళకు
    అప్పుడెప్పుడో 561 కామెంట్ల పోస్ట్ లో చూస్తున్నాం
    మల్లె ఇన్నాళ్ళకి
    ఫీస్ట్ ఫర్ మార్తాండ అభిమానులు

    రిప్లయితొలగించండి
  59. మీ బ్లాగ్లో చర్చలు చాలా వేడిగా వాడిగా సాగుతున్నట్టున్నాయి. ఏ విషయం మీదైన మీ ధైర్యం మెచ్చుకోదగ్గది.

    రిప్లయితొలగించండి
  60. పాశ్చాత్య రోగాలు అన్నా పడిచస్తారు కదూ
    __________________________________________

    LOL

    And a good post brother. Came from Durgeswara blog. I missed it in the beginning

    రిప్లయితొలగించండి