http://nagarajur.blogspot.com/2009/11/2012.html బ్లాగులో నాగరాజు రవీందర్ గారి ప్రశ్నలకి నాకు తెలిసిన సమాధానాలు:
1. దక్షిణ అమెరికాలో నివసించే 'మాయా' తెగల పంచాంగం ప్రకారం డిసెంబర్ 21, 2012 ప్రపంచానికి ఆఖరి రోజు
________________________________________________________________________
అది వారి కేలండర్ కి ఆఖరి రోజు - అంటే, వారి సైకిల్ కి అంతం - నిజానికి అదొక పర్వదినం వారికి. అయితే దానిని ప్రపంచానికి ఆఖరి రోజుగా మిగతావారు అన్వయిస్తున్నారు
2. ఖగోళ శాస్త్రజ్ఞుల అంచనాల ప్రకారం, 2012 లో సౌర తుఫానులు తీవ్ర రూపం దాల్చుతాయి. అవి ఇప్పటికే భూమి, మరికొన్ని గ్రహాలపై తమ ప్రభావాన్ని చూపుతున్నాయి.
___________________________________________________________________________________________________________
మన సూర్యుడు చాలా స్థిరమైన సూర్యుడు. మనకి 135 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న "పెగసీ" అనబడె తార మనకి అతి దగ్గరగానున్న అస్థిర సూర్యుడు. ఆ తార మన సూర్యుడి స్థానంలో ఉంటే భూమి తుడిచిపెట్టుకుపోయేదేమో గాని, మన సూర్యుడికి అంత "సీన్" లేదు :))
3. శాస్త్రజ్ఞులు 2012లో అణు రియాక్టర్ ( ళ్ఛ్) లో ఒక గొప్ప అణువిస్ఫోటనం గావించి , విశ్వం యొక్క పుట్టు పూర్వోత్తరాలను కనుగొనబోతున్నారు. ఈ అణు రియాక్టర్‌ను ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాల భూగర్భంలో 27 కిలోమీటర్ల పొడవున్న సొరంగంలో నెలకొల్పారు. అక్కడ ఇప్పటికే కొన్ని పరీక్షలను జరుపుతున్నారు. ఐతే కొందరు 2012లో జరుపబడే ఈ అణుపరీక్ష వికటించి, సమస్త జంతుజాలం నశించిపోతుందని చెబుతున్నారు.
__________________________________________________________________________________________________________________
ఇది మరీ ఊహాజనితంగా ఉంది. వికటీంచేది రేపైయినా వికటించవచ్చు. అసలు ఈ పరీక్ష మొదలయిన రోజునే వికటిస్తుంది, ప్రపంచం అంతమైపోతుంది అని చెప్పిన వాళ్ళు ప్రస్తుతానికి మాట్లాడడం లేదు.
4. బైబిల్ ప్రకారం 2012లో మంచీ - చెడుల మధ్య ఆఖరిపోరాటం జరగబోతోంది. హిందూ శాస్త్రాలలో కలికి అవతారం గురించి, " మ్లేచ్చ నివహ నిధనే కలయసి కరవాలం; ధూమకేతుమివ కిమపి కరాళం" అని ఉండనే ఉంది.
మరికొందరి అభిప్రాయం ప్రకారం, మానవాళి పూర్తిగా నశించదు. కాని వారిలో ఒక గొప్ప నూతన ఆధ్యాత్మిక మార్పు వస్తుంది. శ్రీ అరబింద్ ఘోష్ కూడా " మనిషి ఏదో ఒకరోజు సుప్రమెంతల్ స్థితిని అందుకోగలుగుతాడు " అని చెప్పారు.
_________________________________________________________________________________________________________________
అవి చెప్పినవేమిటో, వాటిని మనం ఏ విధంగా అన్వయించుకుంటున్నామో, దేవుడికే ఎరుక.
5. అమెరికాలోని యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ ఎప్పుడూ వేడినీటి బుగ్గలను విరజిమ్ముతూ ఉంటుంది. దీనికి కారణం అది సరిగ్గా ఒక అగ్నిపర్వతం మీద నెలకొని ఉంది. ఐతే ఈ అగ్నిపర్వతానికి ప్రతి 650,000 సంవత్సరాలకొకసారి ఆవులించే ఒక చెడ్డ అలవాటు ఉంది. దాని మూలంగా ఆకాశమంతా బూడిదతో కప్పబడి, సూర్యరశ్మి భూమిపై సోకదు. అప్పుడు భూమి పూర్తిగా చల్లబడి, మంచుఖండంలా మారుతుంది. అది అలా 15,000 సంవత్స్సరాల వరకు కొనసాగుతుంది.
యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ అడుగన రోజురోజుకీ పీడనం పెరుగుతోంది. అది 2012లో పూర్తిస్థాయిలో ఉంటుందని భూగర్భ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
_________________________________________________________________________________________________________________
నాసా వారి ప్రకారం ఇది 2012 లో బ్రధ్ధలయ్యే అవకాశం లేదు. ఒకవేళ అలా జరిగినా దానివల్ల ప్రపంచం మొత్తం నాశనమవ్వడం అనేది .
6. ఉత్తర దక్షిణ ధ్రువాలు ప్రతి 750,000 సంవత్సరాల కొకసారి తమ స్థానాలు మార్చుకుంటాయట ! ఇప్పటికే ధ్రువాలు ఏడాదికి 20 - 30 కిలోమీటర్‌లు ఎడంగా జరుగుతున్నాయట ! అలా క్రమేపీ భూమి చుట్టు ఉన్న అయస్కాంత శక్తి నశించిపోయి , అల్ట్రా వయొలెట్ కిరణాలు భూమిపై సోకి, సర్వ ప్రాణులను నశింప జేస్తాయని ఒక కథనం.
________________________________________________________________________________________________________________
ముందుగా - స్థానాలు మారేది అయస్కాంత ధ్రువాలకి, భౌగోళిక ధ్రువాలకి కాదు. అయస్కాంత ధౄవాలు స్థానం మార్చుకోవడం వల్ల తీవ్ర నష్టాలేమి జరగవు. పైగా ఒక ధృవం ఒక డీగ్రీ జరగడానికి కొన్నొ వేల సంవత్సరాలు పడుతుంది.
7. 2012లో ఒక పెద్ద ఉల్క భూమిని ఢీకొనబోతోది. అలా కాని జరిగితే ,అప్పుడు భయంకరమైన భూకంపాలు, సునామీలు సంభవించవచ్చు.
________________________________________________________________________________________
1995 లో నేన్సీ లైడర్ తను వేరే గ్రహాలను సంప్రదిస్తానని, దానిని ప్రకారం 2003 లో ( ఇప్పుడూ 2010 అని మాట మార్చింది అనుకోండి) భూమి అంతమవబోతొంది అంటు, పనిలో పనిగా ఈ ఉల్కోత్పాతం గురించి కూడా చెప్పిన కట్టు కధ ఇది. నాకు తెలిసిన దాని ప్రకారం, 2020 లలో భూమికి దగ్గరగా వచ్చే ఒక తోక చుక్క భూమిని ఢీకొనే ప్రమాదం ఉంది, అయితే ఈ మధ్య విడూదలైన సమాచారం ప్రకారం ఆ అవకాశం అత్యల్పం.
ఇదంతా సరేగానీ, నా బ్లాగులో ఆ మధ్య ఈ మట్ట ఆ మట్టా రహస్యం తెలిసిపోయిందోహో అని చెప్పినవారు మళ్ళీ కనబడడం లేదేమిటి? నేను దానిని చూడకుండానే తీసేశాను. మళ్ళీ చెప్పరూ ప్లీస్?
ఈ మట్టా రహస్యం ఏమిటండీ..మళ్ళీ ఎవరి ఆన్లైన్ జీవితాన్ని బుగ్గిపాలు చెయ్యబోతున్నారు??
రిప్లయితొలగించండిఆ రహస్యం ఏమిటో తెలియకనే కదా బుర్ర బద్దలుకొట్టుకుంటొంది. నేను కూడ అనవసరంగా లాగబడ్డా.
రిప్లయితొలగించండిగురు అంతా బానే ఉంది.. రెండు విషయాలు
రిప్లయితొలగించండి1. యెల్లో స్టోన్ ది నిజంగానే బద్దలైతే మాత్రం చాలా ప్రమాదం ఉండే సూచనలు ఉన్నాయి. మొత్తం మన భూమి ఉష్నోగ్రత 12-16 డిగ్రీలు పడిపోవచ్చు అట. ఆ మాత్రం చాలు సగం పైన జీవులని పొట్టనపెట్టుకునేదానికి. its more about the after effects than the actual eruption, if at all it occurs.
