మాలిక పత్రిక తరఫున రేపు సాయంత్రం భారతీయ కాలమానం ప్రకారం 6 గంటలనుండి రాత్రి 9 గంటల వరకు రెండవ అంతర్జాల అష్టావధానం నిర్వహించబడుతుంది. ఇదే శ్రీ శాకంబరీ అంతర్జాల అష్టావధానం. ఈసారి అవధాన కార్యక్రమం మొత్తం ఆహారానికి సంబంధించినదై ఉంటుంది. చూడాలి మరి ఎంత రసవత్తరంగా సాగుతుందో.... ఈ అవధానం మొత్తం లేఖనా రూపంలో జరుగుతుంది. దీనికోసం ప్రత్యేకంగా శ్రీ శాకంబరీ పేరిట ఒక గ్రూపు ప్రారంభించబడి అందులోనే చర్చలు జరుపుకుంటూ కార్యక్రమాన్ని ఒక తుది రూపానికి తీసుకురావడం జరిగింది. అందులో అవధానిగారు, పృచ్ఛకులు, మాలిక ప్రతినిధులు పాల్గొని అవధాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు..
ఈ అవధాన కార్యక్రమంలోని ముఖ్య అంశాలు, పృచ్ఛకుల వివరాలు:
మొదట నిర్వాహకుల స్వాగత వచనాలు.
తరువాత అవధాని గారి స్వపరిచయం, వరుసగా పృచ్ఛకుల స్వపరిచయం, అతిథుల
స్వపరిచయం...
అవధాన ప్రారంభం
అవధానిగారి చేత దైవ ప్రార్థన, స్వవిషయం, (అవసరమనుకుంటే) అవధాన ప్రక్రియా పరిచయం,
ప్రాశస్త్యాలు పద్యాలలో...
నాలుగు ఆవృత్తుల వరుసక్రమం ఇలా ఉంటుంది.
1. నిషిద్ధాక్షరి :
2. నిషిద్ధాక్షరి :
3. దత్తపది :
4. దత్తపది
5. సమస్య
:
6. సమస్య
:
7. వర్ణన :
8.అప్రస్తుత ప్రసంగం :
అప్రస్తుత ప్రసంగం నిర్వహించే
పృచ్ఛకులకు ఎప్పుడైనా మాట్లాడే, ప్రశ్నించే స్వేచ్ఛ ఉంది. నిరంకుశులు
కదా!
చివర అవధాని గారు, నిర్వాహకుడు ధన్యవాదాలు తెలుపడంతో అష్టావధాన కార్యక్రమం ముగుస్తుంది.
అష్టావధాని : డా . మాడుగుల అనిల్ కుమార్ గారు, ఎం .ఎ ; బి.ఎడ్ ; పీహెచ్ .డి.
(సంస్కృతోపన్యాసకులు , శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాల , తిరుపతి)
అధ్యక్షులు మఱియు సంచాలకులు : శ్రీ చింతా రామ కృష్ణారావుగారు, భాషా ప్రవీణ , ఎం .ఎ
పృచ్ఛకులు :
1. నిషిద్ధాక్షరి : శ్రీ చింతా రామ కృష్ణారావు గారు
2. నిషిద్ధాక్షరి : శ్రీ ముక్కు రాఘవ కిరణ్ గారు
3. దత్తపది :
శ్రీ గోలి హనుమచ్ఛాస్త్రి గారు
4. దత్తపది డా . శ్రీ కొరిడె విశ్వనాథ శర్మ గారు
5. సమస్య
: శ్రీ యం.నాగగురునాథశర్మగారు
6. సమస్య
: శ్రీ నారుమంచి వెంకట అనంతకృష్ణ గారు
7. వర్ణన :
శ్రీమతి వలబోజు జ్యోతిగారు
8.అప్రస్తుత ప్రసంగం : శ్రీ నల్లాన్ చక్రవర్తుల కిరణ్ గారు
మరో ముఖ్యమైన విషయం: ఈ అవధాన కార్యక్రమాన్ని ఆస్వాదించి, ఆనందించాలనుకునే వారికోసం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. అది మాలిక పత్రికలో రేపు సాయంత్రం ఆరునుండి మొదలవుతుంది.
తప్పుకుండా చూడండి మరి.. ప్రతీ ఐదు నిమిషాలకోసారి ఈ పేజిన్ Refresh / Reload చేస్తుండాలి. ఈ ప్రత్యక్షప్రసార బాధ్యతలు నిర్వహిస్తున్నది భరద్వాజ్ వెలమకన్ని..
మాలిక పత్రిక : http://magazine.maalika.org