9, డిసెంబర్ 2009, బుధవారం

థేంక్స్ గివింగ్ సంక్రాంతి - ప్రముఖ బ్లాగర్లు

థేంక్స్ గివింగే సంక్రాంతి అయితే మన ప్రముఖ బ్లాగర్లు ఏమంటారో పేరు చెప్పుకోడానికి ఇష్టపడని మరో ప్రముఖ బ్లాగర్ చెప్పారు. వారి క్రియేటివిటీని ఇక్కడ ప్రచురిస్తున్నా (ఐదో ఆరో నా లైన్లు కలిపి - 90% శాతం వారిదే)

క్లూ: ఇది వ్రాసిన బ్లాగరు పేరు కింద ఇవ్వబడిన పేర్లలో ఒకటి .. పట్టుకోవడం అంత సులువు కాదు లెండి .. మనమెప్పుడూ చూసేది ఆ బ్లాగర్ అమాయకపు ఫేసే :))

____________________________________________________________________________________


తాడేపల్లి: చ.. అలా అనకండి పాపం వస్తుంది.. మన అధ్బుతమైన హైందవ సంప్రదాయం లో పుట్టిన పండుగ తో దానిని ఎలా పోలుస్తారు అసలు అమెరికా వాళ్లకు కుటుంబమే వుండదు ఇంక వ్య్వసాయమేమి వుంటుంది అందరు కలిసి చేసుకు నే పండగ ఏమి వుంటుంది ఆ తురక పక్షిని కోసుకు తినడం తప్ప!

మహేష్: ఏమో నబ్బా ఆయన లా నా వల్ల కాదు - ఇంతకీ థేంక్స్ గివింగ్ కి సంక్రాంతి ఏమవుతుంది? అన్నట్టు అది తురక పక్షి కాదు టర్కీ! లేకపోతే సరస్వతీ పక్షి అనండి (స్వగతం: గొడ్డు మాంసం మీద లక్ష్మీదేవి ఉండగాలేనిది టర్కీని సరస్వతీ పక్షి అంటే తప్పా?)

రౌడీ: వుండండి థాంక్స్ గివింగ్ ప్రేయర్ కు సంక్రాంతి పాట రీమిక్స్ చేసి మాట్లాడతాను.

తెలుగోడు: నేను ఈ మధ్యనే తవ్వకాలలో తీసేనండి... థ్యాంక్స్ గివింగ్ థీం తో కధ మొదలెట్టి సంక్రాంతి కోడి పందేలప్పుడు సస్పెన్స్ పెరుగుతుంది.. చివరికి ఏమవుతుందో చదవండి కధ.. భోగి మంటలలో టర్కీ కాల్చిన వైనం..

కొత్తపాళీ: హ్మ్మ్ ఇంటరస్టింగ్...

జ్యోతి: ఉండండి.. రెండు రెసిపీ లు రాసి దాని మీద దీని మీద సంక్రాతి లో మహా విష్ణు ప్రాశస్త్యం రాసి, రెండు పండగలు అందరం కలిసి ఎలా చేసుకోవాలో రాసి..

రవి గారు: హ్మ్మ్ నా 'ఆమె కు అతడేమవుతాడు' కధ లో థ్యాంక్స్ గివింగ్ అప్పుడే రోమాన్స్ మొదలయ్యి సంక్రాంతి కి విడిపోతారని రాస్తే ఎలా ఉంటుం డబ్బా (స్వగతం)

భావన: అంతా కృష్ణ మాయ, నాకు చలం ఏమి చెప్పలేదు బాబు

ఆచార్య ఫణీంద్ర: తేటగీతి లో రెండు కలిపి పద్యం వ్రాయండి ముందు ఆనక మాట్లాడొచ్చు..

భా. రా.రే: ముందు థ్యాంక్స్ గివింగ్ ఏ సంధి సంక్రాంతి ఎలా విడ గొట్టచ్చో చెప్పండి ప్ల్లెజ్..

శరత్: మీరుండండీ. మన స్వలింగ దేశం లో .. తప్పు తప్పు త్రిలింగ దేశంలో హైదరబాదు ఉండాలా వద్దా అని బుర్ర బద్దలుకొట్టుకుంటున్నా ..

