థేంక్స్ గివింగే సంక్రాంతి అయితే మన ప్రముఖ బ్లాగర్లు ఏమంటారో పేరు చెప్పుకోడానికి ఇష్టపడని మరో ప్రముఖ బ్లాగర్ చెప్పారు. వారి క్రియేటివిటీని ఇక్కడ ప్రచురిస్తున్నా (ఐదో ఆరో నా లైన్లు కలిపి - 90% శాతం వారిదే)
క్లూ: ఇది వ్రాసిన బ్లాగరు పేరు కింద ఇవ్వబడిన పేర్లలో ఒకటి .. పట్టుకోవడం అంత సులువు కాదు లెండి .. మనమెప్పుడూ చూసేది ఆ బ్లాగర్ అమాయకపు ఫేసే :))
____________________________________________________________________________________
తాడేపల్లి: చ.. అలా అనకండి పాపం వస్తుంది.. మన అధ్బుతమైన హైందవ సంప్రదాయం లో పుట్టిన పండుగ తో దానిని ఎలా పోలుస్తారు అసలు అమెరికా వాళ్లకు కుటుంబమే వుండదు ఇంక వ్య్వసాయమేమి వుంటుంది అందరు కలిసి చేసుకు నే పండగ ఏమి వుంటుంది ఆ తురక పక్షిని కోసుకు తినడం తప్ప!
మహేష్: ఏమో నబ్బా ఆయన లా నా వల్ల కాదు - ఇంతకీ థేంక్స్ గివింగ్ కి సంక్రాంతి ఏమవుతుంది? అన్నట్టు అది తురక పక్షి కాదు టర్కీ! లేకపోతే సరస్వతీ పక్షి అనండి (స్వగతం: గొడ్డు మాంసం మీద లక్ష్మీదేవి ఉండగాలేనిది టర్కీని సరస్వతీ పక్షి అంటే తప్పా?)
రౌడీ: వుండండి థాంక్స్ గివింగ్ ప్రేయర్ కు సంక్రాంతి పాట రీమిక్స్ చేసి మాట్లాడతాను.
తెలుగోడు: నేను ఈ మధ్యనే తవ్వకాలలో తీసేనండి... థ్యాంక్స్ గివింగ్ థీం తో కధ మొదలెట్టి సంక్రాంతి కోడి పందేలప్పుడు సస్పెన్స్ పెరుగుతుంది.. చివరికి ఏమవుతుందో చదవండి కధ.. భోగి మంటలలో టర్కీ కాల్చిన వైనం..
కొత్తపాళీ: హ్మ్మ్ ఇంటరస్టింగ్...
జ్యోతి: ఉండండి.. రెండు రెసిపీ లు రాసి దాని మీద దీని మీద సంక్రాతి లో మహా విష్ణు ప్రాశస్త్యం రాసి, రెండు పండగలు అందరం కలిసి ఎలా చేసుకోవాలో రాసి..
రవి గారు: హ్మ్మ్ నా 'ఆమె కు అతడేమవుతాడు' కధ లో థ్యాంక్స్ గివింగ్ అప్పుడే రోమాన్స్ మొదలయ్యి సంక్రాంతి కి విడిపోతారని రాస్తే ఎలా ఉంటుం డబ్బా (స్వగతం)
భావన: అంతా కృష్ణ మాయ, నాకు చలం ఏమి చెప్పలేదు బాబు
ఆచార్య ఫణీంద్ర: తేటగీతి లో రెండు కలిపి పద్యం వ్రాయండి ముందు ఆనక మాట్లాడొచ్చు..
భా. రా.రే: ముందు థ్యాంక్స్ గివింగ్ ఏ సంధి సంక్రాంతి ఎలా విడ గొట్టచ్చో చెప్పండి ప్ల్లెజ్..
శరత్: మీరుండండీ. మన స్వలింగ దేశం లో .. తప్పు తప్పు త్రిలింగ దేశంలో హైదరబాదు ఉండాలా వద్దా అని బుర్ర బద్దలుకొట్టుకుంటున్నా ..
Added on Public Demand:
మార్తాండ: నేను నా విరోచనం .. తప్పు తప్పు .. విమోచనం కధలో మావో జరుపుకున్న క్రిస్మస్ పండగ గురించి రాశా. నా వ్యాఖ్యకి పై ప్రశ్నకి సంబంధం లేదనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్ లో నా కింగ్ ఫోటో చూడండి. మలక్ తలదన్నే ఫోటో అది. ఇంకా అర్ధం కాకపోతే PrPrPiSa (The copyright holder of Virochanam) చూడండి :))