2. మన యూగాల లెక్క ప్రకారం మనం ఉన్నది యుగ సంధి లో. అంటే ద్వాపరమై కలియుగం మొదలైన కొన్ని వేల సంవత్సరాల overlapping (ఇది మీకు తెలిసే ఉంటుంది.. కాని మిగితావాళ్ళ కోసం చెప్తున్నా). అలా ద్వాపరానికి కలి కి యుగసంధి ఇంకొద్ది సంవత్సరాల్లో ముగుస్తుంది.. అదే సమయం శ్రీ వీరబ్రహ్మం గారి కాలజ్ఞానం లో చెప్పారు. ఈ సంధి అనతరించే కాలం చాలా చండాలం గా ఉంటుంది. (కురుక్షేత్రం ఈ సమయం లోనే అయ్యింది).. అంటే 2012 ప్రపంచం అంతరించిపోద్ది అని అనడం లేదు.. కాని అప్పటి వరకు మాత్రం ఇంకా దిగజారడం జరుగుతుంది అని నా ప్రఘాడ విశ్వాసం.
మిగితావన్ని మీరు చెప్పిందానితో ఏకీభవిస్తున్నా...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆ కాలెండర్ ని మళ్ళా పొడిగించమని మాయన్ తెగ వారిని కోరితే సరి వారు పొడిగిస్తారు.... యుగాంతం అవదు ...
రిప్లయితొలగించండి___________________________________
అణు పరీక్ష చేసే శాస్త్రవేత్తలను తీసుకెళ్ళి అబుగ్రైబ్ జైలు లో పెట్టాలని సిద్ధిపేట లో కే.టి.ఆర్ తో ఒక ఆహార దీక్ష చేపిద్దాం
___________________________________
మంచి చెడుల మద్య పోరాటం మాత్రమే కనుక బ్లాగర్లకు వచ్చిన సమస్య ఏమి లేదు
___________________________________
ఆకాశమంతా బూడిద తో కప్పబడినప్పుడు.. మన మావోయిస్టుల వద్ద ఉన్న రాకెట్ లాంచర్ లు ఉపయోగించి వాటిని పేల్చేదము..
___________________________________
పైన అన్నిటికీ ఏదో ఒక విధమైన ......సొల్యుషన్ ఉంది కాని. పరిష్కరించలేని కొత్త సమస్యల ఇప్పుడు ఉత్పన్నం అవడం వల్ల కూడా మానవ జాతికి పెను ప్రమాదం ఉంది అవి
సుమన్ మళ్ళా ఈ-టి.వి. లోకి వచ్చాడు ..
మార్తాండ మళ్ళా బ్లాగ్ లోకంలో బిజీ అవుతున్నాడు( బిజినెస్ లేకపోవడం వల్ల)
కేవలం ఆడవాళ్ళు రాసే బ్లాగుకే హిట్లు కామెంట్లు ఎక్కువ వస్తాయి అని ఈ మద్య ఒకాయన నానా యాగీ చేయడం తో చాలామంది ఆ పేర్లతో బ్లాగులు పెట్టాలని అనుకుంటున్నారని వినికిడి.
మరదేవిధంగా ....
మీరు లాగ బడిన ఆ మట్ట కధ ఏమిటో
@శ్రీనివాస్,
రిప్లయితొలగించండిROFL
*** *** ***
This post is nice.
>>కేవలం ఆడవాళ్ళు రాసే బ్లాగుకే హిట్లు కామెంట్లు ఎక్కువ వస్తాయి అని ఈ మద్య ఒకాయన నానా యాగీ చేయడం తో చాలామంది ఆ పేర్లతో బ్లాగులు పెట్టాలని అనుకుంటున్నారని వినికిడి.
రిప్లయితొలగించండిis it a case of 33% reservations here as well?? nice observation though :D :D
-Karthik
పోని లెండి యుగాంతం కాదని ఒక్కళ్ళన్నా అంటున్నారు. :-)
రిప్లయితొలగించండి