Added on Public Demand:

మార్తాండ: నేను నా విరోచనం .. తప్పు తప్పు .. విమోచనం కధలో మావో జరుపుకున్న క్రిస్మస్ పండగ గురించి రాశా. నా వ్యాఖ్యకి పై ప్రశ్నకి సంబంధం లేదనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్ లో నా కింగ్ ఫోటో చూడండి. మలక్ తలదన్నే ఫోటో అది. ఇంకా అర్ధం కాకపోతే PrPrPiSa (The copyright holder of Virochanam) చూడండి :))

17 వ్యాఖ్యలు:

 1. శరత్: మీరుండండీ. మన స్వలింగ దేశం లో

  kevvu keka!
  ha ha ha

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఎవరు రాశారో నాకు తెలిసిపోయిందోచ్. :)

  ఇట్టాంటి వాటిలో మార్తాండను పక్కన పెట్టేయడం చాలా దారుణం. ప్ర.పీ.స.స. తరపున తీవ్రంగా ఖండిస్తున్నా. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. విడిపోయే టైం కే ఆమె లో విడదీయరాని భందం పెరుగు తోందని ఆ క్షణం లో ఆమెకి తెలీదు
  అనికూడా రాసి వుంటే ఇంకా అప్ట్ గా వుండేది రౌడీ . యి మద్య మీరు బ్లాగ్ లో నల్ల పుస అయి పోయారు?

  ప్రత్యుత్తరంతొలగించు
 4. :))

  అవతల రాష్ట్రం తగలడిపోతుంటే మీకు సంక్రాంతి విందు భోజనాలు కావాల్సొచ్చాయా. హ్మ్మ్. అధ్యక్షా నేనిది ఖండిస్తున్నా. వెంటెనే జై హైదరాబాద్ అనుండ్రీ. లేకపోతే సంక్రాంతి మూడు రోజులూ మీతో నిరాహారదీక్ష చేయించి అది గట్టిగా చేసేలా సీక్రెట్ సర్వీస్ ని కుక్క కాపలా పెడతా.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. @ravuigaru....vidipoye time lo? naakedo bootu dhanistondi!!!

  kaani dialogue excellent, bootunnaa kooda

  ప్రత్యుత్తరంతొలగించు
 6. కోతి పని.
  ఎవరు రాశారో తెలిసిపోయింది :))

  ప్రత్యుత్తరంతొలగించు
 7. Dhanaraj Manmadha: Windows సంక్రాంతి version లో సెక్యూరిటీ లోపాలను సరిజెయ్యకుండా విడుదల చేసినందుకు ఇక నేను ఆ మాక్రో హార్డ్ వాళ్ళవేవీ వాడనుగాక వాడను.

  Thanks giving, సంక్రాంతి వెబ్‍సైట్లు ఇంప్లోరర్ బ్రౌజర్లో నేను తెరవను. కాస్తుంటే ఫైఫాక్స్ లోనా? సఫారీలోనా దేనిలో త్వరగా ఓపెన్ అవుతాయో చెక్ చేసి చెపుతాను.

  BTW మీరు చెప్పేది Indian సంక్రాంతా? చీనీ సంక్రాంతా?

  ప్రత్యుత్తరంతొలగించు
 8. మలక్పేట్, సూపర్, ఎవరు ఉప్పందించారో గానీ చిటపట మని తెగ పేలింది. ;) ళొవె ఇత్. ( Its not Tamil,love it version of baraha )

  ప్రత్యుత్తరంతొలగించు
 9. నాకు తెలిసిపోయింది. అమాయకపు ఫేస్ పెట్టి అల్లరి చేసేది భావన.. రైటా???

  భావన, నన్ను వెక్కిరిస్తావా? ఐనా నువ్వు రాసింది నాకు కుదరదులే. ఉండు నీకు పది ఆర్.సంధ్యాదేవి పుస్తకాలు పంపిస్తా.. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 10. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుదామని వచ్చాను , కాని అంతా ఏదో గోల గోల గా వుంది ! సరే కానీయండి .
  happy new year .

  ప్రత్యుత్తరంతొలగించు
 11. బా మాబావుందండి మీ చర్చా కార్యక్రమం. బాగా నవ్వాను థ్యాంks

  ప్రత్యుత్తరంతొలగించు